"సప్త ప్రేమికులు"

పద్మార్పితా.....పిచ్చి పలువిధాలు అంటే కాదు కాదు ప్రేమికులు పలురకాలు అని చెప్పే ప్రయత్నమే ఈ "సప్త ప్రేమికులు" ఆస్వాధిస్తారు కదూ :-)

"పిసినారి ప్రేమికుడు"
చిల్లర పైసల కోసం చిందులు వేసే నేను
కోట్లరూపాయల విలువైనమాట చెప్పేసాను
ఐ లవ్ యు అని మొబైల్ లో వినిపించాను!


"నిర్మల ప్రేమికుడు"
నీ మోముపై మొటిమల మచ్చలున్నా
ఎలా ఉన్నా నీ ముఖము చంద్రబింబమేనని
తారలుకూడా తోడున్నాయని సంబరపడతాను!

"నిశ్చల ప్రేమికుడు"
ప్రేమిస్తే నిద్రహారాలు ఉండవని అంటారు
వీలుంటే నన్నూ ఒకసారి ప్రేమించేద్దురూ
ఈ మధ్య తిని తొంగోవడం ఎక్కువై లావెక్కాను!

"ధనమున్న ప్రేమికుడు"

షాజహాను కంటే గొప్పవాడిని నేను
సిరిసంపదలంటే లెక్కచేయక ప్రేమించేసి
నీ పేరున బ్రతికుండగానే తాజ్ మహల్ కట్టిస్తాను!

"అతిజాగ్రత్త ప్రేమికుడు"
మనసుతోపాటుగా మరెన్నో దోచుకున్నావు
ఇది తెలుసుకుని గదినంతా పరిశీలిస్తుంటాను
నువ్వొచ్చే ముందు వచ్చి వెళ్ళిన తరువాతను!


"అమాయకపు ప్రేమికుడు"
నిన్ను చూస్తున్నా చూస్తున్నా చూస్తూనేవున్నా
నువ్వు వచ్చేటప్పుడు నేనటు వెళ్ళేటప్పుడు చూసి
చత్వారంవచ్చి రెండుకళ్ళు నాలుగనుకుంటున్నాను!

"నిత్య ప్రేమికుడు"
గాలిలో ప్రేమలేఖరాసి అందరికీ మెయిల్ పంపి
రిప్లై ఇచ్చిన వారిని నిజమైన ప్రేమంటూ ప్రేమించి
తనకోరికలని తలా ఒక్కరిలో ఒక్కొక్కటి తీర్చుకునేను!

23 comments:

 1. అయ్యో...ప్రేమికుల్లో ఇంత మంది ఉంటారా..మీ సప్త ప్రేమికులందరిని ఊహించుకుంటే ముచ్చటైన కార్టూన్ బొమ్మాల్లా ఉన్నారు ..మరో విషయం..పైనున్న కార్టూన్ బొమ్మ కూడా బాగుంది..మొత్తానికి పద్మర్పిత హాస్య కవితలకు కూడా శ్రీకారం చుట్టిందన్న మాట..అదరహో ..ఇదో పిచ్చి ప్రయోగం..అయినా బాగుంది..

  ReplyDelete
  Replies
  1. ఇక్కడో చిన్ని డౌట్.....పద్మగారి ప్రయోగం పిచ్చిదా ప్రేమ పిచ్చిదా అని నవజీవన్ జీ:-)

   Delete
 2. Where I am in this Padmarpita lol :)

  ReplyDelete
 3. ఆదివారం ఆటవిడుపా ఈ హాస్య కవిత...హ హ హా :-)

  ReplyDelete
 4. ఏమోనమ్మ నాకు మాత్రం మీరు వేదన గురించి రాస్తేనే యమనచ్చేస్తారు హాస్యంకన్నా....

  ReplyDelete
 5. సప్తబుుషులు, సముద్రాలు సరే మరి సప్తప్రేమికుల్ని ఎక్కడ నుండి తీసుకుని వచ్చావు:-)

  ReplyDelete
 6. ఈ కవిత వ్రాసింది మా పద్మార్పిత , చిత్రం గీసింది కూడా మా పద్మార్పితనే .
  కాకుంటే ఆ చిత్రంలో కూడా కనపడ్తున్నది కూడా పద్మార్పితేనన్నట్లు కనపడ్తున్నది .
  ఆ పద్మార్పిత పేరు ఓ మూల వ్రాస్తే బాగుండేదేమో ?

  ReplyDelete
 7. few more lovers to be add :-)

  ReplyDelete
 8. ఈ ఏడురకాల ప్రేమికులని కలిసారా మేడమ్:-)

  ReplyDelete
 9. సారీ మాడం మీ కలం నుండి ఇలాంటిది ఊహించలేదు :-(

  ReplyDelete
 10. రొటీన్ కి భిన్నంగా కాస్త రొమాంటిగా ఉందండోయ్

  ReplyDelete
 11. రియల్లీ అనెక్స్పెక్టెడ్ పోస్ట్... చలా ఫన్నీగా ఉంది ప్రేమికులపై మీ డిస్క్రిప్షన్.. :-)) ఈ కన్సెప్ట్ కి 100% తగ్గ పోస్ట్ ఇది. సూపెర్...మేడం

  ReplyDelete
 12. ఏడూ రకాల ప్రేమికులా
  ఏమో నాకు తెలిసినంత వరకు
  ప్రేమను మాత్రం ప్రేమగా ప్రేమించలేని వారులా కనిపిస్తున్నారు
  పిసినారోడు ప్రేమను వ్యక్త పరచడం రాకా పిచ్చివాడై పోయాడు
  నిర్మల ప్రేమికుడు మనిషి ఎలా ఉన్న నిస్సంకోచంగా నీరుగారి పోయాడు
  నిశ్చల ప్రేమింకుడు ప్రేయసిని తక్కువ తన శరీరాకృతి కోసం పాట్లుపడి నిరాకారి అయ్యదేమో
  ధనమున్న ప్రేమికుడు బహుశ తన డబ్బునే ఎక్కువగా ప్రేమించవచ్చు తాజ్ మహల్ ఎం ప్రేమను ప్రేమగా తన మదిలో కోవెల కట్టి పూజిస్తే అదే పదివేలు
  అతిజాగ్రత ప్రేమికుడికి ప్రేమకంటే వస్తువు మీదనే ఎక్కువ ప్రేమ (3-ఇడియట్స్ లో లా :) )
  అన్నిటిని డబ్బుతో పోల్చుకుంటూ అభద్రతా భావం కలిగిస్తాడు.
  చూస్తూ చూస్తూ చెప్తా చెప్తా అని కాలానికి పరుగులు పెట్టిస్తు పాపం చెప్పడానికి వినడానికి ధైర్యం చాలని వాడిలా మిగిలిపోతాదేమో అమాయకపు ప్రేమికుడు
  నిత్యప్రేమికుడి కంటే చాపలు పట్టేవాడే నయం కనీసం అవి అమ్మిన కడుపు నింపుకుంటాడు.

  పద్మ గారు ఇది నేను సీరియస్ గా రాసిన కామెంట్ కాదు. ఇలా రాసి ఎవరిని నొప్పించె ప్రయత్నం చెయ్యలేదు. సరదాకే రాసాను. ప్రేమకు విలువలు తగ్గుతున్న రోజులో అసలు సిసలు ప్రేమ అమ్మ ప్రేమ తరగని కరగని ధనం అది. ప్రేమని ఆకర్షణ ఆకర్షణ ని ప్రేమ అనుకునే నేటి కాలానికి సరితూగే ఉదాహరణలు పేర్కొన్న ఆ 7 రకాల ప్రేమికులు. కాని నమ్మకం ఉంటె ఆ 7 రకాలలో కూడా ఈ ఒక్క రకం ప్రేమే నిండి ఉంటుంది.

  మహాద్భుత హాస్యరసం చాలా బాగుంది మీ ఈ కవిత పద్మ గారు

  సప్తాశ్వారుఢమ్ తమ్ భజే దేవం సూర్యం నమామ్యహం
  ఈ శ్లోక నాకు గుర్తుకొచ్చింది ఆ టైటిల్ చూసి

  ReplyDelete
  Replies
  1. వాహ్ వాహ్...ఏం చెప్పారు. అలాగే ఆ సంస్కృత శ్లోకానికి కూడా అర్థం చెప్పేస్తే బాగుండేది

   Delete
  2. ఆ శ్లోక కు అర్ధం ఇదండీ ఆకాన్ష అభిలాషిణి గారు:
   ఏడేడు అశ్వాల రథం పై వచ్చే ఓ సూర్య దేవా అందుకో నా ముకుళిత హస్త ప్రణమాంజలి

   Delete
 13. "ప్రేమించేవాడే ప్రియుడు అంటే కాదు కాదని పిచ్చిపట్టివాడే అన్నట్లుంది" సప్తప్రియుల యవ్వారం:-)

  ReplyDelete
 14. Sridhargaru sammagaa .... మీరు చెప్పింది బాగుంది కానీ ఇలా సమ్మగా చెబితే ఎక్కనా ప్రేమ పిచ్చోళ్ళకి:-)

  ReplyDelete
  Replies
  1. చెప్పేది చెబుతామండి నయని గారు. వింటే విన్నారు లేకుంటే అందులో మనకు నష్టం వచ్చేదేముంది :)

   Delete
 15. అమ్మాయ్ పద్మాఏడుగురే కాదు ఇంకా వింత విన్యాసాలు చేసే ప్రేమికులు చాలా రకాలు. హాస్యరసం జోడించిన ఈ కూర్పు బాగుంది-హరినాథ్

  ReplyDelete
 16. సప్తప్రేమికులని చదివి స్పందించిన ప్రతి ఒక్కరికీ నమస్సుమాంజలులు.

  ReplyDelete
 17. Thanks a lot to all my dear friends._/\_

  ReplyDelete