గీసినగీత వంపుల్లో మెలికలుతిరిగేసి
రసికతని రాసి రెచ్చగొడుతున్నానని
నీరుగార్చి నిందలేస్తే నేనేం చెప్పలేను
లేని ఆదర్శాలు వల్లిస్తూ రచించమని
ఉద్వేగాన్ని సంస్కరణలకి బంధీనిచేసి
మొక్కుబడి అక్షరాలని ముడేయమని
ముక్కి మూల్గేవారిని నే చదవమనను
అనాగరిక అభిమానమే హద్దులుదాటితే
నిర్మలమైన భావోధ్వేగాలకి సంకెళ్ళువేసి
పదాలపై ముసుగు కప్పి పరవశించమని
రంజింపచేసే రాతలంటూ నేనేవీ రాయను
లిపిలేని అభ్యుదయాలకి ఉరితాడు బిగించి
సహజ నైజానికి నగీషీలద్దిన చెక్కతొడుగేసి
నిఘంటువు కొలనులో నిలబడగలనే కాని
పద్మగా అందరూమెచ్చే రచనలర్పించలేను
Excellent Madam....అందరీ మెప్పించేస్తారు రాతలతో చిత్రాలతో. అయినా మీ శక్తి మీకు తెలియనట్లే ఇలా అనేస్తారు.
ReplyDeleteThank you.ఆంజనేయస్వామిని కానుగా అంత శక్తి ఉండడానికి నాలో :-)
DeleteAggressive poetess... Salam to your words madam .
ReplyDelete_/\_
Thanks for comments
Deleteమీరచనలు ఎవరినీ,నొప్పించవు కనుక అవి నిందలు మోయవు.
ReplyDeleteమీకంటూ ఓ శైలి ఉంది, ఓ భావుకత ఉంది.
ఇకపోతే ఆదర్శాలు వల్లెవేస్తే లాబం లేదు ఆచరణ కావాలి, కనీసం అర్దింపైనా కావాలి.
పద్మ పద్మగానే ఉండాలి, ఓ చల్లని వెన్నలా మీ కవిత్వం సాగనీయండి.
గమనిక:- మనం ఒకరిని మార్చటానికో,ఏమార్చటానికో రాయటం లేదు,
మనకంటూ...ఓ సాహితీదారి ఉంటుంది అంతే..,..ప్రేమతో...మీ మెరాజ్
మీకు నాపై అభిమానం కనుక అలా అంటున్నారు. ఉచ్ఛ్వాస ఉందంటే నిచ్ఛ్వాస తప్పదుగా.
Deleteఅభిమానులు ఉన్నరంటే....అభ్యంతరాలు ఉంటాయేమో కదండి. మీరూ నా తోడుగా ఉంటారనే ఆశా భావం. వందనం.
ఇది పద్మార్పిత ఉవాచ, శాసనం.. ఈ వాక్యాలు ఇంకెవరూ చెప్పలేరు.. యూనిక్.. అభినందనలతో..
ReplyDeleteవర్మగారూ....మరీ అంత ఉక్కుమనసా నాది. శాసనాలు చేసేంత చండికనా నేను :-)
Deleteమనసు వెన్నే పదం చండశాసనం :-)
Deleteఅర్థం కాలేదు ...
ReplyDeleteవిష్వక్సేనుడు....జగమెరిగిన వాడు. అర్థం కాలేదు అని నన్ను ఆనందింప చేయడానికి అన్నారే తప్ప. లేకపోతే అఖండంలోని అర్థాలని అరచేతిలో చూపించేయగలడు :-)
Deleteఈ ప్రపంచంలో ఎవరి సిద్దంతాన్ని వారు కవితల్లో, కథల్లో, రచనల్లో చొప్పించవచ్చు. ఒకరి విమర్శలకు లోనవుతుందని మన దృక్పథాన్ని మన రచనల్లో మార్చుకోలేముగా... మనకు తోచినట్టు మన కోసమే అన్నట్ట్లుగానే రాసుకోవాలి. అదే సహజంగా వచ్చే రచన.. మీ రచనలు కూడా వినూత్న ప్రయోగాలను చేస్తూ, సృజనాత్మకతను అందిస్తూ, మీదైన శైలిలో లోనే ఉండాలి... అయినా ఇంత మంది అభిమానులను సంపాదించుకున్న పద్మర్పిత కవితల ప్రవాహం అలా సాగుతూనే ఉండాలి... మేము చదువుతూనే ఉండాలి ...
ReplyDeleteబేషుగ్గా చెప్పారు.
Deleteఒకరి విమర్శలకు లోనవుతుందని మన దృక్పథాన్ని మన రచనల్లో మార్చుకోలేముగా...నా భావం అదే. అదే ప్రయత్నిస్తాను మీ అభిమానంలో తడిసి ముద్దవడానికి :-)
Deleteనయని నన్నేనా :-)
Deleteమీ రచనలు ఎప్పుడూ మమ్మల్ని అబ్బుర పరిచేలాగే వ్రాసి మీపై మాకు కాస్త ఈర్య్ష కలిగించే మాట మాత్రం వాన్తవం. అలాగని మీ కవితాప్రవాహాన్ని ఆపకండి
ReplyDeleteఈర్ష్యను అభిమానం డామినేట్ చేసిందిగా.....ఓకే మరి :-)
Deleteనాకు తెలిసి ఏ భావాన్నైనా నిర్భయంగా చెప్పగల సత్తా ఉన్నాయి మీ అక్షరాలకు. మీ నిరంతర రచనాస్రవంతిని కొనసాగనివ్వండి.
ReplyDeleteభావాలని నిర్భయంగా చెప్పడానికే ఈ రచనలు అని నమ్ముతాను నేను.
Deleteమీకు మెప్పులకు లోటా.......కుప్పలు కుప్పలుగా వచ్చి పడతాయి. అయినా ఎవరండి మీ భావాలని నిర్ధేశించి నియంత్రించేవారు,
ReplyDeleteరానీయ్ నీలోని భావాలు ఏరులై పొంగనీ.....
అనుకోనీయ్ ఎవరేమైనా అనుకోనీయ్....
అదేంటో మీ బ్లాగులో కన్ను పెట్టగానే కవిత్వం వచ్చేస్తుంది వదన్నా. అదరగొట్టారు అర్పితగారు
ఆకాంక్షా...రానీయ్ రానీయ్ అంటే రెచ్చిపోయి రాసేస్తాను.... అప్పుడు కుప్పలు కుప్పలుగా తిడతారేమో జనం :-) థ్యాంక్యూ ఫర్ యువర్ ఇన్స్పైరింగ్ వర్డ్స్
Deleteచిత్రం సూపర్ మాడం, మీ భావాలతో మమ్మల్ని చిందులు వేయిస్తున్నారు. ఇంకేం కావాలి మీకు.
ReplyDeleteవెయ్య్ చిందెయ్....నా భావకవితా ప్రవాహంలో అని పడెయ్యనా మరి :-)
Deleteపద్మా ,
ReplyDeleteఈ కవితలో నీ నైజాన్ని , నీ భావాన్ని నిర్భయంగా చెప్పేశావు .
హాయిగా ఓ నిట్టూర్పు విడిచేశావనుకుంటున్నా .
చాలా బాగుంది .
' ద 'కు సంబంధించినవి వ్రాయవలసినప్పుడు చిన్న డి టైప్ చేసి తదుపరి ఏ అచ్చులు చేయాలనుకొంటున్నావో అది చేస్తే సరిపోతుంది లేఖిని లో అయితే . చిన్న డి ప్రక్కన హెచ్ అవసరం లేదు .
నిజమే చాన్నాళ్ళుగా చాలా మంది అలా రాయి ఇలా రాయి అంటే నాలో కలిగిన భావసంఖర్షణలకి ప్రతిరూపం ఇది.
Deleteమీరు చెప్పినవి దృష్టిలో పెట్టుకునే ఇకపై రాస్తానండి.
కరిసే నోరు కసురుతూనే ఉంటుందని
ReplyDeleteకసరడం తప్పఇంకా వేరేమి తెలియదని
లోసగుల్లోను భావాలను నిమ్పవచ్చని
కలత హృదయాల్లో కలిచివేసే మాటల మంటని
పదాల అల్లికలతో అల్లకల్లోలంగా అనిపించినా పారద్రోల వచ్చని
భావాతిరేకముగా మీ రచనలు ఎన్నడు లేవని
మీరు రాసే ప్రతి అక్షరం లో అవి ప్రస్ఫుటమని
నింగి అంచులలో గరుడు వాన దేవుడిని సైతం తప్పించుకుని
చిద్విలాసంగా సాగే మీ కవిత ప్రవాహానికి ఏ అడ్డు అదుపులేదని
మీరిలానే కలకాలం పద్మలాంటి రచనలు రాస్తూ ఉండాలని
మురికి పట్టిన సమాజానికి మీ రాతలతో వెలుగును నింపాలని
అందరితోపాటే సహేతుకంగా కోరుకుంటూ ఇలా మరెన్నో రచనలు అర్పించాలని
తామరాకు పై నీటి బొట్టులా ఉండాలని తామర పువ్వులా విరబూయాలని
ఇదే మాటను మీకు అందరితో పాటుగా తెలియజేయాలని
శ్రీధర్గారు సగమే చెప్పినట్లున్నారు. మీ అసంపూర్తి ఆశీర్వాదం సంపూర్తిగా నాది కూడా:-)
Deleteపరిపూర్ణం భవేత్ నటన జీవితం గారు (నయని గారు)
Deleteమీరు ఇలా చెప్తే అర్థం చేసుకునే జ్ఞానం మాకెక్కడి శ్రీధర్ గారు. కాస్త విడమరచి చెప్పాలి కాని :-)
Deleteఅందులో విడమర్చి చెప్పడానికేముంది ఆకాంక్ష గారు. ప్రస్ఫుటంగానే ఉంది కదా.
Deleteనేను చెప్పాల్సింది సగమే అని నటన జీవితం గారు అంటేను లేదండి పరిపూర్నంగానే అంటే సగం కాదు మొత్తమే చెప్పాను అని చెప్పను ఆకాంక్ష గారు.
నా వ్యాఖ్యా అర్ధం కాలేదంటారా? కసిరే నోటికి భావం తెలియని వారికి మనం ఎంత చెప్పిన మనలోని లోసగులనే వెతుకుతారు. నిప్పులు కప్పినా చల్లార్చే మంచి నీటి గుణం అలవరచుకోవాలని అని. పద్మ గారి రాతల్లో ఏ ఒక్క కవితా భావానికి వ్యతిరేకంగా లేదని చెప్పను సుమండీ. అంతే నండి ఆకాంక్ష గారు. మీ ఆకాంక్ష బ్లాగ్ ని కూడా తిలకించాను. చక్కగా 2-3 లైన్ లలో భావాన్ని దట్టిస్తారు తమరు. చాల బాగుంది. మీకు వీలుంటే నా బ్లాగ్ ని కూడా వీక్షించండి (పబ్లిసిటీ అని మాత్రం అనుకోవద్దు)
హమ్మయ్యా......ఇలా విడిగా చెప్తే అర్థంతోపాటు అక్షరాలు కూడా మీ మాటల్లో అందంగా అమరినట్లున్నాయి. తప్పుగా అనుకోకండి అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష. మీ పోస్ట్లు చూస్తున్నాను. Thank you .
Deleteభలే వారే ఆకాంక్ష గారు. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందండి. అడిగారు మీరు చెప్పాను. అర్ధం కాకపొతే ఎవరైనా అడగవచ్చండి ఆకాంక్ష గారు. తప్పు కానే కాదు. పోస్ట్స్ చూస్తున్నందుకు ధన్యవాదాలు మీకు.
Deleteమీరు ఏం రాసినా ప్రత్యేకంగానే ఉండి మనసుని ఉత్తేజపరచి ఆనందింపజేస్తాయి. మీ ఈ అభిమానాన్ని ఎల్లప్పుడు కోరుకుంటూ. ధన్యవాదాలు మీకు.
DeleteThanks to Nayani & Aakaanksha for showing enthusiasm on my writings. Thanks to Sridhar for explaining about comments and sparing his valuable time.
Deleteవేరే బ్లాగుల సంగతేమో కానీ నాకు తెలిసి నీవురాసేవి చదివిన వారెవ్వరూ వెకిలి దృష్టితో చూసి కుచితంగా ఆలోచించే వారుకారని నా అభిప్రాయం. ఎందుకంటే నీవు వ్రాసిన ప్రతి కవితా అంతో ఇంతో ఆలోచింపజేసేదిగా ఉంటుంది పద్మా. ముఖ్యంగా శీర్షికను ఎంచుకుని దానిపై నీ రీసెర్చ్ పొందికైన పదాలతో అమర్చేతీరు కడుప్రశంసనీయం. ఏ విషయాన్నైనా నిర్భయంగా సూటిగా చెప్తావు. అందుకే నీ కవితలకి అంత క్రేజీ. నీకు తిరుగులేదు పద్మార్పితా, కొనసాగనీయి-హరినాధ్
ReplyDeleteమీరన్నది అక్షరాల నిజం. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక వేళ వేయాలి అనుకున్నా అల్లరి పట్టించి వారే ఆత్మీయులుగా మారిన సంఘటనలు ఉన్నాయండి. మీలాంటి పెద్దల ఆశీర్వాద ఫలం. థ్యాంకండి.
Deleteఎవరేమన్నారని నీలో ఈ భావాల అలజడి పద్మా???? చెప్పు చెప్పు చెప్పు.
ReplyDeleteఇన్ని సంఘర్షణల సారాంశంగా మాకు నీవు అందించే ప్రతి కవితా ఒక కమ్మని చలువ కలువే కదా. వద్దు వద్దు ఇంకెప్పుడూ ఇలాంటి ఆలోచనలే వద్దు. నీవు రాసేయి మేము చదివేస్తుంటాము. పెయింటింగ్ సూపర్బ్.....You have a good taste and artistic mind. Keep on writing dear.
నాలో పొంగే భావాలకి ఆనకట్టలు వేస్తే ఎలా సంధ్యగారు. ఇలా బయటపడి పోనీయండి. thanks a lot.
Deleteరాయాలనుకున్నవి రాసుకుంటూ పో
ReplyDeleteఅలగల్గే :-)
Deleteకమలం కలత చెందినా కవిత్వమే
ReplyDeleteపద్మ పదాక్షరాలన్నీ మాకు ప్రియమే
జంట కలువల్లో....మాయావిశ్వమే :-) (కమలం & పద్మ)
Deleteఅనాగరిక అభిమానం హద్దులుదాటి .... నిర్మల భావోధ్వేగాలకు సంకెళ్ళువేసి .... పరవశించమని, రంజింపచేసే రాతలు నేను రాయను
ReplyDeleteనిర్దిష్ట భావన.
అభినందనలు పద్మార్పిత గారు! శుభసాయంత్రం!!
మీ నిర్మల వ్యాఖ్యలు నాకు ప్రేరణలు. ధన్యవాదాలండి.
Delete"చెప్పేవాడికి వినేవాడెప్పుడూ లోకువే" అయినా పద్మార్పిత ఎప్పటి నుండి ఇలా చెప్పిన మాటలు వినడం మొదలెట్టినట్లు. మీరు ఒక ట్రేడ్ మార్క్.....మీరు రాయాలి మేము చదవాలి అంతే అంతే అంతే.....నో మోర్ చెప్పింగ్స్ ఆండ్ వినడాలు :-) బొమ్మ కత్తి, కవిత ఒక సుందర శిల్పం( మీ అభిప్రాయాల శిలాశాసనం)
ReplyDelete"వినేవాడు వద్దంటే ఊరుకుంటుందా వాగే నోరు" అందుకే చెప్పే వాటిలో మంచిని గ్రహించి చెడుని వదిలేస్తే పోలా :-)
Deleteఎంటి మాడం అందరి మెప్పు పొందిన తర్వాత కూడా, ఇంకా సంశయమే, మీరు రాయాలి, మేము చదవాలి, మీ ఎన్నేన్నో వర్ణాలు పాటవిని తరించాలి..
ReplyDeleteకవిత చాల చాల బాగుంది, ఇంక చిత్రం అందం అధ్బుతం.. మీరు మీ కవిత సుమధురం...
శృతీ....ఎన్ని డౌట్స్ వేస్తే అంత ఇంటలిజెంట్ అంటారని మేము స్కూల్లో వెధవ డౌట్స్ అడిగేవాళ్ళం. అలాగే ఇక్కడ కూడా తెలివైన దాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయం :-) థ్యాంక్యూ.
Deleteలిపిలేని అభ్యుదయాలకి ఉరితాడు బిగించి
ReplyDeleteసహజ నైజానికి నగీషీలద్దిన చెక్కతొడుగేసి
బహుశా నీలో ఉన్న ఈ నిర్దిష్టమైన భావాలకే అందరూ ఆకర్షితులేమో. కవితలో నీ ప్రతిబింబం కనబడుతుంది.
మంచి స్నేయితుడు అద్దంలాంటి వాడు అంటారు కదా....మహీ నా ప్రతిబింబాన్ని చూడగలిగావు అంటే..... :-) థ్యాంక్యూ మై ఫ్రెండ్
Deleteహాయ్ పద్మార్పిత...మీ బ్లాగ్ పాటే నాకు ప్రేరణ. మీ అనుమతి లేకుండా టైటిల్ పెట్టేసుకున్నాను. మీ బ్లాగులో నేను ఒకడిని కావాలన్న కోరిక అనుమతిస్తారు కదూ.....నేను నందుని.
ReplyDeleteWelcome Nandu saab.ఆ పాట నా సొంతమా ఏంటండి . మీ అభిమానానికి అనుమతి ఎందుకండి. నా బ్లాగ్ రచనలని ఆస్వాధించి ఆనందించాలని కోరుకుంటున్నాను.
Deleteచాలా రోజుల నా కోరిక మీ బ్లాగ్ చూసి నేను కామెంట్, కవితలు రాయాలి అనుకుని చదివి ఏం రాయకుండా వెళ్ళిపోయేవాడిని. ఇన్నాళ్ళకి నా ఆశయం తీరి నాకంటూ సమయం కేటాయించుకునే తీరిక దొరికింది. ఏమైనా తెలియక పొరపాట్లు చేస్తే మీరు సరిచేస్తారు అన్న ఒక స్నేహితుడి వాక్యాలు గుర్తుచేసుకుంటూ.......మీ బ్లాగ్ పరిచయం చేసిన మిత్రుడికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను.
ReplyDeleteఆ మిత్రుడెవరో నాకు ఆప్తుడేగా.....థ్యాంక్యూ. ఇకపై మీరు కూడా రచించి అలరించాలని కోరుతూ. అక్షరాలు తప్పులు అందరం చేస్తామండి. ఇక్కడ మీకు నాకు తప్పైతే సరిచేసే ఆప్తులు చాలా మంది ఉన్నారు. డోంట్ వర్రీ.
Deleteఅనాగరిక అభిమానమే హద్దులుదాటితే
ReplyDeleteనిర్మలమైన భావోధ్వేగాలకి సంకెళ్ళువేసి
పదాలపై ముసుగు కప్పి పరవశించమని
రంజింపచేసే రాతలంటూ నేనేవీ రాయను
రాతలు రాయరు కానీ వాతలు పెట్టగలరు కదా అదికూడా నొప్పి తెలియకుండా :)
ఊరికే వాతలు పెట్టరు ఎవరూ అనికేత్ :-)
Deleteముందుగా మీకు అభినందనలు... నా వ్యక్తిత్వం ఇదీ.. అని నిక్కచ్చిగా చెప్పగలిగినందుకు. మహిళా స్వాతంత్ర్యం అనే పెద్ద పదాలు వాడను గానీ... ఇలా మనసులో అభిప్రాయాలను సూటిగా వ్యక్తీకరించడం వల్ల నష్టాల కన్నా లాభాలే ఎక్కువుంటాయి. ముందు మన అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ల బెడద వదిలిపోతుంది. హిపోక్రసీ అనే జాడ్యం పారిపోతుంది. నేనైతే మీ నుంచి.. అభ్యదయ కవితలు ఆశించడం లేదు. నాకున్న అనుభవంలో... సూడో అభ్యదయవాదులనే ఎక్కువ చూశాను కనుక... మీరు తీసుకున్న నిర్ణయానికి నా సంపూర్ణ మద్దతు. మీ చిత్రం మొదటి సారి నాకొక వేరే కోణం కనిపించింది. నేనిలాగే ఉంటాను.. ఎవరేమనుకున్నా... అనే భావం చాలా స్పష్టంగా.. అంందంగా... హుందాగా... కలువ రేకుల మధ్య కనిపించింది. మనసు అద్దం లాంటిది అంటారు. నిజమే. అందులో ఉన్నదాన్నే ప్రతిబింబించాలి. లేనిదాన్ని బలవంతంగా బయటకు చూపించమని అడిగితే ఆ అద్దం పగిలిపోయి.. అబద్దాన్నే చూపిస్తుంది. అందుకే ఆ అబద్దానికి దూరంగా ఉండడమే మంచిదన్న మీ కవితా సారాంశం
ReplyDeleteచాలా బాగుంది. మీరిలాగే కొనసాగించండి....
వాహ్ సతీష్ వాహ్!....క్యా బాత్ కహా ఆప్నే. ఏం రాస్తారో ఎలా రాస్తారో అని పద్మార్పితగారి పోయెంతోపాటు మీ కమెంట్ కి కూడా బానిసనై పోయాను ;-)
Deleteమీకు ముందస్తు అభివందనాలు.....ఈ కమెంట్ రాయడానికి మీరు చాలా ఆలోచించారని మెదటి వాక్యంలోనే పసిగట్టేసాను :-) ఎంతైనా అజాతశత్రువైన మీకు ప్రియమైన శత్రువుని కదండి :-)
Deleteనాలో లేనిభావాలని వెలికితీస్తాం అనే నెపంతో ఏవేవో రాయమంటే రాయలేను అని సూటిగా చెప్పాలి అనుకున్నది నిశ్చింతగా చెప్పేసాను. నా చిత్రాలకి మీ అక్షరాలతో అదనపు అందాలని అద్దడం నాకెప్పుడూ ప్రియమే. కొనసాగనివ్వడిలా.
ఆకాంక్షాజీ..... క్యా కహూ ఆప్ ఇస్ తరహ్ ముఝ్ పర్ ఇల్జాం మత్ లగాయియే :-)
Deleteపద్మార్పితగారూ......కాస్త ఇటువైపు కన్నేసి కమెంట్స్ కి రిప్లైస్ ఇస్తే వీకెండ్ హాయిగా ఎంజాయ్ చేస్తాము :-) రండి రండి రండి....దయచేయండి :-)
ReplyDeleteవచ్చా వచ్చా వచ్చేసా....ఇటువైపు(మీ) కన్నేయాలంటే ఇకపై ఒకరోజు సెలవు తీసుకుంటాను :-)
Deleteఎవరికోసమో కాదు మీకోసం మీ ఆత్మసంతృప్తికోసం రాసుకోండి.
ReplyDeleteఅలాగే రాసాను...రాస్తున్నాను.....రాసుకుంటాను :-)
Deleteమీకు ఎంత ఓపికండి పద్మగారు. ఇంతమందికి ఒకేమారు జవాబిచ్చేస్తారు నవ్వుతూ.
ReplyDelete:-)ఇప్పుడూ నవ్వేస్తున్నానుగా
DeleteI can't believe a woman can express her views like this.
ReplyDeleteEveryone have rights to express their views. No gender difference my friend. :-)
Delete