కట్టుబొట్టు కుదురుగా లేకపోతేనేం
కుదురైన కోమలాంగిని నేనురోయ్!
కబుర్లే చెప్పి కళ్ళతో కవ్విస్తానే కాని
కుళ్ళుకుతంత్రాలు నేనెరుగనురోయ్!
అడవికాచిన అందాలు ఆరబోస్తేనేం
అరమరికల్లేని అమాయకురాలినోయ్!
నేను నవ్వుతూ నవ్విస్తుంటానే కాని
నడవడికలో నటించడం నాకు రాదోయ్!
ఆత్మాభిమానం ఉంది, ఆస్తి లేకపోతేనేం
అట్లాంటి ఇట్లాంటి ఆడదాన్ని కానురోయ్!
జీవితపాఠాలు చదివి అక్షరాలు దిద్దా కాని
అబద్ధాలాడి అపోహగ్రంధాలు రాయనోయ్!
నీతినియమాలే నా బలం, ఏదైతే నాకేం
నిజాయితీగా నచ్చినట్లు బ్రతుకుతానోయ్!
బడాబాబులు, బద్మాషోళ్ళు ఎవరైతేనేం
వెకిలివేషాలేస్తే బండకేసి బాదుతానురోయ్!
హా హా భలే చెప్పారండోయ్
ReplyDeleteనిజాయితీగా నచ్చినట్లు బ్రతుకుతానోయ్
I am on safe zone mam.
ReplyDeleteఏంటి అప్పుడే కవ్వించి అంతలోనే కసురుకోవడం భావ్యమా పద్మ :-)
ReplyDeleteగాంయమయోఅ డింకడచూ
ReplyDeleteమిఏ లోయారా కాలీతే లాఇ టుకిటుఅ నుశారా రుగా తర్పిద్మాప..
అక్షరాలన్ని చిందరవందరగా ఐపోయినాయి..! భళే ఉతికారేసింది మీ కవితాశరాలు
అయోమయంగా చూడకండి
Deleteఏమి రాయాలో తేలీకా ఇలా అటుకిటు రాశాను గారు పద్మార్పిత..
న్నిలరాక్షఅ గారదంవరదంచి యినాయిపోఐ..! ళేభ దింసిరేకాతిఉ మీ లురాశతావిక
ఎవరిని తల్లీ ఉతుకుతావు.
ReplyDeleteఉతికి ఆరేసారు...
ReplyDeleteఇంతకు ఎవరిని
నీతినియమాలే నా బలం, ఏదైతే నాకేం
ReplyDeleteనిజాయితీగా నచ్చినట్లు బ్రతుకుతానోయ్!..సద్గుణాలు
Namaste padma madam
ReplyDeleteBaga rastunaru. Konasagandi
చెప్పవలసింది చెప్పారు
ReplyDeleteజీవితపాఠాలు చదివి అక్షరాలు దిద్దా కాని
ReplyDeleteఅబద్ధాలాడి అపోహగ్రంధాలు రాయనోయ్..ఇలాంటి వాక్యాలు మీకే చెల్లు
mam so beautiful pic with strong wordings.
ReplyDeleteమీ స్వగతమో లేక హెచ్చరికో తెలియదు కానీ చగా ఆవిష్కరించారు. చిత్రం కూడా చక్కగా నప్పింది
ReplyDeleteనడవడికలో నటించడం నాకు రాదోయ్
ReplyDeleteఎంత అందంగా వ్రాస్తారు మాడం
కవిత సాంతం ఒక అద్భుతం... కవితకు తగ్గ చక్కని చిత్రం! ఇలా ఉతుకుతాను అని చెప్పి అందరి బెండు తీస్తారన్నమాట.... సలాం! మీ సబలైక భావాలకు!!
ReplyDeleteమీ భావలహరి అమోఘం
ReplyDeleteఇన్నీ మంచి గుణాలు ఉంటే వద్దన్నా వెంటపడతారు..జరభధ్రం మీరు హ హా హా
ReplyDeleteమీ మాటలే కాదు చిత్రాలు కూడా తూటాలై దూసుకెళతాయి గుండెల్లోకి.
ReplyDeleteఉతికి ఆరేస్తారా లేక వదిలేస్తారా :-)
ReplyDeleteExcellent pic selection..CONGRATULATIONS
స్త్రీ శక్తి అంటే ఇదే ఇదే..
ReplyDeleteఅప్పుడే ప్రేమ చూపించి
అవసరానికి ఆదిశక్తిగా మారితుంది
ఓహో బాదుడు అంటే ఇలాగా, అయితే ఇంకేం బాదండీ బద్మాష్ గాళ్ళని. చిత్రానికి నూటికి నూరు మార్కులు పద్మార్పిత-హరినాధ్
ReplyDeleteజీవితపాఠాలు చదివి అక్షరాలు దిద్దా కాని
ReplyDeleteఅబద్ధాలాడి అపోహగ్రంధాలు రాయనోయ్
బడాబాబులు, బద్మాషోళ్ళు ఎవరైతేనేం
నిజాయితీగా నచ్చినట్లు బ్రతుకుతానోయ్!EXCELLENT
rebel poetess you are.
ReplyDeleteఈ భంగిమలో ఉతికించుకుంటే భలే మజా.... :)
ReplyDeleteఅందరి అత్మీయతకు అభివందనములు. _/\_
ReplyDelete