అన్ని రోజులు ఒకేలా ఉండవులే అనుకుని
పాడైన హృదయాన్ని పీకి పడేయడం రాక
నడుస్తున్న బాటలో కొత్త అర్థాలే వెతుకుతూ
నూతనోదయానికి నాణ్యమైన నాంది వేసున్నా!
ఫలించని స్వప్నాలే విలువనెరిగి పరావర్తించి
సఫలీకృతం అవ్వాలని అదృష్టాన్నే నమ్ముకోక
పట్టుదలతో నాకు నేనే ప్రేరణగా మారి నడుస్తూ
పిల్లకాలువ సాగరం చేరదని నదిని వెతుక్కున్నా!
శిల్పం కూడా ఒకప్పటి రాయేనని తెలుసుకుని
అల్పజ్ఞానంతో మట్టిలో మాణిక్యానికి వెలకట్టలేక
మండే సూర్యుడూ మంచే చేయునని నవ్వుతూ
ఆలోచనాసక్తికి కాస్త యుక్తి చేర్చి అడుగేస్తున్నా!
ఒడిదుడుకాటుపోట్లు, పొరపాట్లు సాధారణమని
పోరాడ్డమే పని అనుకుని ప్రతిఫలం ఏం ఆశించక
అలుపన్నాదే లేకుండా నిశ్శబ్ధంగా యుద్ధం చేస్తూ
విజయంవరించి చేసే శబ్ధానికై ఎదురుచూస్తున్నా!
కవితాసాంతానికి ప్రత్యుత్తర వ్యాఖ్యానించటానికి పదాలు వెతుకుతున్నా
ReplyDeleteనిన్న మొన్నటి అక్షరాలకే భావాలను వెలికి తీయగా ఉలితో చెక్కి పదును పెడుతున్నా
జీవితం అక్షర సత్యమో భావ మిథ్యో తెలియక సతమతమగుచున్నా..
నూతనోధ్యాయమనె పదకావ్యము బహుచక్కని రీతిలో ఆవిష్కృతం చేశారు పద్మగారు..!
బహుభాషా ప్రావీణ్యులు మీకు మాటలకి కొదవా :-)
DeleteSame feel Sridharji :-) tappavu manaku E tippalu
DeleteAnthenantaaraa Aakaaksha gaaru.. Sare.. Chesedemundikaa.. Hari Rama Govinda :-)
Deleteమరో పదమూడూ నిమిషాల్లో నూతన వసంతంలో అడుగిడుతున్న పద్మగారికి జన్మదిన శుభాభినందనలు
Delete~శ్రీ~
ReplyDeleteవిజయ దుందుభి మారు మ్రోగు నూతనోధ్యాయ విన్నూత్నోదయం
చీర్స్
జిలేబి
ఇప్పుడే మొదలాయె అప్పుడే విజయమా :-)
Deleteనూతనాధ్యాయం
ReplyDeleteనూతనోదయం/అధ్యాయం అన్న మీమాసంలో తప్పు దొర్లింది. సరిచేసిన మీకు వందనం._/\_
Deleteమండే సూర్యుడూ మంచే చేయునని నవ్వుతూ
ReplyDeleteఆలోచనాసక్తికి కాస్త యుక్తి చేర్చి అడుగేస్తున్నా!
Good....Good !
థ్యాంకులు...థ్యాంకులు :-)
Deleteవిజయోస్తు...
ReplyDeletethank you
Deleteమీకు మీరే కాదు ప్రేరణ మాకు కూడా మీరు ఇన్స్పిరేషన్
ReplyDeleteఏమో చూడాలి ఎంత వరకు సక్సెస్ అవుతానో
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
DeleteVenkatji you are rocking here.
DeleteThis comment has been removed by the author.
Deleteఆడితే కాలో చెయ్యో విరిగేట్లుంది...అందుకే కాంగా కూర్చుని రాసుకుంటానండి :-)
DeleteThis comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Delete@Gadepalli Venkatji...lyricist కూడానా మీరు, అదుర్స్ :-)
DeleteThis comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Deleteపిల్లకాలువ సాగరం చేరదని నదిని వెతుక్కున్నా...మొత్తం ఆధారపడక మీ దారిలో మీరు క్రొత్తఅధ్యాయాన్ని సృష్టించండి.
ReplyDeleteఅలాగే అదే ప్రయత్నం చేస్తాను
Deletethat's U, start new era.
ReplyDeleteపట్టుదలతో నాకు నేనే ప్రేరణగా మారి నడుస్తూ
ReplyDeleteపిల్లకాలువ సాగరం చేరదని నదిని వెతుక్కున్నా! fantastic lines
thank you
Deleteనూతనాధ్యాయం
ReplyDeleteసరిచేసానండి...ధన్యవాదాలు
Deleteకొంప కొలంబో చేసే కవిత్వం అనుకుంటే, ప్రేరణనిచ్చే పద్యం తో మళ్ళీ కొత్తగా ఉదయించారు అర్పితా... మజ్జారే మజా... ఖుదొస్ దోస్త్....
ReplyDeleteఅంత సులువుగా కొంప కొలంబో కానిస్తానా చెప్పండి. :-)
Deleteఒక ఉదయం పుట్టాలంటే మునుపటి రోజు సూర్యు అస్తమించాలి. అది ప్రకృతి. గొప్పైన భావాలు కొన్ని అస్తమయాలతోనే పురుడుపోసుకుంటాయి. ప్రకృతికి ఒక ఆకృతిని ఇచ్చిన మీ మొదటి నాలుగు పంక్తులు నిజంగానే క్రొంగొత్త భావాలకు పునాదులు పరుస్తున్నట్టు ఉంది.
ReplyDeleteధీరులకు విశ్వాసం పట్టుసడలదు. మార్గం మూసుకుందని వెనుకకు మరలరు. ప్రక్కన దాగిఉన్న మరో తలుపును అన్వేషించి స్వయం ప్రేరణతో పనులు పూర్తీ చేస్తారు. మీ రెండవ స్టాంజాలో, అలాంటి బలమైన నమ్మకం ధ్వనిస్తోంది. స్వప్నాలు సాకారం చేసుకోవాలనే తపన ఉంది. పిల్ల కాలువ సంద్రం చేరదు. నిజమే. నదిని వాహనంగా చేసుకొని సాగరంలో చేరి, దాన్నీ మధించగలదు. మీ భావాల్లో ఇలాంటి ప్రేరాత్మక పదాలు మీకే కాదు, చదువరులకూ ఎంతో ఉత్తేజాన్నిస్తాయి.
ఆలోచన ఉంటె సరిపోదు దానిపై ఆసక్తి, ఆసక్తికి తోడూ యుక్తీ కలిస్తే ఇక ఎవరికైనా అడ్డనేది ఉంటుందా? మండే సూర్యుడైనా తలొంచి సలాం చేయాల్సిందే. మాణిక్యాలు మట్టిలో ఉన్నా మేరవాల్సిందే....
భగవద్గీత 2-47
" కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఅస్త్వకర్మణి || "
మీ చివరి పంక్తులు ముమ్మాటికీ నిజం! అదే భగవత్గీత కూడా చెబుతున్నది. ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా ప్రతిఫలం ఆశించక పోరాడడం మీ వంతైతే విజయం ఎప్పటికీ మీ వైపే... చాలా మంచి వాక్యాలు అందించారు. వెరీ ఇన్స్పైరింగ్ పోయెం మేడం. సలాం!!
(04.04.2015) ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు!! _/\_
sorry.... thats 04-12-2015
Deleteఫ్యాన్స్ బ్లాగ్ లో క్రియేట్ చేసిన వీడియో ఎక్సలెంట్...అదరగొట్టేసారు
Deleteమీ ఇన్స్పిరేషనే లేకపోతే నేను ఇలా రాయలేను...
Delete_/\_ మాటలు రావడంలేదు మీ బ్లాగ్లో పోస్ట్ చూసి._/\_
సాగిపొండి కొత్తదారిలో...సూపర్ పిక్
ReplyDeleteథ్యాంక్యూ
Deleteసున్నితభావంతో అలరించారు. చిత్రం చూడముచ్చటగా ఉంది.
ReplyDeleteశిల్పం కూడా ఒకప్పటి రాయేనని తెలుసుకుని
ReplyDeleteఅల్పజ్ఞానంతో మట్టిలో మాణిక్యానికి వెలకట్టలేక
మండే సూర్యుడూ మంచే చేయునని నవ్వుతూ
భవ్యమైన ఆలోచన...హరినాధ్
మీబోటి పెద్దల ఆశిస్సులు_/\_
Deleteపాత తుపాకీలో కొత్త తూటాలు...హా హా హా
ReplyDeleteఈ తుపాకీ తూట్లు/కమెంట్స్ ఏంటో :-)
Deleteస్పటిక స్వచ్చత గల్గు భావనా పటిమల
ReplyDeleteపద్మార్పితకు శత వర్ష శుభము
తెలుగు సంస్కృత పద తియ్యందనాలల్లు
పద్మార్పితకు శత వర్ష శుభము
చదివించు గుణమున్న చక్కని కవితల
పద్మార్పితకు శత వర్ష శుభము
రమణీయ శృంగార రస మనోజ్ఞ రచనా
పద్మార్పితకు శత వర్ష శుభము
కవితలే గాదు చిత్రలేఖనము గాన
మాది కళల కాణాచి పద్మార్పిత కివె
జన్మదిన శుభా కాంక్షలు , చక్కని ప్రతి
భలకు సన్మంగళాని భవన్తు , స్వస్తి .
చాలాబాగుంది పద్మార్పిత పై పద్యము.
Deleteచక్కటి ఆశీర్వచనం
Delete@రాజారావుగారు....అనిర్వచనీయ భావం మీ అభిమాన ఆప్యాయతాక్షరాలకు
Deleteమీరు అందిస్తున్న స్పూర్తి వచనాలకు...ధన్యవాదాలు.
నడుస్తున్న బాటలో కొత్త అర్థాలే వెతుకుతూ
ReplyDeleteనూతనోదయానికి నాణ్యమైన నాంది వేసున్నా...Good luck and Birthday wishes too.
thank you
Deleteప్రతీ లైన్ లో ఆత్మవిశ్వాసం కనబడుతుంది. సాగిపోండి విజయంవైపు మీదైన బాటలో.
ReplyDeleteఅలాగే ప్రయత్నిస్తాను.
Deleteపసందైన పదునున్న పద్మ పదాలు
ReplyDeleteమురిపించేను నీవైన మనోభావాలు
అందరినీ అలరించేవే అర్పితాక్షరాలు
మీకు మా జన్మదిన శుభాకాంక్షలు!
మీరు వ్రాసినట్లు రోజుకి ఒకటి వ్రాయడం నావలన కాదు. నాలుగు లైన్స్ వ్రాసి చదువుకుని నాకు నేనే మురిసిపోతున్నాను. మీరూ మురవండి మరి నా పాండిత్యాన్ని చదివి :-)
బాగా శెలవిచ్చారు ఆకాంక్ష గారు..
Deleteమురిసి మురిసి ముత్యము వాన చినుకాయేనా..
ముసిరి ముసిరి వాన కాస్త తూఫానాయేనా..
అల కడలిని చూసి భీతిల్లి సూర్యునికే చమటలు పట్టి సంద్రం ఉప్పగా మారేనా..
ఏవిటి అలా చూస్తున్నారు.. ఇది వితక.. ఇటుకటు మార్చి రాశానంతే..😛 సరదాగా..
నాలుగు లైన్స్ లో నన్ను పొగిడేసారుగా...థ్యాంక్యూ ఆకాంక్ష ;-)
DeleteVery nice. Your poetry is always inspiration for the beginners like me.
ReplyDeletethanks a lot for encouraging comments.
Deletedidi janamdin mubarak.
ReplyDeleteమరిన్ని పుట్టునరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే
ReplyDeleteహ్యాపీ పుట్టునరోజు అక్కో...ఖుషీ ఖుషీ గుండాలే ఎప్పటికీ.
ReplyDeleteమంచి మంచి కవితల్ మస్తుగ రాయాలే
Many more happy returns of the day
ReplyDeleteఅక్కడక్కడ పద్మ
ReplyDeleteఎక్కడో ఒక పద్మ
అరుదుగా ఒక పద్మ
అపురూపమైన పద్మ
ఆత్మబంధువు పద్మ
అమ్మలాటిది పద్మ
పుట్టినరోజు పాపాయి పద్మ
పసిమనసు పద్మ
దేవుడిచ్చిన కానుక
తీయనైన స్నేహం
రతనాల అక్షరాల
వాణి వీణాపాణి మనపద్మ
అందమైన కవితలతో అందరినీ ఆనందపరుస్తూ నీవు ఆయురారోగ్యాలతో ఆనంగా ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు
ReplyDeleteనడుస్తున్న బాటలో కొత్త అర్థాలే వెతుకుతూ
ReplyDeleteనూతనోదయానికి నాణ్యమైన నాంది వేసున్నా
ఇలాగే కొనసాగనివ్వండి. జన్మదిన శుభాకాంక్షలు పద్మార్పిత
many more wishes on your birthday
ReplyDeleteWishing you many many more returns of the day padma
ReplyDeleteదీర్ఘాయుష్మాన్భవ
ReplyDeleteనువ్వు ఇటువంటి మరెన్నో వేడుకలు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ..పుట్టిన రోజు శుభాకాంక్షలు-హరినాధ్
ReplyDeleteఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు...
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా నమస్సుమాంజలులు_/\_
ReplyDelete