జీతమడిగిన జీవితం

జీవించే ఉద్యోగమే చేసి అలసిన జీవితం
ఖాతాలో లెక్కలేవోచూసి జీతమడిగింది!
నిండిన పర్సు లోకాన్ని పరిచయం చేస్తే
ఖాళీపర్సు మనిషి నైజాన్ని చూపించింది!
డబ్బు జల్సాకాదు అవసరాలు తీర్చునని
శ్రమతో సంపాధించి ఖర్చుపెడితే తెలిసింది!

ఇష్టమేలేని కష్టమైన నవ్వేదో నవ్వమని
నవ్వు వెనుక ఏడ్పునే నిద్రపుచ్చమంది!
జీవమనుకున్న పరిచయాలే విడిపోయి
స్వార్థమేమో పెచ్చులూడి కనువిప్పైంది!
అందరూ మేకవన్నెలద్దుకున్న పులులని
ఈ జీవిత రంగస్థలం పై నటిస్తేనే తెలిసింది!

అంటించడానికి అగ్గిపుల్ల అవసరంలేదని
మనిషి మనిషిని చూసి మండుతాడంది!
రాతినికొలుస్తూ పూలుకోసి హత్యచేసానని
గుడిలో రాతివిగ్రహానికున్న పూలమాలంది!
పుణ్యానికి పెట్టుబడిగా పాపాన్ని లంచమిచ్చి
క్షమని కోరుతూ మరో తప్పుని బలి ఇచ్చింది!

90 comments:

  1. నిండిన పర్సు లోకాన్ని పరిచయం చేస్తే
    ఖాళీపర్సు మనిషి నైజాన్ని చూపించింది!
    డబ్బు జల్సాకాదు అవసరాలు తీర్చునని
    శ్రమతో సంపాధించి ఖర్చుపెడితే తెలిసింది!
    Outstanding lines mam...rocking

    ReplyDelete
    Replies
    1. nmraobandi...ditto...కష్టపడ్డం ఎందుకు? " " ఇలా రెండు చుక్కలు పెట్టక. మరీ ఇంత పిసినారా మీరు :-)

      Delete
    2. ఈ నెల్లో ఓ తారీకు నుంచి పిసినారి గా
      మారేందుకు ప్రయత్నిస్తున్నాను గా
      అదెందుకో మీకు మొత్తం తెలుసు గా
      అయినా మీకనిపిస్తోందా విడ్డూరం గా
      గా ... గా ... గా ... గా ... గా ... గా ...

      ఇలా అడిగినందుకెంతెంతో ఆనందం గా ...
      హలా చెప్పేశాననుకుంటా అలా అలా గా ...

      ఎలాగోలా చెయ్యి కట్టేసుకుందామనుకుంటే
      ఇదిగో మళ్ళీ మీరిలా గా ...
      ఇంత రాశాక కూడా మళ్ళీ ఎప్పుడైనా
      పిలుస్తారా నన్నో పిసినారి గా ???
      ముందు పట్టేసుకోండి నా చెయ్యిని గట్టి గా ...
      లేదంటే ఇంకా ఇంకా పేజీ అంతా రాసేస్తానేమో ఆపకుండా గా ...

      (లేకపోతే పిసినారంటారా నన్ను ...
      చదివీ చదివీ తిక్క కుదిరింది గా ...)

      (పద్మార్పిత గారికో విన్నపం ...
      మీ డైరీ లో నన్ను కూడా ఏదో ...
      ఒక నాలుగు (?) లైనులు అప్పుడప్పుడు
      రాసుకోనివ్వండిలా గా ...)

      thx ... the 3 of u ...
      త్రీ రొజెస్ యాడ్ గుర్తుకొచ్చింది ...
      గా ...

      Delete
    3. మైత్రీ.....థ్యాంక్యూ వెరీ మచ్

      Delete
    4. nmraobandi.....మీ :-) కి ప్రతిగా :-)
      అప్పుడప్పుడూ ఏంటి.....అన్నివేళలా మీకు సుస్వాగతం :-)

      Delete
    5. ఆకాంక్ష....nmraobandi కవితకి జవాబు నువ్వే ఇవ్వాలి:-)

      Delete
    6. that was just fun ...
      again 3r meant 3 friends
      from 3r film only ...
      not the tea ad ...
      (not to be mistaken again -
      with regards to all ...)

      Delete
  2. జీవించే ఉద్యోగమే చేసి అలసిన జీవితం
    ఖాతాలో లెక్కలేవోచూసి జీతమడిగింది!
    నిండిన పర్సు లోకాన్ని పరిచయం చేస్తే
    ఖాళీపర్సు మనిషి నైజాన్ని చూపించింది!
    డబ్బు జల్సాకాదు అవసరాలు తీర్చునని
    శ్రమతో సంపాధించి ఖర్చుపెడితే తెలిసింది!

    ఇష్టమేలేని కష్టమైన నవ్వేదో నవ్వమని
    నవ్వు వెనుక ఏడ్పునే నిద్రపుచ్చమంది!
    జీవమనుకున్న పరిచయాలే విడిపోయి
    స్వార్థమేమో పెచ్చులూడి కనువిప్పైంది!
    అందరూ మేక వన్నెలద్దుకున్న పులులని
    ఈ జీవిత రంగస్థలం పై(నటిస్తే)నే తెలిసింది!

    అంటించడానికి అగ్గిపుల్ల అవసరంలేదని
    మనిషి మనిషిని చూసి మండుతాడంది!
    రాతినికొలుస్తూ పూలుకోసి హత్యచేశానని
    గుడిలో రాతివిగ్రహానికున్న పూలమాలంది!
    పుణ్యానికి పెట్టుబడిగా పాపాన్ని లంచమిచ్చి
    క్షమని కోరుతూ మరో తప్పుని బలి ఇచ్చింది!

    పద్మా!
    సూపర్బ్ , మార్వలస్ .
    బాగుంది అని చ్వ్ప్తే బాగుండదేమోనని , మొత్తాన్ని యిక్కడ చూపిస్తూ వ్రాస్తున్నా .
    ఆరంభం రంభలా అందంగా వుంది .
    ముగింపులో అవసరమైన తెగింపు చూపించావ్ .

    ReplyDelete
    Replies
    1. మీరు నేను రాసింది చదివి నవ్వి ఒక స్మైలీ పెట్టినా ఆనందమే శర్మగారు. ధన్యవాదాలండి మీ అత్మీయ స్పందనకు.

      Delete
  3. కష్టం తెలుసుకున్నవారి తలపై CAP
    స్వార్ధంతో స్నేహం వదిలినవారిని SLAP
    అక్షర సత్యాలు చెప్పిన మీకు CLAPS

    ReplyDelete
    Replies
    1. చిల్లపిల్లైపొతున్నారు రూపగారు...Rhyme అప్పచెప్పారు థ్యాంక్యూ :-)

      Delete
  4. రాతినికొలుస్తూ పూలుకోసి హత్యచేసానని
    గుడిలో రాతివిగ్రహానికున్న పూలమాలంది!

    మీ నిశిత పరిశీలనకు ఓ మచ్చుతునక ఇది. కవితకు ఊపిరి పోసి భావం గుండెకు చేరువయింది. ఈ చిత్రం మరో ఆణిముత్యం పద్మార్పిత గారు. అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. నేను రాసే రాతలకి స్పందించే మీతీరు ఎంతో ప్రేరణాత్మకంగా ప్రశంసనీయంగా ఉంటుందండి. ధన్యవాదాలండి.

      Delete
  5. జీతం భత్యం లేని ఉద్యోగం జీవితం

    ReplyDelete
    Replies
    1. జీవితంలో జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పదు పనిచేయడం( సాగిపోవడం)

      Delete
  6. ఇలాంటి కవిత్వం తో మికు తిరుగులేదనిపించుకున్నారు. తెలుగు సహితీ ప్రస్థానంలో ఇప్పుడు నడుస్తున్నది "పద్మార్పిత" ఎరా... అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.
    అవిరళమైన కృషితో సరళమైన కవితలు రాస్తూ... కాలగమనంలో అభిమానులకు ప్రతి కవితనూ అందంగా అర్థవంతంగా చిత్రాక్షరాలతో బహూకరిస్తూ ఇలానే మున్ముందుకుసాగి, మరిన్ని హృదయాలకు మీ భావాలు చేరాలని ఆశిస్తూ...
    - మీ అభిమాని

    ReplyDelete
    Replies
    1. మనస్పూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎప్పుడూ పద్మార్పితగారు మంచి కవితల్ని అందించాలని

      Delete
    2. తెలుగు సహితీ ప్రస్థానంలో ఇప్పుడు నడుస్తున్నది "పద్మార్పిత" ఎరా... అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.I am feeling proud that I know her. I love her attitude & friendliness.

      Delete
    3. అభిమానిగారు.....మరీ ఇలా తెలుగు సాహితీప్రస్థానంలో "ఎరా" స్థాయికి నేను ఎదగలేదండి. మీ అందరి హృదయాల్లో అభిమానమే నాకు పెద్ద "ఎరా" అభివందనాలు అందలం ఎక్కించి అభిమానిస్తున్న మీకు._/\_

      Delete
    4. నాలో నేను....thank you for your supporting words.
      Sandhya Sri.....Thanks for being my friend and loving as i am dear.

      Delete
  7. SRIPADA garu & SRIDHAR garu..... we miss you !!

    ReplyDelete
  8. తెలుగులోని తీయదనమంతా మీ కవితల్లో చూడగలగడం నా అదృష్టం. అత్యుత్తమం మీ రచనా ప్రతిభ.

    ReplyDelete
    Replies
    1. తీయని తెలుగుతనాన్ని భాషని ఆస్వాధించే మనసు నీది యోహంథ్...thank you

      Delete
  9. ముగింపు చాలా బాగుంది,
    నిక్కచ్చిగా చెప్పిన తీరు బాగా అమరించ్ది కవితకు,
    పద్మా..ఎప్పటిలా బాగుందమ్మా.

    ReplyDelete
    Replies
    1. ఇలా పద్మా అని ఆప్యాయంగా పిలిచి మరీ ప్రేరణ కలిగించే వ్యాఖలు రాసే మీరంటే నాకు భలేఇష్టం. థ్యాంక్యూ మీరాజ్ గారు.

      Delete
  10. Madam bindas kavitha...hatsof to you. 10 commands la powerful kavita rasi meppincharu. oko line korada jhalipinatlundi.

    ReplyDelete
    Replies
    1. thank you Nandugaaru. 10 commands tho compare chesaaru ante nannu oka Emperor ga ani yuddam chesi rule cheyamante chastaanandi. alaanti vaddu chakkagaa ilaa aadutu paadutoo saaganivvandi.

      Delete
  11. బోనాలు పండుగ మాకు ఈరోజు....అమ్మవారు రెపు పూని ఈ సంవత్సరం జరిగేది చెప్తారు. మీరేంటో ఇలా ఎవరో పూనితే మన్షి గురించి మొత్తం చెప్పి కళ్ళుతెరిపించి జాగృతిని కలిగించారు.
    కవితగురించి నేను కమెంటలేను తల్లో పద్దమ్మా( మీరాజ్ ఫాతీమాగారి పిలుపు ఇది నేను వాడుకున్నందుకు క్షమించాలి మీరాజ్ జీ)

    ReplyDelete
    Replies
    1. ఆకాంక్ష ఇలా అమ్మోరని అదరగొడితే ఎలా! అసలే ఏం తెలియని అమాయకురాలిని కదా :-)

      Delete
  12. You are great with extraordinary thoughts. No more words...I am proud to be your friend.

    ReplyDelete
    Replies
    1. Mahee you are always my friend and will be. Thanks for compliments.

      Delete
  13. స్వార్థమేమో పెచ్చులూడి కనువిప్పైంది!
    అందరూ మేకవన్నెలద్దుకున్న పులులని
    ఈ జీవిత రంగస్థలం పై నటిస్తేనే తెలిసింది!
    సూపర్ లైన్స్ పద్మగారు...రోజు రోజుకి ఎదిగిపోతున్నారు.

    ReplyDelete
    Replies
    1. ఎంత ఎత్తుకి ఎదిగినా.....ఒదిగి మీ అందలో ఉండాలన్న కోరిక తీరాలని ఆశ.

      Delete
  14. PADMA MADAM A BIG SALUTE AND THOUSANDS OF CLAPS TO YOU.
    ----From Mahee Friends

    ReplyDelete
    Replies
    1. Hello friends......happy to see you all your affection in this way. thanks a lot.

      Delete
  15. జీతంతోపాటుగా కరువుబత్యం కూడా అడిగితే పనిలోపని అయిపోయేదేమో!:-)

    ReplyDelete
    Replies
    1. జీతమే లెక్కచూడకుండా పనిచేయిస్తుంటే ఇంక భత్యం కూడానా అనికేత్...:-)

      Delete
  16. అర్పితమ్మా......నువ్వేమో రోజుకో విధంగా కవితలల్లి మనసుకి మందుపెట్టి మాయ చేస్తావు. నేనేమో సరైన సామెతలు తెలియక మెదడుకి మేత పెట్టలేక చస్తున్నా. అలాగని నిన్ను వదలను బొమ్మాలి....నిన్ను వదలను బొమ్మాలి:-) :-) కవితలో జీవితాన్ని చదివి అప్పగించావు. ఎవరైనా ఈ కవితకి సరైన సామెత రాసి నన్ను విముక్తి చేయండి.

    ReplyDelete
    Replies
    1. కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి అన్నట్టు గమ్మత్తు గా కొసమెరుపులు అద్దారు అని సామెత వాడుకోండి నయని గారు

      Delete
    2. వొదల బొమ్మాళి వొదల అన్నారు కదా విముక్తి పొందారా ఇప్పుడు :)

      Delete
    3. నయనీ....మిమ్మల్ని నమ్ముకుని సామెతల సంకలం ఒకటి రిలీజ్ చేద్దాం అనుకున్నాను మధ్యలో ఇలా నట్టేట ముంచేస్తే ఎలా. :-) పైగా వదలను బొమ్మాలి అని విముక్తి నొసగుమని మీరే చేతులెత్తేస్తే నేనేం చేయాలో దిక్కుతోచడం లేదు :-)

      Delete
    4. Sridhar Bukya....నయనిగారిని విముక్తురాలిని చేసి నన్ను బంధీని చేస్తారా :-)

      Delete
    5. విముక్తిగావించారుగా ఇంక విహరిస్తా సామెతల వేటలో :-) నమోఃవందనాలు

      Delete
  17. జీవితాన్ని దేనితోను పోల్చగాలేము
    వైషమ్యాలు ఎన్ని ఉన్నా ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా
    అవ్వన్నీ దాటుకుంటూ వెళ్ళడమే జీవితం నేర్పే సత్యం

    జీవితానికి ఊపిరే జీతం కాలగమనమె అలుపెరుగని దారి
    బంధాల అనుబంధాల తీగలా పెనవేసు బంధాలే తలమానికాలు

    జీవితం చదివే పుస్తకమే కాకపొతే అందులో భావాల అక్షరాలూ అందరికి అర్ధం కావు
    అర్ధమైన భావాలు ఆర్ద్రత తో నిండి ఉంటాయి.

    జీవిత యథార్థ సత్యాన్ని చక్కని భావాలతో తెలిపారు. చెమ్మగిల్లాయి చివరి పదాలకు.
    చక్కని చిత్రం అంతకు చిక్కని కావ్యం

    ReplyDelete
    Replies
    1. అర్థమై జీవితం వడ్డించిన విస్తరి అయితే ఎంతబాగుంటుందో కదా.... అందుకే అలా ఊహించుకుని బ్రతికేస్తే బాగుంటుంది. ఇలా బంధాలు, బాంధవ్యాల బంధీ నుండి బయటపడి ఎగిరిపోతే ఇంకెంతో బాగుంటుంది. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఇలా అనుకుంటారు.
      మీ సున్నిత భావస్పందనకు ధన్యవాదాలు.

      Delete
  18. అంటించడానికి అగ్గిపుల్ల అవసరంలేదని
    మనిషి మనిషిని చూసి మండుతాడంది!

    నిండిన పర్సు లోకాన్ని పరిచయం చేస్తే
    ఖాళీపర్సు మనిషి నైజాన్ని చూపించింది!

    జీవించే ఉద్యోగమే చేసి అలసిన జీవితం
    ఖాతాలో లెక్కలేవోచూసి జీతమడిగింది! ఇలా మొదలు పెట్టి మంచి మలుపిచ్చిన ఈ కవిత మనసులో ఒక మూల ఒదిగిపోతుంది ఎప్పటికీ

    ReplyDelete
    Replies
    1. ఎప్పటికీ అలా నా స్థానాన్ని పదిలంగా మీ మనసులో ఉండనివ్వడి మరి :-)

      Delete
  19. చివరి ఆరుపంక్తుల్లో బలమైన భావాలని, జీవిత చిద్విలాసాన్ని చెప్పి అబ్బుర పరిచావు. చిత్రం కూడా జీవితంలాగే నలుపు తెలుపు రంగులతో నీ ఆలోచనలకి అనుగుణంగా ఎంచుకోవడంలో నీ విశిష్టత కనబడుతుంది. అభినందనలు అర్పిత-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారూ మీరు చదివిన జీవిత పుటల్లోని కొన్ని పంక్తులె ఇక్కడ నేను వల్లించాను. నన్ను ప్రశంసించి ప్రోత్సహిస్తున్న మీ నిండైన వ్యక్తిత్వానికి నెనర్లు.

      Delete
  20. ఇంకాడ ఒకొక్కరు వ్రాసే కమెంట్స్ చదివి ఏం రాని ఎర్రిబాగులదానివి నువ్వు మాయ అని నా విశ్వం నన్ను ఎగతాళి చేస్తే ఊరుకుంటానా. ఏదో వ్రాసి పొడిచేద్దాం అనుకున్నా రాక వెర్రి దాన్నని ఒప్పేసుకుంటున్నా.
    మీ కవితలని అర్థం చేసుకుని ఆచరిస్తే చాలు అనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. మాయకి విశ్వం తోడుగా ఉన్నప్పుడు వెర్రిదానివైనా చింతేల మాయా :-) ఆచరించాల్సినంత ఉందంటారా! :-)

      Delete
  21. రెడ్డు రంగు బొట్టు వదిలిన ఫుడ్డు ఫిరంగి తూటాలు. జీవితపు గిడ్డంగిలో లోపాలు.

    ReplyDelete
    Replies
    1. రెడ్డు(Red) రంగు అన్నావు కనుక సరిపోయింది వినోద్ లేకపోతే రెడ్డు బొడ్డు అన్నావని పుల్లుగా ఫుడ్డు కొట్టి ఫిరంగీలో తూటాలన్నీ అయ్యేవరకూ కాల్చేదాన్ని. :-)

      Delete
  22. Very Great Lyrics with wonderful thoughts, Its very heart touching.. Pic super....

    ReplyDelete
  23. Padmarpitaaaaaaaaaaaaaaaa.......waiting for replies . Satishji marking absent for you:-P

    ReplyDelete
    Replies
    1. Replies ivvakapothe naaku nidra pattadugaa....yes i am here at your service :-)

      Delete
  24. పీహెచ్‌డీ చేసిన వారికి డాక్టరేట్‌ ఇస్తారు. మరి జీవితంలో పీహెచ్‌డీ చేసిన వారికి.. ఏం ఇవ్వాలి..? ఆ హోదా పద్మకి ఇచ్చేయొచ్చు. మానవ సంబంధాలను వర్ణిస్తోంది ఆ చిత్రం. మసకబారిన ఆ జీవితంలో... జీవితాక్షరాలు మిణుకు
    మిణుకుమంటున్నాయి. శిలాక్షరాల్లా ఆమె చూపులు హెచ్చరిస్తున్నాయి. జీవిత రంగస్థలంలో ఆడి ఆడి ఆలిసిపోయిన ఆ జీవితానికి చివిరికి మిగిలిన దన్ను మోడు మాత్రమే. మానవ సంబంధాల్లో మాధుర్యాన్ని ఆ చిత్రం చూపిస్తోంది. నుదుటి మీద కుంకుమ ఛాయ... మాంగల్యబంధంలో మమకారం... మిగిలిన ఆనందం ఆ మూరెడు మల్లెపూలలోనే. ఇంకేమీ లేదు... ఆర్థిక బంధాల మధ్య నలిగిపోయిన... మానవ సంబంధాల ఎడబాటు తప్ప. మొత్తానికి మనిషికి మనిషేమవుతాడంటే... ఏమీ కాడు. అదో భ్రమ మాత్రమేనా...? మానవ సంబంధాలను అక్షరాలలో బంధించిన మీకు... మీ చిత్రానికి... సలాం.

    ReplyDelete
    Replies
    1. సతీష్ చిత్రంలోని భావాలని నువ్వు విశధీకరించాక చూస్తే కవితకి చిత్రం ఇంత బలాన్నిస్తుందా అనేంత అద్భుతంగా రాశావు. చిత్రాల భావాలు చెప్పడంలో పి.హెచ్.డీ ఏమైనా చేసావా? సరాదాకి ఆన్నాను. ఆయుష్మాన్ భవ-హరినాధ్

      Delete
    2. అయ్యబాబోయ్ సతీష్ గారి కలం ఇలా నన్ను పొగుడుతుందని కలలో కూడా అనుకోలేదండి. డాక్టరేట్ హోదాకి నేను అర్హురాలిని కాను కానీ మీ కమెంట్ చదివి షాక్ కొట్టినట్లు ఫీల్ అయ్యి ఏ డాక్టర్ దగ్గరకి వెళ్ళాలా అని థింక్ చేసాను కొత్తూరిగారి :-) థ్యాంక్యూ.
      A SPECIAL THANKS TO YOU FOR SPARING YOUR VALUABLE TIME ON COMMENTING IN MY BLOG.
      కమెంట్ చదువుతుంటే తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. నేను అనుకున్న భావాన్ని చిత్రంలో అచ్చుగుద్దినట్లుగా చెప్పారు మీరు. కవితతో పాటు చిత్రంపై శ్రద్ద చూపించే నా శ్రమకి ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉందండి.
      నాకు కాదు సలాం....మీకే నా సహస్త్రవందనాలు.

      Delete
    3. హరినాధ్ గారు నిజమేనండి పి.హెచ్.డి చేసే ఉంటారు :-)

      Delete
    4. వటుడింతై అన్నట్లుగా బ్రహ్మాండంగా ఉంది రోజురోజుకీ మీ వివరణ. మీలో చిత్రభావ అన్వేషణే కాదు పద్మార్పితగారిపై రీసెర్చ్ ఏదో మొదలుపెట్టినట్లుగా గూఢాచారి వర్గాలు తెలుపుతున్నాయి :-)

      Delete
    5. మిస్టరీ ఎప్పుడూ... మిస్టరీనేగా... ఆసక్తి ఉంటుందండోయ్‌.. ఎవరికైనా.... ఆమె కవితల్లో... జీవం ఉండబట్టే...ఆసక్తి. ఈ మధ్య కాలంలో ఇంత రెగ్యులర్‌ ఫాలో అయిన.. బ్లాగ్‌ ఇంకోటి లేదు.

      Delete
    6. మిస్టరీలో హిస్టరీ సృష్టించాలన్న జిజ్ఞాసతో అయినా ఫాలో అయిపొండి నా బ్లాగ్ ని :-) థ్యాంక్యూ సతీష్ గారు

      Delete
  25. మంచి కవిత పద్మార్పిత

    ReplyDelete
  26. అంటించడానికి అగ్గిపుల్ల అవసరంలేదని
    మనిషి మనిషిని చూసి మండుతాడంది!

    Profoundly brilliant lines!

    ReplyDelete
    Replies
    1. Welcome to my blog Krishnagaru. Thanks for your inspiring words.

      Delete
  27. జీవిత సత్యాలను కవితా రూపంలో ఆవిష్కరించి బంధాల గురించి, అనుబంధాల గురించి, విలువల గురించి మీరు ప్రతీ కవితలో ఏదో ఒక భావాన్ని మనసుకు హత్తుకొనేలా వీణలా మీటుతుంటే ఏదో తెలియని మైకమే కమ్ముకున్నట్లుంటుంది ... జీతమడిగిన జీవితంలో మీరు మేక వన్నె పులుల గురించి చెప్పారు..పూలమాలలతో మాట్లాడించారు ..మనిషి మనిషిని చూసి మండినప్పుడు అగ్గిపుల్ల అవసరమే లేదన్నారు...అంతలోనే అందరూ క్షమకు అర్హులు కాదన్న నిజాన్ని చెప్పకనే చెప్పరు... అన్నింటి కన్నా మీ పరిశీలనా శక్తికి నా అభినందనలు.. మీ కవితలను చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలకు మనసులో దృశ్య చిత్రాలుగా మార్చుకొని భావాన్ని కళ్ళ ముందు సాక్షత్కరింపజేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ ఆ అనుభూతే వేరు.. బహుశా ఒక పది సంవత్సరాల తరువాత మీ కవితల వెనుక ఉన్న మర్మాలను పట్టుకోవడానికి వాటి మీద పరిశోధన చేసినా తప్పులేదు... ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ కవితా పుష్పాలను అన్నింటిని మాల కట్టి ఓ సంపుటి రూపంలో భవిష్యత్తులో మీరు మీరు వెలువరించాలని ఆశిస్తున్నాను..

    ReplyDelete
    Replies
    1. బాగుంది......నా రాతలపై మీ వివరణ. మీ అభిమానాత్మక వాఖ్యాల ప్రేరణతో ముందుకి సాగిపోయి మీ అందరి హృదయాల్లో ఉంటే చాలండి. నేను రాసుకునే భావాల పై పరిశోధనలు, పుస్తకావిష్కరణలు అవసరమా చెప్పండి. ఎప్పటికీ ఈ అభిమానాన్ని ఇలాగే ఉండనిస్తారని ఆశిస్తూ మరో మారు ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకు.

      Delete
  28. అర్పితమ్మగారు రిప్లైస్ ఇచ్చి రివ్వున తారాజువ్వలా కవిత విసిరేవారు ఈసారి ఎందుకనో ఇంత ఆలస్యం.

    ReplyDelete
    Replies
    1. సండే కి ఇంకా టైం ఉంది కదండీ. అభిలాషిణి ఆకాంక్ష గారు. అంతలోకి నా బ్లాగ్ ని విక్షీంచండి :)

      నాకు తెలిసి పద్మ గారు ఎవరీ సండే ఓ కవిత అలా అలవోకగా రాసేస్తారు అందుకే ఇలా అంటున్నాను

      Delete
    2. ఆలోచించి చించి ఆలస్యం.....ఏం రాసినా ఏడిపిస్తున్నాను అంటున్నారని నవ్విద్దాం అనుకుంటే పిచ్చిది అంటారేమోనని ఆకాంక్ష ;-)

      Delete
    3. Sridhar Bukyagaru....My hearty congratulations on completion of 500 posts in your blog.

      Delete
    4. ​మీ అమూల్యమైన అభినందనలకి ధన్యావాదాలు పద్మార్పిత గారు
      Thank You Padmarpita Gaaru for your Valuable Wishes and Comments on my Blog on the Occasion of Completion of 500 Posts in my Web-log Kaavyaanjali.

      Started Way back in 2007, On the Last Day of November, it came all along to put my thoughts and feelings in the form of Digital/Electronic Media lead me to bring out this blog.

      ఈ కావ్యాంజలి ప్రవాహాన్ని ఎల్లా వేళల గోదావరి లా ఉరకలెత్తిస్తానని మనవి చేస్తూ.

      శ్రీధర్ భుక్య

      Delete
    5. శీధర్ భుక్యగారి కావ్యాంజలి వేదమై ఘోషించే గోదావరిలా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

      Delete
  29. Replies
    1. కల్కిగారు ధన్యవాదాలండి.

      Delete
  30. amazing poetry with sensible meaning. you are great mamji

    ReplyDelete
    Replies
    1. Payal thanks for reading my poetry and for compliments too

      Delete
  31. సూపర్ పద్మా

    ReplyDelete
  32. సూపర్ పద్మా

    ReplyDelete