చిటికె వేస్తే వస్తానన్న చలి...
చిందులు వేసుకుంటూ వచ్చి
దుప్పట్లో దూరి ఈలవేసి గోలచేస్తూ
ఏదేదో చెప్పి ఏమార్చకు అంటుంది!
బధ్దకాన్ని బావాని పిలిచి...
ఒక్కసారి కన్నుగీటిన పాపానికి
ఒళ్లంతా తడిమేసి వదలలేనంటూ
బ్రతిమిలాడేకొద్దీ మరీ బెట్టుచేస్తుంది!
ఏదో విధంగా సర్ది చెప్పాలని...
సరసమాడ సమయమే కాదంటే
కురుల వెనుక మోమునే దాచుకుని
పగటిని చూపి రేయిగా మారినానంది!
వెచ్చదనాన్ని ముద్దుగా ఇచ్చి...
చిన్నగా గిల్లినా సన్నగా జారుకోబోతే
రేయిరెప్పల్లో దాచకు వేడి ఉద్రేకాలనని
రాత్రికి వేసే రాజీమంత్రమేదో తెలుసునంది!
చిందులు వేసుకుంటూ వచ్చి
దుప్పట్లో దూరి ఈలవేసి గోలచేస్తూ
ఏదేదో చెప్పి ఏమార్చకు అంటుంది!
బధ్దకాన్ని బావాని పిలిచి...
ఒక్కసారి కన్నుగీటిన పాపానికి
ఒళ్లంతా తడిమేసి వదలలేనంటూ
బ్రతిమిలాడేకొద్దీ మరీ బెట్టుచేస్తుంది!
ఏదో విధంగా సర్ది చెప్పాలని...
సరసమాడ సమయమే కాదంటే
కురుల వెనుక మోమునే దాచుకుని
పగటిని చూపి రేయిగా మారినానంది!
వెచ్చదనాన్ని ముద్దుగా ఇచ్చి...
చిన్నగా గిల్లినా సన్నగా జారుకోబోతే
రేయిరెప్పల్లో దాచకు వేడి ఉద్రేకాలనని
రాత్రికి వేసే రాజీమంత్రమేదో తెలుసునంది!
నిజంగా చలిగాడేనా ఇంత పని చేసింది పద్మగారు? :)
ReplyDelete"రాత్రి రాజీమంత్రం" బాగుంది పద్మాజీ
ReplyDeleteఇంతకీ తెలిసింది ఎవరికి?
తెలిపింది ఎవరికి? ha haa
ha ha ha nice nice
ReplyDeleteచలిగాలి కొట్టిందో
ReplyDeleteబద్దకం కమ్మిదో
చిన్నది గిలిగింత పెడుతున్నది :-)
బధ్దకాన్ని బావాని పిలిచి...ఇలా పిలిచి రెచ్చగొడితే ఊరుకుంటుందా చెప్పండి
ReplyDeleteరేయిరెప్పల్లో దాచకు వేడి ఉద్రేకాలనని
ReplyDeleteరాత్రికి వేసే రాజీమంత్రమేదో తెలుసునంది
తెలిసింది ఏమిటో చెబితే నేర్చుకుంటాం మేడం :)
Very nice didi
ReplyDeleteగిట్ల పరేషాన్ చేయకు తల్లీ..
ReplyDeleteఇంతకు చలి చంపిందా లేక బధ్ధకం మిమ్మల్ని విడవను అని చెప్పిందా? కంప్యూజ్ కంప్యూజ్..పెయింటింగ్ బాగుంది.
ReplyDeleteఒక్కసారి బ్రతిమిలాడితే అంతేనండి బధ్ధకం మనల్ని విడిచి వెళ్లను అంటుంది. చలికాలంలో సంగతి సరే సరి :-)
ReplyDeleteమీరు ఇలాంటివి వ్రాయడంలో సిధ్ధహస్తులు
ReplyDeleteబధ్దకాన్ని బావాని పిలిచి...
ReplyDeleteఒక్కసారి కన్నుగీటిన పాపానికి
ఒళ్లంతా తడిమేసి వదలలేనంటూ
బ్రతిమిలాడేకొద్దీ మరీ బెట్టుచేస్తుంది..భలే భలే :-)
చలిగాడంటే అంతే మరి... చెలిచెంత చేరి తడిమేస్తాడు...ఆసాంతం వణికిస్తాడు. వెచ్చని కౌగిలి ఇచ్చే వరకు వదలడంతే. దుప్పట్లో దూరిన చలిగాడికి... చనువు మరీ ఎక్కువ. అసలే సిగ్గే లేదు మరి.
ReplyDeleteఎంత వద్దన్నా బిగుసుకుపోయేంత చనువు. చలిచెలి మధ్య గిలిగిలి రాపిడి వెచ్చని గిచ్చుళ్లు... అబ్బో... అనుభవిస్తేనే కదా ఆ హాయి. ఏజ్ యూజువల్గా చిత్రం అదుర్స్. ఆ చిత్రంలో కోమలాంగి క్రీగంటి చూపులకి... చూస్తే చలిగాడికే కాదు చెలికాడికీ గిలి తప్పదుగా... మొత్తానికి కౌ'గిలి' దుప్పటి కప్పుకునేలా చేశారు..... సూపర్.
అల్లరి చేస్తూ చలి గిలిగింతలు పెడుతుంది
ReplyDeleteచలి చేసే చిలిపి చేష్టలు బాగున్నాయండి.
ReplyDeleteక్యూట్ పోయెం...
ReplyDeleteMerry Christmas
ReplyDeleteచలికాలపు గిలిగింత బాగుంది
ReplyDeleteస్పందనలు తెలియజేసిన అందరికీ అభివందనములు_/\_
ReplyDelete