గెలిపించేయ్..

అక్షరాలని అలవోకగా నీవు తాకి
అందమైన కవితకు జీవంపోసేయి
నా పెదాలని నీ పెదవులతో తాకి
ప్రేమకావ్యానికి అమరత్వమీయి!

వయసు పరిమితి లేదని చెరిపివేసి
ప్రణయానికి వేసిన పగ్గాలు తెంపేయి
సంబంధమే లేని బంధమని చెప్పేసి
జన్మజన్మల బంధానికి ఊపిరిపోయి!

ప్రేమిస్తే చూసేది మనసునేనని చెప్పి
ప్రేమసంప్రదాయపు సాంద్రత పెంచేయి
విచారంగా ఉంది ఒంటరి వెన్నెల విచ్చి
మువ్వోలె నవ్వుతూ చెంతకి వచ్చేయి!

నచ్చిందేదీ నాకెన్నడూ సొంతంకాలేదు
నీవు నా సొంతమై విధిరాతనే మార్చేయి
ఓటమే తప్ప గెలుపు నన్ను వరించలేదు
నీ మదిని నీవోడి నా ప్రేమని
గెలిపించేయి!

29 comments:

  1. మౌనగీతాల మాటునా ఏవో భావాలు
    మూగభావాల మాటునా ఏవో పదాలు
    పలుకలేని పదాల మాటునా ఏవో భావోద్వేగాలు
    తెలుపలేని భావోద్వేగాల మాటునా ఏవో కన్నీళ్ళు
    రాలే కన్నీటిబొట్టు మాటున ఏవో నవ్వులు

    మంచి భావుకత కలబోసిన కావ్యం రచించారు పద్మగారు

    ReplyDelete
  2. మల్లెపూలన్నీ కోసుకొని పోతోంది
    సన్నజాజులన్నీ ఎత్తుకొని పోతోంది
    సంపెంగ పూలన్నీ ఏరుకొని పోతోంది
    మాలలెన్నో కట్టి ఆ తల్లి మెడలో వేస్తోంది
    దేవులపల్లి గ్రామంలో గురజాడ వీధిలో
    రాయప్రోలు వారి పక్కింటి పిల్ల

    కొలనులో కలువలన్నీ తీసుకుని పోతోంది
    ఆవుపాలన్నీ పిండుకొని పోతోంది
    ఏటి ఒడ్డున ముత్యాలన్నీ ఏరుకొని పోతోంది
    పూజలెన్నో సేయ ఆ తల్లి గుడిలో......
    ఆత్రేయ అపార్ట్ మెంట్స్ వేటూరి బ్లాక్
    సిరివెన్నెల వారి ఎదురు ఫ్లాట్ పిల్ల

    చూపించినోళ్ళకి చంద్రహారం చేయిస్తా
    పట్టి తెచ్చిన వాళ్లకి పది లక్షలిస్తా
    జాయ్ అలుక్కాస్ షాప్ అంతా రాసిస్తా ....

    ReplyDelete
    Replies
    1. హా హా బాగుంది

      Delete
    2. ఎట్టెట్టా అన్నీ ఒక్కరికే రాసిస్తారా...మరి మిగతావారి మాటో హా హా హా

      Delete
    3. మల్లెల , సన్నజాజి కుసుమాలను బోలిన మాటలల్లి _ ఆ
      తల్లికి తెల్గు భారతికి దండలు గూర్చిన , గుమ్మ పాల లా
      గుల్లము వెచ్చనైన పలుకుల్ వెలయించిన పాయసాన్నముల్
      అల్లన బెట్టగా కవిత లల్ల నికెవ్వరు ? పద్మగారెగా !

      Delete
  3. వయసు పరిమితి లేదని చెరిపివేసి
    ప్రణయానికి వేసిన పగ్గాలు తెంపేయి..

    ReplyDelete
  4. అందమైన కవితకు జీవంపోసేయి
    నా పెదాలని నీ పెదవులతో తాకి..ఆల్రెడీ ప్రేమకావ్యాలు రాస్తున్నారు :-)

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. ప్రేమ అమరమైనది అని అంటుంటే విన్నాను, కొందరు రాయగా చదివాను. నిజానికి ప్రేమ అమరత్వాన్ని పొందాలంటే ఆ అపురూపమైన ప్రేమకు అక్షర రూపాన్ని ఇవ్వాలి. ఇది 100% ప్రాక్టికల్. “ప్రేమకావ్యానికి అమరత్వమీయి!” ప్రేమ కావ్యానికి అమరత్వాన్ని ఇవ్వమని కోరుతూ తన కవితలలోని అక్షరాలను స్పృశించి జీవం పోయమని ప్రేమికుడికి పెదాలు అందివ్వడం ...వహ్... ఎంతటి రసమయ మధుర భావన! ఇలాంటి అందమైన భావాన్ని మరింత అందంగా అక్షరీకరించడంలో మీకు మీరే సాటి.
    మూడవ స్టాంజాలో మీరు రాసిన ‘’ ప్రేమసంప్రదాయపు సాంద్రత పెంచేయి’’ అన్న వాక్యం అద్వితీయంగా ఉంది.
    ఇంత సులువైన పదాలతో ఎంతో గొప్ప భావాన్ని వ్యక్తపరచడం నిజంగా అద్భుతం.
    ఎంత పట్టు ఉన్నప్పటికీ ఎవరి మదిని వారె ఓడిపోవడం అన్నది ప్రేమలోని మాయాజాలం. ఈ సూత్రం ప్రకారం ఈ కవితలోని ప్రియుడు ప్రియురాలిని 100% గెలుపుబాటలో నడిపిస్తున్నాడు...//
    ఈ కవిత ఇప్పటిదాకా మీరు రాసిన అన్నిటికన్నా భిన్నమైనది. ఎందులో అటువంటి భిన్నత్వాన్ని ఆపాదించుకుందో అసలు మొదట్లో అర్థం కాలేదు. చాలా సార్లు చదవాలని ప్రయత్నించాను. కానీ కవితను మొత్తంగా ఒకసారే చదవలేకపోయాను. ప్రతి లైన్ రెండు అంతకంటే ఎక్కువ సార్లు నాచే చదివిన్చబడ్డాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే చదువుతున్న పంక్తి నన్ను కట్టి పడేసి మరో లైన్ చదవడానికి వీలు లేకుండా చేస్తోంది. ఇప్పుడర్థమైంది ఈ కవిత ఎందుకు అన్ని కవితల కన్నా భిన్నమో. ప్రతి పదం ఒక బంధమై రస ప్రతిబంధకమై ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ఇందులో అతిశయోక్తి లేదు. సలాం!!

    ReplyDelete
  7. ప్రతి పంక్తీ ప్రేమమయం

    ReplyDelete
  8. నైస్ పిక్ అండ్ లవ్లీ ఫీల్

    ReplyDelete
  9. anintiki minchinadi love...feel it enjoy it.

    ReplyDelete
  10. ప్రేమభావంతో సాగిపో, గెలుపు నీదే-హరినాధ్

    ReplyDelete
  11. భావుకత్వతో నిగూఢ ప్రేమని తెలిపారు కవితలో. చిత్రం నచ్చింది

    ReplyDelete
  12. సంబంధమే లేని బంధమని చెప్పేసి జన్మజన్మల బంధానికి ఊపిరిపోయి!ఏ సంబంధము లేని బంధం జన్మజన్మల బంధం అవుతుంది అదే ప్రేమబంధం

    ReplyDelete
  13. నీ మదిని నీవోడి నా ప్రేమని గెలిపించేయి...మధురబావన

    ReplyDelete
  14. ప్రేమను ప్రేమే గెలిపిస్తుందని మీరే చెప్పినట్లు జ్ఞాపకం :-)

    ReplyDelete
  15. Lovely poem and picture madam

    ReplyDelete
  16. ప్రేమకు ఓటమి లేదు..గెలుపు పై గెలుపు తప్ప

    ReplyDelete
  17. నా పెదాలని నీ పెదవులతో తాకి
    ప్రేమకావ్యానికి అమరత్వమీయి!Lovely feel

    ReplyDelete
  18. నచ్చిందేదీ నాకెన్నడూ సొంతంకాలేదు
    నీవు నా సొంతమై విధిరాతనే మార్చేయి
    ఓటమే తప్ప గెలుపు నన్ను వరించలేదు
    నీ మదిని నీవోడి నా ప్రేమని గెలిపించేయి
    చివరి నాలుగులైన్స్ వద్దనే హృదయం నలిగింది

    ReplyDelete
  19. "ప్రేమసంప్రదాయపు సాంద్రత పెంచేయి" కొత్తగా ఉంది. బాగుంది

    ReplyDelete
  20. గెలిపించక చస్తారా
    ప్రేమించాక తప్పదు

    ReplyDelete
    Replies
    1. గెలిపించే చాన్స్ మనమెక్కడ ఇస్తామండీ,వాళ్ళని గెలిపించడానికి మనం,మనల్ని గెలిపించడానికి వాళ్ళూ పోరాడుతూనే ఉంటాము.ఇదొక తొక్కలో ప్రేమ !

      Delete
    2. అయ్యయ్యో నీహారిక గారూ , ఆయనెవరో చెప్పినట్టు ప్రేమ పాచిపోయిన పాయసం లాంటిదండి . అది త్యాగాన్ని కోరుతుంది . అందుకేనేమో వాళ్లెవళ్ళనో గెలిపించాలని మీరు , మిమ్మల్ని గెలిపించాలని వాళ్ళు పోరాడుతూ , మీరూ వాళ్ళూ కూడా తొక్కలే తింటే , పళ్లన్నీ తమ తియ్యదనాన్ని పద్మార్పిత గారి కవితలకి ఇచ్చేస్తున్నట్టున్నాయి . ఇక మిగిలిన కొద్దిపాటి తియ్యదనాన్నయినా మన మీఠీ మీఠీ జిలేబీ గారు తెస్తారేమో చూడాలి . రాక కోసం నిలువెల్ల కనులై ... ఈ Venkat వేచేనులే ..... జీ లే బీ ....

      Delete
  21. ప్రతి పంక్తిలోనూ రక్తి కలిగించెను అనురక్తి

    ReplyDelete
  22. అందరికీ ధన్యవాదములు

    ReplyDelete
  23. భలే! ఇదే అర్థంలో నాకిష్టమయిన పాట ఒకటి వుంది. విని చూడండి వీలైతే : https://www.youtube.com/watch?v=0o5W2RrYwOk

    ~లలిత

    ReplyDelete