పల్లెలో ఏముందని పట్నమొచ్చి ఫోజ్ కొట్టబోతే
పిచ్చిదాన్ని అంటూ పల్లె నన్నుచూసి నవ్వింది
ఎందుకా వెక్కిరింపుమాటలో చెప్పి నవ్వమంటే...
నీ దగ్గరేముంది నువ్వు పెంచే నీలిగే ఓ కుక్కపిల్ల
నా పల్లెలోన పాలు ఇచ్చే పాడి పశువులు ఎన్నో
నడుమునైనా పూర్తిగా తడుపుకోలేని స్నానపుగది
నా పల్లెలోన జలకమాడ చెరువులు బావులు ఎన్నో
వెలుగు కోసమై వెంపర్లాడి వాడిపోయిన నీ మోము
నా పల్లె పండువెన్నెల్లో పరుచుకున్న పక్కలు ఎన్నో
గాలిలేని చిన్నిగదుల్లో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి నీవు
నా పల్లెన ఆనందంగా ఆహ్వానిస్తూ పిలిచే చెట్లు ఎన్నో
నిన్ను పలుకరించే నేస్తం నీ కంప్యూటర్ నీ సెల్ ఫోన్
నా పల్లె నిండా పలుకరించి ప్రేమించే మనసులు ఎన్నో
సొంతంకాని సంతోషాలని కొనుక్కునే సొమ్ము నీదగ్గర
నా పల్లెలో డబ్బుతో కొనలేని ఆనందపు ఆస్తులు ఎన్నో
వద్దంటూ వదిలేసి వలస వెళ్ళిన నీకు ఏమని చెప్పను
నా పల్లెటూరి గొప్పలు చెప్పుకుంటూపోతే ఇలా ఎన్నెన్నో!!

మాడం కవిత బాగుంది. కొద్దిగా గాప్ ఇచ్చరు అనుకుంటా :) పిక్ కరెక్ట్ సరిపోయిందండి
ReplyDeleteగాప్ ఇవ్వలేదు రాస్తూనే ఉన్నానుగా కల్కిగారు
DeleteSuper
ReplyDelete
ReplyDeleteపద్మార్పిత 'పాదా(ల) నిసలని వదిలి బెట్టి పదనిసల్ని పట్టిందేమి టి చెప్మా :)!
జిలేబి
పాదాలతో ఎప్పుడూ పాకడమే అంతే కష్టం కదండి ;-))
Deleteఅందుకే అప్పుడప్పుడూ ఈ పదనిసలు పాటలు :-))
ఈ కవిత ఆద్యంతం చిన్ననాటి జ్ఞాపకాలను తట్టి లేపింది.. అందుకే తెల్లారే పొద్దు ఈ వ్యాఖ్య.. రసవత్తరంగా ఆలోచింపజేసే పదాలతో ఆసక్తికరముగా ఉంది పద్మగారు.
ReplyDeleteహమ్మయ్య పొద్దునే మీకు కూసింత పాత తలపులు గుర్తు చేసాను...హ్యాపీ :-)
Deleteసూరీడూ నెలరేడూ అగపడని ఇరుకు సందుల్లో
ReplyDeleteఒకరి నెత్తి పై ఒకరం పిచుకగూళ్ళలో బతికేస్తున్నాం.
వెలుగే కనపడని బొరికలో
గాలే చొరబడని కలుగులో బతికేస్తున్నాం.
విజ్ఞానమున్నా విజ్ఞత నశించి
బొరియల్లో ఎలుకలవలే బతికేస్తున్నాం.
చదువు కొన్నాం వివేకం నశించింది,
పక్కవారెవరో తెలియకున్నాం బతికేస్తున్నాం
మా దగ్గరుంది అభివృద్ధి గొప్ప.
మీదగ్గరేంఉది ఒట్టి మట్టి తప్ప. బతికేస్తున్నాం
శర్మగారూ....ఎలా ఉన్నారు? చాన్నాళ్ళైంది బ్లాగ్ వైపు రాక, అన్నీ నగ్న సత్యాలు చెప్పారు. _/\_ అంతే తప్పదు...బ్రతుకుతున్నాము బ్రతికేస్తుంటాము!
Deleteకుబుసం చిత్రంలో పాట పల్లె కన్నీరు పెట్టింది
ReplyDeleteమీ కవితలో పల్లె నవ్వింది...బాగింది పద్మాజీ
ఒక అధ్భుతమైనా పాటని గుర్తుచేసారు. ఆ పాట పల్లెతో పాటు మన కంట కూడా కన్నీరు పెట్టిస్తుంది.
Deleteపద్మార్పిత పదప్రయాణం క్రొత్తదారిలో వెళుతుంది.
ReplyDeleteఏదీ ఇంకా దారి దొరకనిదే :-)
Deleteఈనాటి ఈ కవిత మీద కామెంట్ రాయడానికి నాకున్న నాలెడ్జ్ సరిపోదు గానీ , నేను మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ పల్లెటూర్లో ఎంజాయ్ చేసొస్తా , ఇవాల్టికి మీరంతా కుమ్ముకోండి . పల్లెకు పోదాం పారుని చూదాం చెలో చెలో ... అల్లరి చేదాం చెలో చెలో......
ReplyDeleteఎంజాయ్ చేసి పల్లెటూరి కబుర్లు కొన్ని మాక్కూడా చెప్పడం మరువకండి మరి :-)
Deleteఇప్పుడు పల్లెలు కూడా పట్టణాలని మించిపోతున్నాయి పద్మగారు.
ReplyDeleteఅవును నాగరికతతో పాటు సహజత్వాన్ని కోల్పోవడం విచారకరం
Deleteఇప్పుడు అంతా కలుషితం ఐపోయింది, పల్లెల్లో మాత్రం ప్యూరిటీ ఎక్కడ ఉందని అర్పితాజీ
ReplyDeleteఅవుననక తప్పదు
Deleteసూపర్ మచ్చి,.... :-))
ReplyDeleteమచ్చీ అంటే హిందీలో చేప, పల్లెటూరిలో చేపల చెరువులు సూపర్ అని అర్థమాండి :-)
Deleteపల్లెటూరి మాధుర్యాన్ని చక్కని పోలికతో రమ్యంగా మీ కవిత్వం ద్వారా తెలియపరిచారు... ఫోటో క్రియేషన్ చాలా బావుంది మేడం....
ReplyDeletethank you _/\_
Deletegood comparison.
ReplyDeletethank you.
Deleteippudu palle ledu patnamu ledu antaTa kalmasham
ReplyDeletekalmashaalu manusuku maatrame vartistundi kaalushyam prakrutiki vartistundi nandu gaaru.. kalmasham leni manasu vundaali.. kaalushyam leni prakruti vundaali.. appude snehitulaina sannihitulainaa.. appude jeevamaina jeevakoti aina.
DeleteThis comment has been removed by the author.
ReplyDelete