ఆనందమా..నీ చిరునామా!

ఓ ఆనందమా! ఏది నీ చిరునామా
నాపై అలిగి ఎందెందు దాగినావో చెప్పవా
నీ అలుక తీరే మార్గమేదో ఇకనైనా తెలుపవా!

నీ కై వెతికా మేడమిద్దెల్లో, స్వాదిష్టి భోజనంలో
కానరాక వెతికి వేసారి, షాపింగ్ మాల్స్ ని,
నగల నగీషీలనీ నీ జాడ చెప్పమని అడిగా
విసుగ్గా ముఖం చిట్లించి...వెర్రిదానా అంటూ 
నీకోసమే వాటి అన్వేషణ అని నవ్వుతూ..
సంతోషాన్ని నీవు చూసావా అంటూ ప్రశ్నించె!

వేదనతో పరిచయమైన నాకు తెలీదని తల్లడిల్లి
శోధనలో సహాయ పడమని దుఃఖాన్ని కోరగా
నిన్ను గుర్తించే ఆనవాళ్ళు చెప్పమనే...
చిన్ననాటి స్మృతులనే చూడామణిగా ఇచ్చా!

ఇన్నేళ్ళుసత్తువే సొమ్మసిల్లి, అలసట సేదతీరె
అయినా ఆశచావక వెతుకుతూనే ఉన్నా...
అకస్మాత్తుగా ఓ అరుపు...అర్పితా ఆలకించని!
దిక్కులన్నీ వెతికి దిగులు చెందకని ఓ మెరుపు
నేను నీలోనే, నీ చుట్టూనే ఉన్నానంటూ..
నేను వస్తువుని కాను కొనుగోలు చేసుకోడానికి
నిష్కపటమైన ప్రేమలో, నిస్వార్థమైన సేవలో
నిర్మలమైన నవ్వులో, నిశ్చలపనిలో ఉన్నానని

"ఆనందం" అనుభూతని, వెతక్క బంధించనె!
సంతృప్తి తన తోబుట్టని, కోరికలే శత్రువులనె!

15 comments:

  1. ఆనందం వెతిగితే దొరకదు అని చెప్పారు బాగుంది, ప్రయత్నించనిదే ఏదీ సాధ్యం కాదు.

    ReplyDelete
  2. బులెట్ తోడు తుపాకి
    ఆనందం మన తోడు

    ReplyDelete
  3. ఆనందం మీవెంటే

    ReplyDelete
  4. వేదనలోనూ వేడుకలోనూ నవ్వేస్తానన్నారుగా మళ్ళీ ఇదేంటండి బాబూబాబూ :-)

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  5. ఇంతకీ ఆనందం దొరికినట్లేనా...:-)

    ReplyDelete
  6. మీ కవితలో కొత్తదనం కొంచెం కంప్యూజ్ ఉంది పద్మగారు

    ReplyDelete
  7. ఎవరూ ? ఎవరదీ ? ఏదో.....ఏదేదో.... తెచ్చి నా నెత్తిన రుద్దుతున్నారు ? ఓహ్ మీరా పద్మార్పిత గారూ ! హుమ్మ్ .... అయితే మీ ఆనందం అక్కడుంది అన్నమాట ! సర్లెస్తురూ.... ఏమయితేనేం ... పన్నీటి జల్లులు కురిశాయి .... ముత్యాలు దొర్లాయి ....... పారిజాతాలు విరిశాయి ...........

    ReplyDelete
    Replies
    1. అయినా ఈ ఆనందం అనేది ఓ శాడిష్టు పిల్లి లాంటిది అనుకోండి . దాని మొహం తగలెయ్య ! ఒక్కోల్లింట్లో ఒక్కో గూట్లో దాక్కుంటుంది . మీరు చాలా మంచోళ్ళు కనుక వంటింటి గూట్లో పిల్లుందోయ్ అని హెచ్చరించారు . కానీ మా ఇంట్లో పిల్లి అక్కడ లేదండి , వేరే చోట ఉంది .

      Delete
  8. గిట్ల అడ్రస్లు అదిగితే గెట్ల తల్లో

    ReplyDelete
  9. అనందం వెతికితే దొరకదు మనలోనే ఉందని అందంగా చెప్పారు

    ReplyDelete
  10. అంతగా నచ్చలేదు. ఏదో వెలితి

    ReplyDelete
  11. ఆనందమో ఆర్ద్రతో...ఏదైనా మీతో పంచుకున్న ప్రతీ అక్షరాన్ని సహృదయంతో స్వీకరిస్తున్న మీ అందరికీ శతకోటి వందనాలు.

    ReplyDelete
  12. వేదన వాక్యాలు

    ReplyDelete
  13. ఆనందం ఎక్కడ ఉందని నన్నడిగితే నేనిచ్చే చిరునామా.... padma4245.blogspot.com

    కవిత అందులోని మీ భావాల కలబోతలు... చిత్రం... అన్నీ ఆర్ద్రంగా (వేదనలోనూ అందంగా) ఉన్నాయి మేడం... సలాం!!

    ReplyDelete