అన్నీ నీవే

జీర్ణకోశానికే జిహ్వరుచులు చూపించి
కిడ్నీలని కవ్వించి కితకితలు తెప్పించి 
పెద్దప్రేగులని ప్రేమబంధాలతో పెనవేసి
నరాల్లో నడుస్తూ నన్ను నాకే దూరంచేసి
చిన్నప్రేగుల నిండా చిలిపిచేష్టలు దూర్పి
ఉదరకోశానికే ఊపిరి తీసుకోవడం నేర్పి
కాలయంకి కావల్సినవి కడుప్రియంగా ఇచ్చి
ఎముకల మధ్య ఉన్న ఎడబాడునే ఏమార్చి
అన్నవాహికకు అనుబంధంతో ఆకలి తీర్చి
వెన్నుపూసకి బాసచేసి బలాన్ని సమకూర్చి
గ్రంధులన్నింటిలో రసికతనే నింపి రంజింపజేసి
స్వరపేటిక మౌనం వీడి నీ పేరునే జపించగా...

మెదడు మాత్రం కాదని అంటే ఒరిగేది ఏమిటని
గుండెల్లో నీవుంటే గుర్తురాకపోవడానికేముంది!
నా అవయవాలన్నీ నీ అధీనంలో ఆడుతుండగా
ప్రేమించానని చెప్పవలసిన అవసరమేముంది!?

24 comments:

  1. Happy Valentine’s Day

    ReplyDelete
  2. పదమారపిత గారో.. గిసుంటి కైతల్ చుడనికి మంచిగుంటయి.. రాయనికి చేతుల్ వణుకుతయి..
    మాటలకందని పదాలుంటే.. పదాలకందని భావం ఉంటే..

    తోతితాంతుల తూల్యుని తేజోమయ స్వలూపం.. ప్లత్యచ్ఛనాలాయనుని పుత్తినలోజు నేదు..
    రథసప్తమి శుభాకాంక్షలు మీకు పద్మగారు

    ReplyDelete
    Replies
    1. జీర్ణకోశానికి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్
      కిడ్నీలకి రీనల్ కాల్క్యులై
      పెద్దప్రేగులకి డైవర్టికులమ్
      నరాల్లో ఎపిలెప్టిక్ సిండ్రోమ్
      చిన్నప్రేగుకు ఇస్కిమియ
      ఉదరకోశానికి పెప్టిక్ అల్సర్
      కాలేయానికి హెపాటోబిలియరి డిస్ఫంక్షన్
      ఎముకలకి ఆస్టియోపోరోసిస్
      అన్నవాహికకు ఈసోఫాజియల్ స్ఫింక్టర్ డిజార్డర్
      వెన్నుపూసకి లంబార్ డిస్లోకేషన్
      గ్రంధులన్నింటిలో గ్లాండులార్ మాల్ఫంక్షన్
      స్వరపేటికకు వోకల్ డీజెనెరెషన్ అఫేజియా
      మెదడుకి మెనింజైటిస్ గుండెకి మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని డాక్టర్లు చెప్పగా విన్నాను మ్యాడమ్.. ఇదుగొండి మొట్టమొదటిసారి ఇలా మెడికల్ అనాలజి తో అనాటమి హిస్టోపాథాలజి ఫార్మకోకైనెటిక్స్ కలగల్పిన కవిత చుస్తున్నా.. !

      Delete
    2. మీ కవిత స్ఫూర్తికి అభివందనాలు

      Delete
    3. ఏదైన పోరపాటుగా రాస్తే మన్నించండి పద్మగారు

      Delete
    4. శ్రీధర్ గారు మెడికల్ డిక్షనరీ మొత్తం తిరగేసినట్లున్నారు...భళారే భళ :-) దేన్నైనా కవితా వస్తువుగా తీసుకుని ప్రేమను జోడించడం పద్మార్పితకు బటర్ తో పెట్టిన విద్య. కాదంటారా!

      Delete
    5. అయ్యో.. లేదండి ఆకాంక్షగారు.. అవన్ని ఆయా అవయవాలు సక్రమంగా పనిచేయకపోతే వాటికి వచ్చే రోగాలు..
      ఈ మద్య ఎక్కడ చూసినా కల్తిలే.. అమ్మ ఆప్యాయత నాన్న వాత్సల్యత మరియు నిరాడంబరమైన స్నేహం తప్ప..

      Delete
    6. కుయజేపంక్షిరీని లాతంఅ రీమ
      లాచేందింని నేర్పుతీ చ్చేమిలకా
      కిరిససేచూ చ్చివ గిరితి వ్వును
      లాయేపోగిఆ సశ్వానా గాంనమౌ

      మొఏ దోంయిమఏ
      లాకునుకుయేరోదని టుపారవలక
      లాలక నమైతడిగుని లోపపాటింక
      నాలగయదా ల్నిపుచు హఇ తోళ్ళన్నీక నుడేంని తాంలసిదో

      Delete
  3. అణువు అణువులో అన్ని అవయవయవాల్లో అనురాగమే/ ఇంతకు మించి ఏమి వద్దులే ప్రియా ప్రియా...

    ReplyDelete
  4. ప్రేమించడానికి అవయవాలైతేనేం అక్షరాలైతేనేం
    మొత్తానికి అంతా ప్రేమమయం అని చెప్పారు. పిక్ తో పూర్తిగా పడేసారు మీ ప్రేమలో...

    ReplyDelete
  5. ప్రేమ భావాన్ని బాగా పండించారు పద్మగారు

    ReplyDelete
  6. ప్రేమికులరోజు శుభాకాంక్షలు

    ReplyDelete
  7. ఓ ఈసారి అవయవాలని కాన్సెప్ట్గా తీసుకుని కవిత వ్రాసారా. బాగుంది అని రొటీన్గా ఏం చెప్పను పద్మా

    ReplyDelete
  8. అవయవాలతో అంతగా రక్తి కట్టించలేకపోయారు ప్రేమని. అయాం సారీ, చిత్రం ఎప్పటిలాగే బాగుంది.

    ReplyDelete
  9. ప్రేమ ప్రతి అవయవాన్నీ తాకి పరవశింపజేసింది అనడంలో అతిశయోక్తి లేదేమో.. ఈ కవిత చదువుతుంటే.... చాలా కాలం తర్వాత ఇలాంటి కవిత.. సలాం మేడం! యేది ఏమైనా ... ఈ సారి ఎక్కువ మార్కులు చిత్రానికే...

    ReplyDelete
  10. మెదడు మాత్రం కాదని అంటే ఒరిగేది ఏమిటని
    గుండెల్లో నీవుంటే గుర్తురాకపోవడానికేముంది!super

    ReplyDelete
  11. మీ అణువణువూ నిండిన ప్రియసఖుడు ఎవరో...

    ReplyDelete
  12. వెన్నుపూసకి బాసచేసి బలాన్ని సమకూర్చి
    గ్రంధులన్నింటిలో రసికతనే నింపి రంజింపజేసి..నిజమా :)

    ReplyDelete
  13. నాకు బాధ కలిగితే భోరున ఏడవడమే తెలుసు.. ఎందుకంటే దానివల్ల మనసు కుదుట పడటమే కాకా బాధ తేలికపడుతుంది

    ReplyDelete
  14. అన్ని అవయవాలకీ ప్రేమని పంచడం తెలుసునని మీ ఈ పోస్ట్ వల్ల తెలిసింది. ఫోటోలోని అమ్మాయి కళ్ళు ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రియుడెవరో కాని పఠాల్ ఢమాల్ అన్నమాట.

    ReplyDelete
    Replies
    1. అయ్యో ఆకాంక్షగారు..
      పఠాల్ ఢమాల్ కాదండి..
      బుడుగు కి కోపం ఒస్తది..
      సిగానపెసునాంబ సిగ పడితే గోపాలానికి జాటర్ ఢమాల్..

      *సిగానపెసునాంబ: శ్రీజ్ఞానప్రసూనాంబ

      Delete
  15. మీ అప్యాయ స్పందనలకు ధన్యవాదములు _/\_

    ReplyDelete