వ్యసనాల వీరుడు



ఆజానుబాహుడు అందగాడు నాకే సొంతమని
అరవైఎకరాల ఆసామి అనుకుని మురిసిపోతే
మురిసినంతసేపు లేకపోయెను ఆ మురిపెం..
పదినెలల పేకాటతో ముగిసింది ఆ సంబరం!!


రైస్ మిల్లు, రొయ్యల చెరువులున్న రిచ్ మ్యానని
ఆకాశానికి రెక్కలు కట్టుకుని రివ్వున ఎగిరిగెంతితే
ఎగిరిందే తడవుగా ఎత్తికుదేస్తివి కుయ్యో మొర్రో..
గుర్రప్పందాల్లో గుట్టుకాపురం రట్టు చేసినావయ్యో!!
 

ఏడంతస్తుల అద్దాలమేడలోని ప్రతీఅద్దంలో నేనని
సొగసు చూడతరమా అన్నావని నీ సొంతమైపోతే
కన్నుకొట్టి పిలిచిన ప్రతి ఆడదాని పక్కలో చేరి..
ఏడాదికొక అంతస్తు ఎయిడ్స్ రోగానికి ఖర్చుచేస్తివి!!


కండలున్న మగాడినని మీసం మెలేసి నాకేమని
మద్యంలో మునిగి మనిషివే మృగంగా మారిపోతే
వ్యసనాలతో విర్రవీగిన కావరమంతా ఆస్తిలా కరిగి..
చివరికి అస్తిపంజరంగా మారి మట్టిలో కొట్టికుపోతివి!

25 comments:

  1. వ్యసనాల వీరుడు చివరికి పతనం అయ్యాడు..అయ్యో పాపం
    well narrated padmagaru

    ReplyDelete
  2. అయ్యో పాపం ఆ'సామి'.. పేక'ముక్క'లాయేనా..!వ్యసనాల బారినా కడు చీకటాయేనా.. అంది అందకుండా గుట'కాయ' స్వాహాయేనా 'కష్టం' గుర్రపు కాళ్ళతో తానా తందానా చేసెనా.. అద్దాలన్ని పెళుసుబారి తునాతునకలయ్యి పాదాలకే మానని గాయం చేసేనా ఏడంతస్తులు పోయి ఏడుపే మిగిలేనా..ఆస్తంత మదుపాలు ఆయే అస్తి నేలపాలాయి బుగ్గిపాలాయే చివరకు ఆత్మఘోషాయే..

    నిలువుదోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది.. ఎంతో పుణ్యం దక్కేది.. చక్కరపొంగలి చిక్కేది.. అయయో చేతిలో డబ్బులంటు సాగే కులగోత్రాలనే సినిమాలో పాట కి. శే. రమణరెడ్డి గారి నటన గుర్తుకొచ్చింది పద్మగారు మీ కవిత చదివాకా.. ఆ సినిమా వచ్చినపుడు నేను పుట్టలేదనుకోండి..!

    ~శ్రీ~

    ReplyDelete
  3. నిజమే మీరు చెప్పినట్లు వ్యసనాలకి బానిసలై జీవితాలని నాశనం చేసుకుంటున్నవారు ఎందరో.

    ReplyDelete
  4. ఎంతటి హీరో అయినా జీరో అవ్వక మానడు అని తెగేసి చెప్పారు. ఎంచుకున్న అంశం చక్కని సందేశాన్ని ఇచ్చింది. అభినందనలు పద్మార్పిత.

    ReplyDelete
  5. గిట్ల తిట్టి పరేషాన్ జేయకు పద్దమ్మ తల్లో :-)

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. నాకెందుకో శ్రీశ్రీ "హసనానికి రాణివి నీవై వ్యసనానికి బానిస నేనై" గుర్తుకు వచ్చింది :)

    Reposting due to typo, sorry!

    ReplyDelete
  8. కన్నుకొట్టి పిలిచిన ప్రతి ఆడదాని పక్కలో చేరి..
    ఏడాదికొక అంతస్తు ఎయిడ్స్ రోగానికి ఖర్చుచేస్తివి..మీరు మాత్రమే వ్రాయగల పచ్చి నిజాలు,వ్యసనాలపై మీరు సంధించిన అస్త్రాలు అమోఘం...కుడోస్ పద్మార్పితగారు

    ReplyDelete
  9. శరాలు విసిరిన తీరు బాగుందండి

    ReplyDelete

  10. వేదనలోను వేడుకలోను మీలా అందరూ నవ్వుతూ గడపలేక వ్యసనాలకి లోనౌతారు

    ReplyDelete
  11. వారెవ్వా క్యా బాదుడు హై :)

    గిట్లా పరేషాన్ జేసిన పోరగాడు ఎవడు ? చెప్పాలె !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎవలు చెప్పాలె? ముందుగల ఈ ముచ్చట తేలాలె

      Delete
  12. వ్యసనాపరులు కోకొల్లలు
    ఎవరెవరిని మార్చగలరు

    ReplyDelete
  13. ప్రతి పదంలోనూ పస నింపి రాయాలనే ప్రతిన బూనారా మేడం గారూ... అద్భుతంగా ఉంది. సమాజాన్ని ప్రతిబింబించేలా గొప్పగా ఉంది మీ కవిత్వం... సలాం!

    ReplyDelete
  14. సోగ్గాడే కావాలని పట్టుబట్టి పెళ్లి చేస్కుంటే ఇలానే ఉంటుంది మరి ... :-P

    ReplyDelete
  15. ఏ వ్యసనం లేకుండా జీవించడం కూడా కష్టమే కదా!
    ఇంతకు చిత్రానికి కవితకు పొంతన నాకు అర్థం కాలేదు

    ReplyDelete
  16. ఇన్ని వ్యసనాలు ఉన్న ఆ ఉత్తమోత్తముడు ఎవరండీ

    ReplyDelete
  17. సకల కళాకోవిధుడు☺

    ReplyDelete
  18. వాలంటైన్ వీక్ ఒక జబర్దస్త్ ప్ర్రేమ కవిత రాయండి అర్పితగారు

    ReplyDelete
  19. అంతా మగవారిని ఆడిపోసుకునే వారే అయితే ఏం చేస్తాం

    ReplyDelete
  20. మద్యంలో మునిగి మనిషివే మృగంగా మారిపోతే
    వ్యసనాలతో విర్రవీగిన కావరమంతా ఆస్తిలా కరిగి..true

    ReplyDelete
  21. వ్యసనానికి బానిసలు ఎందరో

    ReplyDelete