వ్యాకరణ వాస్తేదో అంతగా కుదరలేదని
అక్షరదోషాలకి శాంతి చేయించమనంటే
భావం మూగదై బంధీగా మిగిలిపోయె!!
ఆలోచనలకి రూపమీయ అర్థనగ్నమని
భీతితో అవి తడిసిపోగా, పాలిపోయెనని
లేని సామర్థ్యంతో రంగులే అద్దమనంటే
ఆలోచనలు అవాక్కై అకాశాన్ని గాంచె!!
వ్యంగ్య వ్యాఖ్యలతో తప్పులే సరిచేసామని
చంకలెగరేస్తూ నవ్వి నీతులే నేర్చుకోమని
అసూయ, వాక్యాలుగా మారి కాలుతుంటే
మర్మమెరుగని మదికన్నీరే స్వేదమై పారె!!
అక్షరాలని అభిమానిస్తే అదేదో నేరమని
భావాలకే రంకుగట్టి బావలతో సరసమని
పదాలే వేరుగా పలికి పెడార్థాలు తీస్తుంటే
వివేకుల విజ్ఞానమిదేనని వినమ్రత నవ్వె!!
కన్నీటిని ఆకాశపు నీలాన్ని కలగలిపి సిరగ మలచి దానిని కలములో నింపి అక్షరాన్ని వ్రాయగా ఆర్ద్రతతో తడిసిన మనసు కుదుటపడగా.. భావమే తలవంచి అక్షరానికీ దాసోహమాయే.. తడి ఆరిన అక్షరమే కావ్యమాయే..!
ReplyDelete~శ్రీ~
భావ కవితలివి ! స్వేచ్చా విహంగాలివి !
ReplyDeleteభావం తప్ప మిగిలినవేవేవో మరేవేవో
చూస్తున్నారని , తూట్లు పొడుస్తున్నారని ,
ఎందుకింత కలత ? ఓ వెన్నెల్లో నెలతా ! !
అభిమానం తో చేసినా అసూయతో చేసినా
అవి కామెంట్లు కాదు కాంప్లిమెంట్లే
ఎరుగవా పొందికైన అందమైన ఓ కవితా ! !
ఇంకెక్కడ మీలోనే నిక్షిప్తమై ఉంది.
ReplyDeleteవేదన కవితాచిత్రంలో చక్కగా వర్ణించారు
భావం ఏమన్నా బాబుగాని సొత్తా ఏమి తిట్టేటోల్లు తిడ్తరు పొగిటోల్లు పొగుడుతుండ్రు :) బొమ్మ కతర్నాక్
ReplyDeleteపద్మార్పితగారికి నమస్కారం. నేను ఒక సందేహం వెలిబుచ్చాను, మీక్రిందటి కవిత విషయంలో. మీఅభిప్రాయం మీరు చెప్పారు. నాకు తెలిసినది ఏదోనేను చెప్పాను తప్ప ఎక్కడా మర్యాదోల్లంఘనం చేయలేదు. తరువాత జరిగిన అనవసరమైన చర్చలో హెచ్చు భాగం నా తప్పులను వెదికేప్రయత్నాలూ, నన్ను కించపరచేప్రయత్నాలూ అధికంగా జరిగాయి కాని మీ పైన కాదన్నది మీరు గమనించే ఉండాలి. కాని నేటి మీ యీ ప్రయత్నంలో మీరు గతటపాలో కేవలం నేను ప్రశ్నించటవలన ఇబ్బంది పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది నాకు విచారం కలిగించింది. మీరు నా ప్రశ్నలో వ్యంగ్యమో అసూయో మరొకటోఎలా చూడగలిగారో అన్నది అంతుబట్టటం లేదు. ఇది చాలా ఆవేదన కలిగించింది. జరిగిందేదోజరిగింది. గతజలసేతుబంధనం వలన కార్యం లేదు కదా! మీకు సలహా ఇచ్చేపాటి వయస్సో, వివేకమో, విఙ్ఞానమో, భాషాఙ్ఞానమో, కవిత్వపాటవమో, జనామోదమో మరొకటో, మరొకటో నాకు లేదని మీరు భావించి కించపడిన పక్షంలో దయచేసి క్షమించండి. నా కారణంగా మీకైనా మరొకరికైనా వేదన కలగటం నాకు సమ్మతం కాదు. ఇకపై మీబ్లాగును దర్శించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మరొకసారి ఈ అల్పప్రఙ్ఞుడి వినమ్రనమస్కారాలు స్వీకరించండి. సెలవు.
ReplyDeleteమీరు వెళ్ళబుచ్చిన సందేహం, నా పొరపాటుని మీరు సరిచేసిన తీరు ఎంతో నచ్చింది. మీ వ్యాఖ్యలు ఎప్పుడూ తెలియని విషయాల్ని వివరించి సరిచేసాయే కానీ విమర్శించలేదనే నా అభిప్రాయము. తెలిసో తెలియకో మీమనసుని కష్టపెట్టినా, నా రాతల మూలంగా పరోక్షంగా మీరు ఇబ్బంది పడి ఉంటే మన్నించండి. మీ సలహాలు, సవరింపులు నా రాతలకు ఎప్పుడూ కావాలి, ఉంటాయని కోరుకుంటూ...పద్మార్పిత _/\_
Deleteఅనవసరమైన వ్యంగ్య వ్యాఖ్యల గురించి ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు.
ముల్లుని ముల్లుతోనే తీయాలని లేదు
ReplyDeleteYou proved it padma. claps
మీ వినమ్రత కవితకు జోహార్లు
ReplyDeleteఅక్షరమాలికలకు పర్మళభావం అద్ది అందంగా సమర్పించగల నైపుణ్యం మీకు దండీగా ఉంది కొనసాగిపొండి.
ReplyDeleteThe less you respond to negativity, the more peaceful your life becomes. Don't let people's compliments get to your head and don't let their criticism get your heart. Be cool & god bless you my dear-Harinath
ReplyDeleteవిడిగా జవాబులు ఇవ్వక కవితారూపంలో మీరు ఇచ్చిన జవాబు అమోఘం. చిత్రం చాలా బాగా నప్పింది. మీరు మీ భావాలు ఎటువంటి వాటికీ బంధీలుకావు. అభినందనలు మీ కవితకు.
ReplyDeleteवाह...मुंहतोड़ जवाब दिया! बहुत खूब
ReplyDelete
ReplyDeleteఅక్షరాలని అభిమానిస్తే అదేదో నేరమని
భావాలకే రంకుగట్టి బావలతో సరసమని
పదాలే వేరుగా పలికి పెడార్థాలు తీస్తుంటే
వివేకుల విజ్ఞానమిదేనని వినమ్రత నవ్వె
మాటల్లేవు మంత్రం వేసి మాయ చేసినట్లున్నారు
చిత్రంలో మొత్తం భావం చెప్పేసి కనికట్టు చేసినారు
భావం స్పష్టంగా భోధించారు. వందనములు
ReplyDeleteమర్మమెరుగని మదికన్నీరే స్వేదమై పారె!! మీరు స్ట్రాంగ్ మాడం ఇలాంటి వాక్యాలు మీకు నప్పవు ;-) GO ON
ReplyDeleteపద్మా కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు విసురుతారు. ఇన్ని రాళ్ళు విసురుతున్నారు అంటే ఇంకే అందరూ కాయలు కోసుకుని తినాలి అనుకుంటున్నారు అనే...సంతోషం అంతా హ్యాపీస్ :-)
ReplyDeleteచక్కని కవిత్వాన్నీ అందిస్తున్న మా అభిమాన కవయిత్రి పద్మార్పితగారికి, ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్లాగ్ కు అభినందనలు.
ReplyDeleteభావాలకు రంకు కట్టే మేధావులే చాలా వరకు. వంకలు వెతికే వారే అందరు ..బాగా రాసారు
ReplyDeleteభాషా సరిహద్దులు చీల్చుకొని భావవేగమున దూసుకు వస్తున్నట్టుంది కవిత, దానికి తగ్గ చిత్రం. మీ వినమ్రతకు శిరస్సు వంచి నా సలాం మేడం....
ReplyDeleteవివేకుల విజ్ఞానమిదేనని వినమ్రత నవ్వె...
ReplyDeleteఆ వినమ్రతతో కూడిన నవ్వే మీ అస్తిత్వం
బాక్సు బద్దలు అయ్యింది. భావం బయట పడింది. హా హా
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteతప్పులు చెయ్యని వాళ్ళెవరు?
ReplyDeleteయే చిన్నపనీ చెయ్యబివాళ్ళు!
తొమ్మిది పన్లు చెడి ఒకపని అదృష్టం కొదీ కలిసొచ్చినా పోటుగాళ్ళే అవుతారు కొందరు?!
ఒక పని చెడినా తొమ్మిది పన్లు చక్కబెట్టగలిగీ ఒద్దికగా ఉంటారు అసలైన కార్యశూరులు!?
స్పటిక స్వచ్చత గల్గు భావనా పటిమతో
ReplyDeleteఅలరారు కవితల కొలువు మీది
తెలుగు సంస్కృత పద తియ్యందనాలతో
అలరారు కవితల కొలువు మీది
చదివించు గుణమున్న చక్కని శైలితో
అలరారు కవితల కొలువు మీది
రమణీయ శృంగార రస మనోజ్ఞతలతో
అలరారు కవితల కొలువు మీది
చదువరుల మనోల్లాస సంజనిత చతుర
శత సహస్రాది వ్యాఖ్యల జల్లు కురిసి
యలరు బంగారు కవితల కొలువు మీది
నిజము పద్మార్పితా ! కమనీయ కవిత !!
రాజారావుగారు నా మాట మీ పద్యంలో
Deleteభావం సుమధురం
ReplyDeleteచెప్పడం సున్నితం
మీ కవితలు ప్రియం
ALL THE BEST PADMAARPITA!
ReplyDeleteGO AHEAD IN YOUR OWN WAY?
హాస్యంగా వ్రాయాలి కమెంట్ అనుకున్నాను కానీ వ్రాయలేక పోతున్నాను.
ReplyDeleteచదువుతుంటే కళ్ళు చెమర్చాయి.. ఎందుకని అడకండి కొన్ని ఫీలింగ్స్ కి రీజనింగ్ ఇవ్వలేము. ఎంతో ఇన్వాల్మెంట్ ఉంటేనే ఇంతలా ఫీల్స్ ని బహిర్గత పరచగలుగుతారు..
అందమైన అక్షరము కపటమెరుగని హృదయము
ReplyDeleteభాష పై మమకారము రచనలన్న అనురాగము
మధురమయిన వాక్యము సొగసైన భావము
ఎంతో నిరాడంబరము మంచితనమే ఆభరణము
వినిపిచని రాగము కనిపించని నేస్తము
సున్నితము సౌశీల్యము సహనము స్నేహము
కొంటెదనాల చిత్రము మేటి శృంగార రస పోషణము
ఒకనాడు ద్రాక్షాపాకము మరునాడే నారికేళ పాకము
చాలా పురుష ద్వేషము స్త్రీ పక్షపాతము
దయ్యాల ప్రపంచము ఆత్మలతో నెయ్యము
దృఢమైన చిత్తము కడు మొండి తనము
ఇదె నేను ఎరిగిన ఆమె నిజరూప దర్శనము
పదుగురూ మెచ్చిన ఈ శ్వేత పద్మము .........
పద్మ గారూ ! వీరంతా మీరు ఎవరికో రిటార్ట్ ఇచ్చారని , జవాబు చెప్పారని
ReplyDeleteఅనుకుంటున్నారు . నాకు మాత్రం మీలో చాలా ఉదాశీనత , నిర్వేదం
కనిపించాయి . రచయితలు భావం కోసం ఎన్నో రకాల పద ప్రయోగాలు
చెయ్యడం , విమర్శల జడివానలు వెల్లువెత్తడం ఈనాటిదా ? చర్చ
కొంచెం వాడిగా సాగిన మాట వాస్తవం . కానీ సున్నితమైన మనసున్న
మీలాంటి పెద్దవారు కొంచెం గట్టి పడాలి . గతంలో చంద్రబోస్ రాసిన
సినిమా పాట ఉదాహరణ చెప్పాను . ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెబుతాను వినండి .
ఒకసారి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలవారు నిండు కొలువు తీరి ఉండగా ,
అల్లసాని పెద్దన్న గారు కవిత్వం చెబుతూ , ఒక పద్యం లో " అమవస నిశి "
అన్న పదాన్ని వాడారు . ఆ పద్యం ఇదుగో .......
కలనాటి ధనము లక్కర
గలనాటికి దాచ కమల గర్భుని వశమా
నెల నడిమి నాటి వెన్నెల
యలవడునే గాదె బోయె నమవస నిశికిన్.
అమవస అనేదే ఒక వికృతి ( అమావాస్య ) , దానిని నిశి తో కలిపి ప్రయోగించడం
నింద్యము , ఆక్షేపణీయం , నిషిద్ధం . అది అల్లసానివారు ఎరుగరా ? అయినా
గమన సౌలభ్యం కోసం , ఛందస్సు కుదరడం కోసం , వేరే పదాన్ని వెతకలేక
అలాగే వాడేశారు . సభికులెవ్వరూ కిమ్మనలేదు . నిశ్శబ్దం గా ఉన్నారు .
ఇంతలో తెనాలి రామలింగ కవి లేచి , అల్లసానివారిని ఆక్షేపణ చేస్తూ ఈ విధంగా
పద్యం చెప్పాడు .
ఎమి తిని సెపితివి కపితము?
బమ పడి వెరి పుచ్చ కాయ వడి తిని సెపితో
ఉమెతకయను తిని సెపితో
అమవస నిసి యనుచు నీవు అలసని పెదనా!
భావము:- ఓ అల్లసాని పెద్దనా! అమావాశ్య నిశి అనుదానిని
అమవస నిసి అని చెప్పితివి కదా? ఏమి తిని చెప్పితివి?
భ్రమపడి వెఱ్ఱి పుచ్చకాయ తిని చెప్పితివా? ఉమ్మెత్తకాయ తిని చెప్పితివా?
ఎంత వెటకారం ! అలసని పెదనా !అని సంబోధిస్తూ ...
దీనికీ సభికులు నిశ్శబ్దం గానే ఉన్నారు .
అల్లసాని వారు ఆ పదాన్ని మార్చలేదు . ఆ పద్యాన్నీ వెనక్కి తీసుకోలేదు .
రెండు పద్యాలూ చరిత్రలో అలాగే నిలిచి పోయాయి .
ఒక్కోసారి అల్లా జరుగుతూ ఉంటుంది . అంతే ! !
నా భావాలని గౌరవించి స్పందించిన అందరికీ నమస్సులు _/\_
ReplyDelete