ఏమైనావో ఎక్కడున్నావో వివరమే తెలియలేదు
ఎదను భారంచేసి ఎందు దాగినావో జాడనేలేదు!
నిట్టుర్పేదో వదిలే ఉంటావది నా చెవిని తాకలేదు
సందేశం ఏదో పంపే ఉంటావు నా దరికి చేరలేదు
నా ఏమరుపాటిది అనుకోనిదే ఊపిరి ఆడ్డంలేదు!
సూచాయిగా సూచనే చేసావు నేనది చూడలేదు
కనులు మూసి తెరిచే కునుకులోన కనబడలేదు
ఏల క్షణమైనా కునుకు వేసానో అర్థకావడంలేదు!
నా మోముపై అశ్రువక్షరాలు నీవు చదువలేదు
వెళ్ళొద్దని దారిలో నా మాటలేవీ నిన్ను ఆపలేదు
మూగబోయిన మనసు దూరాన్ని తగ్గించలేదు!
జ్ఞాపకాల ముళ్ళే గుండెలోదిగి నొప్పి ఆగడంలేదు
నీ నిరీక్షణలో కారిన కన్నీటిధార ఆవిరైపోవడలేదు
నిన్ను మరువమంటే మనసుమాట వినడంలేదు!
Lovely heart touching feel.
ReplyDeletePainting is simply superb.
thank you
Deleteనిరీక్షణలో అసంకల్పిత సందిగ్ధ స్థితులను చక్కగా వ్యక్తీకరించారు పద్మ జి .
ReplyDeleteవెల్ కం & థ్యాంక్యూ
Deleteఆర్ద్రాక్షరాల వియోగాభియోగభరిత కవిత...
ReplyDeleteఅంతేనంటారా వినోద్ji
Deleteమూగమనసు దూరాన్ని తగ్గించలేదు అందంగా చిత్రించారు వేదనని
ReplyDeleteధన్యవాదాలు
DeleteSimply Sooperb
ReplyDeletethank you
Deleteచాలా చాలా బాగుంది మాడం. పాతరోజులు గుర్తుకు వస్తున్నాయి
ReplyDeleteరాయడం మానేసారు/మరచిపోయారు యోహంథ్ మీరు
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteశ్రీధర్ గారు దీన్నిబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నాకు అసలు భాషాపరిజ్ఞానం లేదని, అయినా తప్పదు నా స్నేహితుడిగా మీరు భరించవలసిందే! :-) thank you _/\_
DeleteThis comment has been removed by the author.
Deletethank you and wish you the same.
DeleteSridhar Bukyagaru...ఏం వ్రాసినట్లు?
Deleteఎందుకు డెలిట్ చేసినట్లు?
మాబోటివారు తెలుసుకోరాదన్న కట్టడియా?
This comment has been removed by the author.
Deleteమీ ప్రణయ భావాలకు ఓంనమః
ReplyDeleteధన్యవాదాలు
DeleteAdbhutam!
ReplyDeletedhanyavaadamulu
Deleteమరో అధ్భుత కవితాగానం మీ కలం నుండి
ReplyDeleteధన్యవాదాలు
Deleteసూచాయిగా సూచనే చేసావు నేనది చూడలేదు..అయ్యో నేరం అంతా కధానాయకిదే అంటారా :) చాలా బాగావ్రాసారు
ReplyDeleteనేరం వేరొకరిపై మోపితే ఒప్పుకోరుగా
Deleteభావం చిత్రం రెండు అతికినట్లు సరిపోయాయి. కవితని మీదైన శైలిలో పండించారు
ReplyDeleteధన్యవాదాలు
Deleteఎదను భారంచేసి ఎందు దాగినావో జాడనేలేదు super rasaru
ReplyDeletethank you
Deleteenta premo?
ReplyDeletepremea :-)
Deleteజ్ఞాపకాల ముళ్ళే గుండెలోదిగి నొప్పి ఆగడంలేదు నీ నిరీక్షణలో కారిన కన్నీటిధార ఆవిరైపోవడలేదు నిరీక్షణతో అలసిన వేదనాక్షరాలు
ReplyDeleteభారంగా ఉంది కమెంట్ కూడా...థ్యాంక్యూ ;-)
Deleteఎదభారం చేసిన వాడి కొరకై వేచిచుసి, చేరని సందేశం కోసం ఊపిరాడని వలపు పాషాణంలో విలవిలలాడుతున్న మనసు వేదనని ఇంత హృద్యంగా మీరు కాక ఎవరు తెలుపగలరు.... ఈ సీజన్ లో ది బెస్ట్ కవిత... హ్యాట్సాఫ్ మేడం...
ReplyDeleteఅంటే వేదననే హృద్యంగా చెప్పగలను అంటారా :-) థ్యాంక్యూ.
Deleteఅనురాగంలో మిళితమైన వ్యధాభరిత వాక్యాలను అధ్భుతంగా చిత్రంతో కలిపి అందించారు. అభినందనలు.
ReplyDeleteథ్యాంక్యూ...చాన్నాళ్ళకి మీ కమెంట్
Deleteనా మోముపై ఆశ్రువాక్షరాలు నీవు చదువలేదు
ReplyDeleteవెళ్ళొద్దని దారిలో నా మాటలేవీ నిన్ను ఆపలేదు
మూగబోయిన మనసు దూరాన్ని తగ్గించలేదు!
అధ్భుత లిరిక్స్, ఆడ ఆరుద్రవి అయిపో, frankly :)
సినిమా పాటలు వ్రాసేయ్ పద్మా
ఎందుకండీ సంధ్యగారూ...ఇక్కడ మీ బుర్రలు తింటున్నది చాలదా, వాళ్ళనైనా ప్రశాంతంగా ఉండనివ్వండి. థ్యాంక్యూ.
Deleteఅత్యధ్భుతః
ReplyDeleteధన్యురాలిని
Deletechala baagundandi
ReplyDeleteThank you. I saw your blog. nice, keep writing.
Delete>ఆశ్రువాక్షరాలు
ReplyDelete?
శ్యామలీయంగారు...నేను రాసిన వాక్యం తప్పే అయినా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇన్నాళ్ళూ మీబోటి పండితులు నేను రాసే పిచ్చి రాతలు చదవరు అనుకునే దాన్ని, నేటి మీ ఈ "?" తో అది పటాపంచలు అయిపోయింది. ధన్యోస్మి_/\_
Deleteఅమ్మా పద్మార్పితగారూ, నేను ఆదునిక ధోరణి కవిత్వాన్ని చదవనని ఎందుకనుకుంటారు? నేను అభిమానంగా చదివే కొన్ని బ్లాగుల్లో మీ బ్లాగూ ఉన్నది. ఆమధ్య కొండలరావుగారికి ఆయన బ్లాగులో ప్రచురణకోసం ఇచ్చిన ముఖాముఖీలో మీ బ్లాగునూ ప్రస్తావించాను. ఆ ముఖాముఖీని ఇక్కడ చదవవచ్చును. ఇకపోతే నేను పండితుడను కాదు బాబో అని వీలైనప్పుడల్లా మొత్తుకుంటున్నా ఎవరూ వినటంలేదు. పోనివ్వండి మీ అభిమానం మీది. ధన్యవాదాలు. భాషను అందంగా వాడగలకతం దైవదత్తమైన వరం. అందమైన తెలుగుభాషను మరింత అందంగా వాడగలగటం సామాన్యం కాదు కదా. ఐతే సహజసిధ్ధంగా వరంగా వచ్చిన ఆ ప్రతిభను భాషమీద పట్టుసాధించి మరింత శోభాయమానంగా ప్రయోగించితే ఇంకా బాగుంటుంది, మిమ్మల్ని తప్పుపట్టటం నా ఉద్దేశం కాదు. సానుకూలంగా తీసుకొని నందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి. అంధ్రత్వ మాంధ్రభాషాచ నాల్పస్య తపసః ఫలమ్ అని అప్పయదీక్షితులు గారి మెచ్చికోలు (అయన తమిళుడు) అందమైన మీ కవిత్వంతో తెలుగమ్మకు హారతులెత్తండి. స్వస్తి,
Deleteమీ అభిమానానికి నేను పాత్రురాలిని అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. _/\_
Deleteజాడలేదు అంటూ జాలిగా చెప్పినా బాగుందండి
ReplyDeleteథ్యాంక్యూ కల్కిగారు
Deleteనా మోముపై ఆశ్రువాక్షరాలు నీవు చదువలేదు
ReplyDeleteవెళ్ళొద్దని దారిలో నా మాటలేవీ నిన్ను ఆపలేదు
మూగబోయిన మనసు దూరాన్ని తగ్గించలేదు!
పద్మ గారి కవితా ఖండిక అద్భుతమైన భావనాపటిమతో సంతరించుకుంది. కాని, ఒక్క మాట ప్రయోగం మాత్రం
"ఆశ్రువాక్షరాలు" అన్న పదం కొంచెం సందర్భోచితంగా ఆలోచింపజేస్తోంది. భావంలో అంతగా ఇబ్బంది పెట్టకపోతున్నా, పడపరయోగంలో కొన్ని సార్ధకతలు, సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం, ఆ పదాన్ని కొంచెం మార్పుతో సవరిస్తే చాలా బాగుంటుంది అని అనిపించక మానదు అని చెప్పాలి. "ఆశ్రువాక్షరాలు" మాటకు బదులు "అక్షరాశ్రువులు" అని మారిస్తే, ఆ పాదానికి కొంచెం ఉపశమనం కలిగించి, కవితాపథంలో నిరాఘాటంగా దూసుకుపోక తప్పదు అని చెప్పాలి.
ఈ సందర్భంలో Sridhar Bukya గారి - "అక్షువు నుండి జారేవి అశృవులు పదభ్రంశం గావించి అశ్రువు కాని ఆశ్రు లేదు పద్మగారు. అక్షాశృవుతప్తపదాలు అంనంటే బాగుండేదేమో; మోము పై అనే కంటే అక్షువు త్యజించిన అశృబిందువు లిఖించిన అక్షరాలు ఐతే.." అన్న అబిప్రాయంతో ఏకీభవించక తప్పదు. ఈ కవితకు నేను స్పందించిన విషయాన్ని మరల వక్కాణించడం సముచితం; అవి యిలా ఉన్నాయి:
"కునుకు లాగడం, తీయడం సార్ధక ప్రయోగం; అలాగే, "అక్షరాశ్రువులు" ("ఆశ్రువాక్షరాలు" అన్న దుష్టసమాసం మూలాన) అని మారిస్తే, చదవడంలో పదాల బిగింపు, తూగు మరింతగా బాగుంటాయని నాకనిపించింది." మిత్ర పండితుల భావాన్ని/సూచనలని దృష్టిలోపెట్టుకుని, పద్మగారిని అనువుగా పదాలను మారిస్తే, కవితకు మరింతల సొగసు, సొబగు సమాంతరంగా కలుగుతాయని పున:ప్రస్తావన చేస్తూ, ఏది ఏమైనా "నీ జాడలేదు" కవితను అత్యద్భుతంగా, ప్రేరణాత్మకంగా సమకూర్చిన Padmarpita గారిని అభినందిస్తూ, మున్ముందు మరిన్ని భావాత్మకమైన కవితలను మరింత రసజ్ఞ రమణీయతలను పెంపొందించుకొని ఆవిష్కరించడం తథ్యం అని భావిస్తూ, పద్మ గారికి హృదయపూర్వక అభినందనలు చెబుతూ, కొంపెల్ల శర్మ.
నేను రాసిన భావాక్షరాలకి కవితా ఖండిక అనే అర్హతే లేదు అనిపిస్తుంది మీరు రాసిన వివరణాత్మక వ్యాఖ్యలు చదివిన తరువాత. ఇందరు భాషాప్రవీణులు విశ్లేచించి విశధీకరించేలా చేసిన నా పదాలు కడు పావనం అనే అనుకుంటున్నాను. అవి తప్పే అయినా...(తప్పు రాయబట్టే పావనం అయిందేమో). నిజానికి పదప్రయోగం అంటే ఇంతలా ఆలోచించాలన్న విషయమే నాకు తెలీయదు. కేవలం నా భావాన్ని మీతో పంచుకోవాలన్న జిజ్ఞాస తప్ప. "ఆశ్రువాక్షరాలు" అన్న పదం కన్నీటి అక్షరాలు మోము పై చూడలేదు అనే భావాన్ని చెప్పాలన్న ప్రయత్నం చేసానే కానీ అందులో సార్ధకతలు, సమాసాలు, సంధులు సంప్రదాయాలను పరిగణలోకి తీసుకుని ఆలోచించి రాయాలన్న ధ్యాసలేదు. సహృదయంతో మన్నిస్తారని ఆశ్శిస్తూ...ఇకపై కడు జాగ్రత్త వహిస్తానని తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన నా భావాలని సుతారంగా మందలిస్తూ మొట్టికాయవేస్తున్నాను. సదా మీ ఆదరాభిమానాలని కోరుకుంటూ-పద్మార్పిత
DeleteThis comment has been removed by the author.
DeleteSridhar Bukya గారు,
Delete"సూచాయి" గురించికూడా తెలియచేయమని మనవి.
భవదీయుడు
This comment has been removed by the author.
Delete" అశ్రువాక్షరాలు " ఎంత బలమైన భావన ? దీనితరువాత " నీవు చదువలేదు "అని చెప్పడం . వేదన వల్ల అశ్రువులు , ఆ అశ్రువులే చారికలై చెంపలపై అక్షరాలుగా రూపు దిద్దుకోవడం . ఐనా , వాటిని ప్రియ నేస్తం చూడకపోవడం , చదవకపోవడం , ప్రేయసికి ఇంకా వేదనా భరితం కదా . పద్మార్పిత గారికి తప్ప ఇంతటి బరువైన భావన ఇంకెవరికి తోస్తుంది ? నాకైతే ఈ పదబంధపు బరువు మనస్సుకు హత్తుకుంది . మార్చివేసి , సాదాసీదా చేశారు , " పద్మగారి మార్కు " పదబంధం కాకుండా . అశ్రువాక్షరాలు పదబంధాన్ని చాలమంది విమర్శించారు కానీ , అందులోని పద్మార్పిత మార్కు భావనా ప్రతిభను గమనించినట్లు తోచదు . పండితులుకదా మరి . కాక పోతే వా కు దీర్ఘం తీసేసి , అశ్రువక్షరాలు అని దిద్దుంటే అందరికీ సమాధానమయ్యుండేదేమో .
ReplyDeleteమీ అభిమానానికి నెనర్లండి. పదం ఏదైనా మొత్తానికి నా భావం మీ అందరినీ చేరింది అది చాలు _/\_
Deleteఅశ్రువాక్షరాలు' అన్న పదప్రయోగం లో తప్పు కనిపించడంలేదని నా భావన. వ' కి దీర్ఘం ఇవ్వడం తప్ప... 'ఆశ్రువక్షరాలు' అని సరి చేస్తే చాలు... సంధి కుదురుతుంది... ఇక సనాతన సంప్రదాయాలంటారా...అవి కాలానికి తగినట్లు మారాలి.. ఉదాహరణకు.. విష్ణువు + అతడు =విష్ణువతడు. ఇందులో ' విష్ణువు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' విష్ణువు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చినది.
ReplyDeleteవిష్ణువు + అతడు = విష్ణువతడు అయినది. ఇందులో లేని తప్పు పద్మార్పిత గారు రాసిన " అశ్రువక్షరాలు " లో లేదనుకుంటాను.. శ్యామలీయం గారు, భూక్యా శ్రీధర్ గారు... & కొంపల్లె శర్మ గారూ.. అక్షరశ్రువు -కి అశ్రువక్షరం కి చాలా తేడా ఉంటుంది. కవితలో భావం మారిపోతుంది. కవయిత్రి భావ ప్రకటనకి మీ సలహా అడ్డుకట్ట వేసినట్లు ఉంటుంది. గమనించగలరు.
ఇక చివరగా నేను చెప్పొచ్చేది ఏంటంటే... చదువురానివాడు...అక్షరాలూ పలకలేనివాడు..అజ్ఞాని..మూర్ఖుడు ఇలా ఎవరని తేడా లేకుండా వాళ్ళ హృదయంలో దాగలేక తన్నుకోచ్చేదే కవిత్వం. దానికి నియమాలు..సంప్రదాయాలు .. ఛందస్సులతో పని ఉండదు.. ఒక భావాన్ని హృదయం లోంచి వేల్లగక్కలేకపోతే ఊపిరాదదేమో అన్న సందర్భంలో వ్యక్తి విసర్జించే భిన్న భా వాక్షరమాలిక కవిత...
వినోద్ గారూ ఈ భిన్నమైన అర్థాలు నాకు తెలియవు కానీ సత్ విమర్శలై సరిచేస్తే తప్పులేదు అనుకుంటాను. తెలియనివి తెలుకునే అవకాశం దక్కినట్లే కదా. _/\_
Deleteవిష్వక్సేనుడు గారికి,
Deleteఅయ్యా, అశృశబ్దమూ అక్షరశబ్దమూ ఉభయమూ సంసృతశబ్దాలు. అశృశబ్దానికి తెలుగుచేసుకుంటే ప్రథమావిభక్తిలో అది అశృవు అని తెలుగుపదం అయ్యింది. తెలుగుపదం ప్రక్కన సంసృతపదం అలాగే ఉంచి సమాసం చేయరాదు. మేం చేస్తాం అంటే ఏం చేస్తాం! ఇకపోతే కవయిత్రి భావ ప్రకటనకి నా సలహా అడ్డుకట్ట వేసినట్లు ఉందని మీ అభిప్రాయం గమనించటమైనది. కాని నా ఉద్దేశం అది కాదని కనీసం కవయిత్రిగారికి అవగతం ఐనదని ఆశిస్తాను. భాషాసంప్రదాయాలను గౌరవించనక్కరలేదు అనుకొంటే దానికి నాబోటివారు చెప్పగలిగినది ఏమీ లేదు. ఇన్నాళ్ళూ అనేకమంది ఎంతో ఉన్నతంగా తమ భావశబలతను ఆవిష్కరించటానికి ఈ భాషాసంప్రదాయాలు అడ్డురాలేదు కాని ఈ నాడు అలా వచ్చేస్తున్నాయంటే దానికి మనం భాషను అధ్యయనం చేయటం పట్ల చిన్నచూపు చూడటమే కాని ఆ భాషలూ సంప్రదాయాలూ కావని నా మనవి. అలా కాదు శ్యామలీయం అలా ఎత్తిచూపతమే తప్పూ తప్పున్నరా అని ఎవరైనా అనుకుంటే నమోన్నమః.
feelings arthamaite chalu, ae grammatical mistakes pattinchukuni chesedi amundi ani my feel. unwanted discussion and andaru goppa vallami ani vadanalu.
Deleteఅయ్యా... శ్యామలీయం గారు.... /// తెలుగుపదం ప్రక్కన సంసృతపదం అలాగే ఉంచి సమాసం చేయరాదు. మేం చేస్తాం అంటే ఏం చేస్తాం! //// అశ్రు'వు + అక్షరా'లు రెండూ తెలుగు పదాలే... గమనించగలరు.
Deleteనమస్తే...
ఎక్కడ ఉన్నా వెంటనే రావలసినదిగా మనవి.
DeleteSatish Kotturigaru మీరు ఎక్కడ..ఇక్కడ మీరు most wanted :)
Deleteభావగర్భితం మీ ప్రతి కవితాచిత్రం.
ReplyDeletethank you.
Deleteఅశృ శబ్దము అశృవు గా మారి నట్లే , అక్షర శబ్దము కూడా అక్షరాలు గా మారింది . ఇప్పుడు రెండూ తెలుగు (తత్సమ)
ReplyDeleteపదాలే . పదబంధం చేస్తే అశ్రువక్షరాలు అని తెలుగు సంధి చేయవచ్చు . అంతే కాని , మనోజ్ఞమైన పద్మగారి భావాన్ని ఉల్టా చెయ్యడం విజ్ఞత కాదు . పండితులు కదా మరి !!! పీకి పాకాన పెట్టక మానరు కదా ! మనదురదృష్టం , ఏమి చేస్తాం ? ప్చ్.....
మరేం...
Deleteరాజారావుగారూ, విష్వక్సేనుడుగారూ, మీరిద్దరూ నన్ను క్షమించాలి. 'అశ్రువక్షరాలు' అని తెలుగు సంధి చేయవచ్చుననే అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. ఇది వ్యాకరణచర్చకు సరియైన వేదిక కాదు కాబట్టి ఇంక వదిలేద్దాం. "పండితులు కదా మరి !!! పీకి పాకాన పెట్టక మానరు కదా !" అని మీరు నన్ను అనటం అంత అవసరం కాదేమో, రాజారావుగారూ, దయచేసి యోచించండి. నేను పండితుడినని ఎన్నడూ ఎక్కడా చెప్పలేదు. అది మీకూ తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. అసలు దురదృష్టం నాదే అనుకుంటున్నాను. మీరొక సారి నా మొదటి వ్యాఖ్యను గమనించండి - కేవలం ఆ ప్రయోగంప్రశ్నార్థకం అని నా ఉద్దేశాన్ని సూచించానంతే! ఇకపోతే ఇప్పుడు దాన్ని అందరూ కలసి విషయాన్ని 'పీకిపాకంపడుతున్నా' రని చదువరుల్లో ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చును. కనీసం వారిలో కొందరైనా నా ప్రమేయం ఎంతవరకో ఎటువంటిదో అర్థంచేసుకుంటారని అశిస్తాను. నన్నొక మాటో పదిమాటలో అనటం ద్వారా ఎవరి కైనా తృప్తి కలిగితే కలగనివ్వండి.
Deleteశ్యామల రావు గారూ ,
Deleteనేనన్నది పండితుల విషయం , మీరు పండితులు కానే కాదు కదా , ఈవిషయాన్ని మీరే అనేక పర్యాయాలు నొక్కి వక్కాణాంచడం జరిగింది . ఇక పోతే , నేను మిమ్మల్నసలు ఉద్దేశించనూ లేదు , సంభోదించనూ లేదు . మరి , ఇంకెందుకీ రగడ , మిమ్మల్ని ఒకమాటో , పది మాటలో అనాలన్న దురద అసలేం లేదు . ఇక వొదిలెయ్యండి సంత .
గివి కవితలు కథలో నాకు తెల్వదు మేడం మంచి ముచ్చట్లు మజాగ రాస్తపొండ్రి చదివి సంతోసిత్తం. హాపి దీపావళి
ReplyDeleteఅట్లనే మీరు సదువుకోండ్రి
Deletethank you
simply your poetry is rocking padmaji. continue it. 3 rounds tupaki gallo pelidi. :)
ReplyDeletethank you but why 3 bullets you wasted :-)
DeleteWish you a happy Diwali
ReplyDeleteAwesome pic and poetry mam
Thank you Suresh and wish you the same
Deleteజ్ఞాపకాల ముళ్ళే గుండెలోదిగి నొప్పి ఆగడంలేదు
ReplyDeleteనీ నిరీక్షణలో కారిన కన్నీటిధార ఆవిరైపోవడలేదు
వేదనాభరిత అక్షరాలు నిన్ను వరించి వదలడంలేదు
అందుకే ఇంతందంగా వ్రాసి చర్చావేదిక చేసావు బ్లాగుని. బాగుంది పద్మ
అందరూ అభిమానంతో సరిచేస్తున్నారే కాని అది నేను చర్చగా అనుకోవడంలేదండి సృజనగారు. మీ స్ఫూర్తి స్పందనకు నెనర్లు.
Deleteపెద్దలందరి వివరణలో ఎన్నో కొత్త విషయాలు తెలిసినప్పటికీ....నేను చెప్పాలనుకున్న భావం ముఖంపైన అశ్రువులుగా మారిన అక్షరరాలని నీవు చదువలేదు అని. అది చెప్పడానికి నేను అనుకున్న పదం "అశ్రువక్షరాలు" అది ఎంత వరకు సరైన పదమో నా తెలియదు కానీ నా భావం మీ అందరూ సహృదయతో అర్థం చేసుకునే ఉంటారు అనుకుంటున్నాను. పెద్దలు చెప్పినట్లు "అక్షరాశ్రువులు" అని మారిస్తే అక్షరాలు అశ్రువులుగా మారి నా భావం కుంటుపడినట్లుగా తోస్తున్నది. _/\_
ReplyDeleteగౌరవనీయులయిన పెద్దలు ఎత్తి చూపిన అంశాలు ..... ఆంద్ర సంస్కృత సాహిత్య వ్యాకరణ విశేషాలు పాపం దుఃఖేష్వనుద్విగ్నమనస్కయై , వేదనాభరితయై యున్న ఆమె పట్టించుకునే స్థితిలో లేదు . ఆమె ఆవేదన ఆక్రోశం ఆ క్షణం మనసు పలికిన భాషలో వ్యక్త పరిచింది . వేదన తెలిసింది , భావాన్ని స్వీకరిద్దాం ; భాష ని వదిలేద్దాం .
ReplyDeleteధన్యవాధాలండి భావాన్ని అర్థం చేసుకున్నందుకు, భాషను గురించి సున్నితంగా చెప్పి మనసు భారం తగ్గించినందుకు!
Deleteకొంచెం వివరంగా చెప్పాలంటే .... సంస్కృత భాష నుండి అనేక పదాలు వివిధ భాషల్లోకి దిగుమతి అయ్యాయి , అశ్రువు అక్షరం అలా తెలుగులోకి వచ్చినవే . వీటి మధ్య సంధీ కుదురుతుంది , సమాసమూ కుదురుతుంది . అయితే అశ్రువు ఏక వచనంలో ఉంది , అక్షరాలు బహువచనంలో ఉన్నాయి . ఈ రెంటినీ ఒక ద్వంద్వ సమాసంలో ఇరికించడానికి ధాతువులు రెండూ ఏకరూప స్థితిలో లేక పోవడం సమస్యగా మారింది . అదే అక్షరాశ్రువులు అని ప్రయోగించినపుడు అటువంటి ఇబ్బంది ఎదురుకాదు . భావ కవితల్లో అదీ విషాద గీతికల్లో భాష తడబడటం సహజం , కానీ ఈ చర్చ వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి .
ReplyDelete_/\_thank you_/\_
Deleteఅన్ని నమస్కారాలెందుకు గానీ , ఒక ముచ్చట చెప్తాను వినండి . చంద్రబోస్ ఏదో సినిమాలో గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ... అనే ఒక పాట రాశాడు . అందులో ఒకచోట ... అదిరిపడ్డ మనసుకేంది అర్ధం అడుగుతోంది ఎదురుచూసి అధర కాగితం , నీ మధుర సంతకం ... అని వస్తుంది . అధర కాగితం , మధుర సంతకం అనేవి రెండూ అతి భయంకరమయిన రాక్షస సమాసాలు . అధరం మధురం రెండూ సంస్కృత పదాలు . కాగితం సంతకం తెలుగు పదాలు . వాటిని వీటిని కలిపి సమాసంగా ప్రయోగించడం నిషిద్ధం . వ్యాకరణ దోషం ఉందని చంద్రబోస్ ఒప్పుకున్నాడు గానీ , భావం ఆ రాక్షస సమాసాలతోనే ముడి పడి ఉండడం తో వాటిని మార్చకుండా అలాగే ఉంచేశాడు . కొన్ని సార్లు భావం అనేది అన్నిటినీ డామినేట్ చేసేస్తుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ .
Deleteసూపర్ చెప్పారు
Deleteఒక్కటి మాత్రం నిజం . మిమ్మల్ని విమర్శించడం నా లక్ష్యం కాదు . అలాగని పొగడడం కూడా నా లక్ష్యం కాదు . పొద్దుటే లేవగానే గబ గబా కిటికీ దగ్గరకు పరుగెత్తి , ఆ ఇంటి వైపు చూడటం ... ఆవిడ లేచిందా , లేస్తే వాకిట్లో చక్కగా కళ్లాపి జల్లి ముగ్గు వేసిందా లేదా ? వేస్తె కనుక అది ఏ ముగ్గు ? ఎన్ని చుక్కలు ? ఏ ఏ రంగులు ఎలా కలిపింది ? అని ఎదురు చూడడం , సంతోష పడడం ఇదే నా లక్ష్యం ........
ReplyDeleteఅంటే ఇక పై మరింత శ్రద్ధగా ముగ్గులు వేసి రంగులద్దాలి అన్నమాట. థ్యాంక్యూ
Deleteఇందుకే ఇందుకే ఇందుకే మరి నువ్వు ఇంత పిచ్చపిచ్చగా నచ్చేసావు. ఇంతమంది జనాల మెదడుకి మేత, నాకు మెదడు మోకాలి క్రిందికి జారిపోయింది, ఇంత ఆలోచించి చించి కవిత వ్రాయాలా అని. నావల్ల కాదు తల్లో ఇలా ఆలోచించడం అదేదో నువ్వే చేసెయ్.
ReplyDelete"కవిత వ్రాసిన తీరు పదబంధం చిత్రం అన్నీ మనసుని హత్తుకున్నాయి" అంతే అంతే అంతే.
మెదడుకి మేత ఏమో కానీ...ముందు ఏ భయం లేకుండా రాసేదాన్ని ఇప్పుడు రాయాలంటే గుండెల్లో ఏదో గుబుల్ గుబుల్. :-) థ్యాంక్యూ.
Deleteనా మోముపై అశ్రు అక్షరాలు నీవు
ReplyDelete"అశ్రువక్షరాలు" బదులు అశ్రు అక్షరాలు అంటే సరిపోతుందేమో.
ముందరే చెబుతున్నా నేను పండితుడిని కాను.
మీకు వందనములు._/\_ భావం అర్థం చేసుకున్నారుగా అది చాలు. ధన్యవాదాలు.
Deleteఅసాధారణ కవిత
ReplyDeleteఅందుకే
ప్రశంసలు
విమర్శలు
దీవెనలు
అన్నీ ఆనంద అమోదమే :-) థ్యాంక్యూ
Deleteఎగసిపడిన భావకెరటం
ReplyDeleteమీ అందరి అభిమానం
Deleteపదదోషాలు ఉన్నా భావం భవ్యం
ReplyDeleteభావం అక్షర ప్రవాహమై తడవనీయి-హరినాధ్
మీ అభిమానానికి అశీర్వచనాలకి ధన్యవాదాలండి.
DeleteWhats the problem?
ReplyDeleteNothing Sir.
Deleteఅధ్భుతమైన భావాజాలం
ReplyDeleteఆలస్యంగా చూసాను, చిత్రం భవ్యం
ధన్యవాదాలు మీ స్పందనకు
Deleteకాస్త ఆలస్యమైంది. కానీ ఒక అద్భుతాన్ని చూశాను. గుండె గొంతుకలోన కొట్టుకుంటాది అని నండూరి వారు బావ భావాన్ని వర్ణించినపుడు... గుండె ఎలా గొంతుకలో కొట్టుకుంటుంది అని ఆలోచించలేదు.... బావ కళ్లలో ఎంకి కోసం దాచి ఉంచి ప్రేమబాష్పాలను ఊహించాను. ఇక్కడా అదే నిరీక్షణ.. ఈ సారి ఎంకిలాంటి పిల్ల... నండూరి లాంటి బావ కోసం ఎదురు చూపు. చిక్కనైన కవితలో చక్కనైన పదాల అమరిక పద్మకు ఎప్పుడూ సొంతమే. అర్థం కాని హుసేన్ చిత్రాన్ని చూసి పక్కవాడు ఏమనుకుంటాడో అని వహ్వా అంటాం. రవి వర్మ గీసిన చిత్రం మన పూజగదిలో ఉన్నా పెద్దగా పట్టించుకోం. ఏదైనా పామరుడికి అర్థమయ్యేదే కళ. లేనప్పుడు అది ఒట్టి వృధా ప్రయాస. పద్మ గారి కవితలు అక్షరజ్ఞానం లేని వారిని కూడా అలరించగలవు. అక్షర దోషాల కోణం ఎప్పుడు కానిపించలేదు.... ఆమె కవితా దృక్కోణమే కనిపించేది. ఇప్పుడు నాకదే కనిపిస్తోంది. ఆ చిత్రం ఎంకిపాట కనిపిస్తోంది. నిజంగా నా గుండె గొంతుకలో కొట్టుకుంటా ఉంది. పద్మగారు వహ్వా. ఇక అశ్రువాక్షరాలు అంటారు. అందులో తప్పులేదు. అశ్రువులు కింద పడ్డాక... అవి చెప్పే లిపికి... సంధులు సమాసాలు ఉండవు. కేవలం భావం మాత్రమే ఉంటుంది. ఆ దోషంతో భావంలో కలిసిపోయంది. సాగరంలో కెరటంలా..... బాగుంది పద్మగారు.
ReplyDeleteఆ దోషం భావంలో కలిసిపోయంది. సాగరంలో కెరటంలా..... బాగుంది పద్మగారు.
Deleteఆలస్యంగా స్పందించారన్న కించిత్ బాధ పై మీ అందమైన వ్యాఖ్యల నెమలీకతో సుతారంగా చలువ చందనం రాసినట్లుంది.
Deleteమీ కమెంట్స్ కి ఇంతకన్నా రిప్లై ఇవ్వలేక ఎప్పుడూ మీ ముందు ఓటమిని అంగీకరిస్తూనే ఉంటాను. ధన్యవాదములు మీ ప్రశంసాత్మక ప్రేరణా వాక్యాలకు. _/\_
సూపర్ కమెంట్ సతీష్ గారూ...టాప్ లేపేసారు హా హా హా :-)
Deleteవలపులో ఎడబాటు నిరీక్షణలని మీ మార్క్ లో సున్నితంగా చెప్పారు. అభినందనలు.
ReplyDeleteమీ స్ఫూర్తి వాఖ్యలకు ధన్యవాదాలు
Deleteనిన్ను మరువమంటే మనసుమాట వినడంలేదు
ReplyDeleteU R Rocking. Keep it up.
Thank you Mahee
DeleteThis is master piece of your thoughts and feelings.
ReplyDeleteSandhyaji Sukriya
Deleteపద్మమ్మ ఏం రాసినా పరేషానై పంచాయతీ పెడతారన్నట్లు :)
ReplyDeleteఅదేం లేదు
Delete