మగువనంటూ మదిలోన మదనపడింది చాలు
మదం ఎక్కిన వాడి మగతనాన్ని మసిచేసెయ్!
వెకిలిచేష్టల వారిని వద్దంటూ వారించింది చాలు
వెన్ను వంచి వాడి నరాల్లో వణుకు పుట్టించేయ్!
చంకలోని పసివానికి చనుపాలు ఇచ్చింది చాలు
ఛాతీని చూసి చొంగ కార్చిన వాడి కళ్ళు పీకెయ్!
నలిగిపోయి నలుగురిని న్యాయం అడిగింది చాలు
నడిబజార్లో వాడ్ని నిలబెట్టి నపుంసకుడ్ని చేసెయ్!
సహనానికి మారుపేరు స్త్రీ అంటే సహించింది చాలు
శంకించిన వాడు పతి అయినా పైత్యం పిండేసెయ్!
కామించు అంటే కాదనలేక కుమిలిపోయింది చాలు
కాళిలా మారి వాడి కంఠాన్ని కదంతో తొక్కిపారెయ్!
మదం ఎక్కిన వాడి మగతనాన్ని మసిచేసెయ్!
వెకిలిచేష్టల వారిని వద్దంటూ వారించింది చాలు
వెన్ను వంచి వాడి నరాల్లో వణుకు పుట్టించేయ్!
చంకలోని పసివానికి చనుపాలు ఇచ్చింది చాలు
ఛాతీని చూసి చొంగ కార్చిన వాడి కళ్ళు పీకెయ్!
నలిగిపోయి నలుగురిని న్యాయం అడిగింది చాలు
నడిబజార్లో వాడ్ని నిలబెట్టి నపుంసకుడ్ని చేసెయ్!
సహనానికి మారుపేరు స్త్రీ అంటే సహించింది చాలు
శంకించిన వాడు పతి అయినా పైత్యం పిండేసెయ్!
కామించు అంటే కాదనలేక కుమిలిపోయింది చాలు
కాళిలా మారి వాడి కంఠాన్ని కదంతో తొక్కిపారెయ్!
ఏందక్కా...చండీ వేషం యేసినావ్. మస్తు భయ్యంగుంది
ReplyDeleteగిట్ల భయపడితే గెట్లా తంబి
Deleteచాలా బాగా రాస్తున్నారండి..బెష్!!!
ReplyDeletethank you for encouraging words
Deleteఅమ్మ, ఆలి, అక్క చెల్లిగా అణిగిమణి ఉంటే చెల్లదు. తప్పక మారవలసిందే. టైంలీ పోయం మాడం
ReplyDeleteఅవసరాన్నిబట్టి మారక తప్పదు కదాండీ
Deleteఅమ్మలా అనురాగాన్ని పంచడమే కాదు
ReplyDeleteభగ భగ మండే అగ్నిగుండంలా మారిపో!
ఆదిశక్తి అమ్మ
Deleteఅధ్భుతం-
ReplyDeleteఆడదంటే అబల కాదు సబల అని అక్షరాలతో ఉసిగొల్పి ధైర్యాన్ని అందిస్తున్నారు. నూతన సంవత్సరంలో మరిన్ని స్ఫూర్తిని ఇచ్చే కవితలతో అలరిస్తారని ఆశ్శిస్తున్నాము.
Thank you.
DeleteFire in every sentence...keka
ReplyDeletethank you Suresh
Deleteమీరు మాత్రమే వ్రాయగలరు ఇలా, ఎవరినైనా శాసించేలా
ReplyDeleteనాకన్నా బాగా వ్రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు యోహంత్
Delete
ReplyDeleteబామ్మో ! ఇక్కడేదో విప్లవ వాదం ప్రజ్జ్వ రిల్లు తోంది :) జర దూరంగా వెళ్లి పోదారి :)
ఇలా దూరంగా పారిపోతే ఎలాగండి :-)
Deleteకళ్ళు పీకెయ్! తొక్కిపారెయ్! వణుకు పుట్టించేయ్! పిండేసెయ్! మసిచేసెయ్! అమ్మో ! కాళిక ! చండీక ! భయ్యం ! అగ్ని ! భగ భగ ! సల సల !
ReplyDeleteఇదేదో ముందరికాళ్ళకి బంధము వలె గోచరించు చున్నది ఆచార్యా :-)
Deleteపీకేయ్, తొక్కేయ్ ..అని మీరు అంటే మాత్రం కారణం లేకుండా ఎందుకు చేస్తారు :-)
Deleteకొత్తదనంతో కదం తొక్కి కదనరంగంలో దూకే నవీన ఝాన్సీ రాణి లా ఉన్నారు. కొత్తదనం అంటే అక్షరాలలో రూపు మార్చారు.; భావాల్లో మారలేదు. చిత్రంలో రూపు మారింది; చిత్రం ఎంపికలో రూపుమార్చలేదు. నిజం! మీ పాత కవితలు గమనించినట్లైతే చాలా వరకూ అంతర్లీనంగా ఇలాంటి భావాలే కనిపిస్తాయి. దృవాల్లో సూర్యుడు ఎప్పుడు ప్రశాంతంగానే కనిపిస్తాడు కానీ, అక్కడ ఎప్పటికి అగ్ని జ్వలిస్తూనే ఉంటుంది. మీ కవితలూ అంతే నివురుగప్పిన ‘విప్లవం’. ఇండైరెక్టుగా మగజాతిని ఏకిపడేసిన చాలా కవితలకు ఎంతోమంది భుజాలు తడుముకున్నారు. తిట్టకనే తిట్టి గజగజ లాడించిన మీ ఎన్నోకవితలకు భిన్నం ఈ కవిత. ఈ కవితలో భావాలు మారలేదు. మీరు వ్యక్తపరచిన విధానం మారింది. ఈ కవిత గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇంతటితో శెలవు మేడం... సలాం!!
ReplyDelete
Deleteఅభిమానిగారు...రూపం ఏదైనా నాది కాదండోయ్, అవసరం అనుకున్నప్పుడు అలా రూపాంతరం చెందాలని. అంతే thank you.
ఆల్ఖైదాలో జాయిన్ అయ్యారా... :-) కవిత కెవ్వు!
ReplyDelete
Deleteష్...గట్టిగా అనకండి, అరెస్ట్ చేస్తారు :-)
అనురాగాన్ని చూపించే ఆడది అవసరమైతే ఆదిశక్తి అవతారం ఎత్తాలని చెప్పారు.
ReplyDeleteఅర్పిత అమ్మోరుతల్లి అవతారం ఎత్తినట్లుంది కవితతో...
ఏది...ఆ అవసరం రాలేదు, రాకూడదని
Deleteసహనానికి మారుపేరు స్త్రీ అంటే సహించింది చాలు
ReplyDeleteశంకించిన వాడు పతి అయినా పైత్యం పిండేసెయ్!ఎవరైనా స్పేర్ చేసేది లేదు :)
అంతే కదా మరి :-)
Deleteకాళిక కేళిక
ReplyDeleteధూళిక వధూళిక
ధోంగత ధేయిత నాట్య సుగానరతే
జృంభిత పద గుంభిత రక్తారుణ నేత్రయుతే
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని
పద్మార్పితే!
థ్యాంక్యూ...శాంతింపజేసారు :-)Happy new year in advance Sir
Deleteశాంతి శాంతి శాంతి
ReplyDeleteఇంత ఉగ్రరూపం చూడలేం
మీకు ఆ భయం వలదు నందుగారు :-)
Deleteప్రస్తుతం ఇలాంటి న్యాయమే అవసరం లోకంలో మగమానవ మృగాలకి
ReplyDeleteఆడవాళ్ళు కూడా ఉన్నారు లిపిగారు, కాని వేరో విధంగా.
Deleteఆహా ఇంత కోపం ఎందుకు?
ReplyDeleteno kopam :-)
Deleteకేవలం స్త్రీలే హింసించబడుతున్నారు అనుకోవడం మీ అపోహ పద్మార్పితగారు. పురుషూ బాధించబడుతున్నారు కానీ పైకి చెప్పుకోరు, చెప్పుకున్నా నమ్మరు. మరి వారి మాట ఏమిటో సెలవీయండి.
ReplyDeleteI too agree with you Srinathgaru
Deleteనలిగిపోయి నలుగురిని న్యాయం అడిగింది చాలు
ReplyDeleteనడిబజార్లో వాడ్ని నిలబెట్టి నపుంసకుడ్ని చేసెయ్!
సూపర్ డూపర్ లైక్
thank you
Deleteసహనానికి మారుపేరు స్త్రీ అంటే సహించింది చాలు
ReplyDeleteశంకించిన వాడు పతి అయినా పైత్యం పిండేసెయ్!
ఆడవాళ్ళని ఉసిగొల్పుతున్నారా మాపైన మాడంజీ
చెడుని సంహరిచాలనే తప్ప ఉసిగొల్పడాలు లేవండి
Deletefantastic lines with inspiring words.
ReplyDeletethank you.
Deleteకామించు అంటే కాదనలేక కుమిలిపోయింది చాలు
ReplyDeleteకాళిలా మారి వాడి కంఠాన్ని కదంతో తొక్కిపారెయ్..మారక తప్పని కాలం
అన్నింటా కాదండి!
Deleteపద్మార్పితా...చండీయాగం ఏదైనా తలపెట్టినావా ఏమి. ఏకంగా మగజాతినే ఏకిపడేసావు. సరదాకి అన్నాను.
ReplyDeleteచాలా చక్కగా వ్రాసావు.
అభినందనలు-హరినాధ్
మీకు తెలియకుండా ఏం యాగాలు సర్:-)
DeleteGOOD POST.
ReplyDeleteKEEP IT UP
మీరు ఇక్కడ ఇంత ఉగ్రరూపం ఎత్తినా...ప్రశాంతంగా ఉన్న వాతావరణం చూస్తుంటే నమ్మశక్యంగా లేదండోయ్.
ReplyDeleteకవిత విషయానికి వస్తే...ఊగుతూ ఊపేస్తుంది :-)
మీరు ఇలా అని నిప్పు రాజేయకండి :-)
Deleteజయజయహో స్త్రీ విప్లవం జయహో ☺
ReplyDelete:-)అందరికీ జయం
Delete