కావాలి!

పగటిపలక పై దిద్దిన ఆశల అక్షరాలని
చీకట్లో తనివితీరగా తలచుకుని రోధించి
రాసుకోవడానికి కొన్ని రాత్రులు కావాలి!

పెనుగాలికి ఎగిరిపోయిన కోర్కెల రెక్కల్ని
ఏరి తీసుకొచ్చి అందంగా పేర్చి బ్రతకమని
బరోసా ఇచ్చే మృదువైన చేతులు కావాలి!

బురదలో దొర్లి పొర్లే ఆలోచనలని వడపోసి
మట్టికొట్టుకొని పోయిన మనసులను కడిగి
హత్తుకుని ముద్దాడే మనిషి తోడు కావాలి!

వానకురిసి రాలి నలిగిన జ్ఞాపకాల పూలని
పాడు పరిమళం అంటించుకోక కుప్ప చేసి
ఎత్తేసి శుభ్రపరిచే నిశ్చల నైపుణ్యం కావాలి!

నీరెండలాటి మాటలకు వ్యధల కన్నీరే ఎండి
ఆర్ద్రత తొణికిసలాడే అమృత స్పర్శగా మారి
మరో కొత్త జీవితానికి ఈ ఆశే ఊపిరి కావాలి!

22 comments:

  1. నిజమే...ఎవరిదైనా చేయూత కావాలి

    ReplyDelete
    Replies
    1. అమ్మ .... నాన్న .... ఆశ.... అంతే . ఇంకెవరూ ఉండరేమో .

      Delete
  2. పెనుగాలికి ఎగిరిపోయిన కోర్కెల రెక్కల్ని
    ఏరి తీసుకొచ్చి అందంగా పేర్చి బ్రతకమని
    బరోసా ఇచ్చే మృదువైన చేతులు కావాలి!
    ఎంత అందంగా చెప్పారండి.

    ReplyDelete
  3. నీరెండలాటి మాటలకు వ్యధల కన్నీరే ఎండి
    ఆర్ద్రత తొణికిసలాడే అమృత స్పర్శ కావాలి! సున్నిత పదజాలంతో మనసు తాకినాయి నీ భావాలు-హరినాధ్

    ReplyDelete
  4. కావాలి అంటే ఇవ్వాలి కదా ?

    ReplyDelete
  5. మనిషి అంటేనే ఆశాజీవి, ఆశ చచ్చిపోతే ఏముంది చెప్పండి.

    ReplyDelete
  6. రాసుకోవడానికి కొన్ని రాత్రులు కావాలి!
    మీరు వ్రాసేవన్నీ రాత్రులే అనుకుంటాను, ఇంక కావాలి అని అడగడం ఎందుకు. బాగుంది

    ReplyDelete
  7. கற்பனைச்சிறகுகள் இரவுகளில்தான் பறக்கத்தோன்றும்.
    மனிதமனம் குழம்பிய நிலையில் இருந்து மீளவும் சிந்தனையில்
    சிறக்கவும் சிதறும் மைத்துளிகள் சித்திரமாகவும் கவிதையாகவும்
    மிளிர்கிறது.வாழ்த்துக்கள்...

    ReplyDelete
  8. కావాలి అని ఏవో చిన్ని చిన్ని కోర్కెలు అడుగుతావు అనుకుంటే ఏకంగా జీవితానికి సరిపడే గొంతెమ్మ కోర్కెలు కోరితే ఎలా ;-)

    ReplyDelete
  9. బురదలో దొర్లి పొర్లే ఆలోచనలని వడపోసి, మట్టికొట్టుకొని పోయిన మనసులను కడిగి...చాలా చిక్కనైన భావం

    ReplyDelete
  10. మంచిగున్నది

    ReplyDelete
  11. ఇదేదో గేయంలా ఉందండి పద్మగారు. చివర్లో ఆశే ఊపిరి కావాలి అనడం బాగుంది

    ReplyDelete
  12. మీకు కావాలి అంటూ మాకేం కావాలో చెప్పారు. చిత్రం బాగుంది.

    ReplyDelete
  13. వానకురిసి రాలి నలిగిన జ్ఞాపకాల పూలని
    ఎత్తేసి శుభ్రపరిచే నిశ్చల నైపుణ్యం కావాలి! Super like

    ReplyDelete
  14. కష్టసుఖాలను పెనవేసుకుంటూ కాలాన్ని అల్లుకునే జ్ఞాపకాల తీగ మన జీవితం... పైకి ఎదగడం మాత్రమే గెలుపు అనుకోకూడదు. కిందికి వంగిన తీగలు ఫలాల్ని అందిస్తూ గెలుపుకన్నా అతీతమైనదాన్ని పొందగలుగుతారు. .
    కావాలి ... అంటూ ఒక చక్కని హృద్యుల్ల్లోచన కవితతో మీరు మాముందుకు వచ్చిన తీరు అద్భుతం మేడం...

    ReplyDelete
  15. నీరెండలాటి మాటలకు వ్యధల కన్నీరే ఎండి
    ఆర్ద్రత తొణికిసలాడే అమృత స్పర్శగా మారి,చాలా నచ్చింది

    ReplyDelete
  16. మీ అందరి అభిమానానికీ నమస్కారములు_/\_

    ReplyDelete
  17. మీరు కావాలన్నవన్నీ ఎక్కడ దొరుకుతాయి

    ReplyDelete