గిలిగింత...

 చిటికె వేస్తే వస్తానన్న చలి...
చిందులు వేసుకుంటూ వచ్చి
దుప్పట్లో దూరి ఈలవేసి గోలచేస్తూ
ఏదేదో చెప్పి ఏమార్చకు అంటుంది!

బధ్దకాన్ని బావాని  పిలిచి...
ఒక్కసారి కన్నుగీటిన పాపానికి
ఒళ్లంతా తడిమేసి వదలలేనంటూ
బ్రతిమిలాడేకొద్దీ మరీ బెట్టుచేస్తుంది!

ఏదో విధంగా సర్ది చెప్పాలని...
సరసమాడ సమయమే కాదంటే
కురుల వెనుక మోమునే దాచుకుని
పగటిని చూపి రేయిగా మారినానంది!

వెచ్చదనాన్ని ముద్దుగా ఇచ్చి...
చిన్నగా గిల్లినా సన్నగా జారుకోబోతే
రేయిరెప్పల్లో దాచకు వేడి ఉద్రేకాలనని
రాత్రికి వేసే రాజీమంత్రమేదో తెలుసునంది!

19 comments:

  1. నిజంగా చలిగాడేనా ఇంత పని చేసింది పద్మగారు? :)

    ReplyDelete
  2. "రాత్రి రాజీమంత్రం" బాగుంది పద్మాజీ
    ఇంతకీ తెలిసింది ఎవరికి?
    తెలిపింది ఎవరికి? ha haa

    ReplyDelete
  3. చలిగాలి కొట్టిందో
    బద్దకం కమ్మిదో
    చిన్నది గిలిగింత పెడుతున్నది :-)

    ReplyDelete
  4. బధ్దకాన్ని బావాని పిలిచి...ఇలా పిలిచి రెచ్చగొడితే ఊరుకుంటుందా చెప్పండి

    ReplyDelete
  5. రేయిరెప్పల్లో దాచకు వేడి ఉద్రేకాలనని
    రాత్రికి వేసే రాజీమంత్రమేదో తెలుసునంది
    తెలిసింది ఏమిటో చెబితే నేర్చుకుంటాం మేడం :)

    ReplyDelete
  6. గిట్ల పరేషాన్ చేయకు తల్లీ..

    ReplyDelete
  7. ఇంతకు చలి చంపిందా లేక బధ్ధకం మిమ్మల్ని విడవను అని చెప్పిందా? కంప్యూజ్ కంప్యూజ్..పెయింటింగ్ బాగుంది.

    ReplyDelete
  8. ఒక్కసారి బ్రతిమిలాడితే అంతేనండి బధ్ధకం మనల్ని విడిచి వెళ్లను అంటుంది. చలికాలంలో సంగతి సరే సరి :-)

    ReplyDelete
  9. మీరు ఇలాంటివి వ్రాయడంలో సిధ్ధహస్తులు

    ReplyDelete
  10. బధ్దకాన్ని బావాని పిలిచి...
    ఒక్కసారి కన్నుగీటిన పాపానికి
    ఒళ్లంతా తడిమేసి వదలలేనంటూ
    బ్రతిమిలాడేకొద్దీ మరీ బెట్టుచేస్తుంది..భలే భలే :-)

    ReplyDelete
  11. చలిగాడంటే అంతే మరి... చెలిచెంత చేరి తడిమేస్తాడు...ఆసాంతం వణికిస్తాడు. వెచ్చని కౌగిలి ఇచ్చే వరకు వదలడంతే. దుప్పట్లో దూరిన చలిగాడికి... చనువు మరీ ఎక్కువ. అసలే సిగ్గే లేదు మరి.
    ఎంత వద్దన్నా బిగుసుకుపోయేంత చనువు. చలిచెలి మధ్య గిలిగిలి రాపిడి వెచ్చని గిచ్చుళ్లు... అబ్బో... అనుభవిస్తేనే కదా ఆ హాయి. ఏజ్‌ యూజువల్‌గా చిత్రం అదుర్స్‌. ఆ చిత్రంలో కోమలాంగి క్రీగంటి చూపులకి... చూస్తే చలిగాడికే కాదు చెలికాడికీ గిలి తప్పదుగా... మొత్తానికి కౌ'గిలి' దుప్పటి కప్పుకునేలా చేశారు..... సూపర్‌.

    ReplyDelete
  12. అల్లరి చేస్తూ చలి గిలిగింతలు పెడుతుంది

    ReplyDelete
  13. చలి చేసే చిలిపి చేష్టలు బాగున్నాయండి.

    ReplyDelete
  14. చలికాలపు గిలిగింత బాగుంది

    ReplyDelete
  15. స్పందనలు తెలియజేసిన అందరికీ అభివందనములు_/\_

    ReplyDelete