అలంకరణ


నీలిమబ్బుల వంటి కలల సామ్రాజ్యంలో
అరవిరిసిన విహంగాలు ఊహా సౌధాలు..
చంద్రుడు మబ్బుల మాటున నక్కెననో
తారలు షికారుకెళ్ళి ఇంకా తిరిగి రాలేదనో
వంకలు కొన్ని వెతికి రేయిని పొడిగించరాదా
ఊహలతో మరిన్ని ఊసులు చెప్పనీయరాదా!
మేఘమా! చంద్రుడ్ని మాయచేసి ఒడిసిపట్టి
వెన్నెలనే దోచి కలల కలువల్ని విప్పారనిచ్చి
అంబరాన్ని అవనితో సంధిచేసి సంబరపడరాదా!
ఎగసే సాగరకెరటాల వంటి భావ అలజడులలో
హత్తుకున్న కోర్కెల్లేవు, కొట్టుకుపోయినవీ లేవు
స్థిర సంకల్పానికి నిర్ధిష్టమైన రూపం ఒకటిచ్చి
పట్టుదలని పరిచయం చేసి ప్రణయంగా మార్చి
అంధకారానికి వెలుగుతో పరిణయం చేయరాదా
గమ్యాన్ని సరిగమ సరాగాలతో శింగారించరాదా!

24 comments:

  1. Nice feel.
    Happy new year in advance.

    ReplyDelete
  2. అంధకారానికి వెలుగుతో పరిణయం సూపర్

    ReplyDelete
  3. ఎన్నెన్నో వర్ణాలు అంటూ చాలా భావాలను పలికించారు' కొద్దిరోజులు నెట్వర్కి దూరంగా ఉండి మిస్ అయ్యాను. మీకు హ్యాపీ న్యూ ఇయర్

    ReplyDelete
  4. వెన్నెలనే దోచి కలల కలువల్ని విప్పారనిచ్చి
    అంబరాన్ని అవనితో సంధిచేసి సంబరపడరాదా... మనసుని తాకింది

    ReplyDelete
  5. Wish you happy new year

    ReplyDelete
  6. నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  7. స్థిర సంకల్పానికి నిర్ధిష్టమైన రూపం ఒకటిచ్చి
    పట్టుదలని పరిచయం చేసి ప్రణయంగా మార్చి
    అంధకారానికి వెలుగుతో పరిణయం చేయరాదా
    గమ్యాన్ని సరిగమ సరాగాలతో శింగారించరాదా!

    "మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !"

    ReplyDelete
  8. అంధకారానికి వెలుగుతో పరిణయం ....అంబరానికి అవనితో సంధి ...wow nice thought

    ReplyDelete
  9. Madam super.
    Happy new year wishes to you.

    ReplyDelete
  10. అలంకరణ బాగుంది.
    నూతన సంవత్సరం మరిన్ని కవితలతో అలరించాలని కోరుకుంటూ...

    ReplyDelete
  11. Last lines are excellent mam.

    ReplyDelete
  12. పట్టుదలని పరిచయం చేసి ప్రణయంగా మార్చి
    అంధకారానికి వెలుగుతో పరిణయం చేయడం అధ్భుతమైన ఆలోచన

    ReplyDelete
  13. Beautiful pic. New year wishes didi

    ReplyDelete
  14. వంకలు కొన్ని వెతికి రేయిని పొడిగించరాదా
    ఊహలతో మరిన్ని ఊసులు చెప్పనీయరాదా!:)

    ReplyDelete
  15. చక్కని కవితతో పాత సంవత్సరానికి మంచి ముగింపు పలికారు... నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మేడం... సలాం టు యువర్ పోయెట్రీ... 2016 లో మరిన్ని భావమాలికలతో ముందుకు సాగాలని ఆశిస్తూ సదా మీ శ్రేయష్షు కోరుకునే ఓ అభిమాని....

    ReplyDelete
  16. అరవిరిసిన విహంగాలు ఊహా సౌధాలు..
    చంద్రుడు మబ్బుల మాటున నక్కెననో
    తారలు షికారుకెళ్ళి ఇంకా తిరిగి రాలేదనో
    వంకలు కొన్ని వెతికి రేయిని పొడిగించరాదా..మరిన్ని క్రొత్త కవితలతో మెప్పించండి

    ReplyDelete
  17. అలంకరణలో భావాలు అందంగా అగుపడుతున్నాయి

    ReplyDelete
  18. అరవిరిసిన విహంగాలు ఊహా సౌధాలు..ఇవి ఎప్పటికీ నిజం కావు

    ReplyDelete
  19. అంధకారానికి వెలుగుతో పరిణయం చేయరాదా
    గమ్యాన్ని సరిగమ సరాగాలతో శింగారించరాదా!cool lines

    ReplyDelete
  20. రాదా...రాదా... ఓ రాదా...!!! :)))

    ReplyDelete
    Replies
    1. రాదు విష్వకసేనవర్య.. రానే రాదు.. :))))

      Delete