గుర్తుకొచ్చే..


 గుండె కొట్టుకుంటూ ఉంటే గుర్తుకొచ్చే
నువ్వు అక్కడున్న జ్ఞాపకం తట్టిలేపె

గడిచిన కాలమంతా కఠినంగానే గడిచె
నీ బాస జ్ఞాపకమై వచ్చి లేపనం రాసె

తట్టుకోలేని గుండె తడబడుతూ అడిగె
దు:ఖాన్ని తరిమే నిబ్బరాన్నీయమనె

ఎదను ఎదిరించే శక్తి నాలోనూ ఎక్కువే
అది తరిగిన క్షణమే మది నిన్ను తలిచె

సేదతీర్చుకోమని నా నీడే నన్ను ఓదార్చె
అప్పుడు, ఆగని కన్నీటికి నీవు గుర్తుకొచ్చె

21 comments:

 1. ఏదో ఒకనాడు నువ్వు తిరిగొస్తావని
  ఇలా జీవిస్తున్నాను ,
  నువ్వు ఒంటరి అయిపోతావేమోనని
  మరణాన్నిరానీకుండాఆపుకుంటున్నాను

  ReplyDelete
 2. గుండె కొట్టుకుంటూ ఉంటే గుర్తుకొచ్చే..మొదటి లైన్ తో మొదలైంది గుండె కొట్టుకోవడం.
  Excellent pic

  ReplyDelete
 3. కనులకు సొంపు చిత్రం
  కనులను తడిపే పదజాలం

  ReplyDelete
 4. తడి కన్నుల్లో తేమను చూసే కన్ను ఆర్ద్రతను ఎలా తెలుసుకుంటది
  కన్నీరే బాధను చూసి దూరమవ్వాలని రాలే వేళ..
  మనసు పడే ఆవేదనకు మాటలు చాలునా..
  గలగల గోదారి మండె ఎడారైతే
  ముఖానికే చిరునవ్వుల ముసుగు వేసి
  జ్ఞాపకాలను లోలోపలే కలచి వేసేనా
  ఎన్నాళ్ళి మౌనం ఏది ఆ వాక్ప్రవాహం

  డిస్క్లైమర్: ఎవరిని ఉద్దేశించినది కాదని ప్రార్థన

  ReplyDelete
  Replies
  1. algumas memorias sâo tão profundas que mesmo com o passar do tempo continuam no nosso coraçâo.. nâo se perde e nem se vai

   Meaning:
   some memories are so deep that even with the passage of time remain in our hearts .. shall not be lost and will not be

   Delete
 5. ఒకే మూసలా ఉంది పద్మా.

  ReplyDelete
 6. ఎదను ఎదిరించే శక్తి నాలోనూ ఎక్కువే..keep it

  ReplyDelete
 7. మీ హృదయధ్వని వినిపించే రాగంలో తరగని అనురాగముంది. కవిత అధ్బుతంగా ఉంది. సలాం మాడం!

  ReplyDelete
 8. ఈ ప్రేమకి అంతం ఎప్పుడు?????

  ReplyDelete
 9. హృదయస్పందనలు

  ReplyDelete
 10. అచ్చంగా మాయ గుండె విశ్వానికై కొట్టుకున్నట్లు :-)

  ReplyDelete
 11. తీపి గురుతులు

  ReplyDelete
 12. గుర్తు చేసుకుంటూ ఉంటే గుర్తుకొస్తాయి గుర్తులు మరి :-)

  ReplyDelete
 13. ప్రేమ కన్నా విరహం గొప్పది. విరహం కన్నా జ్ఞాపకం మరీ బరువైంది. బరువెక్కిన హృదయం నిండా విరహాన్ని నింపుకుని ప్రేమిస్తే... ఆ వేదనలో ఆవేదనంతా ప్రేమబాష్పాలుగా మనసు చిలికిస్తూ ఉంటే... కంట నీరు రాదు గానీ.. హృదయం ద్రవిస్తుంది. నిజమైన ప్రేమకు సంకేతమదే. మీ కవిత చెప్పిన సత్యమిదే.

  ReplyDelete
 14. రాయించే ప్రేరణలు మీ స్పందనలు
  వాటినందించిన మీకు నా వందనములు_/\_

  ReplyDelete