తెలిపేదెలా!?

నువ్వు వస్తావని నేను ఎదురు చూసే ప్రతీక్షణం
ఒక యుగమై బాధించినప్పడు ఎంత బాగుంటుందో
అంతకు వేలరెట్లు తిరిగెళతావన్న తలపే మరీ బాధిస్తుంది
అందుకే తలచుకోరాదని తలచి మరింత తలచుకుంటాను
నిన్ను చూసి పొంగిపోరాదనుకుని చూడగానే ఎగిరి గెంతేస్తాను
లేని గంభీరత్వాన్ని ముఖానికి పులుకుని, నీ వైపు చూస్తే
సడలిపోతాను అనుకుంటూ పక్కకు తిరిగి నవ్వుకుంటాను
అది చూసి ఆనందం అనుకునే భ్రమలో నువ్వు ఉన్నప్పుడే...
నేను చెప్పాలనుకున్నవి చెప్పలేక మౌనానికి లిపి వెతుకుతాను
నువ్వేమో నిన్ను చూడక దిక్కులు చూస్తున్నానని అలుగుతావు
అదిగో సరిగ్గా అప్పుడే అనుకుంటాను...నేను మూగబోతేనేం
నీవు గుండె చప్పుడు వినలేని చెవిటివాడివి ఎప్పుడైనావని!
అంతలోనే నన్ను నేనే సరిపుచ్చుకుని,  సర్ది చెప్పుకుంటానిలా...
మనసుని చదివే మర ఏదో కనుగొంటే నీవు నా మనసు చదువుతావని
నీవు వలచావని తెలిపేది నా జ్ఞాపకాల నీడలకేనని తెలిసి నిట్టూరుస్తాను!

24 comments:

  1. fantastic
    heart touching
    excellent painting

    ReplyDelete
  2. మౌనానికి లిపి వెతుకుతాను

    ReplyDelete
  3. భాష రాక, మౌనానికి లిపి లేక మనసు తడిసినట్లుంది.

    ReplyDelete
  4. చాలా రోజులైంది మీ నుంచి మనసు తాకే భావనలు విని

    ReplyDelete
  5. మనసుకి మరోసారి దగ్గరగా

    ReplyDelete
  6. ನನ್ನು ನನ್ನುಗಾ ಚೂಪೇ ಅದ್ದಾನಿಕಿ..
    ಅದ್ದಾನಾ ಗೋಚರಿಂಚೇ ಪ್ರತಿಬಿಂಬಾನಿಕಿ..
    ನಿಶಿಧಿಲೋ ಜಾಬಿಲ್ಲಿ ವೆನ್ನೆಲಕು..
    ತೇಟತೆಲ್ಲನಿ ನಿಂಡು ಕಲುವಬಾಲಲಾ..
    ಎದುರುಚೂಪೂಲ ರಾಗಭಾವಮೇ ಕಾನವಚ್ಚೇನು ಕವಿತಾಸಾಂತಮುನಾ..

    ಬಹುಚಕ್ಕನಿ ರೀತಿಲೋ ರಚಿಂಚಾರು ಪದ್ಮಗಾರು..
    ಕಳ್ಳಕು ಕಟ್ಟಿನಟ್ಟು ಉಂದೆ ಕಾವ್ಯರೂಪಕಂ..

    ಕೆವ್ವು ಕೇಕಾ.. ಕನ್ನಡಿಗ ಭಾಷದಹುಳ್ಳಿ ತುಂಭ ಬಹಳ ಸಂತೋಷಾಯಿತು.. ಕವಿತ ಅತಿಸುಂದರ.. ಧನ್ಯವಾದಗಳು

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ గారు....ఒక్క ముక్క అర్థం అవ్వలేదు

      Delete
    2. నన్ను నన్నుగా చూపే అద్దానికి..
      అద్దాన గోచరించే ప్రతిబింబానికి..
      నిశిధిలో జాబిల్లి వెన్నెలకు..
      తేటతెల్లని నిండు కలువబాలలా..
      ఎదురుచూపూల రాగభావమే కానవచ్చే కవితాసాంతమునా..

      బహుచక్కని రీతిలో రచించారు పద్మగారు..
      కళ్ళకు కట్టినట్టు ఉంది కావ్యరూపకం..

      కెవ్వు కేకా.. కన్నడ భాషలో.. చాలా సంతోషం.. కవిత బాగుంది.. ధన్యవాదాలు

      Delete
  7. మీరే తెలిపేదెలా అంతే నేనేం తెలుపను

    ReplyDelete
    Replies
    1. నిన్న ఆ కామెంట్ రాసినపుడు తెలుగులో కూడా రాశాను ఆకాంక్ష గారు.. కాకపోతే టూ టైమ్స్ రీఫ్రెష్ కొట్టి డేటా ఆఫ్ చేశాను.. పొద్దున చూస్తె ఆ తెలుగు వెర్షన్ గాయబ్..మీ కామెంట్ ఉంది.. అందుకే మరల కామెంటాను.. నాకు కన్నడ రాదు ఆకాంక్షగారు.. తెలుగు మాత్రమే.. కాకపోతే రెండు బ్రాహ్మి స్క్రిప్ట్స్ కదా అని అలా రాశాను.. క్షంతవ్యుణ్ణి.. ఈ సారినుండి తెలుగులోనే వ్యాఖ్యానిస్తాను.. శుభోదయం..

      Delete
    2. Sometimes, the emotions are so high, that one can never find suitable words that can convey it.. The Episode of Waiting for Someone So Dear, Instills a Feel of Security (75%) as well as Insecurity (25%), as both emotions are reflections of each other, I have tried to use the word Mirror.

      Happiness Blooms as the Early Morning Flowers which are wet and cool with the morning dew and a warm ambience welcomes with the beams of sun that shine..

      Good Morning Akanksha Gaaru and
      Good Morning Padma Gaaru..

      Delete
  8. తలచుకోరాదని తలచి మరింత తలచుకుంటాను,wonderful wordings

    ReplyDelete
  9. nicely narrated heart touching lines.

    ReplyDelete
  10. లేని గంభీరత్వాన్ని ముఖానికి పులుకుని, నీ వైపు చూస్తే
    సడలిపోతాను అనుకుంటూ...సున్నిత భావం చాలా నచ్చిందండి

    ReplyDelete
  11. పద్మార్పితగారు మీరు ఎప్పుడూ ఆడవాళ్ళే సున్నిత మనసు ఉన్నవారు, జెంట్స్ అంతా మోసగాళ్ళు అని వారికి ప్రేమించే హృదయం ఉన్న కఠినాత్ములుగా చిత్రీకరిస్తారని మీ పై అభియోగ...నిజమేనా

    ReplyDelete
  12. చిత్రాన్ని పొగిడేదా
    కవితని ప్రశంసించేదా

    ReplyDelete
  13. తెలుపవలసింది అంతా తెలిపి ఇంకెలా అని అడగనేల అర్పితా

    ReplyDelete
  14. ఎదురు చూపుల్లోని ఎదభారాన్ని ఎంతో అందంగా చిత్రించారు...భళారే భళ

    ReplyDelete
  15. నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా.....పాట వింటున్నంత మధురంగా ఉంది మీ కవిత మరియు చిత్రం

    ReplyDelete
  16. చాలా అద్భుతమైన హృదయావిష్కరణ. రియాలిస్టిక్ గ ఉన్నాయండి మీ భావాలు. డిఫరెంట్ గా ట్రై చేసినా మీ మార్కు భావుకత్వం ఎక్కడా మిస్సవలేదు మేడం.... సలాం!

    ReplyDelete
  17. కన్నా కూణ్ కుఁ రచకో కేని మాలమ్ ఛేని.. ఏకిన ఆచ్ లాగో జకో అజ్జేకిన ఆచ్ లాగ్ణు కేన్ ఛేని.. జేర్ జేనజ్.. కత్రాకతోయి ఆచ్ మనక్యాన కన్నాయి ఆచో వేని కసన్ కో హను..జన్నా తాణి ఏకిర్ వాసు వాట్ దేకేరజ్


    ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు.. ఒకరికి నచ్చింది వేరోకరికి నచ్చాలని లేదు.. ఎవరికి వారే.. ఎంతయినా మంచి మనషులకి మంచి జరగదంటారు ఎందుకో మరి.. అప్పటివరకు తప్పదు నిరీక్షణ

    ReplyDelete
  18. అయ్యో! పాపం పసివాడు...

    ReplyDelete
  19. మీ అందరి అత్మీయ స్పందనలకు ధన్యవాదములు. _/\_

    ReplyDelete