అస్థిర జీవం

తటస్థంగా ఉండలేనన్న అసంతృప్తి ఆత్మను అనలేక
నిరాశ ఆమ్లక్షారాలని గొంతులో పోసుకుని గోలచేస్తూ
కళ్ళనే చెమ్మచేసె, ఆవేదనపు సాంద్రతను తెలుపలేక
మస్తిష్కమే వేదనతో పొంగ, మోమేమో ముసురుపట్టె!

రంగులేని వర్ణం లోలోన చిగురాశ స్పటికంగా జనించి
కనిష్టమైన కోర్కెలు గరిష్టమై జ్ఞాపకాల పరిభ్రమణంలో
ఆటపాటలకి దూరంగా ఆవేశపు ఆలోచనలలో అలసి
పాలపుంతలాంటి శరీరం అగ్నిగోళమై భగభగా మండె!

వెలుగు చూడలేని హృదయ దర్పణం పారదర్శకమై
కాలానికి వ్రేలాడదీయబడ్డ నిర్లిప్తత ఆశలవైపు చూడ,
ఒంటరితనంతో స్నేహం చేయనన్న జీవితం డోలకమై
బ్రతుక్కీ చావుకీ మధ్య ఊగిసలాడే యంత్రంగా మారె!!!

25 comments:

  1. మాడం ఆదివారం ఆవేదనా గీతమా...పదాలు కష్టంగా కొత్తగా ఉన్నాయి. బొమ్మ బాగుందండి.

    ReplyDelete
  2. ardham kaledu madam. sorry its too difficult to understand

    ReplyDelete
  3. అనాలోచితముగా అసంపుర్ణముగా అన్యాక్రాంతమైన సంక్లిష్టమైన సందిగ్ధతకు దర్పణం పడుతోంది జీవనశైలి లో మార్పుల పర్వం.
    బాధతప్తహృదయరాగభావావేశాన్వేషణ కడు కన్నుల దాగి కన్నీటి పర్యంతమై ముభావాల కొలిమై కర్కష కఠోరమై మది ఆవేదన చెందగా సంద్రం లోతున దాగిన అక్షర క్షారామ్లముల గుణగణాలనే బేరిజు వేసే హృదయాంతరంగములో పౌనఃపౌన్యపు కెరటాలు..
    దస్సెక్ దస్సెక్ మాలమ్ వేతాణి లారేర్ సే కాఁయి కాఁయి లకిచికో తోన కళ్రోచగ ఆశల ఊసుల అలల ఉద్దృతిలో కాలగమనం.. వింత కడువిశాలమైన దృక్పథావలోకనకటకం జీవితమే ముణ్ణాళ్ళ ముచ్చటాయే ఈ సే కసనికో పర్బాతి పౌరజ్ వేదననెరిగిన మనసు చెఱువాయే పదాలే పదార్ధాలే "తిలాకాష్టమహిశబంధనమాయే".
    ఆవేదనభరితమౌ కావ్యమెల్ల కడుసంకుచిత కాఁయి ఛకో అభివర్ణన వర్ణాతిరేకం సశేషం.

    కన్నుల కన్నీరు కంచె దాటితే ఏరైనా సెలయేరాయే.. ఆ సెలయేటి మడుగులో కలువలాయే చంద్రుని వెన్నెల కై వీక్షింపగ బ్లహ్మకమరమాయే..
    పద్మగారు.. పదజాల ప్రయోగం కడు ప్రసంశనీయం.. అందుకే నా వ్యాఖ్య లో కూడా కోన్ని క్లిష్ట పదాలు పేర్చాను.. బహుపరాక్ శ్లాఘనీయం మీ కవితరచనచాతుర్యతానువాదగమనాపథం.

    ReplyDelete
  4. ఇద్దరు మహాకవులు ఒకసారి విజయవాడలో కలుసుకున్నారు ( ట ). కృష్ణా నది ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ( ట ) . ఇంతలో వారిలో ఒకాయన భోరున ఏడవడం ప్రారంభించారట . ( అంతా ట ట టా యే సుమా ! ఏదో మీ బోటివాళ్ళు చెప్పుకుంటుంటే విన్నదే )అది చూసి రెండో ఆయన ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారు ( ట ) . దానికి ఆయన ................
    నాకుగాదులు లేవు
    నాకుషస్సులు లేవు
    నేను హేమంత కృష్ణానంత
    శర్వరిని ......
    అని బదులిచ్చారట . ఈసారి రెండో ఆయన ఏడవటం మొదలు పెట్టారట . అప్పుడు మొదది ఆయన విస్తుపోయి నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా ? అని అడిగారట . రెండో ఆయన తన సంచి లోంచి ఓ బాటిల్ తీసి , అందులోది కొంచెం పుచ్చుకుని ఓ సిగరెట్టూ వెలిగించి ఇలా అన్నారుట .
    నేను సైతం భువన భవనపు బావుటానై
    వెలిగి పోతాను
    విశ్వ వీణ కు తంత్రి నై
    మూర్చనలు పోతాను .....
    అప్పుడు అటుగా వెడుతున్న మరో మహాకవి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అన్నారుట .
    ఈయన ఏడుపు ప్రపంచానికే ఏడుపు
    ప్రపంచం ఏడుపంతా ఆయన ఏడుపు ..........

    ఇదంతా విన్న తరువాత నాకో సందేహం కలిగింది .
    " ఏ రీతి ఏడ్వను దేవా ?
    నేనేరీతి ఏడ్వను దేవా ?
    స స్స రి గ పా ద స్స ని ద పా
    స పా గ మా
    మ దా గ రి
    సాని సాని సారి గరి సారి గరి
    దారి దారి దారిదరి దారిదరి
    " ఏ రీతి ఏడ్వను దే.....ఏ....ఏ...వా ?
    నేనేరీతి ఏడ్వను దే.....ఏ....ఏ...వా ? "
    ( Krishna Sastri , Sri Sri , Devarakonda Bala Gangadhara Tilak )

    ReplyDelete
  5. వేదన స్థిరంగా ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అయినా అన్నీ అస్థిరమే అని మీకు చెప్పాలా పద్మార్పితా!

    ReplyDelete
  6. ఒక్కముక్క సమజ్ కాలేదు :-(

    ReplyDelete
  7. కళ్ళనే చెమ్మచేసె, ఆవేదనపు సాంద్రతను తెలుపలేక
    మస్తిష్కమే వేదనతో పొంగ, మోమేమో ముసురుపట్టె!
    వండర్ఫుల్ భావప్రకటన..కంగ్రాట్స్ పద్మార్పిత

    ReplyDelete
  8. అంటే కెమికల్ గడబిడ... అన్నమాట.. :-)

    ReplyDelete
  9. Spiceandhra online తెలుగు న్యూస్ పొర్టల్ ఎప్పటికప్పుడు వస్తున రాజకియ వార్తలు, సినీమ వార్తలు, జాతీయ, అంతర్జాతీయ అదించటంలొ ముందు వుటొంది.

    ReplyDelete
  10. జివితం అస్థిరంగా ఉంతేనే కద అర్పితా ముక్కుతూ మూలుగుతూనో మున్ముందు మార్పులు చేర్పులు జరుగుతాయి అని ఆశతో జీవించగలం. ప్రస్తుతకాలంలో బ్రతుకు చావుకి మధ్య యంత్రంలా మారి సాగించే జీవితాలే అందరివి, ఆశ్శిస్సులు-హరినాధ్

    ReplyDelete
  11. వేదన జీవితంలో ఎలాగూ తప్పదు కవితల్లోను అదే ఎందుకు

    ReplyDelete
  12. నిరాశ నిర్వేదం నిస్తేజం నిట్టూర్పులతో నిండిపోయి ఉందని ఒకింత ఉక్రోషం ... ఉడుకుమోత్తనం కలగచ్చేమో గానీ .... ఒక కవితగా ... సాహితీ ప్రక్రియగా .... భావ ప్రకటన.. భాషా ప్రకటన .. రస పోషణ ( అది ఏ రసమైనా గానీ ) ... అన్నింటా ఈకవిత .... రచయిత్రి యొక్క వైదుష్యాన్ని , ప్రజ్ఞా పాటవాన్ని ఘనంగా , సమున్నతంగా , దర్పంగా చూపించింది .

    ReplyDelete
    Replies
    1. పైన మీరు వ్రాసిన కమెంట్కి వివరణా ఇది మాష్టారు

      Delete
    2. కవితని కవితలా చదివి నమిలి ఉమ్మేస్తే ఏ గొడవా ఉండదు . అందులో లీనమైపోతేనే ఒస్తున్నాయి ఎక్కళ్ళేని తిప్పలూ . ఏం చెయ్యమంటారు చెప్పండి సబ్ కుఛ్ సీఖా హమ్ నే న సీఖీ హోషియారీ........

      Delete
  13. అస్థిరజీవితాన్ని ఎలా స్థిరపరచుకోవాలో వివరంగా చెబితే ఇంకా బాగుండేది కదాండి పద్మార్పితగారు

    ReplyDelete
  14. కష్టతరంగా ఉన్నా అర్థమైన తరువాత అవ్యక్తీకరించలేని వేదన మనసుని క్రమ్మింది

    ReplyDelete
  15. చలనం మార్పులు సహజం అనుకుంటే సరిపోలే

    ReplyDelete
  16. వెలుగు చూడలేని హృదయ దర్పణం పారదర్శకమై
    కాలానికి వ్రేలాడదీయబడ్డ నిర్లిప్తత ఆశలవైపు చూడ
    ఆశలకు అంతు ఎక్కడుంది పద్మా..??

    ReplyDelete
  17. medam konchem navvinchandi
    Adavalekapotunam

    ReplyDelete
  18. కవితలోని ఒక్కో అక్షరం ఒక్కో ఆణిముత్యం లా ఉంది. భౌతికమైన ఈ శరీరానికి రసాయనాలు అద్దబడి కోర్కెల ఉత్ప్రేరకాలతో మనసులో ప్రతిచర్యలు జరిగితే చర్యాఫలితంగా ఉద్భవించిన బాదాభారిత ఉత్పన్నాన్ని మీదైనా శైలిలో అధ్బుతంగా వర్ణించారు... సలాం!!

    ReplyDelete
  19. సబ్జెక్ట్ ఏదైనా మీకు కవితా వస్తువే. బాగుంది

    ReplyDelete
  20. నిరంతరం నూతనత్వం మీ కవితల్లో.

    ReplyDelete
  21. అందరి ఆత్మీయ స్పందనలకు అభివందనం _/\_

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete