ప్రణయ అలలు


నిష్కల్మష ప్రేమకు నిర్వచనమే నీవని తెలిసె
పదాలన్నీ పేర్చి నీ పేరిట పద్యమే రాయబోతే!

సుమధుర నాదస్వరమే ఊదినట్లు అనిపించె
నీ ఊపిరేదో నన్ను తాకకనే గిలిగింతలు పెడితే!

సజల సహజ నయనాలే నీకై దిక్కులు చూసె
సతతహరిత సరళ సరస సల్లాపాలేవో కరువైతే!

మండుటెండలో మలయమారుత గాలులే వీచె
నా కురులలో నీ మోముదాచి రాతిరని నవ్వితే!

సిగలోని మల్లెలు పిర్యాదు దొంతర్లే నీకు చేరవేసె
అధరాలు అదురుతూ మకరందాన్ని దాయబోతే!

నింగిలోని తారకలన్నీ సిగ్గుమొగ్గలై తలలు వంచె
ప్రణయఅలలకే తడిసి పసిడిమేనే నిగనిగలాడితే!

కౌగిలి వీడలేక వీడిన కపోతాలు విరహంలో అలిసె
కనురెప్ప మూసి తెరచి యుగమాయెనని చెబితే!

26 comments:

  1. అనుకున్న భావాలని సగం చిత్రంలో చూపించి మిగిలిన సగం మీ తీయని పదాలలో పులకరింపజేస్తారు. అందమైన ప్రణయ సుధామధురం మీ ఈ కవిత మీ భావ అలలకు కళాతృష్ణకు అభివందనం.

    ReplyDelete
  2. హిమజ్వాలలు రేపిన ఊహలకు రెక్కలొచ్చాయి. తడిసిన మనసుకి అన్నీ భారమే. సిగపూల అలక, అధరాల వణుకు, తడబడిన అడుగు, తడి సొగసు... అంతా ప్రణయ ప్రకృతి మాధుర్య హేల. నిష్కల్మష ప్రేమకే రసమయ జీవిత పరమార్ధం తెలుస్తుంది. ప్రేమ పావురాల విరహం , తోడు కోరుతున్న తన్మయం ఈ రెంటి మధ్య ఒక సరిహద్దు... నిష్కల్మష ప్రేమ. అందుకేనా... రెండు పావురాల మనసు మాటను, కోరికల తనువు మాటను సాక్షాత్కరించారు. రస హృదయులతో కవితలు రాయిస్తున్నాయి... మీ కోమల రసాక్షరాలు. చాలా బాగుంది. గిలిగింతలు పెట్టింది.

    ReplyDelete
    Replies
    1. సతీష్గారు...రొమాంటిక్ మూడ్ లో కమెంటారని అర్థం అయ్యిందిలెండి :-) బాగుంది

      Delete
    2. నేను రొమాంటికేనండీ.....

      Delete
  3. ప్రతీ అక్షరం పులకరింపచేసిన మాట వాస్తవం.

    ReplyDelete
  4. అత్యంత రమణీయం రసాభరితం దృశ్యకావ్యం.

    ReplyDelete
  5. చాలా బాగుంది .ప్రతీ లైన్ రసరమ్యంగా మలుపు తితిప్పుతూ భావాన్ని పండించావు.

    ReplyDelete
  6. వెయ్యి తూటాలంత పెట్టు మీ కవిత సూపర్

    ReplyDelete
  7. ప్రేమకు నిర్వచనాన్ని ఎందఱో మహానుభావులు ఎన్నో విధాలుగా చెప్పారు. అదొక అనుభూతని, రెండు హృదయాల కలయిక అని, ఒక ఆత్మీయ బంధమని, ... ఇలా ఎన్నో కనిపించని భావాలను చెప్పారే గానీ కంటికి కనిపించేదిగా ప్రేమను ఎవరూ నిర్వచించలేదనుకుంటా నాకుతెలిసీ. ఇక్కడ ఒక వ్యక్తిపై అగాధమంత లోతు మనసున్న కథానాయకికి ఉన్న ప్రేమ ఒక ఎత్తైన శిఖరాన్ని తాకిందని చెప్పొచ్చు. అటువంటి పరాకాష్టే ప్రేమకు నిర్వచనంగా ‘’ప్రేమికుడని’’ ఇక్కడ వ్యక్తపపరచింది. అదీ కమ్మనైన పదాలు కూర్చి ప్రియుడిపై ఒక పద్యం రాయదలచినపుడు. ఎంత అద్భుతం ఇది! సతతహరిత సరససల్లాపాలు – ఒక విన్యసభారిత పదప్రయోగం. ప్రతిక్షణం ప్రేమ చిగురిస్తే గానీ సరసం సతతహరితం అవ్వదు. అలాంటి భావాన్ని నింపుకున్న ఈ కవిత ఎంతో పవిత్రమైనది. కురులలో రాతిరి అనిపించినపుడు ఒంట్లో జ్వలించిన వేడిని మండుటెండలు గా చిత్రించడం ఒక అమోఘమైన భావన. ప్రాక్టికల్ గా యుగాలు జీవించడం అసాధ్యం. ప్రేమలో అది సుసాధ్యం. క్షణం వీడినా మనసు క్రమక్షయం చెందుతుంది. గొప్పగా రాసిన ఈ కవిత మీ అక్షరాల్లో ఒక కొత్తదనంత్తో పాటు, ఒక మిధ్యా లాలనను అందించేప్రయత్నం చేసింది. సలాం! మేడం.

    ReplyDelete
    Replies
    1. అందరిలా కాకుండా విభిన్నరీతిలో చెప్పడమే పద్మార్పిత ప్రత్యేకతని మీ కమెంట్ ద్వారా అర్థమైంది. చక్కని విశ్లేషణ

      Delete
  8. మొత్తంగా తానో విశ్వం

    ReplyDelete
  9. ప్రణయ అలల తాకిడికి తట్టుకోవడం కష్టమే అయినా ఇష్టం అనేంత బాగుంది-హరినాధ్

    ReplyDelete
  10. సజల సహజ నయనాలే నీకై దిక్కులు చూసె
    సతతహరిత సరళ సరస సల్లాపాలేవో కరువైతే
    ఎంతో నచ్చిన వాక్యాలు పద్మగారు

    ReplyDelete
  11. పద్మార్పితా ఒక్క వారం అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి ప్రణయ ప్రళయం సృష్టించారు మీ ప్రణయ అలలతో. చాలా అత్యభుతంగా వ్రాశారు. ముఖపుస్తకంలో కుదిపేసి ఉంటుందనుకుంటాను. బాడ్ లక్..నా అకౌంట్ అక్కడ మళ్ళీ దొబ్బింది. త్వరలో అక్కడ కలుస్తాను. అలా అని ఇక్కడ రాననుకోకండీ...వస్తూనే ఉంటా మీరు వ్రాస్తూనే ఉండండి.
    రిప్లైస్ వ్రాయండి అని ఇంక చెప్పి విసిగించనులెండి.

    ReplyDelete
    Replies
    1. ముఖ పుస్తకానికీ, మీకు ఏదో గొడవున్నట్టుంది.....

      Delete
  12. ఏడుపుగొట్టు అన్నానని మరీ ఇంత విరహపుగొట్టు కవిత రాస్తే ఎలా...
    ఓ నా ప్రియుడా ....అమ్మడి విరహం ఆవిరై ..స్వేదమై..స్వేదం కాస్తా పెట్రోలై దహించకముందే... కాపాడు... ఓ మై గాడ్...

    ReplyDelete
  13. పదం పదంలో రసానుభూతి కలిగించారు.

    ReplyDelete
  14. Mam your poetry rocks all the way.

    ReplyDelete
  15. each and every line extraordinary feel. excellent

    ReplyDelete
  16. పద్మగారి పదవిన్యాసం మరోసారి ప్రణయ కవితలో కనబడుతుంది.

    ReplyDelete
  17. వామ్మో గిట్ల రాసి మాయజేస్తివి మనసు

    ReplyDelete
  18. మీ అందరూ తెలియజేసిన అపూర్వమైన అభిప్రాయాలకు నా నెనర్లు.

    ReplyDelete
  19. వావ్ మిస్ అయ్యాను. రసరమ్యం

    ReplyDelete