నేడు మరల ముస్తాబౌతున్నా
నీవొచ్చి మరలి వెళ్ళకూడదని
ఆశలనద్దా నుదుట తిలకంగా
నిరీక్షణలని కనులకి కాటుకగా
కెంపుల ముక్కెరని నీ గుర్తుగా
ఊసుల ఊహలని జూకాలుగా
పచ్చలహారాన్ని నీకు ప్రతీకగా
చేసిన బాసలని చేతి గాజులుగా
కలలని కట్టాను కటిమురుగుగా
చివరికి అద్దంలో నిన్ను చూస్తున్నా
రెక్కలు కట్టుకుని రివ్వున రాలేదని
నిన్నునీవు చూడ సందేశమంపనా
వస్తున్నావని కాకి కబురు అందినా
నా వాలుజడ గంటల్ని మ్రోగించనా
అందెల మువ్వలతో స్వాగతమననా
నవ్వుముత్యాలని ముద్దుగా ఇవ్వనా
కౌగిళ్ళ సంకెళ్ళతో నిన్ను బంధించనా
మెట్టెలతో ప్రేమకి సాక్ష్యం చెప్పించనా!
నీవొచ్చి మరలి వెళ్ళకూడదని
ఆశలనద్దా నుదుట తిలకంగా
నిరీక్షణలని కనులకి కాటుకగా
కెంపుల ముక్కెరని నీ గుర్తుగా
ఊసుల ఊహలని జూకాలుగా
పచ్చలహారాన్ని నీకు ప్రతీకగా
చేసిన బాసలని చేతి గాజులుగా
కలలని కట్టాను కటిమురుగుగా
చివరికి అద్దంలో నిన్ను చూస్తున్నా
రెక్కలు కట్టుకుని రివ్వున రాలేదని
నిన్నునీవు చూడ సందేశమంపనా
వస్తున్నావని కాకి కబురు అందినా
నా వాలుజడ గంటల్ని మ్రోగించనా
అందెల మువ్వలతో స్వాగతమననా
నవ్వుముత్యాలని ముద్దుగా ఇవ్వనా
కౌగిళ్ళ సంకెళ్ళతో నిన్ను బంధించనా
మెట్టెలతో ప్రేమకి సాక్ష్యం చెప్పించనా!
పద్మార్పితా ముస్తాబు కాకపోయినా నీ మనసు భలే అందం...ఈ వలపు ముస్తాబు దానికి వన్నె తెచ్చింది. వణక్కం :-)
ReplyDeleteనా శింగారం నచ్చిందన్నమాట :-)
Deleteచివరికి అద్దంలో నిన్ను చూస్తున్నా
ReplyDeleteరెక్కలు కట్టుకుని రివ్వున రాలేదని
నిన్నునీవు చూడ సందేశమంపనా
ఇంత అందంగా ప్రేమ వలపు కలగలిపి రాయగలిగేది ప్రేమార్పిత గారే.. ఈ మాట ఎన్నిమార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది.. మీ కవితాఝరికి అభివందనం పద్మార్పిత గారు..చిత్రం అదిరిందండీ..
వర్మగారు మరీ పొగిడేయమాకండి.Thank you
Deleteఇంత ఎదురు చూపుల పిమ్మట
ReplyDeleteపొగడ్త బహుమానంకై ఎదురు చూస్తారు,
ముభావమనే పరదా మాటునే ఉంటారు,
'అందీ అందక' అనే ఆటలో పైచేయి సాధిస్తారు,
అలక కిరీటమే మరచానని మరీ ధరిస్తారు,
కాకి కబురు పంపి కోయిల పలుకులకై చూస్తారు,
వాలు జడ వయ్యారాల నీలుగుడు చూడంటారు,
తన నవ్వులో ముత్యాలు నిజంగా ఏరి తెమ్మంటారు,
అనాదిగా వస్తున్న ఆచారమంటూ పైవన్నీ పాటిస్తుంటారు,
మారం చేసే విధానములో పీ హెచ్ డీ చేసేస్తారు....
హ హ హ ... బాగుంది ....
సాగర్ గారికి ఎక్స్ పీరియన్స్ ఎక్కువే :-) థ్యాంక్యూ
Deleteఇది " వలపు ముస్తాబు " అనుకోను , " వలపు తలపుల ముస్తాబు " అనుకోంటున్నా .
ReplyDeleteఈ మారు నీ చిత్రాంగి నా కళ్ళకు కమనీయంగా అగుపించి , నా మనసుకు ఆనందాన్ని అందించింది .
ఈ చిత్రాంగినే చూస్తూ నేను రాసింది చదవడం మరువకండి :-)
Deleteఅక్షరాల సౌందర్యం నీ ముస్తాబులో మహా ముద్దొస్తున్నాయి. చిత్రం చెప్పకనే చెప్పేస్తున్నది
ReplyDeleteఆ సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాధించండి :-)
DeletePainting chudalo kavita chadavalo artham kaavadam ledu.
ReplyDeleteRendoo chusey Yohanth :-)
Deleteపదాల పొందికని చూసి తన్మయత్వంలో ఉంటే చిత్రంలోని చిన్నిది చిన్నబోతుంది. చిన్నిదాని అలుక తీర్చబోతుంటే కవిత నన్ను కవ్విస్తున్నది. ఇలా అయితే ఎలా అర్పిత?-హరినాధ్
ReplyDeleteపదాలని పలకరించి చిన్నిదాన్ని చూడండి ;-)
DeleteGood feel!!
ReplyDeleteపద్మా నిజంగా ఇంత అందమైన మనసు ప్రేమ ఉన్నవాళ్ళు ఉంటారంటావా? ఎందుకో ఈ కవిత చదువుతుంటే జీవితంలో ఏదో కోల్పోయిన భావన. అయినా గడిచిన కాలం తిరిగిరాదుగా :-( ఈ బొమ్మను నేను దొంగిలించేసాను నా మొబైల్ స్క్రీన్ సేవర్ గా రోజూ చుస్తాను :-)
ReplyDeleteతరిచి చూస్తే మీలోనే ఉంటారుగా మహీ :-)
Deletenice..
ReplyDeleteon a lighter note... పిక్‌లో ముక్కెర మిస్సింగ్. మరి కెంపుల సొంపులు ఎలా... హలా!
రైట్ సైడ్ పెట్టుకుంది, కుడిచెంపన మెరుపు ఆ కెంపుదే :-)
Deleteఅబ్బో ఇన్ని ఉన్నాయిగాని అసలు వలపు కనపడలేదే!
ReplyDeleteGood pic
వలచిన వాడికది కనబడి ఉంటుందేమోలెండి :-)
Deleteమీ అనుపమాన పదవిన్యాస స్వరలహరి కావ్యఝారి మరల మనసుని ఆనంద డోలికల్లో ఉయ్యాలలూపింది.
ReplyDeleteఇంతకంటే ఇంకేం అనినా అది పొగడ్తే అవ్వుతుంది
"నీ కోసం ఎదురు చూసిన క్షణాలను కళ్ళకు కాటుకగా అద్ది నిలుచున్నా"
"నీ వలపును రంగరించి నా నన్నే ఓ కొత్త చిత్రం లా తీర్చిదిద్ది వేచి ఉన్నా "
ఇవి కలిపితే మీ కావ్యం పరిపూర్ణం అవ్వుతుందని అనుకుని రాసాను. ఆద్యంతము చక్కగా ఉంది.
దానికి ప్రత్యుత్తరం గా పేర్చిన చిరు ప్రయత్నపదజాలం : మీ అపురూప రచన ముందు సరితూగాదేమో అర్పిత గారు. బొమ్మ ఆ'కట్టు'కుంది
"వన్నె తరగని నీ మనసు అందం చూడడానికి
నిన్ను మరల నా మనసు మందిరాన నిలుపుకోవడానికి
నా మదిలో దాగింది నువ్వే అని చెప్పడానికి
నీ అంతరంగ తలపుల్లో నేనే ఉన్నానన్న సంగతిని చూపడానికి
నీ అందమైన మనసుని మరల లాలించడానికి
నా ఆలోచనలో నిండిపోయి వేచి ఉన్న నీ మనసు ని ఆశని రేపడానికి
సాక్ష్యం ఇంతకంటే నాకేది దొరకలేదు నా హృదయాన్ని చూపడం తప్ప !!"
శ్రీధర్ భుక్య
http://kaavyaanjali.blogspot.in/
ధన్యవాదాలు తప్ప ఏమి రాయను చెప్పండి.:-)
DeleteNice !!
ReplyDeletesuresh Babu .k
thank you
Deleteవలపుల ముస్తాబు చాలా చాలా బాగుంది. అమ్మయిలు వేసుకునే నగలతో ఇంత అందంగా మీరే కవిత వ్రాయగలరు. చిత్రం చాలా బాగుంది, అంతకన్న మీ కవిత ఇంకా ఇంకా బాగుంది.:-))
ReplyDeleteఅమ్మాయి మనసుతో కమెంట్ పెట్టావు శృతి :-)
Deleteపద్మార్పితగారు ఇంతకీ ఈ వలపు ముస్తాబు వర్క్ ఔట్ అయ్యిందాండి :) Just kidding.Good thoughts with emotional feelings in your poetry. Painting is excellent.
ReplyDeleteఅయితే ఇలా కవిత రాయనుగా :-) Just for fun, Thank you.
DeleteYour kavitas and paintings are outstanding. I am just addicted watch your blog. keep writing.
ReplyDeleteKeep in touch my friend :-)
Deleteపద్మా, అక్షరాలతో, భావాలతో అలంకరించే మీ కవిత ముందు ఏ చిత్రమైనా తక్కువే, ప్రతి పదమూ ముత్యాల సరమే. అభినందనలు.
ReplyDeleteమీ వ్యాఖ్య నాకెప్పుడూ మనోల్లాసమే :-)
Deleteమీకు మనసుకి, అక్షరాలకి ముస్తాబు అవసరం లేదండి...అలవోకగా అమరి ఉంటాయి :-)
ReplyDeleteమీలాగే అందంగా ఉంది మీ కమెంట్ :-)
Deleteనిన్ను చూడడానికి నీకు నేను సందేశం పంపనా అని అమాయకంగా అడుగుతూనే నువ్వు నాలోనే ఉన్నావని ఎంతందంగా చెప్పారండి. ఇలా చెప్పడం మీకే చెల్లింది.
ReplyDeleteభావం అర్థమైనందుకు సంతోషమండి :-)
Deleteచక్కని చిత్రంతో కవిత ముస్తాబు బాగుంది.
ReplyDeleteథ్యాంక్యూ ప్రేరణగారు.
Deletenestam chala baga vraasinaavulee...
ReplyDeleteనచ్చినందుకు మనసు ఆనందించెలే :-)
Deleteమీ మనఃపూర్వక స్పందనలతో నన్ను ఉత్సాహంగా రాయడానికి ప్రేరేపిస్తున్న ప్రతి ఒక్కరికీ నమోవందనము.
ReplyDeleteఇక్కడ రిప్లై ఒక్క లైన్ లోనే ఇవ్వాలన్న వెర్రితలంపుతో ఎవరినైనా నొప్పిస్తే మన్నించ ప్రార్ధన......పద్మార్పిత
ee line ardam kaledu padama...కలలని కట్టాను కటిమురుగుగా......కటిమురుగుగా ante?
ReplyDeleteకటిమురుగు అంటే నాకు తెలిసి....వడ్డాణం (కటి=నడుము + మురుగు=కంకణం)
Deletewow...gud expression and explantion...thnx
Delete--Roopa