ఎరుగని ఎదకు ఎదను తాకిస్తే తెలిసింది
మనసిచ్చి దోచుకోవడం నాకు రాలేదని!
దరిచేరిన హృదయం దూరమై తెలిపింది
తెలిసీ తెలియని చెలిమేదో బాగుండెనని!
ఎడబాటు ఎరుగని ఎద వెక్కెక్కి ఏడ్చింది
ఎదను ఇవ్వడం నేరమై మిగిలిపోయెనని!
శ్వాసాగితే చిన్నివిషయమని నవ్వేసింది
నీ తలపులో లేని తనువు జీవఛ్ఛవమని!
వేదనేమో నిన్ను నమ్మనంటూ నటిస్తుంది
నవ్వుతున్న కనులేల చెమ్మగిల్లినాయని!
చేసుకున్న బాసలని చివర్నో కోరిక కోరింది
ఊపిరి ఆగిపోతే నీ కౌగిలిలో కడతేర్చమని!
మనసిచ్చి దోచుకోవడం నాకు రాలేదని!
దరిచేరిన హృదయం దూరమై తెలిపింది
తెలిసీ తెలియని చెలిమేదో బాగుండెనని!
ఎడబాటు ఎరుగని ఎద వెక్కెక్కి ఏడ్చింది
ఎదను ఇవ్వడం నేరమై మిగిలిపోయెనని!
శ్వాసాగితే చిన్నివిషయమని నవ్వేసింది
నీ తలపులో లేని తనువు జీవఛ్ఛవమని!
వేదనేమో నిన్ను నమ్మనంటూ నటిస్తుంది
నవ్వుతున్న కనులేల చెమ్మగిల్లినాయని!
చేసుకున్న బాసలని చివర్నో కోరిక కోరింది
ఊపిరి ఆగిపోతే నీ కౌగిలిలో కడతేర్చమని!
ఎదను అలజడికి గురిచేసినా మీ కవితలోని పలుకులు పంచదార చిలుకలే. చిత్రం కవ్విస్తున్నా ముఖంలో అలజడి ప్రస్ఫుటమై కనబడుతుంది. అదేగా ఆ చిత్రంలో చూపాలనుకున్నది పద్మాజీ
ReplyDeleteపంచదార పలుకుల తీపిదనాన్ని ఆస్వాధించిన మీకు నెనర్లండి.
Deleteఅద్భుతంగా ఉంది చిత్రం కవిత్వం
ReplyDeleteథ్యాంక్యూ జీ
Deleteహృదయాన్ని ద్రవింప చేసే కవితా మరో అద్భుత చిత్రం.. <3
ReplyDeleteకవితని ఆస్వాధించిన హృదయానికి అభివందనం (చిత్రాన్ని చూస్తూ ఉండిపోతారు అనుకున్నానుగా )
Deleteఏమైపోతివో అని నా ఎదలో అలజడకి కారణం అడిగేలోగా ఇలా నీ ఎద అలజడని తెలిపి ఎదను భారమెనరించ తగునా నీకు కలువబాలా:-) ఏమైనా చిత్రం కడు కనువిందుగా ఉన్నది.భళారే భళా :-)
ReplyDeleteఎక్కడికైనా ఎగిపోయేంత ధైర్యమా నాకు ఆకాంక్ష....నీ ఆ రెండు కళ్ళ వాడి చూపుల్లో బంధీని కదా! :-)
Deleteప్యార్ మే టిక్కుం టిక్కుం... :-)
ReplyDeleteప్యార్ మే పూర్తిగా బుడుంగ్ బుడుంగ్ అని తేలక కొట్టుకుంటే పైకి తేకుండా టిక్కుం టిక్కుం అంటే ఎలా వినోద్:-)
Deleteపాత పద్మార్పితను మళ్ళీ మీ ఈ ఎద అలజడిలో చూపించారు
ReplyDeleteఎద అలజడికి పాత కొత్త ఏంటి యోహంత్. నేను ఎప్పటికీ ఒకేలా....
Deleteమనసు మాట వినదు . వేదనంటే మనసుకి నీకు కూడా మహా ఇష్టం కదూ :-)
ReplyDeleteవినమన్నా వినని మనసుని వదిలి వేదనని వాటేసుకుంటే రంగిలింది ఈ వలపు చిచ్చు మహీ....:-)
Delete
ReplyDeleteచాతకాని తన్నాన్ని అంగీకరిస్తూనే ,
చెలిమి ఎంత బాగుంటుందో అన్న విషయం దూరమైతే గాని తెలియదని ,
ఎదకెడబాటు తప్పదని ,
తనువుకి అనువుగ వుండేవి తలపులేనని ,
వేదనతో కనులు చెమ్మగిల్లుతాయని ,
బాసలు అభాసు పాలైనప్పుడు పర్యవసానం కడతేరటమేనని ,
ఆ కడతేరటం కూడా కౌగిలోనే కడతేరాలని ,
బహు చక్కగా చెప్పకనే చెప్పావు పద్మా !
అందమైన భావనకు , అచ్చమైన అమ్మాయి ఆకృతి అమితంగా ఆకర్షిస్తోంది .
మొత్తం కవితకి సరళమైన సారాంశం చెప్పారుగా శర్మగారు. ధన్యవాదాలండి.
Deleteప్రేమకి వేదన తప్పదని సున్నితంగా చెప్పారు. చిత్రం చాలా బాగుంది.
ReplyDeleteతప్పని వేదనని తలచుకుని ఏడవలేక నవ్వడమే అంటారా :-)
Deleteప్రేమే పెద్ద రోగం ఇంక దానికి వేదన తోడు
ReplyDeleteఆ రోగానికి మందు వేదనేగా :-)
Deleteచింపేసారు చిత్రం అదిరింది. ఇలాంటి కవితలు రాయడంలో అందెవేసిన చేయి మీది.
ReplyDeleteచిత్రం చింపాను అన్నారుగా మరి కవిత కత్తిరించాను అనొచ్చ్చుగా
Deleteచివరి లైనులు కనులను తడిచేస్తున్నాయి పద్దమ్మా..:-))
ReplyDeleteఅయ్యో......నీలా మీ కళ్ళు నీళ్ళు కారేలా చేసాను. ఈసారి నవ్విస్తానుగా:-)
Deleteప్రేమించే వారిని ప్రేమించడంలో గొప్పతనం లేదు, ప్రేమించలేని వారిలో కూడా ప్రేమభావాన్ని కలిగించే ప్రజ్ఞ నీవు రాసే కవితల్లో కనీకనిపించడం ఆనందంగా చదివిస్తూ నూతనోత్సాన్ని ఇస్తుంది.
ReplyDeleteనిజంగా అలాంటి ప్రభావం చూపిస్తున్నాయి నా రచనలు అంటే నాకు ఎంతో సంతోషంగా ఉందండి.
Deleteగుడ్డి ప్రేమకు పైత్యం తోడైనట్లుందంటే ఇదేనేమో! అన్నీ తెలిసీ ప్రేమించి మనసు మాట వినదంటూ చివరికి ప్రాణం కూడా అలాగే కడతేరాలి అనుకోవడం అంతా చిత్రం భళారే విచిత్రం.
ReplyDeleteచిత్రాతిత్రమే ప్రేమచేష్టల విన్యాసం....వీక్షించక తప్పదుగా మీకు :-)
Deleteసుంధరమైన మైన ప్రేమ కావ్యం! అతి అధ్బుతమైన పదాలతో, అందమైన చిత్రంతో, కనువింపుగా వినసొంపుగా చుడముచ్చటగా ఉంది.. సూపర్:-)
ReplyDeleteప్రేమ మాధుర్యాన్ని(అలజడిని) ఇంతలా అభివర్ణించిన మీకు అభివందనం
Delete.ఈ అలజడేదో గోల చేసి గగ్గోల పెట్టేలా ఉంది.:-)
ReplyDeleteఅలా అని అలజడులకి దూరంగా ఉంటే అసలు విషయం తెలీదుగా అనికేత్
DeleteSatish
ReplyDeleteSridhar
Sripadagaru
3 big S where are you?????????:-)
here without you people blogging is bhoring
నిజమే సుమా ఏ మాయాలోకంలో విహరిస్తున్నారో :-)
Deleteఅవే కళ్ళు అందరిపై నిఘావేయడం అభినందనీయం ఆకాంక్ష. ముగ్గురిలో ఒకరు దొరికారు మరో ఇద్దరి మాటో !!!!?:-)
Deleteమాయావిశ్వం మరో జత కళ్ళతో మీరు కూడా వెతకండి :-)
Deleteసూపర్ మేడం... చాలా రోజులకి మీనుంచి ఇలాంటి కవిత. శ్వేతకలువ భావాల బంధిఖానా లో అభిమానులని కట్టిపడేశారు.
ReplyDeleteకీప్ రాకింగ్ :-))
శ్వేతకలువ భావాలా లేక....పసిమిఛాయ జవ్వని చూపులకి మనసున రేగే అలజడులా :-) నిజం చెప్పండి.
Deletepaintings select chesedi merena ekkada nundi collect chchestaru excellent madam
ReplyDeleteSelection and choice is mine only. thank you
Deleteకలువల్లో రంగులు తెలుసు కానీ... మొట్టమొదటిసారి... పసుపుపచ్చ కలువను చూసినట్టుంది. ఆ చిన్నదాని
ReplyDeleteవేదన అలజడిలో... ఎంత విరహమో... పైన కొమ్మ మీద కూర్చున్న ప్రేమవిహంగాలే చెప్తున్నాయి. అరవింద మోముకి అంత కష్టం తెచ్చిపెట్టినదెవరో... మనసు నొచ్చుకోనిదెవరికి. ప్రేమకే ప్రేమదేవతలా ఉన్న ఈ బంతిపూవు తాకిడి... నాలో ఎన్ని అలజడులు రేపిందో... చాలా బాగా రాశారు. పద్మగారు. ప్రేమ-విరహం... బాసలు ఊసులే అయితే కౌగిలిలో కడతేరాల్సిందేనా... మరో ప్రేమ కౌగిలికి అర్హత లేదంటారా... పద్మగారు... పచ్చని బందిఖానాలో కట్టిపడేశారు...
సతీష్గారు......మీ కమెంట్ కోసం చూసి చూసి బదులే రాక వెళ్ళిపోయా. ఏమైపోయారు, ఎప్పుడొచ్చరు? ఈమెవరు అనుకున్నా ప్రశ్నించడానికి అనుకున్నా సరే జవాబు చెప్పాల్సిందే తప్పదు:-) మీ చిత్రవిశ్లేషణలకై వేచిచూసే విహంగిని....అమ్మో ఏంటో పద్మార్పిత బ్లాగ్ కి వస్తే కవిత్వం తన్నుకొస్తుంది. :-)
Deleteఇంక ఈ చిత్రం గురించి మీరు వివరించారు అనడంకన్నా వలపు కురిపించారు అంటే బాగుంటుందేమో కదా. అయినా దోషం మీదికాదు ఆ చిత్రంలోని చక్కనమ్మది:-) మాఫ్ కరో నా అగర్ గలత్ కహాతో .
ఆమెలో వేదన కన్నా ప్రేమమయమే కనిపించింది... పచ్చదనంలో ఆ ప్రేమనంతా దాచుకుని... వేదనలో నలిగిపోతున్నా... ఆ చిన్నదాని ఊసుల్లో, ఆమె ఎద అలజడిలో... మమేకమైతే.. ఆమె వేదన తాత్కాలికమే అనిపించింది ఆకాంక్ష గారు. మీరిలా నా కామెంట్ కోసం ఎదురుచూస్తే.. పద్మగారు కలువ పువ్విచ్చుకు కొడతారు... మనిద్దరినీ... థాంక్యూ ఫర్ వెయిటింంగ్... కొంచెం పని ఒత్తిడిలో కాస్త ఆలస్యం.
Deleteచంద్రుడులేని కలువపై సూర్యకిరణాలు పడితే పసిడికలువేగా (ఈసారి పసుపురంగు కలువని చూడండి చంద్రుడులేడన్న వేదనలో కొంచెం సన్నని రెక్కలతో పీలగా ఉంటుంది మామూలు వేరే రంగు కలువలతో పోల్చి చూస్తే) మొత్తానికి కవితకన్నా కాంతే మిమ్మల్ని కలవరపెట్టింది అనేది మాత్రం వాస్తవం.
Deleteపసుపు బంతికి దాసోహమై కలువబాల కవిత్వంలో బంధీని అనడం సమంజసమా సతీష్ గారు :-)
ఆకాంక్ష నువ్వన్నది అక్షరాల నిజమే. ఎంతైనా తెలివైన దానివి సతీష్ గారి మనసుని ఇట్టే చదివేస్తావు.
Deleteసతీష్ గారు రెండుపిల్లులు కొట్టుకుంటే కోతి తగువు తీర్చినట్లుంటుందేమో!.....నేను కొడితే కలువతో కొట్టినా కొరడాతో కొట్టాను అంటారు. :-) ఎందుకొచ్చిన తగుగువుతీర్చడం చెప్పండి.(నన్ను ఇన్వాల్ చేయకండి)
Deleteవిరహం వేదనాభరితమైనా తప్పదు ప్రేమ అంత మధురం. అయినా ఈ ముగ్థమనోహరిని ఎవరో ఇంత అలజడికి గురిచేసిన దురదృష్టవంతుడు:-) ;-)
ReplyDeleteకలువ కష్టాలు కలువవి....చంద్రుడి కమిట్మెంట్స్ చంద్రునివి. దురదృష్టం అదృష్టందేముంది కదా :-)
Deleteప్రేమ ఎంత మధురం
ReplyDeleteప్రియుడు అంత కఠినం
అందుకే ఎద అలజడి మీ కవితా నాయకికి. మార్గమేం సెలవిస్తారు ప్రేమార్పితగారు. :-)
మధురమైన అలజడికి ప్రేమించడేమే.....మరో మార్గమేం లేదుకదండి!
Deleteమీరెప్పుడూ ఒంటరి స్త్రీ చిత్రాలనే ఎక్కువగా ఎంపిక చేసుకోవడంలోని మర్మం ఏంటంటారు? కవితలో పదాలు చిత్రానికి అనుగుణంగా సున్నితంగా ఉన్నాయి.
ReplyDeleteచాలా సింపుల్....ఇందులో మాయా లేదు మర్మం లేదు. నేను వచ్చేటప్పుడు పోయేటప్పుడూ కూడా ఒంటరినే....ఇంక నా భావాలు కూడా ఎప్పటికీ ఒంటరివే. అయినా నేను రాసేవి సాధారణంగా "స్త్రీ" భావాలే అందుకే ఆమెనే చిత్రిస్తాను మీతో షేర్ చేసుకుంటాను.
DeleteEsa alajaDi anToo andari edalanu pinDestiri padmarpita gaaru:):)
ReplyDeleteమీ అందరి స్పంధించే సున్నిత ఎదలని తాకిన నా భావలహరిది అదృష్టమే!
Deletewonderful painting
ReplyDeletethank you
Delete