రుధిర భావం

బూజుపట్టిన ఆలోచనల నుండి బయటపడాలని ప్రయత్నిస్తూ
ఎన్నో చెప్పాలి అనుకుంటూనే నిన్ను చూసి  ఏమీ చెప్పలేను!

ఈ ఉరుకుల పరుగుల జీవితంతో రాజీ పడలేక కుస్తీ పడుతూ
సంక్షిప్తంగా చెప్పాలన్న తపనలో చెప్పాల్సింది మరచిపోతాను!

బెరుకు ఎందుకు నా అనుకున్న నీతో చెప్పడానికి అనుకుంటూ
క్షణంచాలు సంభాషణ పూర్తవడానికని యుగాలు గడుపుతాను!

తెలిసీ తెలియని సన్నని బిడియపుపొరల్ని మన మధ్య బిగిస్తూ
అనుభవాలని చింతాకులా విశాలపరుస్తూ భంగ పడుతుంటాను!


నాగురించి అన్నీ తెలిసిన నీతో చెప్పలేని మౌనం మూలుగుతూ
అలజడిచేస్తే మళ్ళీ అపరిచితులమైతే బాగుండు అనుకుంటాను!

32 comments:

  1. మీ రుధిరభావాలు అద్భుతం

    ReplyDelete
  2. ఆవేదనేదో అలుముకుంది లోలోపల
    మాట ఐనా పెగలక ఎదురు చూపు
    నిన్నటి మాటలనే నేమరు వేసుకుంటు
    ఆ తీపి జ్ఞాపకాలను ఆవిష్కరిస్తు మరల

    నవ్వులతో పలకరింపులాయే
    మనసే కేరింతల్లో తేలియాడే
    పక్షం రోజుల అమవస మౌనదీక్ష వీడే
    గలగల మాటలన్ని శ్రవణానందపు పున్నమి వెన్నెల కురిపించే

    మనసే ఊర్రూతలూగే వేళా
    గ్రీష్మాన మంచు కురిసేలా

    డిస్క్లైమర్: ఎవరిని ఉద్దేశించినది కాదు.. పద్మగారి కవితకు ఒక్కోసారి సమాధానంగా.. ఒక్కోసారి ప్రశ్నగా.. ఒక్కోసారి ప్రశంసగా.. ఒక్కో సారి విమర్శగా వ్రాసే పదజాలమే నా ఈ కమెంట్లు యాదృచికంగా కాకతాళీయంగా అనుహ్యంగా అని తెలియజేస్తున్నా..

    ఎదురు చూపులైనా మంచి మనసుంటే మరల పలకరించే వీలుంటుందని చెప్పకనే చెప్పారు పద్మ గారు.

    ~శ్రీ~

    ReplyDelete
  3. శ్వేత భావమో, రుధిర భావమో
    మీరు ఇంత గాప్ తీసుకుంటే మాకు హృదయభారం.
    తెలుగు సంవత్సర ఆరంభం ఇలా మొదలు పెట్టారు..కానివ్వండి :)

    ReplyDelete
  4. చెప్పాలేక మ్రింగాలేక సగం జీవిత కాలం అయిపోయిందండి

    ReplyDelete
    Replies
    1. When Words Fall Short Silence Speaks
      When Silence Falls Short Thoughts Speak
      When Thoughts Fall Short Words Speak

      Delete
  5. బిడియం పొరలు సున్నితమైనవి అయితే ఇంకా ఆలోచనలు ఎందుకు చెప్పండి. ఎప్పటికైనా చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పేసి తాడో పేడో తేల్చేసుకుంటే పోలా :-)

    ReplyDelete
    Replies
    1. ఆమే మనసు సున్నితం..
      అతని మనసు నవనీతం..
      ఒకరి పట్ల ఒకరికి ఎనలేని గౌరవం..
      అలాంటప్పుడు తెలిసి తెలిసి ఆభాసుపాలు ఎందుకు కావటం..
      వారసలికే చెరిసగం..
      అందుకే అందుకే వారిరువురి మధ్య తెలిసీ తెలియని బిడియం..!

      ఆకాంక్ష గారు ఎందుకు అని అడిగారు కదా.. నా మార్క్ సందేహ నివృత్తి :-)

      Delete
  6. చెప్పలేని సున్నిత భావాల పొదరిల్లు మీ భావాలు.

    ReplyDelete
  7. అపరిచితులయిపోయి..... మా అందరికి కుంభిపాకం వేయిస్తారా...

    ReplyDelete
  8. jerninchukovadam kashtam bhavanni
    apt painting.

    ReplyDelete
  9. కడిగిన పాత్రనే మళ్ళీ మళ్ళీ కడిగి
    ఉతికిన గుడ్డనే మళ్ళీ మళ్ళీ ఉతికి
    గీసిన బొమ్మనే మళ్ళీ మళ్ళీ గీసి
    ఎదుటివాళ్ళు బోర్ కొట్టి చస్తారేమో
    అని ఏమాత్రం సంకోచించకుండా
    పదే పదే చేసే హత్యా ప్రయత్నం
    భావం మీది రుధిరం మాత్రం నాది

    ReplyDelete
    Replies
    1. నమస్తే వెంకట్సాబ్..మీరు చెప్పినట్లు ప్రేమభావం మనిషిలో చచ్చిపొయి బోర్ కొట్టినట్లైతే ఇంక మనిషి బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది. ప్రేమ ఎలా చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా బాగుంతుంది కొత్తగా ఉంటుంది. కాదంటారా

      Delete
    2. ఉన్న పాత్రలు, గుడ్దలతోనే సరిపెట్టుకోవాలి. అంతేకాని లేని వాటి గురించి ప్రాకులాట ఎందుకని. తెలిసిన వచ్చిన భావాలే తప్ప రానివి ఎక్కడ నుంచి రాయను మహాప్రభో._/\_

      Delete
  10. మళ్ళీ అపరిచితులమైతే బాగుండుబాగుండు.....సున్నిత భావం!

    ReplyDelete
  11. క్షణంచాలు సంభాషణ పూర్తవడానికని యుగాలు గడుపుతూ ఈ సంభాషణలకి అంతంలేదు ఎప్పుడూ ఆరంభమే మేడంగారు

    ReplyDelete
  12. చింతాకులా విశాలమైన అబ్బో చాలా విశాలమైనదే..హా హా

    ReplyDelete
  13. రుధిరభావం ప్రేమతత్వం

    ReplyDelete
  14. ఉరుకుల పరుగుల జీవితంతో రాజీ పడలేక కుస్తీ పడుతూ భావం ఏదైనా తప్పదు పరుగు

    ReplyDelete
  15. ఒక్కసారి బూజు పట్టిన ఆలోచనలు,,మల్లి దులిపితే పొవు కదా...
    అన్దుకెనేమో బయటపడలేక,,తను చెప్పాల్సిన్ది చెప్పలేక
    శుధ్ఢి కాలేక ,,,కాయమును కాల్చలేక ,,,కాలముకు సమాధానము ఇవ్వలేక

    అలా చస్తూ బటుకుతున్న తనను(X-పెర్సన్) చూస్తే నాకె ఎహ్ మాత్రము జాలి కలగటం లేదు

    ఇడి నాకు ఎదురైన అనుభవం తో చెబ్తున్నా ,,,నేస్తం
    ఇది నాకు ఎదురైన అనుభవం తో చెబ్తున్నా ,,,నేస్తం
    నీ కవిత ,,నా జేవన ప్రయానమ్ లో ఎదురైన అనుభవానికి దగ్గరగా వున్ది,,,నువ్వు ఏ భావం తో రాసావో,,కాని,..నా భావనను చెబ్తున్న అన్తే

    ReplyDelete
  16. ఒకోసారి నువ్వు రాసే కవితలలు సొంత అనుభవానికి దగ్గరగా ఉంటాయి పద్మా. దేని గురించీ ఆలోచించకుండా ఉందాం అనుకున్నా ఉండనివ్వవు నీ భావాలు. :)

    ReplyDelete
  17. ఆలోచనలు బూజు పట్టినా పర్వాలేదు
    భావాలకి బూజు పడితేనే కష్టం :)

    ReplyDelete
  18. ఇలా ఎన్నాళ్ళు దాచుకుంటారు, చెప్పేయండి

    ReplyDelete
  19. అపరిచితులమైతే బాగుండు...అవును ఆలస్యం ఎందుకు అయిపొదాం.

    ReplyDelete
  20. ఆలోచనలు సతమతం చేస్తే భావాల దారంతో వాటిని జ్ఞాపకాలుగా చేసుకుని అక్కున చేర్చుకో మదికి సాంత్వన చేకూరుతుంది.. మాటరాకా మౌనం ఎదురైతే నిను నిన్నుగా అర్దం చేసుకునే వారి కళ్ళలో చూడూ.. నీవు చెప్పదల్చుకున్నదేమిటో వారికి అవగతమౌతుంది.. నీ మనసు కుదుట పడుతుంది..!

    ~శ్రీ~

    ReplyDelete
  21. భావం వరకు బాగుంది కాని భరించడం కష్టం పద్మగారు.

    ReplyDelete
  22. స్పందనలతో స్పూర్తినిస్తున్న అందరికీ అభివందనములు._/\_

    ReplyDelete
    Replies
    1. మీరు వ్రాస్తు ఉండండి.. వ్యాఖ్యలు వాటికవే వస్తుంటాయి పద్మ గారు.. శుభం భూయాత్.. జై శ్రీ రాధాకృష్ణ

      Delete
  23. నాగురించి అన్నీ తెలిసిన నీతో చెప్పలేని మౌనం మూలుగుతూ
    అలజడిచేస్తే మళ్ళీ అపరిచితులమైతే బాగుండు అనుకుంటాను! no words to express.. touching lines

    ReplyDelete