పొగడ్త

అబద్ధపు ప్రశంసలే అందరికీ ఆనందాన్ని ఇస్తాయి
పొగడ్తల్లో నిజాయితీ ఎప్పుడూ నీరుగారిపోతుంది..
గులాబీని నువ్వెంత సుకుమారివో అంటే అదేం గొప్ప
దానికి ఉన్న ముల్లుని అంటే అది మురిసిపోతుంది!!

చేయాలి అనుకున్నది చేయకుండానే ఎవరైనా పొగిడితే
అప్పుడు కలిగిన సంతోషంలో ఏం నిజాయితీ దాగుంది..
అయినా పొంగిపోయి సంబరపడి నవ్వడం అతిసహజం
కృత్రిమ ఆనందాన్ని ఇచ్చే ప్రశంసలే అందరికీ కావాలి!!

నిజం నిష్టూరపు నీడ అందుకే దానికి శత్రువులు జాస్తి
పొగిడితే మనలోని అహం అసంకల్పితంగా నర్తిస్తుంది..
ఉన్నది ఉన్నట్లుగా చెబితే చేతకానితనం అనిపించుకుని
ఓర్వలేనితనానికి ఇదొక ఒరవడని నింధించబడుతుంది!!

ఎవరు ఏమన్నా మనం స్పందించడంలోనే భేదముంది
అందుకే పొగిడితే పొంగిపోయి తిడితే కృంగిపోకంటుంది!!

29 comments:

  1. దారి తప్పినట్టుంది :)

    ReplyDelete
  2. ఆహా ఓహో అనలేం
    అలాగని ఛా ఛీ అనడం మహాపచారం
    మా చెడ్డ సంగ్ధిధంలో పడేసారు..హా హా

    ReplyDelete
  3. ఉన్నది ఉన్నట్లుగా చెబితే చేతకానితనం అనిపించుకుని
    ఓర్వలేనితనానికి ఇదొక ఒరవడని నింధించబడుతుంది!!

    ReplyDelete
  4. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైనది పొగడ్తే

    ReplyDelete
  5. కృత్రిమ ఆనందాన్ని ఇచ్చే ప్రశంసలే అందరికీ కావాలి!!
    నిజం చెప్పారు. పెయింటింగ్ గుడ్

    ReplyDelete
  6. అందరికీ ఆనందాన్ నిఇచ్చేవి పొగడ్తలే
    అటువంటి అప్పుడు అవి మంచివే కదాండీ

    ReplyDelete
  7. పొగరుని అణగార్చేలా
    గమ్మత్తుగా అనిపించేలా
    డాబు దర్పం తిరోగమించేలా
    తాత్కాలికమైన పదం ఈ పొగడ్త

    నిరాడంబరమైన అంబరం
    నిఃస్వార్థమైన పుడమి
    ఒకటి వానకు తడవనిది
    మరోకటి తన గుణం మార్చనిది

    ముక్కుసూటిగా చెబితే ముక్కు మీద కోపం
    పొగడ్త వలన క్షణికం ఆనందం మిగులు అనర్థం

    ~శ్రీ~

    ReplyDelete
  8. నేను నంది అంటే నంది అనాలి,
    నేను ఇదుగో పులి అంటే మీరు అదిగో తోక అనాలి -
    అందుకే కదా అధికారం అవసరం!
    పొగడ్త లోని మాధుర్యం కూడా అదే.

    ReplyDelete
  9. ఎవరు ఏమన్నా మనం స్పందించడంలోనే బేధముంది
    అందుకే పొగిడితే పొంగిపోయి తిడితే కృంగిపోకంటుంది!! ........ నిజం మేడం!! సలాం!...

    ReplyDelete
  10. సై అంటే సై అనాలి
    ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి

    ReplyDelete
  11. భలే బాగాచెప్పావు పద్మమ్మో
    పొగడ్త అనుకోమాకు తల్లో :)

    ReplyDelete

  12. పద్మార్పిత నీదు పదము
    బద్మాష్ లను తరిమితరిమి బడబడ గొట్టున్
    ఖిద్మాత్ చేయును; మరినీ
    గద్మాయింపు సెహభేషు గద పద్యార్థీ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. దుర్భిణీ వేసితిని
      ఎత్తి పోతల చేసితిని
      గద్మాయింపు కానక పోతిని
      తెలియ గోరు ఓ విద్యార్ధి ని ...

      ... (మైనస్ గద్మాయింపు)

      జేకే ...
      :-)

      Delete
  13. ''ఎవరు ఏమన్నా మనం స్పందించడంలోనే భేదముంది
    అందుకే పొగిడితే పొంగిపోయి తిడితే కృంగిపోకంటుంది!!'' ...

    ... ఇది మాత్రం ఖచ్చితంగా ఖాయం చేసుకుందామండి
    సుఖముగనే అలజడి లేక బ్రతుకుటకిదియే పరమార్ధమండి

    ReplyDelete
  14. నిజం చెప్పి భాధపెట్టడం ఎందుకని అబద్ధం చెప్పి సంతోషపెట్టడమే నయం. ఓ నాలుగు ప్రోత్సాహకరమైన మాటలు చెబితే పోయేది ఏముంటుంది, ఈ విధంగా ఆలోచించి పొగిడేవారు కూడా ఉంటారు పద్మార్పితా-చిత్రంలో చిన్ని పొగుడుతుందో లేక పాడుతుందో తెలియదు కాని బాగుంది-హరినాధ్

    ReplyDelete
  15. బులెట్స్ బులెట్స్....నేను పొగడను

    ReplyDelete
  16. Compliments always gives Inspiration.

    ReplyDelete
  17. Wah wah
    Kya bath hai
    Bahut badiya
    Shandar Chakas

    ReplyDelete
  18. నిజం నిష్టూరపు నీడ అందుకే దానికి శత్రువులు జాస్తి..అవును నిజం

    ReplyDelete
  19. పొగడకపోతే కుళ్ళుమోతు, ఓర్వలేనితనం అంటారు
    ఇది అక్షరాలా నిజం. చాలా బాగా చెప్పారు పద్మగారు

    ReplyDelete
  20. బాగుంది అని నిజంగా మెచ్చుకుంటే కూడా అది పొగడ్తే అంటారా మాడంజీ

    ReplyDelete
  21. గిసోంటి నీతులు సెప్పితే ఏమనాల్నో సమజ్ కాదు

    ReplyDelete
  22. గులాబీని నువ్వెంత సుకుమారివో అంటే అదేం గొప్ప
    దానికి ఉన్న ముల్లుని అంటే అది మురిసిపోతుంది!!

    ReplyDelete
  23. నిజం నిష్టూరపు నీడ అందుకే దానికి శత్రువులు జాస్తి..అవును

    ReplyDelete
  24. It's true
    very nice padma
    Keep rocking.

    ReplyDelete
  25. నచ్చినా నచ్చకపోయినా
    మెచ్చి పొగిడిని పొగడ్తలకు
    నమో:వందనములు_/\_
    :-) :-) :-) :-) ఇంత ఆనందాన్ని ఇచ్చిన పొగడ్తలు మంచివే కదా!

    ReplyDelete
  26. :) పొగడ్తతోనే ఆనందం కూడా అందుతుంది అందులో అతిశయోక్తి లేదు కానీ ఆ పొగడ్తలకు లొంగిపోయిన మనిషి ద్వేషి అవుతారు ...

    ReplyDelete
  27. :) పొగడ్తతోనే ఆనందం కూడా అందుతుంది అందులో అతిశయోక్తి లేదు కానీ ఆ పొగడ్తలకు లొంగిపోయిన మనిషి ద్వేషి అవుతారు ...

    ReplyDelete