నువ్వుంటే


కొత్త ఆశలే మొలకెత్తేను నీవు నా చెంతనుంటే
గ్రీష్మమే గురితప్పి వసంతమాడేను నువ్వుంటే

జీవితంలో కోరినవేవి పొందలేదన్న వ్యధలుంటే
అవీ మది నుండి మాసిపోతానన్నాయి నీవుంటే

నీవు లేనప్పుడు పరామర్శించి పలికేవాళ్ళకంటే
కోటికి పైగానే కుళ్ళుకుంటారు నువ్వు నాతో ఉంటే

లోకమే కపట కలహాల నడుమ కల్లోలమైయుంటే
కలలు కవాటాలనే తెరిచాయి నీ కౌగిలిలో నేనుంటే

వాయిద్యాలు వినసొంపుగా మ్రోగుతామని కబురెట్టే
మనిద్దరి గళాలు ఒకటై యుగళగీతమే పాడుతుంటే

16 comments:

 1. లోకం తీరు ఎలా ఉంటుందో ఎండగట్టారు పద్మగారు..
  "ఒక నువ్వు ఒక నేను" అంటు సాగిన కవిత్వం ఎంతో భావగర్భతంగా బాగుంది అనే కంటే కంటతడి తెప్పించింది.. సున్నితంగా సునాయాసగా పదును తగ్గని మీ కవితాకుసుమానికీ నమః సుమాంజలి..

  ఎండలు ముప్పైకి తగ్గనంటున్నాయి
  వడగాలుల సమయం ఇదేనంటున్నాయి

  సంతోషం దుఃఖం జీవితం లో భాగమంటున్నాయి
  నిట్టుర్పుల సెగ తాకనీకుండా చలో భాగ్ భాగ్ అంటున్నాయి

  మాటలు భావాలకు అందనంటున్నాయి
  భావాల ఒరవడిలో కొట్టుకుంటున్నాయి

  కన్నులు ఆనందానికీ అశృవులంటున్నాయి
  కారడవంటి కటిక చీకటిలో వెన్నెలకై చూస్తుంటామంటున్నాయి

  ~శ్రీ~

  ReplyDelete
 2. గ్రీష్మమే గురితప్పి వసంతమాడే
  మీ అక్షర విన్యాసానికి మది పులకించె

  ReplyDelete
 3. పాత పద్మ కవితలు వికసించె మరల

  ReplyDelete
 4. very nice didi
  Arpita-bhayya's daughter name

  ReplyDelete
 5. ప్రేమైకజీవులు

  ReplyDelete
 6. మంచి అనే పదం మాటకు మాత్రమే మిగిలిపోయింది పద్మ మ్యాడమ్.. ఈ కాలం లో కూడా మంచి కోసం పరితపించటమంటే నడి వేసవి మిట్ట మద్యాహ్నం ఎండల్లో చెప్పులు లేకుండా నడవటమే..


  ~శ్రీ~

  గరుడగమన శ్రీ లక్ష్మీ వేంకట నరసింహ

  ReplyDelete
 7. ఎంత మధురమైన భావాలు.... నువ్వుంటే అంటూ మా అందర్నీ మీ కవితాసాగరంలో ముంచెత్తారు... సలాం... మేడం !

  ReplyDelete
  Replies
  1. నేను పంపిన పద్యం చూసారా
   పోస్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నాను.

   Delete
 8. నువ్వుంటే వేరే ప్రపంచం ఎందుకు అంటారా?

  ReplyDelete
 9. లోకమే కపట కలహాల నడుమ కల్లోలమైయుంటే
  కలలు కవాటాలనే తెరిచాయి నీ కౌగిలిలో..అందమైన భావన

  ReplyDelete
 10. గ్రీష్మమే గురితప్పి వసంతమాడేను నువ్వుంటే-నాకు భలేబాగా నచ్చేసింది

  ReplyDelete
 11. ప్రేమతో నువ్వుంటే

  ReplyDelete
 12. మీ అత్మీయ స్పందనలకు అభివందనం _/\_

  ReplyDelete
 13. గ్రీష్మమే గురితప్పి వసంతమాడే 100 likes

  ReplyDelete