ఆ రోజు తప్పక వస్తుంది........
తీరనికోరికల భారంతో పయనమౌతాను
మదిలోనే మసైన కలలతో మిగలలేను
ఏడ్చేడ్చి నీరెండిన కళ్ళతో నిర్జీవినౌతాను!
ఇలా తప్పక జరుగుతుంది........
ఎవరికంటా పడకుండా ఒంటరిగా రోధిస్తావు
అనుకోకుండా నన్ను చేర పయనమౌతావు
సమాధిపై మట్టిని నీ కన్నీళ్ళతో గట్టిపరిచేవు!
ఇది భ్రమగా అనిపిస్తుంది.........
రవిని చంద్రుడు పొందినంత రేయి పగలౌనా
ప్రాణంపోయాక ప్రేమచూపిన ప్రయోజనమౌనా
మన్నించమంటే విధిరాతను ఎవరైనా మార్చేనా!
ఇదేదో బాగున్నట్లుగా ఉంది........
ఒంటరిగా పయనమయ్యే నీవు జంటగా జీవించు
అనిశ్చల జీవితంలో అనంతమైన ప్రేమను పంచు
బ్రతికుండి విశాల హృదయ వీలునామా లిఖించు!
తీరనికోరికల భారంతో పయనమౌతాను
మదిలోనే మసైన కలలతో మిగలలేను
ఏడ్చేడ్చి నీరెండిన కళ్ళతో నిర్జీవినౌతాను!
ఇలా తప్పక జరుగుతుంది........
ఎవరికంటా పడకుండా ఒంటరిగా రోధిస్తావు
అనుకోకుండా నన్ను చేర పయనమౌతావు
సమాధిపై మట్టిని నీ కన్నీళ్ళతో గట్టిపరిచేవు!
ఇది భ్రమగా అనిపిస్తుంది.........
రవిని చంద్రుడు పొందినంత రేయి పగలౌనా
ప్రాణంపోయాక ప్రేమచూపిన ప్రయోజనమౌనా
మన్నించమంటే విధిరాతను ఎవరైనా మార్చేనా!
ఇదేదో బాగున్నట్లుగా ఉంది........
ఒంటరిగా పయనమయ్యే నీవు జంటగా జీవించు
అనిశ్చల జీవితంలో అనంతమైన ప్రేమను పంచు
బ్రతికుండి విశాల హృదయ వీలునామా లిఖించు!
బొమ్మ అందంగా ఉంది. హృదయ వీలునామా ఇలాగా రాయచ్చనమాట :)
ReplyDeleteఇలా రాయొచ్చు అనేది నా ఊహమాత్రమే.....మీకు నేనేం చెప్పగలను :-) Thank you very much.
Deleteపద్మార్పితగారి కవనం ఆర్ద్రం! చిత్రలేఖనం పంచరంగులభరితం!
ReplyDeleteమీ వ్యాఖ్య నాకు అమితానందభరితం. నెనర్లండి.
Deleteపద్మార్పిత ,
ReplyDeleteమదిలోనే మ(న)సైన కలలతో మిగలలేను
రవిని చంద్రుడు పొందినంత రేయి పగలౌనా ( ఇల్లలకగానే పండగ అవుతుందా అన్నది గుర్తు చేసింది . అయినా ఇలా ఉపయోగించటం ఎంతో చక్కగా వున్నదీ . వావ్ ! అనకుండా వుండలేకపోతున్నా . )
ప్రాణంపోయాక ప్రేమ చూపిన ప్రయోజనమౌనా
మన్నించమంటే విధిరాతను ఎవరైనా మార్చేనా!
ఇదేదో బాగున్నట్లుగా ఉంది........ ( ఈ లైను లేకుంటే ఇంకా బాగుండేదేమో )
బ్రతికుండి విశాల హృదయ వీలునామా లిఖించు!( బ్రతికుండి అనటం కంటే ,అలా బ్రతకటానికి అంటే ఇంకా ఎంతో ఎంతో ఆ భావానికి బలం చేకూర్చేదేమో )
చిట్ట చివరగా మళ్ళి చిత్రం అందాఇన భావలను అలవోకగా ఆరబోస్తోంది .
పద్మార్పిత కంటే చ్త్రార్పిత అంటె బాగుంటుందేమో . హ్యాట్స్ ఆఫ్ .
మీ ఈ విశ్లేషణాత్మక అభిమాన ఆస్వాధనాస్పందనకు అభివందనములు.
Deleteతీరని బాధనైన తియ్యగ తెలిపే మీ కావ్యసరళి నుండి జాలువారిన మరో స్వాతి చినుకు, అలాంటి రోజు రాకమునుపే నీ ప్రేమ వీలునామా లిఖించుమని ఉపదెశం మనిషిలోని భావలను భద్రపరుచమని తెలిపే ఓ మంచి సందెశం పద్మ గారు. మీకు ముందస్తుగా "భారతావని బానిస సంకెళ్ళు తెగి, ముక్తి పొంది అరవై ఆరు ఏళ్ళు దాటి అరవై ఎడో యేటా అడుగిడుతున్న శుభతరుణాన స్వాతంత్ర్య దినొత్సవ శుభాకాంక్షలు తెలుపుతు, మీ కలము నుండి జాలువారే ప్రతి కావ్యం మనసుని ఎల్లపుడు హత్తుకొవాలని ఆకాంక్షిస్తు, మీ నేస్తం: భుక్యా శ్రీధర్
ReplyDeleteమీ అభిమానానికి అభివందనములు.
Deleteకవిత శిల్పం ఆకట్టుకుంది. ప్రతీ ఖండీకా ప్రత్యేకంగా ప్రారంభం కావటం, "సమాధిపై మట్టిని నీ కన్నీళ్ళతో గట్టిపరిచేవు!" ఈ వాక్యం తప్పకూండా కొన్నాళ్ళు గుర్తుంటుందనుకుంటున్నాను. మంచి భావన పద్మగారూ..అభినందనలు
ReplyDeleteవాసుదేవగారు ఇలాంటి మనసులో మరచిపోని ముద్రవేసే పదాల అల్లికకు పద్మార్పిత పెట్టిపుట్టిందేమో అనిపిస్తుంది. అన్యదా భావించకండి ఇలా మీ వ్యాఖ్యకు వాక్యం కలిపానని-హరినాధ్
Deleteచాన్నాళ్ళకి మీ మెప్పు పొందాను. కొన్నాళ్ళుకాకుండా కొన్నేళ్ళు గుర్తుండిపోయే కవిత రాయాలని అత్యాశ.:-) ధన్యవాదాలండి వాసుదేవ్ గారు.
Deletesuper poetry. Image is super.. హృదయ వీలునామా! super..
ReplyDeletethank you Sruti.
Deleteవీలునామా కనులతో కాంచీ హ్రుదయంతో లిఖించటం ఓ చక్కని అనుభూతి కవి జన్మకు. మంచి భావాలు అభినందనలు మీకు.
ReplyDeleteమీరాజ్ గారు మళ్ళీ మీ కమెంట్ తో మది పులకించిందండి :-) థ్యాంక్యు.
Deleteఏడ్చేడ్చి నీరెండిన కళ్ళతో నిర్జీవినౌతాను!
ReplyDeleteఇలా తప్పక జరుగుతుంది........
సమాధిపై మట్టిని నీ కన్నీళ్ళతో గట్టిపరిచేవు
Heart touching lines....
మీ సున్నిత హృదయపు మెచ్చుకోలు మహబాగుంది....థ్యాంక్యూ.
Deleteహృదయ వీలునామాని హృద్యంగా వ్రాసారు...అభినందనలు,..స్వాతంత్యదినోత్యవ శుభాకాంక్షలు...
ReplyDeleteథ్యాంక్యూ.....మీకు కూడా శుభాకాంక్షలు...
Deleteఅద్భుతమైన టైటిల్ తో మనసుదోచావు అర్పితా.....నీ అందమైన ఆలోచనలకు అసలు కర్త ఎవరో కానీ మహా అదృష్టవంతుడు. అభినందనల చప్పట్లు-హరినాధ్
ReplyDeleteకర్త కర్మ క్రియల ఫలితంతో పాటు మీ అభిమానాన్ని కూడా నాకే దక్కనివ్వండి :-)....ధన్యవాదాలు హరినాధ్ గారు
Deleteపద్మార్పిత మీ పదాల పదునుకు మనసును సున్నితంగా కోస్తుందండి. ఇలా చెప్పడం మీకే సొంతం.
ReplyDeleteథ్యాంక్యూ....సున్నితంగా కోసి సుతిమెత్తని ఆనంద లేప్యం కూడా కావాలని కోరుకుంటాను.
Deleteకొత్త స్టైల్ లో మెప్పించారు. బాగుంది పద్మార్పితా బొమ్మ భావం కూడా!
ReplyDeleteథ్యాంక్యూ వెరి మచ్
Deleteహృదయ వీలునామా ఇంత బాధాకరంగా కన్నీళ్ళతో గట్టి పడిన సమాధిపై రాసే శిలాక్షరాలుగా వుండాలా??
ReplyDeleteమీ భావోద్వేగానికి జోహార్లు పద్మార్పిత గారూ..
వీలునామా అంటేనే బాధాకరమైనది కదండి....ఇంక అందులో ఆప్షన్స్ ఏముంటాయి చెప్పండి :-) థ్యాంక్యూ వర్మగారు.
Deleteఇంత భాధగా, నిర్దయగా శపించాలా...ఎంత హృదయ వీలునామా అయితే మాత్రం :-)
ReplyDeleteMahee now a days you are becoming so emotional. cheer up. dont worry, these all are life spicy things to digest :-)
Deletebeautiful painting with heart touching words, but its pitching ;(
ReplyDeleteThank you Anony. Sometimes heart needs this sort of touchings too :-)
Deleteహృదయార్ద్రం గా, హృదయార్ధం గానూ ఉంది ఈ వీలునామా!
ReplyDeleteఈసారి పెయింటింగ్ లో మరిన్ని భావాలు రంగుల్లో ఒలికాయి.
మీ స్పందన హృదయాన్ని అహ్లాదపరిచింది. థ్యాంక్యూ.
Deleteమాడం గారు....ఈ విషాధ ఛాయలనుండి బయట పడేసేలా కూసింత నవ్వించండి :-)
ReplyDeleteనవ్వులు పండించడం మీవంతు సృజనగారు :-)
Deleteమీ భావావేశంతో రూపు దాల్చిన కవిత గూర్చి ఏమి కామెంట్ చేయగలం బాగుంది అని తప్ప .....
ReplyDeletethere is no choice that you left with us 'always' as usual...
"ఇదేదో బాగున్నట్లుగా ఉంది........"
ఈ వాక్యం వాడవలసినది కాదు
Thanks a lot Sagarji.
Delete"ఇదేదో బాగున్నట్లుగా ఉంది" అనేది ఎందుకు వాడానంటే....లాయరు నోటీసు ఇచ్చేటప్పుడు పాయింట్స్ లా విశధీకరిస్తారు కదా...అలాగే నేను కూడా ఈ వీలునామాని ఇలా క్రొత్తపంధాలో చెప్పాలి అని ప్రయత్నించాను. లాయర్ వీలునామా రాసేవాళ్ళకి సూచనలు ఇస్తారు ఇలా చేయండి, అలా చేస్తే బాగుంటుంది అని....తరువాత రాసేవాళ్ళ ఇష్టం.:-) అది ఈ పంధాలో నేను ఇక్కడ చెప్పడం అందరికీ నచ్చకపోయి ఉండవచ్చు. అయినా భావం మీ మనసుని చేరిందనే భావిస్తున్నాను.
పద్మార్పితగారు ఈ వీలునామా ఇంతకీ ప్రేమించుకునే ముందు రాయాలా లేక ప్రేమించేసుకున్నాకా? అని డౌట్ :)kidding. It touched the heart.
ReplyDeleteGood question young star..:-)
Deleteప్రేమించుకునే ముందు, ప్రేమించుకున్నాక వీలునామా అవసరం ఉండదు, కాని లైఫ్ లో కమిట్ అయ్యే ముందు హృదయపు వీలునామా రాసుకోవడం అవసరమేమో అనికేత్.... డిఫరెంట్ గా ఆలోచిద్దాం అప్పుడు డౌట్స్ రావు :-)
Deleteకెక్యూబ్ వర్మగారు.....ఏదో యంగ్ స్టర్స్ డౌట్స్ తీర్చడం పోయి మీరే యూత్ లా మారిపోతే ఎలాగండి :-)
DeleteDeath is not the final destination for love. Its a part of life and Its not the Life. mari ila velunamalu avi enduku happyga enjoy cheyakunda
ReplyDeleteYes I too agree with your statement Anonymous. But in life this sort of emotions gives us slight pain but happiness too. thanks for you comment.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteపేరాగ్రాఫ్ గా విడగొట్టి చదివితేనే కాని అర్థం చేసుకోలేనంత తెలివితక్కువ వాళ్ళు కారండి పాఠకులు. పద్మార్పిత వ్రాసిన దాన్ని కేవలం విడగొట్టి మీరు వివరించింది ఏంటో ఇక్కడ అర్థంకాలేదు.
DeleteBukya Sridhar garu...మీకు నేను రాసింది అర్థం అయ్యి ఉంటుందనే భావిస్తున్నాను. సాగర్ గారికి చెప్పిందే మీకు కూడా "ఇదేదో బాగున్నట్లుగా ఉంది" అనేది ఎందుకు వాడానంటే....లాయరు నోటీసు ఇచ్చేటప్పుడు పాయింట్స్ లా విశధీకరిస్తారు కదా...అలాగే నేను కూడా ఈ వీలునామాని ఇలా క్రొత్తపంధాలో చెప్పాలి అని ప్రయత్నించాను. లాయర్ వీలునామా రాసేవాళ్ళకి సూచనలు ఇస్తారు ఇలా చేయండి, అలా చేస్తే బాగుంటుంది అని....తరువాత రాసేవాళ్ళ ఇష్టం.:-) అది ఈ పంధాలో నేను ఇక్కడ చెప్పడం అందరికీ నచ్చకపోయి ఉండవచ్చు. అయినా భావం మీ మనసుని చేరిందనే భావిస్తున్నాను.
Deleteమీరేమో ప్రేమలో వీలునామాలు రాసేయమంటున్నారు....అందులో ఓనమాలు కూడా రాయలేకపోతున్నాం :-)
ReplyDeleteకవితకి, పెయింటింగ్ కి తిరుగులేదు.
ఓనమాలేంటి కవితలే రాసేస్తున్నావ్ కదా తెలుగమ్మాయి :-)
Deleteఇదేదో బాగున్నట్లుంది.
ReplyDeleteఈ కమెంట్ కూడా వెరైటీగా బాగుంది :-)
Deleteఎవరికంటా పడకుండా ఒంటరిగా రోధిస్తావు
ReplyDeleteఅనుకోకుండా నన్ను చేర పయనమౌతావు
సమాధిపై మట్టిని నీ కన్నీళ్ళతో గట్టిపరిచేవు!
అనిశ్చల జీవితంలో అనంతమైన ప్రేమను పంచు
బ్రతికుండి విశాల హృదయ వీలునామా లిఖించు Hart Touching Lines Padma Garu
మీ హృదయాన్ని తాకిన ఈ వీలునామాపై మీ స్పందనకు ధన్యవాదాలండి.
Delete