మార్చి పాడవే కోయిలా..



రాతిరివేళ రగిలి గొంతు చించుకోకే కోయిలా
కొత్తరుచులు తెలియనప్పుడు నీవు పాడితే
నాడు కమనీయం అదే సర్వం కడు రమ్యం
పాతబడి నేడా రాగం వెగటుపుట్టి కర్ణకఠోరం!

నీ గళానికి కొత్తరాగమేదో నేర్పించు కోయిలా
శృతి రాగం తాళమంటే వినే వారు లేరెవ్వరు
వెర్రి పాశ్చాత్య వ్యామోహంలో గెంతులేస్తున్నాం
నీకు కూడా పాప్ రాగాలతో షేక్ సమంజసం!

పిలవని పిలుపుగానైనా ప్రేమతో రాకే కోయిలా
రాగానికి కొన్ని రంగులద్దుకుని తూగుతూ రావే
గళంతో పనిలేదు వేషాన్ని మార్చి గెత్తులేయడం
బ్రేక్ డాన్సులంటూ స్టెప్పులు వేస్తూ అరిచేయడం!

తొలకరీ పాటనే పరవశాన్న పాడబోకే కోయిలా
వినీ వినిపించని పదాలు పాడుతూ కేకలు పెట్టు  
గుండెకోత ఆక్రందనల్ని కేరింతల్లో కలిపితే క్షేమం
ఏగూటి పలుకులు అక్కడ పలకడమే న్యాయం!

24 comments:

  1. చివరిలో మలుపు తిప్పి ఏ ఎండకు ఆ గొడుగుపట్టాలి అన్నట్లు చెప్పడం మీ ట్రెండ్...సూపర్.

    ReplyDelete
  2. బాధను రాతిరిగా మలిచి.. మనసును కోయిలతో పోల్చి
    నిన్నటి బంధాన్నే తలచి.. కాలం మరలి రాదని తెలిసి
    ఇష్టాలను తెలుపనులేక లోలోపల కలతపడి
    విసుగును నటించనులేక అయోమయానా నిలబడి
    ఏ కాలమైనా ఆ రాగం మూగబోకూడదని తపనపడి
    :
    మొదటి స్టాంజా కాలంతో పాటు మార్పనేది సహజం
    అయితే మనసునే గాయపరిచేంత మనిషి మారకూడదని
    మీదైన శైలిలో చక్కని వివరణ ఇచ్చారు పద్మ గారు.

    రెండవ స్టాంజాలో గుణగణాలను మించిన మంచి లేదని
    అయితే కరిగే కొవ్వొత్తని కాలానికి పేరిచ్చి మైనముతో
    ఆవేదనను రెట్టించి ఆభాసుపాలు కాకూడదని
    మీదైన శైలిలో చక్కని వివరణ ఇచ్చారు పద్మ గారు.

    అస్తిత్వాన్ని మించిన ఆస్తి మరోకటి లేదని
    పదుగురు పదునైన పదాలతో పరుషంగా పలికారని
    మనసుని తెలిసి నిందలపాలు చేసుకోకూడదని
    మీదైన శైలిలో చక్కని వివరణ ఇచ్చారు పద్మ గారు.

    ~శ్రీ~

    ReplyDelete
  3. మళ్ళీ మళ్ళీ కూయవే కోయిల
    గొంతెత్తి నీకు నచ్చిన రాగమాలపించు
    పరుల నాగరికతతో నీకు పనేల
    నీకు నచ్చిన లోకంలో నీవు విహారించు
    ఆలపించు రాగం నచ్చినవారు నీవారు
    నచ్చని వారితో నీకు పనేలేదు..

    ReplyDelete
  4. రాగం మార్చమని మీరు అనడం బాగుందా చెప్పండి
    ఎవరికీ వచ్చింది నచ్చింది వాళ్ళు పాడుకుంటారు, వినే వారి ఇష్టం.

    ReplyDelete
  5. కొత్త ఒక వింత , పాత ఒక రోత
    దీని ఆలోచించడం ఎందుకు,
    మనకు నచ్చిన దారిలో మనం నడవాలి.

    ReplyDelete
  6. Old is Gold.
    Your writings are always fresh.
    Go on Padma.

    ReplyDelete
  7. కండిషన్స్ పెడితే కోయిల పాడలేదు :-)

    ReplyDelete
  8. కోయిల పాటలకు కొదవు లేదండి పాడుతూనే ఉంటుంది అన్ని ఋతువులకి తగిన పాటలు.

    ReplyDelete
  9. now birds tho matladutunaru. enni languages vachu meku.

    ReplyDelete
  10. అసంపూర్తిగా ముగించినట్లు ఉంది ఈ పోస్ట్. చిత్రము చాలా బాగుంది. తలచుకుంటే ఇంతకన్న అధ్భుతంగా వ్రాసి ఉండేవారు.

    ReplyDelete
  11. raani ragam aithe vinipincha vachu
    vachina raagam vaddu ani ante ela? edi anyayam.

    ReplyDelete
  12. నువ్వు కోయిలకు చెప్పిన పాటాలు ఆ మధ్య కాలంలో ఉండేవి. ప్రస్తుతం చాలావరకు సాహిత్యపరంగా అయితేనేమి సంగీత పరంగా బాగుంటున్నాయని చెప్పాలి. కోయిలను మార్చి పాడమని చేసిన హితభోధన బాగుంది.ఎంతైనా పాత పాటలు మరపురాని ఆణిముత్యాలు-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. అలనాటి (నేను అప్పటికీ పుట్టలేదు లెండి) మేటి పాటలలో కొన్ని:

      ఆధా హై చంద్రమా రాత్ ఆధి
      పగలే వెన్నెల జగమే ఊయల
      పాడవేల రాధికా ప్రణయసుధా గీతికా
      హాల్ కైసా హై జనాబ్ కా
      విధాత తలపున ప్రభవించినది
      (నా చిన్నప్పుడు)
      తెరే దర్ద్ సే దిల్ ఆబాద్ రహా
      ఏ కాష్ కే హమ్ హోశ్ మేఁ
      జానే జిగర్ జానే మన్
      మేరా మన్ క్యోఁ తుమ్హే చాహే
      జల్లంత తుళ్ళింత కావాలిలే
      (ఇహ ఇప్పుడు)
      వేయ్యి నామాల వాడా వేంకటేశుడా

      Delete
  13. ఏ ఎండకు ఆ గొడుగు
    ఏ గూటి పలుకులు అక్కడ పలకడమే కరెక్ట్.

    ReplyDelete
  14. లెస్స కోయిల పలుకులు మీవి.

    ReplyDelete
  15. రొటీన్
    డిఫరెంటుగా
    రాయండి
    పద్మగారు.

    ReplyDelete
  16. మీ ఈ పోస్ట్ కొంచెం నిరుత్సాహకరం.

    ReplyDelete
  17. గళంతో పనిలేదు వేషాన్ని మార్చి గెత్తులేయడం
    బ్రేక్ డాన్సులంటూ స్టెప్పులు వేస్తూ అరిచేయడం!
    ప్రస్తుతం ఇదే ట్రెంద్ ఫాలోయింగ్ ...

    ReplyDelete
  18. పెద్దలు ఎప్పుడో సెలవిచ్చారు నలుగురు మెచ్చిన పాట పాడాలి అందరూ నడిచే త్రోవలో నడవమని..

    ReplyDelete
    Replies
    1. పది మందిలో పాట పాడిన అది అంకితమెవరో ఒకరికే..!

      Delete
  19. ఎంత మార్చినా వినసొంపైన పాటలు ఇప్పుడు కొరబడినవి.

    ReplyDelete
    Replies
    1. గళములెన్ని మారినా.. గాత్రము మారునా
      గాయకులెందరు మారినా.. సాహిత్యం మారునా
      సంగీత పరికరాలెన్ని మారినా.. బాణి మారునా

      Delete
  20. పిలవని పిలుపుగానైనా ప్రేమతో రాకే..

    ReplyDelete
  21. మీ అందరి స్పూర్తిస్పందనలకు నమస్సుమాంజలి_/\_

    ReplyDelete