కోమలి

చిలకపలుకులే పలికి చిత్రంగా మనసు దోచి
చీరకొంగట్టుకుని చుట్టూ చిన్నపిల్లాడిలా తిరిగి
చెప్పకుండా వచ్చేయి ఛల్ మోహనాంగి అంటే
నమ్మి నీతో వచ్చేసేటంత అమాకురాలిని కాను
లోకంపోకడ ఎంతో తెలిసిన చిన్నదాన్ని నేను!

మాయమాటలెన్నో చెప్పి మభ్యపెట్టాలని జూచి
మనసు ఇచ్చేసినాను అంటూ మరెక్కడో తాకి
మగబుధ్ధి చూపి మర్మమెంతో దాచి రమ్మంటే
మోసపోయేంత మెతక మనిషిని అసలే కాను
మసక మనసులెన్నో చదివిన మగువను నేను!

కల్లబొల్లి కబుర్లేవో చాకచక్యంగా చెప్పి కవ్వించి
కోరేది కామమే కాదంటూ కసిని కళ్ళలో దాచి
కావలసిన కార్యానికి ఇరుమనసులు సాక్షంటే
కపటం ఏదో తెలుసుకోలేనంత కబోదిని కాను
కాళికగా మారే కుసుమకోమల కాంతను నేను!

19 comments:

 1. Replies
  1. వాగుకు మార్గనిర్దేశం గావింపజాలరు..
   మనసులో భావాల ఒరవడికి ఆనకట్టలేనే లేదు..
   అనునిత్యం ప్రవహించే నిర్మల నది నిర్ఘరి..
   ఉరకలేసే నిండుకుండలా కృష్ణ గోదావరి..

   Delete
 2. అవసరం అనుకుంటే అవతారమెత్తక తప్పదు.
  కోమలి బహు చక్కగున్నది.

  ReplyDelete
 3. కోమలి సుకుమారి అనుకున్నాం,
  అమాయకురాలు కాదు అసాధ్యురాలు
  పెయింటింగ్ చాలా బాగుంది

  ReplyDelete
 4. మీరు అసామాన్యులు అని మాకు ఎప్పుడో తెలుసు :)

  ReplyDelete
 5. ఇంతకీ ఎవరికి ఈ అన్యోపదేశం అర్పితగారు, చిత్రం సూపర్, మొత్తానికి ఎవరికో పిడి ;-)ha ha

  ReplyDelete

 6. వారేవా క్యా బాత్ హై :)

  చీర్స్
  జిలేబి

  ReplyDelete

 7. చిలుకపలుకు చిత్రముతో
  కలువకనుల భామ జతగ కవితను చదివెన్
  జలతారు వలెనను ఊరెను
  సులభాతి సులభముగ మనసున తేనియలున్

  ReplyDelete
 8. బహుగడుసరి కోమలి :)

  ReplyDelete
 9. కల్లబొల్లి కబుర్లేవో చాకచక్యంగా చెప్పి కవ్వించి
  కోరేది కామమే కాదంటూ కసిని కళ్ళలో దాచి..మీకే చెల్లు వ్రాయడం.

  ReplyDelete
 10. కాళికగా మారే కుసుమ కోమలి ధైర్యవంతురాలే
  చిత్రం మనోహరం

  ReplyDelete
 11. మీ పదాల్లోని సున్నితత్వం ఇదే - ఘాటుగా చెప్పకుండా, అందంగా ఔరా! అనిపించేలా కొట్టకుండానే చెంప చెళ్ళు మనిపిస్తారు. చిలక పలుకులతో మీ పదాల అల్లిక చాలా బావుంది మేడం. మర్చిపోయాను; బొమ్మకూడా అద్భుతం.... సలాం!

  ReplyDelete
 12. చిలకపలుకులా ఇవి
  చెంప చెళ్ళుమనిపించారు

  ReplyDelete
 13. కోమలిని మోసగించడం అంత సులువైన పనికాదు ఎందుకంటే ఆమె మీరే/మీ కవితా నాయకి కదూ

  ReplyDelete
 14. ప్రతీ స్త్రీలోను ఇదే విధమైన ఆలోచన, తెలివితేటలు, చాకచక్యము ఉంటే మోసపోవడం అనేది జరుగదు, మోసగించాలి అనుకున్నా మోసం చేయలేరు. బొమ్మ భవ్యం-హరినాధ్

  ReplyDelete
 15. కోరేది కామమే కాదంటూ కసిని కళ్ళలో దాచి
  కావలసిన కార్యానికి ఇరుమనసులు సాక్షంటే
  నైపుణ్యంగా చెప్పారు

  ReplyDelete