సాధన

అమ్మ ఆప్యాయంగా కలిపి పెట్టిన అన్నం ముద్ద
ఉడకని అన్నం హాస్టల్లో అరగనప్పుడు గుర్తుకొచ్చే..
ఆమె ఒడిలో గారాలుపోతూ విననన్న మాటలు
గోడపై బల్లి అరిస్తే అమ్మా అంటూ అరవాలనిపించె!

నిద్రపుచ్చుతూ నాన్న చెప్పిన ఎన్నో నీతిపాఠాలు
అర్థంకాని పాఠాలు మెదడ్ని అరగదీస్తే అర్థమయ్యే..
నాన్న ఆశయం తీర్చాలన్న తపన తరుముతుంటే
కష్టపడి శ్రధ్ధగా చదివి సాధించాలన్న పట్టుదలపెరిగె! 

అదేపనిగా చదువుతుంటే చెల్లితో ఆడుకున్న ఆటలు
అలసిపోతివా అక్కా అని అమాయకంగా వెక్కిరించె..
సెలవలివ్వని కాలేజీని కాల్చేయాలి అనుకున్నప్పుడు
ఉద్యోగనికై అన్నయ్య పడుతున్న పాట్లు జ్ఞాపకమొచ్చె!

విరామం లేక విసుగు చెందిన తనువు విశ్రాంతి కోర
స్నేహితులే దరి చేరి సినిమాకి చెక్కేద్దామని సైగ చేసె..
ధృఢసంకల్పమే దూతై వచ్చి గమ్యానికి దారి ఎక్కడన
సాధనతో సాధ్యం కానిది ఏదంటూ నన్ను నే ప్రశ్నించె!

(హాస్టల్స్ లో అహర్నిశలు చదువు చదువు అంటూ నలిగిపోతున్న ఇంటర్ విద్యార్ధులకు అంకితం )

24 comments:

  1. ప్రస్తుత చదువుల పరిస్థితి...ఎంచుకున్న సబ్జెక్ట్ బాగుంది

    ReplyDelete
  2. పరిష్కారం చెప్పండి పద్మగారు

    ReplyDelete
  3. సర్కారు బడిజెప్పు సార్లకు పట్టదు

    చేతి నిండ రియలెస్టేటు వల్ల

    పర్యవేక్షకులకు పట్టదు పనితీరు

    విద్యానిధులు బొక్కు విధుల వల్ల

    పాఠశాలల బాగు పట్టదు నేతకు

    కార్పొరేటు బడుల కలిమి వల్ల

    బిడ్డల చదువులు పెద్దవారెరుగరు

    జీవన పోరాట స్థితుల వల్ల


    వెరసి - గ్రామీణ బడులలో వెలయు చదువు

    చిత్తశుధ్ధికి దూరమై చిత్రమైన

    తీరు తెన్నుల భాసించు తీరు చూడ

    చదువు మృగ్యము సర్కారు ‘సాగు’ బడుల .


    కొడుకు జదివించు కొనుటకు కూలి చేయు

    తల్లికి తనయ చేదోడు తప్పదయ్యె

    చదువు సర్కారు బడులలో చక్కనైన

    కార్పొ’ రేటు ’ బడుల కేగు కర్మ తొలగు .

    ReplyDelete
    Replies
    1. కార్పొరేటు భలే గ్రేటు

      Delete
  4. సాధనతో సమకూరు సిరులు...మీదైన శైలిలో చక్కగా వ్యక్తపరిచారు నేటి హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లల మనోభావాలని

    ReplyDelete
  5. కార్పొరేటు చదువులా మజాకానా..

    ReplyDelete
  6. విద్యను ఆర్జించేవారికన్నా ఇలా నలిగిపోయేవారే ఎక్కువ.
    బాగా వ్రాశారు.

    ReplyDelete
  7. అందరికీ ర్యాంకులు రావాలనన్న ఆరాటమే తప్ప వీరి గోడు వినేవారు లేరు పాపం :(

    ReplyDelete
  8. బండెడు పుస్తకాలు , గాడిద మోతలు , నాసి రకం ఆహారం , అమ్మా నాన్న ల మీద బెంగ , కాలేజీని తగలబెట్టా లన్నంత ఆవేశం , చెల్లి జ్ఞాపకం , లక్ష్యం సాధించాలన్న కృత నిశ్చయం .... ఆ పసిమనసు అంతర్మధనాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు మేడం , ఆ పసిదాని ఆవేదనలో ప్రతి అక్షరం నిష్టుర సత్యం . హేట్స్ ఆఫ్ . కుడోస్ .

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది అక్షరాలా నిజం వెంకట్ గారు. నేటి కార్పొరేట్ చదువుల్లో నలిగి ఎన్ని యువహృదయాలు సతమతం అవుతున్నాయో-హరినాధ్

      Delete
    2. మీ పిల్లలు తప్పక హాస్టల్లో చదువుతున్నట్లున్నరు. యాం ఐ రైట్ ;)

      Delete
  9. నేటివిటీకి దగ్గరగా ఉంది మీ కవిత. పెయింటింగ్ అధ్భుతంగా అతికినట్లు ఉంది.

    ReplyDelete
  10. అన్నీ నిజాలే

    ReplyDelete
  11. చదువు చెప్పే ఇన్స్టిట్యూట్స్ షూట్ చేసి పడేయాలి అన్నంత కోపం వస్తుంది

    ReplyDelete
  12. పద్మా ఏ హాస్టల్ అమ్మాయి దేహంలోకి పరకాయప్రవేశం చేసావో తెలీదు, చాలా చక్కగా వర్ణించావు. చిత్రం కూడా నప్పింది-హరినాధ్

    ReplyDelete
  13. ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. ఇలా దూరమైనప్పుడే అమ్మ అనురాగం అందరి విలువలు తెలుస్తాయి. హాస్టల్ లో ఉండి చదువుకున్నవారికి అక్కడి నుండి ఇంటికి వచ్చిన తరువాత అన్నివిలువలూ తెలుస్తాయి. ఇది ఒక స్టేజ్.

    ReplyDelete
  14. మంచి భవిష్యత్తుకు బంగారుబాట హాస్టల్లో చదువుకున్న పిల్లలు మంచి క్రమశిక్షణ , నడవడిక కలిగి ఉంటారని నాకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయం పద్మ., కొన్ని పొందాలి అంటే కొన్ని కోల్పోక తప్పదు.

    ReplyDelete
  15. విరామం లేక విసుగు చెందిన తనువు విశ్రాంతి కోర
    స్నేహితులే దరి చేరి సినిమాకి చెక్కేద్దామని సైగ చేసె..ఇట్స్ మై బెస్ట్ చాయిస్ :)

    ReplyDelete
  16. ఈ పోటీ ప్రపంచంలో ఫీలింగ్స్ ఎవరికి కావాలి
    ఏదో విధంగా ర్యాంకులు రావాలి..

    ReplyDelete
  17. Padma I think this is not your subject:-) anyway good attempt

    ReplyDelete
  18. Mee Kavithalu chala bavuntai,hrudayanni takutai,
    Istamunna chota kastam vundadu,
    Istapadi chadivithe kastam telidu,
    artham aina chaduvu mana bavishyathuku batalu vestundi,
    artham kani chaduvu mana burraku baramautundi...

    ReplyDelete
  19. సాధన చేయకుండా అన్నీ సులభతరంగా కావాలి అనుకోవడన్ కూడా అవివేకమే. కష్టేఫలే.

    ReplyDelete
  20. I 2 have same feelings on hostels, nice painting.

    ReplyDelete
  21. మీ అందరి స్ఫూర్తిస్పందనలకు వందనములు_/\_

    ReplyDelete