కలానికి వేవిళ్ళు


ఊహలతో ఊసులే చెప్పి వలచేవట
అందుకే నిన్ను వేదనే వరించానంది
ఉబుసుపోక వేసే వేషాలని వదిలేవా
వయసు మారాంచేస్తూ విరబూస్తుంది!

కోరికలే గుర్రాలై ఉరకలేయబోయెనట
అందుకే ఆశయమే కాలుజారిపడింది
ముక్కలైన మనసు అతికించబోతివా
మరపు లేపనమై గతం జ్ఞాపికౌతుంది!

బ్రతుకు ఆశతో ఏడడుగులు వేసెనట
అందుకే నిరీక్షణయే కౌగిలి కావాలంది
తమకానికి తలపుల్ని కాపలా పెడితివా
రెప్పలమాటున భావమై మిగిలిపోతుంది!

భావాలు కలలతో కాపురం చేసెనంట
అందుకే కామోసు కలమే కక్కుకుంది
కలాన్ని సిరా వేవిళ్ళంటూ వెక్కిరించబోవ
కవితలే పుట్టునని కాలం కబురుపంపింది!



43 comments:

  1. అనుమానం ఎందుకని?
    అద్భుతమైన కవితలే పుడతాయి
    చిత్రం చాల చాల బాగుంది

    ReplyDelete
    Replies
    1. పుట్టి పెరిగిన తరువాతేగా తెలుస్తుంది మిత్రమా!

      Delete
  2. kalaniki vevillu kottagundi padaprayogam.

    ReplyDelete
    Replies
    1. కలం నోట్లోంచి కక్కిందే కవిత అన్న భావంతో అలా.... :)

      Delete
  3. కోరికలే గుర్రాలై ఉరకలేయబోయెనట ఆశయమే కాలుజారిపడింది అక్షర కూర్పు చాలాబాగుందండీ. చిత్రం తగినట్టుగా ఉంది

    ReplyDelete
    Replies
    1. అంతే కదండీ...కోరికలే గుర్రాలై ఎగిరితే కాలో చెయ్యో విరుగుతుంది తీరడం మాట ఎలా ఉన్నా :) కాదంటారా!

      Delete
  4. ఈ వయసులో వేవిళ్ళా ? మీ కలం తట్టుకోగలదా ? అసలే మీ కలానికి భవిష్యత్తు చెప్పే అలవాటు ఉంది.

    ReplyDelete
    Replies
    1. కంగారు పడకండి....కక్కు వచ్చింది కలానికి నాకు కాదుగా తట్టుకునే శక్తి దానికి ఉందిలెండి :-)

      Delete
  5. ఓహ్ వేవిళ్ళు అనంటే వాంతులా పద్మగారు. నేను మీ కవితలోనే చూస్తున్నా.. సిర చుక్కలను వాంతి చేసుకునే కలం నుండి జాలువారే భావాల అల్లికే కావ్యమాల.. హయ్యో.. మరేం పర్వాలేదు లేండి.. బాల్ పాయింట్ పెన్ ఐనా భావాల ఒరవడిలో కాగితమంత ఒలికిపోతుంది.. అందుకే ఈ-కాలం లో ఈ-ఇంక్ బెటర్.. తేన్పులు రాకుండ భావం జీర్ణమైతుంది.. పొలమారదు.. (కవిత బాగుంది పద్మగారు.. నేను రాసిందే అర్దం కాకపోవచ్చు మీకు)..

    ReplyDelete
    Replies
    1. లంచ్ టైమ్ లో కామెంట్ కనుక అలా రాశాను పద్మగారు

      Delete
    2. మీకు ముందస్తు దీపావళి, నాగ చవితి గ్రీటింగ్స్ పద్మ గారు. నో పొల్యూషన్ ఓన్లీ ప్రమిద అఖండ జ్యోతులు

      Delete
    3. మొత్తం ట్రీట్మెంట్ మీరే చెప్పారు...థ్యాంక్యూ :-)

      Delete
  6. వేవిళ్ళా, వాంతులా? కంగారు పడవలసింది ఏం లేదుగా ;)

    ReplyDelete
    Replies
    1. నిదానంగా చదువు మహీ కలానికి వేవిళ్ళు....

      Delete
  7. నన్ను నడిమిట్లకి లాగకుండ్రి. నాకేం తెల్వదు

    ReplyDelete
    Replies
    1. ఎవరు అన్నారు అంతుందని:-)

      Delete
  8. కలాన్ని సిరా వేవిళ్ళంటూ వెక్కిరించబోవ
    కవితలే పుట్టునని కాలం కబురుపంపింది!మీ ఆలోచనలకు దండాలు పద్మమ్మా

    ReplyDelete
    Replies
    1. నందినీ థ్యాంక్యూ... పోస్టింగ్స్ లేవు ఈ మధ్య మీవి

      Delete
  9. ఊహలతో ఊసులే చెప్పి వలచేవట
    కోరికలే గుర్రాలై ఉరకలేయబోయెనట
    బ్రతుకు ఆశతో ఏడడుగులు వేసెనట
    భావాలు కలలతో కాపురం చేసెనంట
    కవిత చాలా బాగుంది చిత్రం బాగుంది భావం బాగుంది అద్భుత:

    ReplyDelete
    Replies
    1. డైరెక్ట్ గా పొగిడేసారే :-) థ్యాంక్యూ వెంకట్ గారు
      అమృతవల్లిగారు థ్యాంక్యూ

      Delete
  10. కవిత & చిత్రం బాగుంది

    ReplyDelete
  11. భావాలు కలలతో కాపురం చేసెనంట
    అందుకే కామోసు కలమే కక్కుకుంది
    కలాన్ని సిరా వేవిళ్ళంటూ వెక్కిరించబోవ
    కవితలే పుట్టునని కాలం కబురుపంపింది
    నీలోని భావుకత్వం శిఖరాగ్రం చేరిన వేళ-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకు

      Delete
  12. తమకానికి తలపుల్ని కాపలా పెడితివా
    రెప్పలమాటున భావమై మిగిలిపోతుంది..
    అద్భుతంగా చెప్పారు. కుడోస్

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ ఆకాంక్ష

      Delete
  13. ఇలాంటి కవితలు వ్రాస్తే కమెంట్స్ వ్రాయడం కష్టం. అద్భుతః

    ReplyDelete
    Replies
    1. కష్టమైనది అంటూ ఏముంది ప్రయత్నిస్తే :-)

      Delete
  14. ఊహలతో కాలయాపన చేస్తే వరించేది వేదనే కానీ ఉబుసుపోని ఊహలు లేకుండా మనసుకు తృప్తిపడుతుందా?? హృదయానికి కళ్ళెం లేదు కదండి. రంకేలేస్తూ కోరికల రూపంలో గుర్రాలై పరుగెడుతాయి. కానీ కాలు జారాక చేసేదేముంది... గడచిన జ్ఞాపకాల్లో తప్పొప్పుల్ని వెదకడం తప్ప....
    చివరి లైన్లు అధ్బుతంగా కొత్తగా ఉన్నాయి... మీ భావాల అంబులపొదిలో మరో అక్షరాస్త్రం ఈ చివరి స్టాంజా....

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమేనేమో...ధన్యవాదాలు

      Delete
  15. Replies
    1. ఎవరిని షూట్ చేయాలి :-)

      Delete
  16. కవలపిల్లలై కవితలు పుట్టనీయండి మరి :-)

    ReplyDelete
    Replies
    1. పెంచడం కష్టం కదా :-)

      Delete
  17. కలానికి వేవిళ్ళు అంటే అన్నీ ఖుషీ ఖుషీ కవితలే పుట్టుకొస్తాయట. కానీయ్ మరి :-)

    ReplyDelete
    Replies
    1. అలాగే విత్ బ్లెసింగ్స్ :-)

      Delete
  18. యాహూ...ఇకపై కవితలే కవితలు, సందడే సందడి :)

    ReplyDelete
    Replies
    1. కవితలే అయితే కడుపు నిండదుగా :-)

      Delete
  19. భావాలు కలలతో కాపురం చేసెనంట
    అందుకే కామోసు కలమే కక్కుకుంది...wonderful expression

    ReplyDelete