భామాప్సర..

ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వెతమాకు తిలోత్తమని కానంటే
నీ మేను చూడ వేయికళ్ళు చాలవే వలపువిపంచీ అంటావు!

మునినే మురిపించి మాతృత్వ రూపినైన మేనకని కానంటే
నీ కామకోరిక తీర్చేటి కల్పతరువంటి కామాక్షిని అంటావు! 

ఇంద్రియాలను రెచ్చగొట్టి కవ్వించే రంభను అసలే కానంటే
 నీ ఇష్టానుసారంగా అన్నీ అమరిన అందాలరాశిని అంటావు!  

విశ్వామిత్రుడి ఉర్వుల నుంచి ఉద్భవించి ఊర్వశిని కానంటే 
నీ ఊహల్లో ఊపిరి పోసుకున్న మోహినీనయగారిని అంటావు!

మాయచేసి మరులుగొల్పి మోహంలో పడేసే మోహిని కానంటే
నీ ప్రాణం నిలిపే అమృతభాంఢమే నా అణువణువని అంటావు!

అప్సరసల అందాలు ఏ కోణంలోను కానరావు నాలో అనంటే
నీవు నాలో చూసేది ఆత్మసౌందర్యం అప్సరోభామిని అంటావు!

ముందస్తు చూసేది మోమునే కాని మనసుని కాదని నేనంటే
నీ మనసే నాదైనప్పుడు సాక్ష్యమెందుకే సమ్మోహినీ అంటావు!

అవ్యక్త భావాలు ఆశ్రువులుగా రాల్చలేక అక్షరాలుగా రాస్తానంటే
 నీ అక్కున చేరిన అన్నీ మరిచెదవే మదికమలరమణీ అంటావు! 

33 comments:

  1. అప్సరసల్లోని అందాలు అన్నింటినీ మించిన ఆత్మసౌందర్యం...అత్యద్భుతం!

    ReplyDelete
  2. అప్సరసలను చూసినదెవరు..!
    ఆత్మ సౌందర్యం దీపమై వెలుగు పంచే వేళ..!
    బాహ్యసౌందర్యం మైనము వలే ఈర్ష్య అసూయలతో మండి కరిగి పోయేది..!!

    స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకలైన ఆ రాధాకృష్ణులే కానవస్తున్నారు నాకు మీరు పెట్టిన చిత్రములో..!

    అందెల రవళి ధ్వనించగా
    మురళి నాదమే వినిపించే

    శ్రీరాధాకృష్ణార్పణమస్తు

    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. అప్సరసలు చదివితే ఏమనుకుంటారో :)చూస్తే బాగుంటుంది అనుకుంటే వారిని చూసిందెవరు అంటే ఎలాగండి:)

      Delete
    2. బాగా చెప్పారు. అప్సరస ను ఇంద్రులవారు తపము చేసేవారి దీక్ష ఎంతటిదో తెలుసుకునెందుకుగాను దివి నుండి భువికి పంపించేవారని ఉక్తి. దీక్షదక్షతగలవారికి ఈ అప్సరసలను చూడకుంటేనే మహర్షుల బిరుదుతో పాటు సంకల్పిత దైవానుగ్రహం కలిగేదని మీకు తెలియనిదేమున్నది చెప్పండి నయని గారు. కనుకా.. బాధలెన్ని అవరోధాలై నిలచినా వాటిని అధిగమించాలని ఇలా వ్రాశాను .. సరదాగానే సుమి..!

      Delete
    3. Do You Know Nayani Madam,
      At the First Instant, I overlooked the Title of this poem, I thought it as "Bhasmasuraa". Out of Amazement, I had another Glimpse, Only then I found it as "Bhaamaapsara" and not "Bhasmaasura".

      With Apologies to Padma Gaaru, for mis-interpreting the title.

      Even then I saw Krishna there.. It is the Mohini Avataar of Krishna that protected first Lord Shiva from the Burning Bracelet of Bhasmaasura, and then the Same Avatar along with Shiva, came to the rescue of all Gods during Ksheerasaagaramathanam.

      Delete


  3. భామాప్సరా ! జిలేబీ !
    నీమోము గని మనసునుగని నీప్రాణంబుల్
    మామదిని తాకె పద్మ
    మ్మా! మము విడువకు విడువకు మా నయగారీ :)

    జిలేబి

    ReplyDelete
  4. అందం కన్నా ఆత్మసౌందర్యం మిన్న.
    చివరి రెండు లైన్లలో అప్సరసల్ని తలదన్నే అక్షర సౌందర్యాన్ని ఇముడయింపజేసావు..
    అభినందనలు పద్మార్పిత

    ReplyDelete
  5. కవితని అందమైన అలలపై తేలియాడించారు.అప్సరసలు చదివితే ఏమనుకుంటారో :)చుస్తే బాగుంటుంది. తెలుసుగా...మీరు ఇలాంటి ఫిటింగు ఏదో పెట్టి ఎదుటివారిని చిత్తు చేస్తారని.

    ReplyDelete
    Replies
    1. కనబడని భావాన్ని
      వివరించే క్రమంలో
      తత్సమానమైన పదాలంకరణ గావిస్తే

      కవిత

      గలగల గోదారి అలలపై తళుకులీనే ముప్పావు చంద్రబింబం (పూర్ణిమ కు మరో మూడు రోజులు)

      Delete
  6. This is your trend marked awesome lyrics padma.
    Our hearts filled with energy..Congrats my dear.

    ReplyDelete
  7. అటు ఇటూ మీరై చేసిన ద్విపాత్రభినయం రసామృతం.

    ReplyDelete
  8. ఎక్కడండి కాదన్న వాటికి అన్నింటికీ చిరునవ్వుతో సమాధానం ఇచ్చినా కరుగకపోగా పైగా అక్షరాల్లో చెబుతానని అమాయకుడ్ని చేస్తున్నారు.చివరిగా ఆత్మసౌదర్యాన్ని గాంచిన అతడిదే గెలుపు. కవితను అసాంతం చదివించి మంత్రముగ్ధుడ్ని చేసినట్లున్నారు.

    ReplyDelete
  9. అప్సరసలు అబ్బురపడిరా?

    ReplyDelete
  10. విశ్వామిత్రుడి ఉర్వుల నుంచి ఉద్భవించిన ఊర్వశి
    అవ్యక్త భావాలు ఆశ్రువులుగా రాల్చలేక అక్షరాలుగా రాస్తా
    చూసేది ఆత్మసౌందర్యం అప్సరోభామిని..అద్భుత భావల ఆవిష్కరణ

    ReplyDelete
  11. అప్సరోభామిని=అప్సరసను మించిన అందమా?
    కవిత అప్సర వోలె ఉన్నది.

    ReplyDelete
  12. అర్పిత అక్షర సౌందర్యం ఎదుట అప్సరసలు వారి అందం బలాదూర్ అన్నట్లు అదరగొట్టేసారు 😃😁

    ReplyDelete
  13. అందం అనేది ఆడవారి సొంతం అయితే దాన్ని చూసి ఆస్వాధించి ఆనందించే సౌలభ్యాన్ని మగవారికి అలనాటి దేవతల కాలం నుండి నేటి కలికాలం సాగుతూ వస్తున్నదే. అప్పుడు అప్సరసల్లోనే కాదు దేవతల్లో కూడా అందాన్నే చూసేవారు, నేడు అందరూ బాహ్య సౌందర్యం కాదు ఆత్మసౌందర్యం చూడమంటున్నారు. దీన్ని ఎందరు ఎంతవరకూ పాటిస్తున్నారో మరి. కవిత ఆలోచించే విధంగా మలచి కొత్తగా వ్రాసావు అభినందనలు-హరినాధ్

    ReplyDelete
  14. వడ్డాదిపాపయ్యగారి చిత్రానికి
    వయ్యారాలు నేర్పించి..
    అప్సరసల అందచందాలకి
    ఆత్మసౌందర్యం జోడించి..
    అసలుసిసలు అందమంతా
    అక్షరాల్లో గుప్పించి..
    ఆనందం ఒసగిన అర్పితా
    భళారే భళి....

    ReplyDelete
  15. కవితలో నేర్పు కూర్పు కనబడుతున్నాయి.

    ReplyDelete
  16. ఏమి అందం, ఆత్మసౌందర్యం చూసి మనసు పులకరించే.

    ReplyDelete
  17. రంభ ఊర్వశి మేనక తిలోత్తమలని మించిన తెలివైనవారు
    అందం ఎందుకు ఆరబోసుకోడానికే తప్ప..

    ReplyDelete
  18. అవ్యక్త భావాలు ఆశ్రువులుగా రాల్చలేక అక్షరాలుగా రాస్తానంటే
    అక్కున చేరిన అన్నీ మరిచెదవే మదికమలరమణీ-చివరి వాక్యాలు చాలు భావం తెలుపడానికి.

    ReplyDelete
  19. అప్సరసలు అందరినీ కొలువు తీర్చినారా బ్లాగ్లో :)

    ReplyDelete
  20. అన్నీ తెలుసుకుని అర్థం చేసుకోవడంలో అత్మసౌందర్యం దాగుందని నమ్ముతాను.
    ఏదైనా మీరు చెప్పింది రాసింది మేము నమ్ముతాము నమ్మిస్తారు..హ హా హా

    ReplyDelete
  21. అక్షరాల్లో అప్సరసలు నాట్యం చేసారు.
    చిత్రం చాలాబాగుంది.

    ReplyDelete
  22. ఆత్మసౌందర్యముంటేనే బాహ్య సౌందర్యానికి విలువ

    ReplyDelete
  23. అందం అప్సరస అర్పితం...డిషుం డిషుం :)

    ReplyDelete
  24. ఆత్మసౌందర్యం ఎంత గొప్పది అయినా ఇంద్రియాలు రెచ్చిపోయేది మాత్రం అందం చూసి. తప్పుగా అనుకోకండి నాకు తెలిసిన పరిజ్ఞానంతో ఇలా వ్రాయాలి అనిపించింది.

    ReplyDelete
  25. రాసిన అక్షరాల అందం ముందు అప్సరసలు ఒక లెక్కా చెప్పండి.

    ReplyDelete
  26. అర్పిత అక్షరాలను అభిమానంగా చదివి
    అందులో లోటుపాట్లను ఎంచక ఆదరించి
    అప్సరసలని మించింది ఆత్మసౌందర్యమని
    అమూల్యమైన అభిప్రాయాలని తెలియజేసిన
    అందరి ఆత్మీయతకు పేరు పేరునా అందజేస్తున్న
    అభివందన నమస్సుమాంజలులు..అందుకోండి _/\_

    ReplyDelete
  27. అంతిమ విజయం అర్పితను అప్సరసదే అని తెలుపుటకు సంతోషిస్తున్నాము.

    ReplyDelete