చౌకధర

మనిషి జీవితం ఎంత సరసమైనదో చూసారా
ఎందుకీ గగ్గోల ధరలు మండిపోతున్నాయని
కొన్నికాసులకే కొనొచ్చు మంచిని మర్యాదని
ఎవరన్నారు మంచి లేకపోతే మనుగడే లేదని!

మనిషి ముందూ చౌకగానే అమ్ముడయ్యేవాడు
ఇప్పుడు దేవుడు కూడా అమ్ముడై పోతున్నాడు
మ్రొక్కుబడులకే మొగ్గుచూపి మోక్షమిస్తున్నాడు
ఎవరనేరు పాపపుణ్యాలని కొలిచే త్రాసే జీవితమని!

మనిషి మానవత్వపు చౌకధరల పట్టికని చూసారా
క్షీణిస్తున్న విలువలకి అధికధరంటూ అరుపులేలని
ప్రాణంపోయినాక తలచినా మరచినా ఏమి జరిగేనని
ఎందుకొచ్చిన ప్రాకులాట అమూల్యమైనది జీవితమని!

మనిషి రోజుకో మూల్యమని విలువ తగ్గుతున్నప్పుడు
మరెందుకని ధరలపై ఈ అనవసర ధర్నాల చెడుగుడు
దర్జాగా డాబుదర్పపు అక్కరకురాని మాటల అడుగుడు
ఎందుకీ దిగజారిన బ్రతుకు జీవనపోరాటమని అడగరేలని!

26 comments:

  1. దిగజారిన మానవతా విలువలపై ఎక్కుపెట్టిన అస్త్రమా ఇది పద్మార్పితగారు...వండర్ఫుల్

    ReplyDelete
  2. మనిషి విలువలు దిగజారి తరువాత అవసరాల ధరలు పెరిగితే ఏంటీ అంటారా?

    ReplyDelete
  3. మానవ జీవితంలో ఆఖరి మాటకు చాలా విలువను యిస్తుంటారు అందరు . అలాగే ఈ కవితలో ఆఖరున వ్రాసిన 4 పంక్తులు చాలా విలువైనవి .
    మనిషి రోజుకో మూల్యమని విలువ తగ్గుతున్నప్పుడు
    మరెందుకని ధరలపై ఈ అనవసర ధర్నాల చెడుగుడు
    దర్జాగా డాబు ,దర్పపు అక్కరకురాని మాటల అడుగుడు
    ఎందుకీ దిగజారిన బ్రతుకు జీవనపోరాటమని అడగరేలని!
    కాకుంటే చివరిలో ప్రశ్నార్ధకంగా వదిలేస్తే యింకా బాగుంటుంది .
    ఎందుకీ దిగజారిన బ్రతుకు జీవనపోరాటమని అడగరేల ?

    మొదటి 4 పంక్తులలో 3 వ దానికి , 4 వ దానికి పొంతన కుదరదు . ఒక్కసారి ఆలోచించితే బాగుంటుందేమో మఱి .

    ReplyDelete
  4. మనిషి చౌకగా అమ్ముడైపోతున్నాడు కనుకనే వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటినాయని అరిచి గోలచేస్తున్నాడు. కాదంటారా?

    ReplyDelete
  5. మనిషి నైజం అదే పద్మార్పితా....మనమేంటో తెలుసుకోకనే ఎదుటివారి తప్పులు చెప్పేస్తుంటాం. మన విలువలే దిగజారినాక ఇతరత్రా విలువల్లో హెచ్చుతగ్గులతో పనేంటని చక్కగా చమత్కరించావు.

    ReplyDelete
  6. ఎవరన్నారు మంచి లేకపోతే మనుగడే లేదని!
    ఎవరనేరు పాపపుణ్యాలని కొలిచే త్రాసే జీవితమని!
    ఎందుకొచ్చిన ప్రాకులాట అమూల్యమైనది జీవితమని!
    ఇంకేదో అడగరేమంటూ అననేల? నువ్వుమాత్రమే ప్రశ్నించగలవు ఇలా-హరినాధ్

    ReplyDelete
  7. "ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుంటే
    అన్నీ ఉన్నమ్మ అణిగిమణిగి ఉందట"
    అలాగే మనిషికి విలువ ఎలాగో తక్కువే కాబట్టి నిత్యావసరాలు కూడా చౌకగా లభ్యమవ్వాలని మా డిమాండ్ తప్పు కాదుగాక కాదు :-)

    ReplyDelete
  8. పద్దమ్మగోరూ....మీరు ఇలా పదేసి రోజులు పద్యకవితలకి ఎగనామం పెట్టేసి నా మైండ్ మొద్దుబార్చి బ్లాంక్ చేయమాకండి :-)

    ReplyDelete
  9. మీ ఆలోచనా విధానం రాసేతీరు మీతోపాటు చదివే వారిని కూడా ఆలోచింపజేసేలా ఉంటాయి. అందుకే చదివిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. మంచి కవితని అందించారు,

    ReplyDelete
  10. మనిషి మనసు మాత్రమే తెలుసు అనుకున్నాను కానీ వారి విలువల్ని కూడా పసిగట్టే పరికరముంది మీ పదాల్లో :-)

    ReplyDelete
  11. పద్మా ఇన్నిరోజు ఆలోచించావా ఇంత అద్భుతమైన కవితరాయడానికి అని ఆలోచిస్తున్నా మా శ్రీవారితో కలిసి చర్చిస్తున్నా కూడా :-)..భేష్ బ్రహ్మాండంగా వ్రాశావు.

    ReplyDelete
  12. దిగజారి అమ్ముడవుతున్న మానవత్వ విలువలనే వెలుగుని సరిచేసే ప్రయత్నం లా చిత్రంలో మీ కవితా పటిమను రంగరించిన ద్విగుణీకృత దృష్య మాలిక. కనువిప్పుకి వెలుగు బావుటా. వండ్రఫుల్ మేడం.

    ReplyDelete
  13. భలే మంచి చౌకబేరము ... ప్రేమోల్భణం ఎఫెక్టనుకుంటా :-)

    ReplyDelete
  14. మానవ విలువలు క్షీణించాయని నేను అనుకోవడం లేదు. మనిషి క్షీణించాడు, మనిషి ఆలోచనలు క్షీణిస్తున్నాయి.
    మనిషిలో మనిషి మాయమయ్యాడు. బహుశా కలియుగం ప్రారంభమైన మొదటి రోజు నుంచే మనిషి మాయమయ్యాడు. దీపాన్ని సరిచేసి, కాంతిని పెంచి... చీకట్లో మనిషెక్కడ ఉన్నాడో వెతికే ప్రయత్నం చేయకండి. లేడు. కానీ.. మీరు వెలిగించిన దీపం... ఇచ్చిన వెలుగే మానవత్వం. ఆ వెలుగుని మీతో పాటు కాపాడే మనుషులు మిణుకుమిణుకుమంటూ ఉంటారు. ఈ పాటైనా లోకం ఇలా ఉందంటే... ఆ మిణుగురులే. చక్కని కవిత. చిక్కని భావన. మీ మార్కు కనిపించింది... మీకు వంద మార్కులు.

    ReplyDelete
    Replies
    1. మీరిలా నేను అడక్కముందే గంభీరంగా కమెంటేసారు, ఏమన్నా బొమ్మకూడా బుస్సుమంటుందేమో! :-)

      Delete
  15. ఎవరికైనా ఏమైనా అయితే మనకెందుకులే అనుకునే రోజులివి
    అంతేగాని వాళ్ళు మనలాంటి మనిషే అని ఆలోచించే తత్వం నేడు మరుగున పడిందేమో అనేలా ఉన్నాయి నేటి కాలం మానవీయ సంబంధాలు.

    మనిషిలోని మానవత్వం నేను శిలరూపుదాల్చి చేక్కేవారులేకా మూగావేదనకు లోనవుతూ ఉంటె పలకరించాకపోయి వెక్కిరింతలు ముభావంగా మనిషికి మనిషికి తెలియని కనబడని అగాధాలు

    నమ్మకాన్ని కూడా తూలనాడే రోజులివి కాని అందరు అలా ఉండరు. కలియుగం లో కూడా ఆ వేంకటేశ్వరుడు ఎలా ఐతే అవతరించాడో అలానే కొద్దో గొప్పో మనుషులు కూడా ఉన్నారు బాధను పంచుకునే వాళ్ళు.

    సత్సంబంధాలు మనిషిని మనిషి అర్ధం చెసుకొఅదమ్ లోనే దాగుంది పద్మ గారు. విలువైన ఈ జీవితాన్నికి కూడా సార్థకతా చరితార్తకం అందులోనే నిగూదితమై ఉన్నాయి. దేవుడు అనేవాడు కూడా అమ్ముడుపోయాడన్నారు, నిజానికి దేవుడు మనందరిలోనే కొలువై ఉన్నాడు. అమ్ముకునేది కూడా పొట్టకూటికే అనేది ఇప్పుడు ధర్మంగా భావించొచ్చు కాని ఆ దేవుడి సిరి సంపదలు తన వక్షస్తలముపైనే ఉండగా

    నిరాడంబరమైన చిరునవ్వు ఆ మోమున వెలుగుచుండగా, మనిషికి మనిషికి దూరం పెరిగే కొద్ది ఈ అనవసరపు తులాభారాలు లేని పోనీ బేర సారాలు. ఏ పరిస్థితిలో ఐన మన అసలైన సంపద బంధాలు బాన్ధవ్యాలే తప్పితే ఇంకా వేరే ఏది కాదు

    (ఇది నా అభిప్రాయం మాత్రమె తప్పుగా అనిపిస్తే మన్నిచేద్దురు ) ఓం నమో నారాయణ

    ReplyDelete
  16. ఏమోనమ్మ నాకుమాత్రం ఈ లోకం తీరు అస్సలు అర్థం కాకున్నది. ఏదో పొడితేద్దాం ఉద్ధరించేద్దాం అనేలాంటి మాటలు చెప్పాలంటే కూసింత భయమే. ఎందుకంటే ఏం చేయలేనని. మానవ విలువలు తెలుసుకోవడంలోనే కాలం వెళ్ళిపోతుందేమో!

    ReplyDelete
  17. ఇంత సీరియస్ కవితరాసి మనిషిని ఎడాపెడా కడిగేయాలా అధ్యక్షా:-)

    ReplyDelete
  18. మనిషి చవకగా అమ్ముడుపోవాలంటే ఖర్చు మరికాస్త ఎక్కువే

    ReplyDelete
  19. బాగుంది మేడం కవిత. ఎవరు అడగరే ఎందుకు మీరే అడగండి మీ వెంట మేముంటాం :-)

    ReplyDelete
  20. అమ్మడాలు కొనడాలు అన్నీ జరిగిపోతున్నాయి ధరల పట్టిక ఎవరు చూస్తున్నారని. మనిషి జీవితం కూడా సాగిపోతుంది, విలువలు బంధుత్వాలు ఎవరు పట్టించుకుంటున్నారని. ఆలోచనాత్మిక కవిత బాగుంది

    ReplyDelete
  21. చిన్నారి నువ్వేదో సంఘర్షణల్లో కొట్టుమిట్టాడుతూ భాధలో ఉన్నావు అన్నది వాస్తవం. కేవలం నీ కవితలు చదివి ఏర్పడిన బంధమే అయినా అనుకోకుండానే మనసుకి దగ్గరైనావు. ఎటువంటి కష్టాలు వచ్చినా కోల్పోని నీ ఆత్మస్థైర్యం నిన్ను మరలా మా పద్మార్పితను చేస్తుందని చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. భాదేమైనా పంచుకుంటే తీరుతుంది అంటారు కదా హరినాధ్ గారు మరిక్కడ అలాంటిది ఏంలేదు. ఏదేమైనా పద్మార్పితగారి కవితలు మనకి అహ్లాదాన్ని అందించి ఆమెని కలవర పెడతాయి అనుకోను.

      Delete
  22. అణగారని ఆత్మవిశ్వాసమే నా అన్న
    తడి ఆరని తలపులే తమ్ముళ్ళు
    నాకు నేనే రక్ష.....పద్మార్పితగారి మాటలివి ఫేస్ బుక్ లో
    ఈ మనోబలంతోనే సాగిపొండి. Come on cheer up Mam.:-)

    ReplyDelete
  23. నా రాతలకి స్పంధించిన వారికి నా నమస్కారములు. అందరూ నా రిప్లైల్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటే నేను ఇవ్వకుండా నిరాశపరచానని తిట్టుకోకండి. ఈసారికి ఇలా ఒగ్గేస్తారని ఆశతో._/\_ మీ పద్మార్పిత

    ReplyDelete