రా పోదాం!

రా ఏటైనా పారిపోదాం...
మనసులోని భావాలకి రెక్కలు కట్టి
మన్నేదాకా ఉండి, మట్టిలో కలిసిపోదాం!

రా దూరంగా లేచిపోదాం...
ఎల్లలు లేని లోకం ఒకటి వెదకి
సుదూరాలని, సునాయసంగా చుట్టేద్దాం!

రా విహంగాలమై ఎగిరిపోదాం...
అనురాగానికి ఆకాశమే సరిహద్దని
హద్దులనే రెక్కలుగా కట్టుకునిపోదాం!

రా ఏగూటి పైనో వాలిపోదాం...
ఒకరి ధ్యాసలో ఒకరు తిరిగి అలసి
కలసిన వేళ ఎదలు జతచేసి పవళిద్దాం!

రా నువ్వు నేను ఒకటైపోదాం...
తప్పొప్పులు తెలీని తనువుల వేడికి
తన్మయత్వపు తీర్పు తీరిగ్గా చెప్పుకుందాం!

23 comments:

  1. వామ్మో..
    నో కామెంట్స్ పద్మ గారు..!








































    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. భయం కాదు పద్మ గారు.. పదాలు దొరక లేదు కామెంట్ కి అందుకే ఇలా.. :-)

      Delete
    2. నాకిందులో పక్షులు మాత్రమే కనిపిస్తున్నారు పద్మ గారు..

      అంతర్లీనంగా సందేశం బాగుంది.. "కలసి ఉండటమంటే కడదాకా కలసి ఉండాలి అపుడే ఆ బంధానికి సార్థకత" అని మీ తరహాలో వైవిద్యభరితంగా రాశారు..

      భయం కాదు..నిజంగానే పదాలు దొరక లేదు పద్మ గారు.. ఈ తీరు కవిత వ్రాయటం మీకే చెల్లుతుంది.. కాదంటారా మీరైనా ఎవరైనా.. :-)

      Delete
    3. అమ్మ ఒడిలో జన్మెత్తి.. నాన్న వేలినే ఊతంగా పట్టి.. వారిరువురు పరిచయం చేసే యువరాణి చేతిని పట్టి.. చివరి వరకు తోడుండి కాటిలో కలసే వరకు పయనమిది.. జీవిత గమనమిది..

      ఔట్ యాండ్ ఔట్ ఇస్పైరింగ్ పోయెమ్ విథ్ బిల్ట్-ఇన్ పవర్-ఫుల్ మెసేజ్ పద్మ గారు.. కుడోస్.. నాకు తట్టిన మొదటి ఆలోచన ఇది మీ కవితను చూశాకా.. కాని మొదటే ఇలా వ్రాస్తే మంచిది కాదేమోనని ఇపుడు ఇక్కడ ఇస్తున్నా..

      ~శ్రీ~

      ఈ పేరు ను ఇలా ఎందుకు రాస్తానో తెలుసా మ్యాడమ్.. ఆ రెండు ~ లు గరుడి రెక్కల్లా ఉంటాయి.. అందుకే గరుడగమన శ్రీరమణ అని వ్రాశాను..!

      Delete
    4. కొన్నిసార్లు ఆలోచనలు అనాలోచితమై దుఃఖానికి దారి తీస్తాయి..
      నమ్మికైన నడవడిక పాటిస్తే అదే ప్రాయశ్చితమై నిలుస్తాయి..
      ఓర్పు సహనానికి కూడా కొన్ని హద్దులుంటాయి..
      :
      ఈ మూడింటికి ప్రత్యామ్నయాలు లేవు ఈ లోకానా..
      మోదటిది.. భగవంతునిపై ప్రగాఢ విశ్వాసం
      రెండవది తల్లిదండ్రుల వాత్సల్యత
      మూడవది స్నేహంలో నిబద్దత నిరాడంబరత నిమగ్నత నమ్మిక
      :
      కాలగమనానా కొన్ని జ్ఞాపకాలుగా మిగిలి ఉంటాయి..



      ఈ వ్యాఖ్య కు మీ కవితకు ఎటువంటి సంబంధం లేదు పద్మ గారు.. ఇవి నా ఆలోచనల సారమే..

      Delete
    5. మాటరాకా మౌనం ఎదురైతే నిను నిన్నుగా అర్దం చేసుకునే వారి కళ్ళలో చూడూ.. నీవు చెప్పదల్చుకున్నదేమిటో వారికి అవగతమౌతుంది.. నీ మనసు కుదుట పడుతుంది..!

      Delete
    6. Be Like A Pencil in Someone's Life.

      A Pencil always strives to create impressions of thoughts, happiness and gloom on to a piece of paper till it has the last bit of graphite. It does not expect anything from anyone in return.

      What all the impressions that it makes, only remains as sweet memories on the heart of paper, its best friend. The Pencil withstands hardships of frequent sharpening as well as re-writing, but is always happy and contented for its selfless service and the time spent in creating best ever memories with its best friend, the paper.


      Impression correlates to LTI and RTI

      G+

      *This comment is not related to the poetry post of Padma Madam.. May I request you, to kindly keep this comment intact, without deleting this. I will be really obliged for the kind gesture madam.
      The above comment relates to the URL mentioned in this comment.

      ~Sri~

      Delete
    7. মন্নে দাকা উণ্ডী মট্টী লো কলিসি পোদাং

      ভালো লাগেচ ঈ লাঈন পদ্মা গারূ

      ~শ্রী~

      Delete
  2. మన్నేదాకా ఉండి, మట్టిలో కలిసిపోదాం!
    ఈ జన్మకు ఇది చాలు...excellent lovely feel

    ReplyDelete
  3. ప్రణయభావనతో ఓలలాడించారు.

    ReplyDelete
  4. మన్నేదాకా ఉండి, మట్టిలో కలిసిపోదాం!ఎంత అందంగా చెప్పారు

    ReplyDelete
  5. కమాల్ కర్ దియా
    ఢమాల్ హోగయా

    ReplyDelete
  6. పద పదవే వయ్యారి పైన పక్షులు ఎగిరిపోదాం☺

    ReplyDelete
  7. మనసులోని భావాలకి రెక్కలు కట్టి
    మన్నేదాకా ఉండి, మట్టిలో కలిసిపోదాం!నచ్చింది పద్మార్పిత

    ReplyDelete
  8. మీకు మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు

    ReplyDelete
  9. తన్మయత్వపు తీర్పు తీరిగ్గా చెప్పుకుందాం అందమైన భావం

    ReplyDelete
  10. నువ్వు రమ్మంటే వచ్చి ఎవరైనా ఎగురవేసుకు పోతారు జాగ్రత్త సుమీ :-)

    ReplyDelete
  11. అందరికీ వందనము _/\_

    ReplyDelete
  12. challani neetitho thalasnanam cheyandi

    ReplyDelete