అంతరంగంలోకి తొంగి చూడాలన్న ఆశ ఎందుకు?
అక్కడేం కాలక్షేపపు కుటీరాలు నిర్మించబడి లేవు
సప్తస్వరాలు వినిపించే వలపు వాయిద్యాలు లేవు
సేదతీర్చే గాలితెమ్మెర్ల వింజామరలు అస్సలు లేవు
నా భావావేశవీచిక ప్రతిధ్వనుల శంఖారావాలు తప్ప!
అందని పొదరింట అడుగిడాలన్న ఆతృత ఎందుకు?
అంతర్ముఖాలతో అలజళ్ళురేపే అంతఃపురాలు లేవు
తివాచీ పరచి ఆహ్వానించ పచ్చిక పరిసరాలు లేవు
సెలయేటి స్వచ్ఛ జలపాతాల సిరులంతకన్నా లేవు
నాలోనే దాగిన కంటిఊసుల కీచురాళ్ళ అలికిడితప్ప!
అందమైన నూతనోత్సాహ మది అన్న తలపెందుకు?
అంతర్గత ఆందోళనలకి కారణాలు ఇక్కడ వెదక లేవు
ప్రగల్భపు ప్రాకులాట పసిడి పలుకులిక్కడ విన లేవు
విఫలయత్నంతో అంతర్లీన అంతరంగాన్ని చూడ లేవు
నా బలమైన అనుభవసారాల కాలాక్షరసుమాలు తప్ప!
నా ఈ "అంతరంగం" తో 300 పోస్ట్ లు పూర్తిచేసాను.
నేనందించిన భావాలకి ప్రేమాభిమానాలతో స్పందించి నాకు, నా ఆలోచనలకు అక్షర రూపకల్పనాస్ఫూర్తిని ఇచ్చి తప్పుల్ని కూడా సహనానురాగాలతో సరిదిద్దిన ప్రతిఒక్క అస్వాధస్నేహశీలాహృదయానికి శతప్రణామ పద్మాల మాలార్పితాలు.
అక్కడేం కాలక్షేపపు కుటీరాలు నిర్మించబడి లేవు
సప్తస్వరాలు వినిపించే వలపు వాయిద్యాలు లేవు
సేదతీర్చే గాలితెమ్మెర్ల వింజామరలు అస్సలు లేవు
నా భావావేశవీచిక ప్రతిధ్వనుల శంఖారావాలు తప్ప!
అందని పొదరింట అడుగిడాలన్న ఆతృత ఎందుకు?
అంతర్ముఖాలతో అలజళ్ళురేపే అంతఃపురాలు లేవు
తివాచీ పరచి ఆహ్వానించ పచ్చిక పరిసరాలు లేవు
సెలయేటి స్వచ్ఛ జలపాతాల సిరులంతకన్నా లేవు
నాలోనే దాగిన కంటిఊసుల కీచురాళ్ళ అలికిడితప్ప!
అందమైన నూతనోత్సాహ మది అన్న తలపెందుకు?
అంతర్గత ఆందోళనలకి కారణాలు ఇక్కడ వెదక లేవు
ప్రగల్భపు ప్రాకులాట పసిడి పలుకులిక్కడ విన లేవు
విఫలయత్నంతో అంతర్లీన అంతరంగాన్ని చూడ లేవు
నా బలమైన అనుభవసారాల కాలాక్షరసుమాలు తప్ప!
నా ఈ "అంతరంగం" తో 300 పోస్ట్ లు పూర్తిచేసాను.
నేనందించిన భావాలకి ప్రేమాభిమానాలతో స్పందించి నాకు, నా ఆలోచనలకు అక్షర రూపకల్పనాస్ఫూర్తిని ఇచ్చి తప్పుల్ని కూడా సహనానురాగాలతో సరిదిద్దిన ప్రతిఒక్క అస్వాధస్నేహశీలాహృదయానికి శతప్రణామ పద్మాల మాలార్పితాలు.
పద్మార్పితగారు మీకు నా హృదయపూర్వక అభినందనలు. యాదృచ్ఛికంగా చూసి మొదట అభినందనలు తెలియజేసే అదృష్టం దక్కినందుకు ఆనందంతో పాటు కించిత్ గర్వంగా ఉంది. నేను గత 6 నెలలుగానే మీ బ్లాగ్ చూస్తున్నాను కాని మనసు బాగుండనప్పుడు మనోల్లాసాన్ని ఇచ్చేవి మీ కవితలని నిస్సందేహంగా చెప్పగలను. తెలుగు భాషలోని తీయదనం వినమ్రత మీ వ్రాతల్లో కనిపిస్తుంది. మీరు ఇలాగే ఇక ముందుకూడా కొనసాగించాలి.
ReplyDeleteమీ మనోల్లాసాన్ని పెంచే ప్రేరణ నేనవడం ఆనందదాయకం. ధన్యోస్మి.
DeleteWishing u wholeheartedly on ur success....my heart is overwhelmed with ur writings....
ReplyDeleteThis one was built with b'ful words...heart touching!! Unable to express my feel in words...
I hope u will complete ur 1000 writings soon..n I am alive to wish u...on that auspicious day.
May everyday in ur life is peaceful n gives u strength to write...for us.
Thanks a lot for your affectionate wishes with loveable blessings.
Deleteఈ " అంతరంగం " తో నీ అంతరంగంలోని కొన్ని భావాలు , చిత్ర రూపంగా , కవితాపరంగా , పాఠకులకు విజయవంతంగా తెలియచేసినందులకు శుభాభివందనలు .
ReplyDelete300 కాదు ముక్కోటి అయినా తెలియచేయగలవన్న ప్రగాఢ విశ్వాసం నాకు , సారీ నీ పాఠక మిత్రులకున్నది . మఱోమారు నా శుభాభివందనలు .
మీ ఈ స్ఫూర్తిదాయక అభివందనాశ్శీస్సులకు ధన్యవాదసుమాలు. మీ ఈ ప్రగాఢ విశ్వాసాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంటానండి.
Deleteమీ అంతరంగం అందని భావాల తారంగం
ReplyDeleteమీ అంతరంగం తరగని ప్రేమకు పెట్టింది పేరు
మీ అంతరంగం రంగురంగుల హరివిల్లుల సమాహారం
మీ అంతరంగం గగనతల విహార సాధనం
మీ అంతరంగం మనసుదోచే విలువైన భావగీతం
మీ ఈ వాహిని 300+ లు దాటాలని, ఎప్పటికి నిత్యతరంగిణి అయ్యి మా అందరి మన్ననలు పొందాలని ఆసిస్తూ ఆశీర్వదిస్తూ...
మునుపటి నా వ్యాఖ్యా కు అర్ధం విశాదికరిస్తున్నాను: (ఓడిగేలిచాను టపా )
"Katraayiko Yaan Lakichi Padma..
(ఎంతో బాగా రాసారు పద్మ ..)
Aacho cha.. taaro kavita
(చాల బాగుంది .. మీ కవిత)
Harek panktima himmat cha
(ఒక్కో వరుసలో ధైర్య సాహసాలు ఉన్నాయి )
Hanuj lakti ra.. ser aashirvaadam taarumpra racha..
(ఇలాగే రాస్తుండు .. అందరి ఆశీర్వచనాలు నీపై ఎల్లప్పుడు ఉంటాయి ..)
Tamaaro Sopti
(మీ నేస్తం )
Sridhar Bukya Pathlawat
http://kaavyaanjali.blogspot.in/
ఇప్పుడు మీరు ప్రత్యుతరానికి అదే "Asante Bukya Sridhar" కు అర్ధం తెలుపగలరు:-)
Sridhar Bukya
మీ కమెంట్ కి థ్యాంక్స్ అని తప్పించుకోవడం తప్ప వేరో గత్యంతరం లేదు. ఎందుకంటే కవితాగోష్టికాదు అని నేస్తాలు నిందవేస్తారు. :-)
Deleteఇంక మీరు రాసిన నాకు తెలీయని బాషకి అర్థం మీరు చెప్పిందే నేను అర్థం చేసుకుని......Asante అంటే Thank you అని పెట్టాను :-)
పద్మగారు, నాకు asante మీనింగ్ తెలుసండి. నిన్ననే అంతర్జాల మథనం చేసి కనుక్కున్నాను అది ఆఫ్రికా స్వాహిలి భాషలో థాంక్స్ అని అర్ధం వచ్చే పదం. చూసారా.. మేము పలికే భాష ఇలా ఉంటుందన్నమాట, అలా అని మాది స్వాహిలి అనుకునేరు. అస్సల కాదు సుమండీ.
Deleteనా కామెంట్ కి రిప్లై కోసమని ఇంటర్నెట్ లో వెతికించినందుకు క్షమించండి.
ఈ మా భాషకు లిపి లేదు. ఎన్ని ఏళ్ళైన పలికే నేర్చుకున్నాం. అలా అని ఏదో గ్రహాంతర భాష కూడా కాదు. ఏదేమైనా మీ స్పందనకు ధన్యవాదాలు పద్మ గారు.
ఇలా ఇంకో కొత్త భాష గురించి తెలిసింది
Deleteమీ సున్నిత భావాలను 300 విదాలుగా తెలియజేసిన మీ అక్షర ముత్యాలకు అభినందనలు. ఎన్నో కవితల్లో ఈ భావం ఇలా చెప్పగలిగేది ఒక్క పద్మార్పిత మాత్రమే అనే ఆలోచన వస్తుంది. పద్మా బ్లాగ్ లోకానికి మీరో కలికితురాయి.
ReplyDeleteమీ ఈ అభిమాన స్పందన నాకు ఎన్నటికీ వసివాడని పరిమళకుసుమం. థ్యాంక్యూ.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteథ్యాంక్యూ.
Deleteసార్ మీ కావ్యాంజలి పబ్లిసిటి కాస్త ఆపండి సార్ ప్లీజ్///\\\\\
DeleteThis comment has been removed by the author.
DeleteCongratulations Padma garu. 300 kavitalante ammo anipistunna meeru gurtukuraagane aaaaahh aaavidaki 300 emanna pedda lekka anipinchindi.adi mee mudunna confidence. So keep writing........
ReplyDeleteThank you very much for your reciprocating confidence on me.
Deleteమీరు లేవన్నవన్నీ మీ పద చిత్రాలలో ఆవిష్కరిస్తూ బ్లాగ్ ప్రపంచంలో అందరినీ ఓలలాడించిన మీ కవితా రచనా పటిమకు, ధీరోదాత్తతకు ఈ త్రిశత కవితా ప్రకటన సందర్బంగా హృదయపూర్వక అభినందనలు పద్మార్పిత గారు. This is a great achievement and you have that stamina and courage to write more and more.. My heartfelt so much happy on this Great DAY as your well wisher and proud to be one of your co-blogger.
ReplyDeletewith HEARTY CONGRATULATIONS..
కల్మషంలేని అనురాగాధరణ నిర్మల వ్యాఖ్యాలతో ప్రేరణనిచ్చే మీ స్నేహపూరిత నిడారంబర చేయూతకి సజలనయన నమస్కారాలు. I am thankful to you for your appreciation and wishes. My heart is filled with deep respect and gratitude to you.
Delete"అందని పొదరింట అడుగిడాలన్న ఆతృత ఎందుకు?
ReplyDeleteఅంతర్ముఖాలతో అలజళ్ళురేపే అంతఃపురాలు లేవు " మీరు అనుకుని రాసారో లేక యాధృచ్చికంగానే జరిగిందొ ఈ రెండు వాక్యాల్లోనూ అనుప్రాసనియమం చాలా బాగా పండింది.మొత్తం కవితంతా హత్తుకున్నా ఇక్కడ పేర్కొన్నవి వెంటాడే వాక్యాలు.
sincere and heartfelt congratulations on your reaching 300 milestone of your dedicatory Love poems. Excellent achievement
కవితలోని ప్రాసకోసం ప్రాకులాడ్డం తప్ప వేరే ఏ నియమనిబంధనావళ్ళు తెలియని అల్పజ్ఞానిని, నేను మీ మనసుని హత్తుకుని గుర్తుండే వ్యాక్యాలు రెండైనా రాసి మెప్పించాను అంటే......really I feel proud and this is one of the best compliment for me. thank you very much.
Deleteఅభినందన మందారమాల మాటల మానసచోరికి :-)
ReplyDeleteమరెన్నో అద్భుత అక్షర చిత్రాలతో అలరించండి.
మీ ఈ అప్యాయతానురాగాలు నా వెన్నుతడుతున్నంతకాలం ఇలా రాస్తుండాలన్నదే నా అభిలాష.....థ్యాంక్యూ సృజనగారు
Deleteభావమే జీవంగా భాష్యమే వర్ణముగా కుంచెకు చేకూరే అధ్వేషణ,
ReplyDeleteచిత్రపఠముగా నిలచినంతట మనస్సుకైనా తప్పని అనుసారణ,
ఉద్వేగభరితమైన ఆ మనస్సుకి కలిగెను భావోద్వేగానికి ప్రేరణ,
పెల్లుబిక్కిన భావ సంగ్రామము ప్రారంబించే సంధికై అన్వేషణ …
తన మనసులో నిమిడీకృతమైన భావాల సంఘర్షణ,
భావానికీ భావానికీ నడుమ జరిగిన ప్రతి "సంభాషణ",
సంతసించే పదాలుగా నిలపి తను చేకూర్చిన సంరక్షణ,
'మనిషి'లో ప్రతి భావనకి నిలచె తన మనస్సే ఓ ఆకర్షణ …
భావవ్యక్తీకరణకై ప్రతి "పదం" తన పిలుపుకై చేసేను నిరీక్షణ
పదము పదము అనిపించెను వర్ణమాల అక్షరాల అనుసరణ
సేదతీరే ఆ పదమునే మురిపించే పద పొందికలోని అలంకరణ
'బంధన భాగ్యమే దొరకని ప్రతి పదం' కోరుకొనెను తన ఆదరణ …
(ఇంతకంటే ఏమీ చెప్పలేని నిస్సహాయుడిని .....)
http://vedivedisamosaalu.blogspot.com/
ఏమి చెప్పలేని నిస్సహాయుడ్ని అంటూ..... అధ్వేషణ, అనుసారణ, ప్రేరణ, అన్వేషణ, సంఘర్షణ, సంభాషణ, సంరక్షణ, ఆకర్షణ, నిరీక్షణ, అనుసరణ, అలంకరణ, ఆదరణాల గురించి అనర్గళంగా చెప్పేస్తే నోటమాటరాక మౌనంగా డిక్ష్టనరీ తిరగేయడం తప్ప ఏం రాయను చెప్పండి? :-) మీ అభిమాన స్పందనకు నెనర్లు.
Deletecongrats keep going..!
ReplyDeleteThank you.
Deletefinally evanni yekkadi nunchi copy chesthunnaro chepthara
ReplyDeleteఅనానిమస్ గారు.....ముందుగా మీకు వందనాలు. కాపీ చేస్తే నిలేస్తారు అన్న భయాన్ని కల్పించి మా సొంత ఆలోచనలకి స్ఫూర్తినిచ్చే మీలాంటివారికి నేను సదా నిబద్ధురాలిని. అయినా అప్పుడప్పుడూ మీ అనుమానపు కళ్ళద్దాలని తీసి మనోనేత్రాలతో చూడ్డానికి ప్రయత్నించండి. అప్పుడు ఎదుటివారి మనోభావాలు సొంతమేనని స్పష్టం అవుతాయి.
Deleteఅభినందనలు!
ReplyDeleteమీ భావనా తరంగాలు అప్రతిహతమై మరిన్ని శతాంశమానాల్ని వడివడిగా దాటుకుని సహస్రమానంలోకి అడుగిడాలని ఆకాంక్షిస్తూ...
విజయీభవ! దిగ్విజయీభవ!!
మీ ఈ ఆశ్శీసాకాంక్ష అభినందనలకు నమస్సుమాంజలులు.
Deleteచండ్రునికో నూలుపోగులా ఒక చిన్ని కవితైనా రాసి అభినందిద్దాం అనుకుంటే పదాలేకాదు అక్షరాలు కూడా మిమ్మల్ని వీడి రానంటున్నాయి. నాకు పరోక్షంగా భాష నేర్పిన నేస్తమా! మిమ్మల్ని అభినందించే అక్షరాలని కొన్ని అరువు ఇవ్వరాదా....మనఃపూర్వక అభినందనలు అర్పిత.
ReplyDeleteయోహంత్ నువ్వు ఇంత స్వచ్ఛమైన తెలుగులో కమెంట్లు రాయడం కవితతో సమానం. కేవలం బ్లాగ్ లో కమెంట్లతో పరిచయం పెంచుకుని తెలుగుభాషని అభిమానంతో నేర్చుకుని మనసుకి హత్తుకునే చిన్ని కవితలు రాసే నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ధన్యవాదాలు నేస్తం.
Deleteమా అర్పిత అసమాన ప్రతిభావంతురాలు అని చెప్పడానికి నీ ఈ "అంతరంగం" ఒక్కటిచాలు. అందుకోమ్మా నా ఆశీర్వచనాలతోపాటు అభినందనలు-హరినాధ్
ReplyDeleteఅనతికాలంలోనే అతిసన్నిహిత వ్యక్తిగా అభిమాన అనురాగ ఆశ్శిస్సులను అందించిన హరినాధ్ గారికి నమోవందనం.
Deleteఅందరూ అన్నీ చెప్పేశారు......హృదయపూర్వక అభినందనలు పద్మార్పితగారు
ReplyDeleteచిన్ని పదాలతో అభినందించిన చిలకమ్మా....మీ భావం నాకెరుకలే:-) థ్యాంక్యూ
Deleteentha prasantham ga vuntundoo mi kavithalu chadivithe...chala sunnithamina bhavalanu anthakante sunnithamina mataltho eeri andam ga kurchi makandinchi anadaparusthunna padmarpithaku evi subhakamkshalu...andukondi nestham...:D
ReplyDelete--Roopa
Roopa garu...mee ee comment thanda thanda cool cool ga undi. thank you.:-)
DeleteCongrats!!padmarpita gaaru.... meeru ilaane raastu maa andarni alaristundadi...:-):-)
ReplyDeleteమీ ప్రేరణాస్ఫూర్తులతో తప్పక అలరించే ప్రయత్నం చేస్తానండి.Thank you.
Deleteమీ అంతరంగం అంతులేని అందాలు చూపిస్తుంటే ఎన్ని వందలైనా మేము రెడీ. తప్పకుండా ఇంకా ఎన్నో ఎన్నో వందల ఊహలకలలు మాకు ఉల్లాసం కలిగించాలి. మీకు హృదయపూర్వక అభినందనలు.
ReplyDeleteజయగారు.....మూడువందల పోస్టులు పూర్తిచేసిన ఆనందంకన్నా మళ్ళీ మీ అందరినీ ఇలా ఇక్కడ చూడ్డం మరింత ఆనందంగా ఉందండి. మీ అభిమానాన్ని సదా ఆశిస్తూ.Thank you
Deleteఅందని పొదరింట అడుగిడాలన్న ఆతృత ఎందుకు?
ReplyDeleteఅంతర్ముఖాలతో అలజళ్ళురేపే అంతఃపురాలు లేవు
తివాచీ పరచి ఆహ్వానించ పచ్చిక పరిసరాలు లేవు
సెలయేటి స్వచ్ఛ జలపాతాల సిరులంతకన్నా లేవు
నాలోనే దాగిన కంటిఊసుల కీచురాళ్ళ అలికిడితప్ప!...
300 పోస్టులకి మీకు అభినందన మందారమాల. అందుకోండి .....పద్మ గారు...@శ్రీ
ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు "శ్రీ" గారి కమెంట్ కనిపించే బ్లాగ్ కళ్ళకు అని పాడుకుంటూ మీకు ధన్యవాధాలు తెలియజేస్తున్నానండి. :-)
Delete...
ReplyDelete...దీని మర్మమేమి వినోద్ బాబు:-)
Deleteఇందులో ఏ మర్మమూ లేదు పద్మా గారు:: ఆలోచించకండి. మీకు అభినందనలు ఎలా తెలుపాలో అర్థం కాక ఇలా మూడు చుక్కలు 300 పోస్టులకు..
Deleteహమ్మయా... మూడుచుక్కల నిరసనేమో అనుకున్నా :-)
Deleteఅక్కా నా మనసు మనసులో లేదనుకో.. ఏటో నేప్పుడు రాత్తానో ఇన్నిన్ని పోస్టులు. అయినా నీలా రాయలేనులే.. ఏడాదికో ఈతలా ఎప్పుడో పలుకుద్ది నా మనసు.. ఇంకేటి రాత్తాను. నిన్నత్తుకుని మురిసిపోవడం తప్ప..
ReplyDeleteఏంటో....అక్కా అంటూ హటాత్తుగా వాలి అంతుచిక్కకుండా ఎగిరిపోతావ్
Deleteవచ్చినప్పుడంతా గాలిదుమారంలా వచ్చి ఎటో వెళ్ళిపోతావ్....
అలా ఒదిలేయమాకే ఓలమ్మోలమ్మో :-)
Congrats padmarpita garu. Keep rocking...
ReplyDeleteThanks a lot my dear.
Deleteమీ అంతరంగం అంతు తెలియని భావాల తరగని గని.మూడు వందలేం అంతకు పది రెట్లయినా కవితలు వ్రాయగలరు మీరు.మీ కవితలు స్త్రీల హృదయాల్లాగా అథివాస్తవిక చిత్రాల్లాగా అర్థమయీ అవనట్లున్నామనోరంజకంగా ఉంటాయి.అన్నీతప్పక చదువుతుంటాను.మనఃపూర్వక అభినందనలు.
ReplyDeleteస్త్రీ హృదయాన్ని పసిగట్టేసారుగా.....మీ ఆస్వాధించే హృదయానికి, అభిమానానికి నఃమోవందనములు.
Deleteపద్మా ఇలా ఎలా రాస్తావో తెలీదు కానీ, రాసిన ప్రతి పదం ఎవరికి వారే తమకోసమే రాసింది అనేలా మరిపిస్తావు. నిజమే నీకు ఇది భగవంతుడిచ్చిన వరం. నీ ద్వారా మేము ఆస్వాధిస్తున్నాం, ఇది అదృష్టం. దినదిన ప్రవృధ్ధి చెందుతూ నీ ఆశల శిఖరాన్ని అధిరోహించు నేస్తం! Hearty congratulations.
ReplyDeleteమహీ నీ స్నేహమయ హృదయానికి వందనం. Thank you.
DeleteCongrats Padmaarpita...
ReplyDelete300 అనగానే నాకు ఇంగ్లీష్ మూవీ 300 గుర్తుకు వచిన్ది (my Fav)... Leonidas రాజు 300 Spartan యోధులతో పెర్షియన్ లను ఎదిరించదమ్. You also now lead an army of 300 PadmaaRpita(SPA)arTanNs...
మీరు రాసేవి అందరికి కలిగే / మనసులోని భావలె.. కాని అవి పెదవి దాక వచేసరికి సందేహమై పొతాయి లేదా అక్షర రూపం దాల్చేలోగా ఆవిరైపొతాయి..
అక్షర రూపం దాల్చాలి అంటే .. ఆ సరస్వతి / వాగ్దేవి కటాక్షం ఉండాలి అని నా అభిప్రాయమ్..
I know, You are blessed.
Please take care.
వావ్...అంత గొప్ప ఇంగ్లీష్ సినిమాతో పోల్చేసారా:-) గాల్లో తేలిపోతున్న ఫీల్.......ఎక్కడపడతానో :-) మరీ అంతలా పొగిడేయమాకండి, మీ అభిమానం చాలండి.Thanks for compliments and wishes.
Deleteపద్మార్పితగారు ఎన్నో అధ్భుతమైన అక్షరాలతో అల్లిన భావమాలిక మీ అంతరంగం. కంగ్రాట్స్.
ReplyDeleteఅంతరంగంలోకి తొంగి చూడాలన్న ఆశ ఎందుకు?
అక్కడేం కాలక్షేపపు కుటీరాలు నిర్మించబడి లేవు
సప్తస్వరాలు వినిపించే వలపు వాయిద్యాలు లేవు
సేదతీర్చే గాలితెమ్మెర్ల వింజామరలు అస్సలు లేవు
నా భావావేశవీచిక ప్రతిధ్వనుల శంఖారావాలు తప్ప....కట్టిపడేసారు
అనికేత్.....మీ స్పందనలతో, ప్రశంసలతో రాసేలా ప్రేరేపిస్తూ సపోర్ట్ ఇస్తున్న మీ అభిమానానికి థ్యాంక్యూ
Deleteమూడోవంద బొమ్మా, కవితా రెండూ అద్భుతంగా ఉన్నాయి.
ReplyDelete"త్రిశతక కవితాం భవతి!" ;)
చిన్నీఅశగారి అత్మీయస్పందనకు నెనర్లండి.
Deletehearty congratulations on your achievement.
ReplyDeleteమీ కవితా భావాలకి మా శంఖారావాలు......
ReplyDeleteతర్కంగారి మెప్పు మాకెంతో ఆనందదాయకం. ధన్యవాదాలు
DeleteCongratulations padmarpita:-))
ReplyDeleteSruthi...thank you dear.
Deletemi blogs chadivaanu......mi telugu amogham......mana bhasha manamae marchipotuna erojullo intha chakkaga telugu raastunnarante, miku na hats-off. first of all, congrats on completing 300 blogs. miru 300 raayatam oka ettu aite avanni nenu chadavatam inko ettu. chadivi kanipistha....unta andi
ReplyDeleteWell come to my blog and thanks for you compliments Vidya Sagar garu
Delete300 టపాలతో అంతర్జాలపు కవితాలోకంలో విజయవిహారం చేసిన పద్మర్పిత గారికి ఆత్మీయ అభినందనమాల. మీ కవితాప్రవాహం ఆగకుండా 3000 మరో టపాలతో వీరవిహారం చేయాలని కోరుతూ మీ నేస్తం ..ఇక మీ కవిత విషయానికి వస్తే "అంతరంగం" ముచ్చటగా ఉంది. మీ జలపాతాల సిరులు, కంటిఊసుల కీచురాళ్ళు, అలజళ్ళు రేపే అంతఃపురాలు అన్నీ పదాల అల్లికలో అందంగానే ఉన్నాయి..
ReplyDeleteమీ అభిమాన ప్రశంసాత్మక వ్యాఖ్యలకి వందనాలు
Deleteఅంతరంగంలో తొంగిచూశాం.. ఏన్నో వింతలు మరెన్నో విషేషాలు చూశాం..సప్తసరాగాల పదనిసలన్నీ ఏర్చికూర్చి పదాల కూర్పుతో ఏమార్చి. అద్బుతంగా రాశారు...కాదుకాదు అర్బుతమైన పదాలను మనస్సు పదాలుగా మార్చి మామనసులను ఏమార్చి ఎన్నో అద్బుతమై కవితల్లో మమ్ములను మంచెత్తారు.. 300 కాదు 3000 పైగా పదాల అల్లికతో మమ్ములను అలరిస్తారని ఎదురు చూస్తాము All The Very Best Padma Garu
ReplyDeleteThank you very much.
Deletecuriously waiting for 301 post...
ReplyDeleteLets me enjoy the completion of 300 posts.:-) thanks for you curiosity & affection.
Deleteఅంతరంగమందు అలరారు భావాలు
ReplyDeleteపదములందు పొదిగి పదును పెట్టి
గురుచూసి గుండెలో గ్రుచ్చుతారు...
కనుల కొలనులో కదలాడే కలల
అలల్ని అలవోకగా ఒడిసి పట్టి
అందంగా అదిస్తారు...
మసకబారిన మనసుల్ని సైతం
మాటల మంత్రంతో
మరోలోకానికి తీసుకుపోతారు...
ఇలాగే
జీవన పయనంలో ప్రతిక్షణమూ
స్పందిస్తూ... ఆస్వాదిస్తూ... అలరిస్తూ..
అందమైన కవితలందిస్తూ....
వుండాలని మనసా వాచా తలపోస్తూ...
నాతోపాటు అందరి ఆశీస్సులూ అభినందనలూ
పద్మార్పితం కావాలని ఆకాంక్షిస్తూ...
శలవ్....
మీ అభినందన కవితకి హృదయపూర్వక అభివందనము.
Deleteఏంటండీ....మౌన గీతాన్ని ఆలపిస్తున్నారూ...
ReplyDeleteమీ...మా మనసు దోచే మరో కవితా గానం కోసం ఎదురు చూస్తూంటే...ఎప్పుడెప్పుడా అనీ... ఇంత మౌన గీతాలాపనా...
ఎక్కడా కామెంటూ పెట్టడంలా...ఎందుకీ నిశబ్ద సంగీతం???
ఏదో మనసాగక అడుగుతున్నా..మరోలా అనుకోకండీ...
I am addicted to Ur writings.....
మీ అందరి అభిమానాన్ని ఇలా మౌనంగా ఆస్వాధిస్తున్నాండి.
DeleteYour addiction is inspiration for my writings. thanks a lot.
Prudently crafted ...Subtle expression ...Soul touching art ...Amazing :) ur Amazing :)
ReplyDeleteWell come to blog. Thank you very much.
Deletepadmarpita are you okay mam
ReplyDeleteYes I am fine. thanks for your concern.
DeleteI can't believe this, you have such a wonderful talent my dear. amazing writings. Congratulations
ReplyDeleteThanks to Anonymous for inspiring comments.
Deleteసారీ పద్మ గారూ.. ఇలా లేట్ గా వచ్చి ఈ కవితా హరివిల్లుపై వాలి పలకరించడం నేరమే.. కానీ మీకు శుబాభినందనలు తెలపకుండా ఎలా మరి.. అందుకోండి వర్ణ శోభిత అభినందన మందారమాల..
ReplyDeleteనేరమేం కాదండీ ఆలస్యమైతేనేం......చాలా కాలానికి విచ్చేసి అందమైన కమెంటిడిన మీకు ధన్యవాదాలు.
DeleteCongratulations Madam, I am seeing other side of you yaar.. Fabulous follow up-----Nalottam, Jabalpur
ReplyDeleteThank you Nalottamji for your interest in telugu blogging. One day definitely you will become a telugu poet.
DeleteI just discovered your poetry today. It is truly amazing and profound! This is a one of wonderful poem that speaks your heart full feelings. Have you published a book? Thank you for contributing your poetry. You are an amazing poetess and your poems are devastating and passionate s the poetry world.
ReplyDeleteI am sorry for commenting in english and causing in convenience to you. I promises you next time i will keep comments in telugu.
ReplyDelete