వలస బంధం

కొన్ని పరిచయాలు తామరాకుపై నీటిబొట్లు
దోసిలితో నీళ్ళిచ్చి దాహమైతే తీర్చవు కానీ
సెలయేటి సోయగం కనికట్టుగా చూపుతూ
సూక్ష్మంలో మోక్షమంటూ సర్వం కోరతాయి

కొన్ని అనుబంధాలు పనికిరాని పనిముట్లు
అగుపడకనే అంతటా తడిమి ఆప్యాయతని
అందమంటూ అంబరాన్ని నేలపై చూపుతూ
అధఃపాతాళానికి అందని నిచ్చెనలు వేస్తాయి

కొన్ని ప్రక్రియలు పాకుడంటిన జారుడుమెట్లు
చేయూతమంటూ చేతినైతే అందిస్తాయి కానీ
మూరెడు మొగలి పూలమాలతో మురిపిస్తూ
మల్లెల మండువానే బదులు అడుగుతాయి

కొన్ని ప్రణయాలు కనిపించని గాయపుగాట్లు
అందితే తలని అందకపోతే కాళ్ళని పట్టుకుని
వలస పిట్టలవలె విచిత్రంగా మాయమైపోతూ
పట్టుకుంటే జారి పట్టుకోకపోతే ఎగిరిపోతాయి

80 comments:

 1. పద్మా.....ఇది పర్సనల్ ఎక్స్ పీరియన్సో లేక అక్షరాలతో నీవు ఆడుకుంటున్న చెలగాటమో తెలీదు కానీ ప్రతి కవితకీ సున్నిత భావాలని జోడించి హృదయానికి హత్తుకుంటావు. నా మనసు మూలెక్కడో గుంబనంగా దాగిపోయే కవితిది. తగిన చిత్రంతో మదిని తడిమేసావు.

  ReplyDelete
  Replies
  1. సంధ్యగారు నా భావాలకి అక్షరరూపం జీవితానుభవం కొంత వీక్షించి తెలుకున్నది మరింత. మనసులో నా భావాలు మరికొన్ని ఒదిగిపోనీయండి.

   Delete
 2. ఆలోచనలుంటేనే సరిపోదు, దమ్ముండాలి దుమ్మురేపాలంటే.....రెండూ పుష్కలంగా ఉన్న మీరు మరోసారి ధ్వజమెత్తారు అనిశ్చల పరిచయబంధప్రక్రియప్రణయాలపై. వామ్మో ఆవేశం ఎక్కువైంది అంటారా లేక అంత పెద్ద వాక్యం రాసిన ఆయాశం అంటారా!:-) అదరహో అదరః కవిత.

  ReplyDelete
  Replies
  1. ఆలోచనల వరకు ఓకే కానీ మరీ ఇలా దుమ్మురేపితే ఎలా?.....డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఇబ్బంది పడతారేమో :-)

   Delete
 3. అన్నట్లు మరిచాను చిత్రాన్ని ఎంచుకోవడం ఒకెత్తు, దాన్ని నిర్భయంగా పోస్ట్ చేయడం మీ సొత్తు. keep it up.

  ReplyDelete
 4. కొన్ని కాదు నేటితరంలో అన్ని పరిచయాలు ప్రణయాలు బంధాలు భాధ్యతలు కూడా యాంత్రికంగా మారిపోయాయి. అవసరానికి అనుగుణంగా అందరూ మారిపోతున్నారు. నేటి పరిస్థితులపై చర్నాకోల్ ఝళిపావు శభాష్

  ReplyDelete
  Replies
  1. నందుగారూ.....మీరన్నది నిజమే. జీవితమే యాంత్రికమైపోయింది.

   Delete
 5. You are a lady with guts and gun shot thoughts. Keep rocking

  ReplyDelete
  Replies
  1. With guts...its fine
   Gun shoot.....No license :-)

   Delete
 6. కొన్ని తెలిసినా అన్నీ తెలుసనేవారు కొందరు
  ఏమీ తెలియకపోయినా తెలుసనేవారు మరికొందరు
  ఎన్నో తెలిసినా అణుకువగా ఉండేవరు పద్మార్పితగారు
  మీరంటే అభిమానం దినదినం అభివృధ్ధికి కారణం ఇదే

  కవితగురించి ఏం వ్రాయలేక ఇలా ఏదేదో వ్రాసేస్తున్నను. కవితలోని భావం సింప్లీ సూపర్బ్. పిక్ మైండ్ బ్లాక్:-)

  ReplyDelete
  Replies
  1. రూపగారు తలచుకుంటే మీరు కవితలు రాసేయగలరు. మైండ్ బ్లాక్ ని బ్రైట్ చేసెయ్యండి. :-)

   Delete
 7. పద్మా నిజాలన్నీ నువ్వు చెప్పేసి నిమ్మకు నీరెట్టనట్లుంటే....పాపం జనాలు లబో దిబో అంటారు చిత్రాన్ని చూసి నీ రాతలు చదివి. చాలా భావయుక్తంగా చెప్పాలనుకున్నదంతా చెప్పావు. అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. సృజనగారు.....నిజాలు చెప్పమనేగా చిన్నప్పటి నుండి నేర్పించింది. చిత్రాలని చూసి లబలబలాడే వారు కాదండి, అందరూ భావాలని చదివి చిత్రాలని అస్వాధించే నేర్పరులే అని చాలాసార్లు రుజువు చేసారు మనవారంతా.

   Delete
 8. మీ బ్లాగ్ ఒక అందమైన పర్ణశాల. పంచరంగుల కుహు కుహు రాగాలు మీ భావాలు.

  ReplyDelete
  Replies
  1. కల్కి గారు మీ ప్రొఫైల్ పిక్ పసిడి చాయతో, నవ్వు పంచదార తీపితో ఆకర్షణీయంగా ఉందండి. మీ వ్యాఖ్యలకు వందనాలు.

   Delete
 9. పద్మా ,

  నువ్వు యిలా బ్లాగులో వ్రాసుకొంటూ పోవటం కంటే , ప్రముఖ వారపత్రికలకి పంపితే పేరుకు పేరు వస్తుంది , పెన్నిధి దక్కుతుంది . ప్రతిభను వృధా చేయరాదు మనకు ధనం అవసరమున్నా లేకున్నా .
  మాణిక్యం మట్టి చేత కప్పబడి , అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల ధగ ధగా మెరుస్తుంటుంది . కొంతమంది చేతల వల్ల తన ప్రతిభను వెల్లడి చేస్తుంటాయి స్థిరంగా మాత్రం కాదు . స్థిరంగా తను అంటే ఏమిటో తెలియాలంటే తన ద్వారానే సాధ్యమవుతుంది . ఇది నూటికి నూరు పాళ్ళు అక్షర సత్యం , ఆచరణ సాధ్యం .

  అందులో నీది వన్ వే ట్రఫిక్ కాదు . టూ యిన్ వన్ వి . భావం , భావానికి తగ్గ చిత్రం చూపగల సత్తా వున్నదానివి .

  గతంలో నువ్వు ఓ వేళ ఈ ప్రయత్నాలు చేసి , ఫలితం లేకపోయినా నిరుత్సాహ పడకూడదు .
  ఇకనైనా దూసుకుపో తప్పకుండా .
  " రాయి అన్నది ఒకనాటికి రత్నమౌనురా " అన్నది అందరూ ఎఱుకలో వుంచుకోవలసిన బంగరు సూక్తి .

  ReplyDelete
  Replies
  1. శర్మగారు ఇంత విపులంగా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పి కంటికెదురుగా కవితా సంపుటిక సంబరాలని కమనీయంగా చూపిస్తుంటే.....మునుపు రాని ఆలోచనలకి అంకురార్పణ జరుగక మానదు కదా! ఆలోచిస్తున్నా.."నేటి ఆలోచనలు రేపటి ఆచరణలు" అవుతాయేమో చూద్దాం!

   Delete
  2. ఆకాంక్ష...Yes Sarmagari idea bahoot khoob :-)

   Delete
 10. అసలైన బంధం అనేది ఎంత విదిపోవాలన్న వీడిపోదు
  ఆ బంధానికి ఎన్ని చేసిన ఏమి ఇచ్చినా తీరిపోని ఋణం
  ఆకాశానికి భూమికి దూరం చాలా కాని ఆ పుడమి దాహాన్ని తీర్చే ఆ ఆకాశ బంధం ఎనలేనిది
  కొన్ని పరిచయాలు ఎప్పటికి సమసిపోవు క్షణాలు నిమిషాలు గంటలు రోజులు నెలలు వత్సరాలు యుగాలు ఎన్ని గడిచిన గాని

  చాల చక్కని కవనం పద్మ గారు. చక్కగా తెలిపారు వలస బంధాల గురించి.. :)

  ReplyDelete
  Replies
  1. శ్రీధర్ గారు.....అసలైన బంధం అనేది ఎన్ని అడ్డంకులున్నా అలాగే నిలుస్తుంది కానీ నేడు అలా అసలైన బంధాలే కరువైనాయని నా భావం. బహుశా నాకు తారసపడి నేను చూసినవి అటువంటి బంధాలేనేమో!

   Delete
 11. ఎలా రాస్తారో మీ భావాలని ఇంత అధ్భుతంగా నాకెప్పుడూ అర్ధంకాదు.

  ReplyDelete
  Replies
  1. నా భావాలకి అక్షరానుభవాలే ఊపిరి మరియు మీ అందరి అభిమానమే ప్రేరణ.

   Delete
 12. Padma is this resembles any few of your friends. If so I am sorry to hear this. Regarding poem this is one more feather in your grown. Congrats.

  ReplyDelete
  Replies
  1. Of course Mahee.....All are not like that, some are there to TEST, Some will USE, Some will TEACH and some will bring out the BEST.

   Delete
 13. తర్కిస్తే బొమ్మగురించి చేయాలి. కవిత అద్భుతం

  ReplyDelete
  Replies
  1. తర్కించండి....అంటే మీరు కూడా బొమ్మల్ని చూసి ఆనందిస్తున్నట్లేగా :-)

   Delete
 14. కొన్ని పరిచయాలు తామరాకుపై నీటిబొట్లు
  కొన్ని అనుబంధాలు పనికిరాని పనిముట్లు
  కొన్ని ప్రక్రియలు పాకుడంటిన జారుడుమెట్లు
  కొన్ని ప్రణయాలు కనిపించని గాయపుగాట్లు
  ఏమో పద్మా నీవు ఏం రాసినా చదవాలని, పాటించాలని పిచ్చపిచ్చగా ప్రేమించాలని అనిపిస్తుంది. ఇదేదో మాయరోగం అనమాకు.

  ReplyDelete
  Replies
  1. ఆకాంక్ష అయితే నేను ఏం రాసినా పర్వాలేదన్న ధీమా నాకొచ్చేసిందిగా....ప్రేమించేసెయ్ :-) రోగంలేదు రొచ్చులేదు అంతా ప్రేమమయం!

   Delete
 15. కొత్తూ రిగారి కమెంట్ తరువాత నేను కమెంటితే కంచెం జ్ఞానోదయమై బాగారాసేదాన్ని కమెంట్ కానీ నాకు ఆ చాన్స్ ఇవ్వలేదు .:-( పోనీలేండి ఇప్పుడైనా జ్ఞానాన్ని ప్రసాదించండి సతీష్ గారు.:-)

  ReplyDelete
  Replies
  1. మీ కమెంట్ ఎప్పుడూ సూపరే ఆకాంక్షా. అల్లరిలోపాటు ఆనందాన్ని అహ్లాదాన్ని అందిస్తుంది.

   Delete
 16. అయ్యబాబోయ్ ఎంత బాగరాసారండి!
  అధ్బుతం.. నేటితరం మానవత విలువలను ప్రతిబింబించేట్టుగా, మగువ మనసును, వలపు దృక్పదాన్ని అందమైన అక్షరాలతో చక్కగ మీదైన శైలిలో అమర్చారు.. సూపర్.. మీ కవితకు మేము దాసోహం!

  ReplyDelete
  Replies
  1. శృతీ...అయ్యబాబోయ్ అంటే హడలి చచ్చాను :-)నచ్చి మెచ్చి దాసోహం అన్నారుగా దాన్ని చదివి పడిలేచాను

   Delete
 17. పరిచయమైనా ప్రణయమైనా ఎదుటివారి భావాలను గౌరవిస్తూ నమ్మకంపై సాగే పయనం. అలాకాకుండా స్వార్థం కోరికలు ఆధిపత్యం చేసినప్పుడు ఏ బంధమైనా భ్రష్టుపడుతుంది.
  పద్మార్పితకి పద్య పరిమళాలని సున్నితంగా మనసులో నాటుకునేలా చెప్పే నైపుణ్యం మెండు అనడానికి మరో నిదర్శనం ఈ కవిత. ఆశిస్సులతో-హరినాధ్

  ReplyDelete
  Replies
  1. ఈ రోజుల్లో ప్రతిష్టమైన బంధాలు ఎవరూ కోరుకోక నమ్మకాన్ని పెంపొందించుకోవడం లేదేమోనండి.

   Delete
 18. దోసిలితో నీళ్ళిచ్చి దాహమైతే తీర్చవు కానీ
  సెలయేటి సోయగం కనికట్టుగా చూపుతూ
  అందితే తలని అందకపోతే కాళ్ళని పట్టుకుని
  వలస పిట్టలవలె విచిత్రంగా మాయమైపోతూ
  పట్టుకుంటే జారి పట్టుకోకపోతే ఎగిరిపోతాయి..
  లెస్సపలుకుల భాంఢాగారం మీ కవితాలేఖనం.

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనలు ఆ పలుకులకు పదును పెట్టే పరికరాలు.

   Delete
 19. పరిచయ బంధాలు అనిశ్చలం అంటే ఏదో తెలియని ఆందోళన పద్మార్పితగారు.

  ReplyDelete
  Replies
  1. నిలుపుకుంటే నిలకడ బంధాలే....డోంట్ వర్రీ:-)

   Delete
 20. అధ్భుతమైన భావావేశం. చక్కటి అమరికతో కవిత్వంలోని భావానికి మరింత వన్నె తెచ్చారు. పద్మార్పిత ఈస్ జస్ట్ నాట్ ఎ నేం ఇట్స్ ఎ బ్రాండ్ అనడానికి ఇంకేం కావాలి... అదరహో మేడం...
  చిత్రం మీ ఉన్నత ఆలోచనలకు మానసిక స్థైర్యానికి అద్దం పట్టేలా ఉంది...
  సతీష్ కొత్తూరి గారు ఎక్కడున్నా వచ్చేయండి... వైటింగ్ ....

  ReplyDelete
  Replies
  1. బ్రాండ్ మార్క్ అని బోర్ కొట్టి చదవడం మానేస్తారేమోనని భయం :-)

   Delete
 21. నా కామెంట్‌ కోసం వెయిట్ చేస్తున్నందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు. కాస్త ఆరోగ్యం బాగోక ఆలస్యమైంది. ఈ కవిత చదివిన రోజే కామెంట్ పెడదామనుకున్నా.. కానీ.. అంత తేలిక వ్యవహారంలా అనిపించలేదు. ఒక పదిసార్లు చదివితేనే గాని అంతరార్ధం అంతుపట్టలేదు. ఇది మగువ మనసుకి సంబంధించిందా.. లేకా అన్ని బంధాలనూ ప్రస్తావించిందా..? అనేది తేల్చుకున్నాక ఇదిగో ఇప్పుడు రాస్తున్నా.....

  ReplyDelete
  Replies
  1. వెల్ కం కొత్తూరిగారు. మీకు ఫాన్స్ ఫాలో పెరిగిపోతుందండోయ్ :-)
   మీ ఆరోగ్యం కుదుట పడిందనుకుంటాను. మీరు పదిసార్లు చదవడానికి నోచుకున్న నా భావాక్షరాలు ధన్యులు :-)

   Delete
 22. మొదట మీ చిత్రానికి హాట్సాఫ్‌. అది పబ్లిష్‌ చేసిన ధైర్యానికీ, భావాలను సూటిగా చెప్పగలిగిన మీ మనోధైర్యానికి సలాం. తామరాకు మీద నీటి బొట్టే మీ చిత్రం. ఆ వాలుచూపు వాడి చూస్తే తెలుస్తోంది... పట్టుదొరికేది కాదు. అలా అని వదలేదీ కాదు. ఆ నెమలి పింఛంలో రంగుల ప్రపంచమే ఆ బంధానికి కావాలి. రంగులందిస్తున్న ఆ చేయి కాదు.
  తడి ఊహలతో వేడెక్కించి... నునుపు గోడల మీదుగా అగాధంలోకి జార్చే... వయ్యారాల ఎర అది. స్వార్ధాన్ని గెలిపించుకునేందుకు... బంధం భ్రమలో బంధించే ప్రవల్లిక. ఆ చిక్కుముడుల్లో పుట్టిన ప్రేమ, వ్యామోహం ఏదీ
  మొగ్గ దశ దాటదు. కొన్ని బంధాల బంధనాల గురించి మీరు చూపించిన చిత్రం... సరిగ్గా సరిపోియంది పద్మ. ఈ రోజుల్లో ఉన్న బంధాలన్నీ దాదాపుగా ఇలాంటివే... పనికిరాని పనిముట్లు. గాయపు గాట్లు. జారుడు మెట్లు. ఇక్కడి క్యారెక్టర్‌ ఆడా, మగ అని కాదు. ఇద్దరూ ఇద్దరే. మీ చిత్రానికి జెండర్‌ లేదు. కేవలం కాన్సెప్ట్‌ మాత్రమే కనిపించింది. మొత్తానికి... మీ చిత్రంలో ఆకర్షణ కన్నా.. అణువణువూ స్వార్దంతో నిండిన..రసికత ఎర... కనిపిస్తోంది. ఎంతో లోతైన విశ్లేషణాత్మక కవిత. హ్యూమన్‌ ఫిలసాఫికల్‌ థాట్‌ ఇన్‌ ఎవెరీ డే లైఫ్‌. గత కవితలో ఓ కామెంట్‌ పెట్టాను.. మళ్లీ ఇక్కడ రిపీట్‌ చేస్తున్నాను.. జీవితంలో పీహెచ్‌ డీ చేశారు.

  ReplyDelete
  Replies
  1. సతీష్ కొత్తూరిసారూ........నమోనమః మీ పరిశీలనాశక్తికి విశ్లేషణావిధానానికి, రచనాశైలికి. అసలు ఒక చిత్రం వెనుక ఇంత కధ ఉంటుందని, కవిత రాసి చిత్రం పెట్టాలంటే దానివెనుక ఇంత కృషి చేయాలని అప్పుడే ఒక పోస్ట్ కి పరిపక్వత వస్తుందని పద్మార్పితగారు రాయడం మూలంగా మీరు వివరించడం వలనే తెలిసింది. (బొమ్మలుపెడితే ఇంత బాగోతం ఉందనే నేను బోడిగా పెట్టేస్తాను నా చిట్టికవితలని. ఎంతైనా తెలివైనదాన్నికదా;-)

   Delete
  2. తడి ఊహలతో వేడెక్కించి... నునుపు గోడల మీదుగా అగాధంలోకి జార్చే... వయ్యారాల ఎర అది. స్వార్ధాన్ని గెలిపించుకునేందుకు... బంధం భ్రమలో బంధించే ప్రవల్లిక. ఆ చిక్కుముడుల్లో పుట్టిన ప్రేమ, వ్యామోహం ఏదీమొగ్గ దశ దాటదు. ఈ రోజుల్లో ఉన్న బంధాలన్నీ దాదాపుగా ఇలాంటివే... పనికిరాని పనిముట్లు. గాయపు గాట్లు. జారుడు మెట్లు. ఇక్కడి క్యారెక్టర్‌ ఆడా, మగ అని కాదు. ఎంతో అద్భుతంగా చెప్పారు సతీష్ గారు.
   ఇంతటి ఉన్నతమైన భావాలు ఉన్నయి కాబట్టే పద్మగారి రాతలకు అంతటి ప్రాముఖ్యత. ఎటువంటి విభేధాలు లేకుండా అందరిచే చదివించగల నైపుణ్యముంది ఆమె రచనల్లో.

   Delete
  3. Fantastic analysis on Photo.

   Delete
  4. ముందస్తూ మీరు ఎంతో శ్రమకోర్చి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించినందుకు ధన్యవాదాలు.
   "ఆ నెమలి పింఛంలో రంగుల ప్రపంచమే ఆ బంధానికి కావాలి. రంగులందిస్తున్న ఆ చేయి కాదు.
   తడి ఊహలతో వేడెక్కించి... నునుపు గోడల మీదుగా అగాధంలోకి జార్చే... వయ్యారాల ఎర అది. స్వార్ధాన్ని గెలిపించుకునేందుకు... బంధం భ్రమలో బంధించే ప్రవల్లిక. ఆ చిక్కుముడుల్లో పుట్టిన ప్రేమ, వ్యామోహం ఏదీ మొగ్గ దశ దాటదు. ఈ రోజుల్లో ఉన్న బంధాలన్నీ దాదాపుగా ఇలాంటివే"
   Satishgaru....this is what exactly I want to express.ఇంతందంగా మనసులోని భావాలని రాయగానే పసిగట్టేయడం గొప్పకళ. నాకు మీరు రాసిన వ్యాఖ్యలు చదవగానే ఆశ్చర్యంతోపాటు నాపై నాకు కించిత్ గర్వం కూడా కలిగిందండోయ్..... ఎందుకంటారా! ఇంతలా అర్థమయ్యేటట్లు భావాలని చెప్పేయగలుగుతున్నానని.

   Delete
  5. మనుసులోంచి భావాలు వెలికి తీసినపుడు... అవి ఇంకో మనసుని తట్టినపుడు... ఇలాంటి విశ్లేషణలు ఎవరైనా చేయగలుగుతారు... పద్మగారు. నా కామెంట్ ఇంత మందికి నచ్చిందంటే... అది నిజంగా నా అదృష్టం. మీ కవితా ప్రేరణలో ఉన్న పదును. ఈ రెండే తప్ప.. ఇంకేమీ కాదు. ధన్యవాదాలు.

   Delete
 23. Wonderful job and awesome thoughts in analysing the picture and poem. God bless you Satish-Harinath

  ReplyDelete
  Replies
  1. Thanks for encouraging words.....ఆకాంక్ష, Nayani & Harinathgaru.

   Delete
 24. నిలకడలేని బంధాలు పరిచయాలు ఎందుకని ఒంటరిగా ఉండలేం కదండీ పద్మార్పితగారు. సహజీవనం అంటే ఇలాంటివన్నీ ఇలాంటివి తప్పవు.

  ReplyDelete
  Replies
  1. హ్మ్... నిజం చెప్పారు అనికేత్..

   Delete
  2. ఒంటరిగా ఉండలేం అని నీరుగారిపోతే...సావాసమంటూ ప్రతివారూ సంగంలో మోసంచేస్తారు. అప్పుడు ఇంకా బాధ కదా అనికేత్....

   Delete
 25. nijame meeru cheppedi . endukanta oka kavi annattu.:"abhimanam athmiyatha antha oka bhootakam.athma thrupthi kosam manasulu aduthunna natakam."ani .kaani akkadakkkada kondaru chala athmiyanga untaru .andarini oke gata na kattalem kadandi

  ReplyDelete
  Replies
  1. ramanareddygaru welcome to my blog. "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
   ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం".....నాకెంతో నచ్చిన పాట.
   అందరూ అలా ఉండరు అనే కొన్ని పరిచయాలు కొన్ని బంధాలు అన్నాను. మీ అభిమానాత్మక స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 26. బంధాలు అనుబంధాలు అందినట్టే అంది ఏవో తెలీని తీరాలకు మాయమైతే మనసు పడే వేదనలోంచి ఆవేశంగా మారి ఆత్మీయంగా ఆ బంధాన్ని చీవాట్లు పెట్టే చిరు మెలిక మీకు తెలిసినట్టుగా ఎవరికీ తెలీదు పద్మార్పిత గారు. ఈ కవితా కౌశలం మీ సొంతం. అనితర సాధ్యమేమో? మీ అభిమానుల ఆనంద వాక్యాల మధ్య రాసే సాహసం చేసా. అభినందనలతో..

  ReplyDelete
  Replies
  1. కెక్యూబ్ వర్మగారు.....పద్మగారు చివాట్లు పెట్టినా సున్నితంగా ఉంటాయన్నది అనుభవసారమేనండోయ్ :-)

   Delete
  2. బంధాలు అందీ అందడం కాదు.....అవసరాలకి దగ్గరగా వచ్చి దూరమైపోతే చెందే ఆవేదన అలా పలినట్లుంది. అయినా నేను చీవాట్లు పెట్టడం ఏంటండి......ఎప్పుడూ నవ్వేస్తూ ఎదుటివారికి నవ్వే చాన్స్ ఇవ్వని కంప్లైంట్స్ ఇస్తుంటే. మీ వాక్యాలెప్పుడూ ఆనందమే నాకు.

   Delete
  3. నయనిగారు నేనెప్పుడు చీవాట్లు పెట్టానండి....చీవాట్లు తిన్నానే కానీ :-)

   Delete
 27. wonderful poetry with beautiful painting on human relationship@@@@kudoos

  ReplyDelete
 28. చాలా బాగారాశారు. మానవసంబంధాలు అన్నీ మెలికలు చిక్కుముళ్ళే.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ....ఒక్క ముక్కలో చెప్పారు.:-)

   Delete
 29. తడిబట్టల్లో తొంగిచూస్తున్న అందాలతో ఇలా బంధాల గురించి ఘాటుగా చెప్పించాలా ?
  అందం & బంధం రెండూ సూపర్ ....

  ReplyDelete
  Replies
  1. వర్షంలో తడిచి వచ్చి తడిగా ఉంది అంటే ఎలా వినోద్ :-) వేడి మిర్చీబజ్జీలు ఘాటుగా ఉన్నవి తినాలికదా :-)

   Delete
 30. Happy friendship day my friend, hope all is well. If so give replies my dear.

  ReplyDelete
  Replies
  1. Thank you my dear. Wish you the same.

   Delete
 31. కుశలమా పద్మార్పితా.....

  ReplyDelete
  Replies
  1. నేను ఇచట కుశలమే....thank you Sir

   Delete
 32. వ్యక్తిగత కారణాల వలన రిప్లైస్ ఇవ్వడంలో ఆలస్యం అయినందుకు మన్నించాలి._/\_

  ReplyDelete
  Replies
  1. హమ్మయ్య మనసు కుదుటపడింది.

   Delete
 33. "వెన్నెలకెరటం" సాహిత్య బ్లాగుకు సభ్యత్వనమోదుకు ఆహ్వానం
  http://vennelakeratam.blogspot.in/p/blog-page_4312.html

  ReplyDelete
 34. బంధం అంటేనే బంధించి ఉంచేది అని అర్థం. ఒక బంధాన్ని ఆశించడం అంటే మనకు మనమే బందీగా కట్టుబడి ఉండటానికి సిద్ధపడుతున్నామన్నమాట. అది మన అవసరమో. బలహీనతో అయ్యుంటుంది. అలాగని అవతలి వ్యక్తిని కూడా సంకెళ్ళు వేసుకోమనడం అన్యాయం కదూ! స్వేచ్ఛగా ఎగిరే సీతాకోక చిలుకను గుప్పెట్లో బంధించాలనుకుంటారు. ఎగిరిపోతే ఇలా నిష్టూరమాడతారు. పరిచయాలు, అనుబంధాలు, ప్రక్రియలు, ప్రణయాలు అన్నిటా నిట్టూర్పులేనా? 'అధః పాతాళానికి నిచ్చెనలు' ప్రయోగం బాగుంది. జత చేసిన బొమ్మ ఇంకా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. అన్నీ నిట్టూర్పులేనని నన్నే నింధించారుగా...:-( బాగుంది. ఎంతైనా తెలివైన వారండి మీరు. థ్యాంక్యూ

   Delete