నీ నా గమకాలు...


సై అంటే సైయని సరదాగా సరసాలాడక
చిలిపిఊహలని చిదిమేసి చిత్రంగా నవ్వి
సన్నాయి ఊదరాక నాదస్వరం ఊదేవు!

కొంటె కోర్కెలతో కవ్వించి ఖుషీ చేయక
కమ్ముకున్న కారుమబ్బులా దరికి చేరి
కోడెత్రాచులాగ కస్సు బుస్సులు ఆడేవు!

వల్మీకపొదమాటున వలపు కురిపించక
మనసుని మెలిపెట్టి మోహము తీరెనని
కుబుసం వీడిన నాగులా సర్రున జారేవు!

ఇరువురి గమకాలతో సృష్టి గమనమనక
తెలిసిన కార్యం ఇదని తెలియకుండా చేసి
వీడని బంధమై చుట్టుకుని నాట్యమాడేవు!

23 comments:

 1. That's Good one...keep rocking lol

  ReplyDelete
 2. ఘుబాళించే పరిమళభరితమైన సంపంగి దెచ్చి కొప్పున తురమక
  మోదుగ పువ్వులు ఇవని మొగలి రేకులేవని పలికి కండ చీమలు కుట్టేనని
  గుంటగలగరాకు అని కాసేపు నల్లేరు అని కాసేపు అనేవు!


  లోకం తీరిది.. ఒకరికి ఒకలా కనిపించేది మరోకరికి మరోలా కనిపిస్తుంది అని చెప్పకనే చెప్పారు పద్మగారు.

  ReplyDelete
 3. ప్రియుడు పాములోడి యేషం ఏషిండు అట్లైతే :)

  ReplyDelete
 4. ఇరువురి గమకాలతో సృష్టి గమనమనక ప్రేమని మొత్తం మీ సొంతం చేసుకున్నారు.చిత్రం సరిపడింది మీ కవితకు.

  ReplyDelete
 5. పాములోడి వేషంలో వచ్చినా నిందలు మాత్రం తప్పలేదుగా

  ReplyDelete
 6. బూ.... బూ....బూ.... పద్మ గారూ ! ఈ పాముల బూరా ఊదబడటం లేదు , ఎ..కా..డా.. కొని తెచ్చినారు ? వేరంటీ గీరంటీ లాంటిది ఏమన్నా ఉందా ? :P :P ( టెన్షన్ పెట్టి చంపినా మీరే , దూది పింజని చేసి గాల్లో తేల్చినా మీరే ! ) very sweet .

  ReplyDelete
  Replies
  1. మౌనవీణ గానం ఈ జీవిత పయనం.. ఏ క్షణాన ఎలా ఉంటుందో తెలియని వైనం.. జీవితానికే గ్యారెంటి వ్యారెంటి లేనపుడు.. రీడేడ్ స్నేక్ చార్మింగ్ పైప్ కి ఎమన్న ఉంటుందంటారా వెంకట్ గారు.. జీవాత్మ దూది పింజమే సుమ.. బ్రతికున్ననాళ్ళు బరువుగా ఉంటుంది.. ఏ క్షణాన ఏ గాలికి ఏవైపుకి ఎగురుతుందో ఎవరికి అంతు చిక్కదు.. (ఆమంగళం ప్రతిహతమౌగాకా)

   జై శ్రీమన్నారాయణ

   Delete
 7. సై అంటే సై అని హెబ్బా పటేల్ లాగా తయారవ్వాలి. Good ...Good...

  ReplyDelete
 8. ఇరువురి గమకాలతో సృష్టి గమనమనక..nice words mam

  ReplyDelete
 9. మాడం అర్పితగారు పిక్స్ ఎక్కడ దొరుకుతాయి మీకు దానికి అతికినట్లు ఉండే అక్షరాలు సైతం

  ReplyDelete
 10. పాముళోడి మాయలో మీరు పడ్డారా లేక....

  ReplyDelete
 11. మనసుని మెలిపెట్టి మోహము తీరెనని
  కుబుసం వీడిన నాగులా సర్రున జారేవు! ఏంటి నిజమే :-)

  ReplyDelete
 12. గత రెండు పోస్టులకు కలిపి ఇక్కడే స్పందిస్తున్నాను. ఏడేళ్లుగా ఒక మహిళ తన భావాలను ఈ వేదిక ద్వారా పంచుకుంటున్నారు. నేను నాలుగేళ్లుగా ఆమె కవితలు చూస్తున్నాను. వ్యాఖ్యలు రాస్తున్నాను. ఆ పదబంధాల్లో భావం కట్టిపడేసేది. ఆ భావాత్మక చిత్రం చక్కిలిగిలి పెట్టేది. రోజురోజుకూ ఉత్సాహంగా మరింత పటుత్వంతో కవిత్వం రాయాలన్న ఆమెలోని ఆకాంక్ష చాలా గొప్పగా అనిపించేది. నా కామెంట్లతో నా వంతుగా ఉత్సాహ పరిచేవాడిని. వేదనా వర్ణనలో కన్నీటి చుక్క సిరాగా, రసజ్ఞ కవితలో తడిఆరని ఊహలే అక్షరాలుగా, స్వతంత్ర భావాల్లో ముక్కుసూటితనమే పదాలుగా అల్లుతూ... తన ఎదలోతుల్లో దాగున్న స్వేచ్ఛా విహంగానికి కవితల రెక్కలు తొడిగి విహరింపచేస్తున్నారనిపించేది. బహుశా అదే నిజం కావొచ్చు. మరి ఇందులో భాషెక్కడుంది? అంతా భావమే... భావానికే భాష కావాలంటే... చిరునవ్వులో వెదకాలి, ఆవేదనలో వెదకాలి, కన్నీటి చుక్కలో వెదకాలి.. బహుశా ఎవరికీ సాధ్యం కాదనుకుంటా? పద్మార్పిత భాషావేత్త కాదు, పండితురాలని కూడా ఆమెప్పుడూ చెప్పిన దాఖలాలు లేవు. ఒక సగటు మహిళ... తన స్వేచ్ఛా భావాలను... తన అంతరంగ సాగరంలో కొన్ని కెరటాలను కవితల తీరానికి చేరుస్తున్నారు. వాటిని ఆస్వాదించడమే తప్ప... నీళ్లు ఉప్పగా ఉన్నాయి, ఇసుక కాళ్లకు అంటుకుంటోంది అంటే... సాగర అందాలు మనసుని తట్టవు. రవి కాంచని చోట కవి గాంచును అంటారు. అలాంటి ఎన్నో భావాలను ఆమె కలువ రేకుల్లాంటి అక్షరాలతో బంధించారు. స్వేచ్ఛా భావాలకు రెక్కలొస్తే అది పద్మార్పిత కవితే. పద్మార్పిత గారు... మీరిలాగే రాస్తూ ఉండండి.మకరందాల సుమధుర గంధాల సుగంధాక్షరాల పదబంధాల అందాల అల్లికల అల్లిబిల్లి కవితా కెరటాల సాగరంలో... శ్వేతపద్మాక్షరమై వికసించండి.

  ReplyDelete
  Replies
  1. Excellent Comment Satish.

   Delete
  2. గత మూడు పోస్టులకు కలిపి ఇక్కడ స్పందిస్తున్నాను. ఈ దేశప్రజల ఖర్మ కాలితే దిక్కుమాలిన న్యూ రిపోర్టర్లు పుట్టుకొస్తారు.

   Delete
 13. Better late than never , good job Satish ji

  ReplyDelete
 14. సతీష్ కొత్తూరి గారు,

  మకరందాల సుమధుర గంధాల సుగంధాక్షరాల పదబంధాల అందాల అల్లికల అల్లిబిల్లి కవితా కెరటాల సాగరంలో...

  ఈ పై మీ భావమాలిక సేహభేష్ ఐన భావమాలిక !

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
 15. పడతి పామును ప్రేమించి పడగ జూచి
  గడుసు దనమున కాటేయ నడుగ నడుగ
  వినయమున పాము తనను పోవిడువు మనుచు
  పడగ దించుకు తలయొగ్గి బ్రతిమలాడె .

  ReplyDelete
 16. prema visham chimme naagupaamuluntayannamaata.. :-)

  ReplyDelete
 17. మీ స్ఫూర్తిదాయక స్పందనలకు అభివందనములు _/\_

  ReplyDelete
 18. జానపదం కలిసినట్టున్న స్టైలిష్ కవిత. సూపర్ మేడం!!
  ( విమర్శనాస్త్రాలకు మౌన సమాధానం ఓ బ్రహ్మాస్త్రం! )

  ReplyDelete