ఏం జీవితం!?

ఎంత అందంగా చెప్పారు ఎవరో..
దాహంగా ఉంది, నీటిలో విషం కల్సింది
తాగినా చస్తారు తాగక పోయినా చస్తారు!
ఇదే తంతు జీవితాంతం సాగుతూనే ఉంది
పరిష్కరించుకునే కొద్ది మరిన్ని సమస్యలే
నిదుర పూర్తిగా పట్టదు, కలలు నిజం కావు


కాలం కాస్త ఓపిక పట్టమంటుంది..
సహనం ఇంకెంత సమయం అనడుగుతుంది
ఉదయం లేచింది మొదలు ఉరుకులుపరుగులు!
విశ్రాంతి కోసం వెతుకులాట విశ్రాంతి లేకుండా
నైపుణ్యం నడివీధుల్లో నర్తిస్తుంటే..
అదృష్టం అందమైన భవనాల్లో హాయిగా ఉంది!


అందుకే నీ పై అన్నీ అభియోగాలే జీవితమా

అయినా మౌనంగానే సాగిపోతుంటాను..
ఎందుకంటే...ఇది కూడా లేని వాళ్ళు ఎందరో! 

30 comments:

  1. ఏం జీవితం ఏమిటి
    ఎందరికో ఇదే జీవితం

    ReplyDelete
  2. పద్మార్పిత గారు,

    Marvellous ! who can beat these lines !

    నైపుణ్యం నడివీధుల్లో నర్తిస్తుంటే..
    అదృష్టం అందమైన భవనాల్లో హాయిగా ఉంది!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  3. ఎంత అద్భుతమైన మాటలు... జీవితం నిండా కలలే... ఎన్ని కలలు ఉంటె అంత నిదురకు దూరం. కాలానికి సహనానికి సరైన భేదాలు చెప్తూ ఇలా విధితో మీ కథానాయకి సహజీవనం చేయడం బావుందండీ... సలాం!

    ReplyDelete
  4. జీవితాన్ని నిండుగా చదివినట్లుంది కవిత

    ReplyDelete
  5. విశ్రాంతి కోసం వెతుకులాట విశ్రాంతి లేకుండా..బాగుంది

    ReplyDelete
  6. ఎవరి జీవితం ఎప్పుడూ ఎవ్వరికీ నచ్చినట్లు ఉండదు, అలాగని ఏ ఆశయాలు లేకుండా సర్దుకు పొమ్మని చెబితే సాగిపోవడం కష్టమే కాదు దుర్లభం. చాలా చక్కగా విభిన్న రీతిలో చెప్పావు. అభినందనలు అర్పిత-హరినాథ్

    ReplyDelete
  7. నైపుణ్యం నడివీధుల్లో నర్తిస్తుంటే..
    అదృష్టం అందమైన భవనాల్లో హాయిగా ఉంది
    ఇదే తంతు జీవితాంతం సాగుతూనే ఉంది
    పరిష్కరించుకునే కొద్ది మరిన్ని సమస్యలే
    మీ ఈ కవిత మీ శైలికి కాస్త భిన్నంగా ఉందండోయ్ :-)

    ReplyDelete
  8. అది తెల్వకనే పరేషాన్... హా హా హా

    ReplyDelete
  9. ఏం జీవితం
    పాడు జీవితం
    మూడునాళ్ళ ముచ్చట

    ReplyDelete
  10. పరిష్కరించుకునే కొద్ది మరిన్ని సమస్యలే
    నిదుర పూర్తిగా పట్టదు, కలలు నిజం కావు...నిజం నిజం

    ReplyDelete
  11. అందుకే నీ పై అన్నీ అభియోగాలే జీవితమా
    అయినా మౌనంగానే సాగిపోతుంటాను...
    beautiful expression ...


    మేడం గారు...
    హృదయ పూర్వక
    నూతన సంవత్సర శుభాకాంక్షలు ...
    మీకూ - మీ కుటుంబానికి ...

    ReplyDelete
  12. పరిష్కరించుకునే కొద్ది మరిన్ని సమస్యలే..ఏం జీవితమో ఏమో

    ReplyDelete
  13. ఎవరో చెప్పిన విషయాన్ని మరింత అందంగా చెప్పడం మీకే చెల్లింది పద్మా

    ReplyDelete
  14. నైపుణ్యం నడివీధుల్లో నర్తిస్తుంటే..
    అదృష్టం అందమైన భవనాల్లో హాయిగా ఉంది!
    Great and true lines mam

    ReplyDelete
  15. ఇది కూడా లేని వాళ్ళు ఎందరో!total compromise in single line. well said

    ReplyDelete
  16. గమనించండి: ఒక్కొక్కసారి మనం అసహనానికి గురైనపుడు అకారణంగానే కోపాన్ని ఎదుటివారిపై ప్రదర్శిస్తు ఉంటాం.. కాని మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. క్షణికావేశం వలన ఎదుటివారి మనసునే కాదు పరోక్షంగా ఎవరి మనసును వారే గాయపర్చుకుంటుంటాం. కోపం మరునిమిషమే నిన్ను అధః పాతాళానికి అణగార్చి నిష్క్రమిస్తుంది.. కాని అంతలోనే జరగరాని నష్టం జరిగిపోతుంది.. మనిషిగా మన విలువ ఎదుటివారిని గౌరవించడం వలన మెరుగుపడుతుంది.. మంచిని అలవర్చుకుంటే కనిసం ఏ ఒకరి మదిలోనైనా ఓ చిరుజ్ఞాపకంగా మిగిలి ఉంటాం..

    అదే జీవితానికి సార్థకత

    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. గమనిక:- అంటూ జీవితం గురించి వివరించారు ఏం శ్రీధర్ గారు

      Delete
    2. ఏమో ఆకాంక్ష గారు.. ఈజీ టు మింగిల్ డిఫికల్ట్ టు అండర్ స్టాండ్ ఇజ్ హోప్ ఫుల్లి ది రియల్ డెఫినిషన్ యాండ్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్.. ఒక్కోసారి మనసు కకావికలం ఔతే వచ్చే ఉద్విగ్నతకు తార్కాణం ఇలాంటి కవితలు.. లేకుంటే నేనెపుడు కాస్తో కుస్తో సరదాగానే ఉంటాను.. హ్యాపి న్యు ఇయర్ ఇపుడు చెప్తున్నాను తొమ్మిది రోజుల పిమ్మట

      Delete
  17. ఏమైనా బ్రతుకుతూ సాగవల్సిందే జీవితం

    ReplyDelete
  18. పద్మగారు జీవితం గురించి రాస్తూ స్త్రీ చిత్రాన్ని పెట్టడంలో ఆంతర్యం ఏమిటో వివరిస్తారా ;)

    ReplyDelete
    Replies
    1. జీవితమంటే జాణ కదా...నెరజాణ !

      Delete
    2. నయనిగారు మీరు చిత్రం గురించి అడగవలసింది సతీష్ కొత్తురిగారిని, హ హా హా

      Delete
  19. దీనమ్మ జీవితం .... అనబడు ఈ షార్ట్ ఫిలిం చూడుడి...
    https://www.youtube.com/watch?v=_t83-QwBY-w

    ReplyDelete
    Replies
    1. ఔ మల్లా.. మీ మోబైల్ నంబర్ స్పెల్లింగ్.. నాకు తెరియాద్..
      గక్కణేమో గిట్లనే ఉంది..
      చాయా గిళాసు ని సీడీ ట్రేలా పెట్టిండు..
      కాప్ స్మాల్ గలిపి ఒత్తిండు..
      మార్కర్ తో క్లిక్ క్లిక్ రాసిండు..
      గంతే మల్ల.. గిసోంటివి జరుగుతుంటాయనట్టు

      వారి మస్తు పరేశాని చేసిండు.. భేజా ఫ్రై..
      వినోద్ గారు.. నవ్వాలో ఎడ్వాలో ఎరికైతలే..
      షార్ట్ ఫిలిం పార్

      Delete
  20. ఛా కొత్త సంవత్సరం ఉషారు పుట్టిస్తారు అనుకుంటే....ఇదేమిటి ఇలా నిరుత్సాహ పరిచారు.

    ReplyDelete
    Replies
    1. తదా.. ఆచాంఛా గారు.. మలే.. భలె భలే
      2016:
      felice anno nuovo duemila sedici

      Delete
  21. "కాలం కాస్త ఓపిక పట్టమంటుంది..
    సహనం ఇంకెంత సమయం అనడుగుతుంది
    ఉదయం లేచింది మొదలు ఉరుకులుపరుగులు!
    విశ్రాంతి కోసం వెతుకులాట విశ్రాంతి లేకుండా"

    ఎద్దనవలె మొద్దనవలె
    తాగుబోతనవలె కావరమనవలె
    ఇంతకన్న గొప్ప కవిత్వం
    చెప్పగలనన్న కవిని
    అహంకారి యనవలె
    సాధురే సాధు సాధు హసాదు బల్ పసండు పద్మార్పితా?!

    ReplyDelete
  22. అందరి అక్షరాభిమానానికి నమస్కారములు_/\_

    ReplyDelete
  23. This comment has been removed by the author.

    ReplyDelete
  24. This comment has been removed by the author.

    ReplyDelete