అర్పితా నీ అసలు రూపం ఏదంటే
ఎన్నని తెలిపేది ఏమని వర్ణించేది?
అస్తిత్వమైన అందచందాలను చూపి
అసలందాల్ని ఎలా అనాకారిని చేసేది!
అవయవసౌష్టవంలో అప్సరసనంటే
ఆవురుమనే ఆశతోడేళ్ళనెలా ఆపేది?
అభిమానమని పైత్యానికి ముసుగేసి
పై పైనపడి పేట్రేగితే ఎలా తట్టుకునేది!
అరమోడ్పు కళ్ళ పద్మనయనినంటే
కసిరేగిన కోర్కెల్ని ఎలా చల్లబర్చేది?
నాజూకైన నడుము వంపును చూసి
కామం పుట్ట కావరమెలా కత్తిరించేది!
అధరాలే కెంపులై అలజడి రేపెనంటే
కాదన్న నాకే కన్నుకొడితే ఏంచేసేది?
పసిడిమేను మేలి మెరుపని మురిసి
కనబడితేనే స్నేహమంటే ఎలా నమ్మేది!
మీరన్నదంతా సమాజంలో ఎప్పట్నుంచో ఉన్నదేకాని అద్భుతమైన మనసులు మనుషులు కూడా ఉన్నారు
ReplyDeleteఅందరూ అలాగే ఉంటే నా భావాలే మూగబోతాయండి :)
Deleteమీ మనోవేదన్ని కూడా అందమైన అక్షరాల్లో కూర్చి చెప్పడం అమోఘం. మీకు సలాం
ReplyDeleteఆవేదనకు నాకు తోచిన అక్షరరూపం.
DeleteNuvu rasevi vastavm aina andaru ala undaru dear.
ReplyDeleteWe need your lovely poetry..that's enough. Keep rocking.
Oh...nice comment. andaroo kadu kondaru untaarani naa bhavam.
DeleteDidi pic super hai. Poem bhi super hoga.
ReplyDeletethank you. hoga kya..padotho shee :)
Deleteమీ పోయంస్తో పని కాని మీ ఫేస్ తో పనిలేదు మాకు
ReplyDeleteఅయినా చపలమైన తుంటరి మనసు మాట వినక మీతో అప్పుడప్పుడూ ఇలా చివాట్లు పెట్టించుకినుట అలవాటు మాకు
ఏం చేస్తాము...మీకు మాకు రాసిపెట్టి ఉన్నది తప్పదు.
కవిత మాత్రం అదిరింది.
నిజానికి చెప్పాలంటే మీ పోస్ట్ చదివిన తరువాతే చూడాలి అనే కోరిక బలపడింది మాకు.
చూడాలన్న కోరికను నిందగా మార్చి నాకే తిప్పి కొట్టారుగా :)
Deleteచిలకపచ్చ చీరలో సొగసు చూడతరమా
ReplyDeleteఎంతందంగా మీ భావాలు వ్రాసారో అంత అందంగా చురకలు వేసారు
చిత్రమును నేను తస్కరించుట ఖాయం.
తస్కరించనేల తీసుకో...థ్యాంక్యూ
DeleteLovely wordings with warnings.
ReplyDeleteSo excellent and exciting posture.
thank you.
Deleteచూడాలి అనుకునేవారు మనం ఎన్ని చెప్పినా వినరు. అయినా ఎవరికోసమో మన వ్యక్తిత్వాన్ని చపుకుని బ్రతకడం ఎందుకు. నీకు తోచిన విధంగా నీవు ఉండి వ్రాసుకో కాదనుకునేవారు కనబడకుండా పోనీ పద్మా..మరో నైస్ పోస్ట్ ఫ్రం యూ.
ReplyDeleteమీరు చెప్పిన కిటుకు బాగుంది..అలాగే ఫాలో అయిపోతానుగా :)
Deleteఅంతటి ధైర్యసాహాసం చేసింది ఎవరు
ReplyDeleteకనబడమని కోరి మిమ్మల్ని గాయంచేసిన ఎవరు అర్పితగారు.
ఎందరో అలాంటి మహావుభావులు...
DeleteSooooooooooper counter :)
ReplyDeleteits not a counter :)
Deleteమీరు కనబడనక్కర్లేదు
ReplyDeleteకవితల్లో కనబడితే చాలు
బొమ్మల్లో మిమ్మల్ని ఊహిస్తారు
కంటిన్యూ మీకు నచ్చినట్లు
అభినందనలు మీ కవితకు
కవితలల్లి చెప్పిన అభినందనలకు ధన్యవాదాలు.
Delete
ReplyDeleteపచ్చని మేని సొబగు నులి
వెచ్చగ గుచ్చు కవనంబు వెనువెంటగనన్
"నెట్ చెలి" పద్మార్పిత సరి
తచ్చట లాడిరి జనులిట తరుణి జిలేబీ :)
జిలేబి
మీలా అందంగా పద్యాలు రాయడం రాదు అప్పుడప్పుడూ అర్థం కూడా కావు నా మట్టిబుర్రకు.ధన్యవాదములు.
Deleteఏమని వర్ణింతు వయ్యారిని
ReplyDeleteజగనంబు చూడ గుండెల్లో జిల్లు
నయనం చూడ మనసు తుళ్ళు
పదాల వెంట పరువం పరుగులెట్టు
భావాలు చదివినవారు దాసోహం
నిన్ను చూడ ఎవరి తరమో తెలుపవే.
వామ్మో...కవితలో ఘాటుగా వర్ణించారు, థ్యాంక్యూ.
Deleteఆహా..ఏం వర్ణించుకున్నారు మిమ్మల్ని మీరు :-)
ReplyDeleteఎదుటివారు ఎత్తిపొడవక ముందే జాగ్రత్త చర్యలు :)
Deleteఅదృశ్యంగా ఉండి ఎవరికీ అగుపించనని సుకుమారంగా అందంగా బల్లగుద్ది చెప్పినట్లుంది కవిత. లోలోపల మనసులో ఆవేదన ఉన్నప్పటికీ నవ్వుతూ కప్పిపుచ్చినట్లుంది:-)
ReplyDeleteకనబడతానని కమిట్ అయితే ఇంకేమైనా ఉందా..ఎప్పుడెప్పుడంటూ :)
Deleteఅక్షరాలు అందంగా మలచిన మీ అందం అమోఘం
ReplyDeleteమనసులోని భావాలకి రూపం ఇచ్చిన తీరు అద్భుతం
మీ వ్యాఖ్యలకు వందనం
Deleteమనిషికి కోరిక కుతూహలం అనేవి సర్వనైజం పద్మ. అందులోను అక్షరాలని అలవోకగా మలచిచే నీ మోము చూడాలి అనుకోవడం ఎలా ఉంటావు ఏమిటని ఆలోచించడంలో తప్పులేదు. వాటి పర్యవసానంలో విభేధాలు పుర్రెకో బుధ్ధి వలె మారవచ్చును. అంత మాత్రమున అందరినీ ఒకే కేటగిరీలోకి చేర్చడం ఎంతమాత్రం సబబుకాదు. కవితలో నీవు వ్రాసిన భావం నీ వరకు ఎంత కరెక్టో, నీ అక్షార అభిమానుల కోరిక నిన్ను చూడాలని అనుకోవడం కూడా అంతే కరెక్ట్-హరినాధ్.
ReplyDeleteమనిషి మనిషికీ ఒక నైజం ఉండవచ్చును కాదనను. కానీ అది ఎదుటి వారిని ఇబ్బందికి గురిచేయరాదని నా అభిప్రాయం. మీకు తెలియనిది కాదు కదా మాస్టారూ_/\_
Deleteconditions pettina sneham nammakam kadu :)
ReplyDeleteaunu nijamea kadaa :)
Deleteఇన్ని సంవత్సారాలలో ఎప్పుడైన చూడాలి అనుకోవడం వాస్తవం కానీ మిమ్మల్ని కనబడాలి కోరలేదు. మీరు మంచి మనసు ఉన్న కవయిత్రి మీ కవితలు మాకు ఇష్టము.
ReplyDeleteమీరు కోరినారు అని కాదు...అలా కోరే వారు చాలా మంది ఉన్నారని చెప్పాను అంతే యోహంత్
Deleteఅందాలతో అభ్యంగన స్నానం ఆచరించినట్లుంది మీ కవితాలాపన అందుకు తగిన బొమ్మను పోస్ట్ చేసిన నిన్ను చూడాలని ఎవరికి ఉండదు చెప్పు అర్పితా. దీన్ని అంతర్జాతీయ ఆశగా పరిగణలోకి తీసుకోమందువా...హా అహా హా
ReplyDeleteచలికాలంలో అభ్యంగన స్నానమా...సరిపోదన్నట్లు దానికి అంతర్జాతీయ ఆశను జోడించారు ;)
Deleteఅస్తిత్వమైన అందచందాలను చూపి అసలైన అందాలని ఎలా అనాకారిని చేసేది..అద్భుతంగా వ్రాసారు అంతరంగమే అసలుసిసలు అందమని.
ReplyDeleteబాగా చెప్పారు నందిని. మీ ప్రొఫిల్ పిక్ బాగుంది.
Deleteఇంతకీ కనిపించేది ఎవ్వరికో ఎప్పుడో తెలుపవలెను అర్పితగారు :)
ReplyDeleteలిస్ట్ ప్రిపేర్ చేసి త్వరలో తెలియపరుస్తాను మహీ :)
Deleteఅందాన్ని కవితలా అల్లి ఆరిపోసినారు
ReplyDeleteఇక కనబడమని ఎలా అడుగుతాములెండి
మీరు అడగరని తెలుసుగా ;)
Deleteగిసోంటి మాటలు మస్తుగ్గ రాసి పరేషాన్ జేస్తవు, నాకు సమజ్ గాలే కాకుంటేనె మంచిగుంది..
ReplyDeleteనన్ను పరేషాన్ జేసి నేను చేసినా అంటే ఎట్లా :)
Deleteకన్నులతో చుసేదీ గురువా
ReplyDeleteకనులకు సొంతమౌనా..అని పాడుకోమంటారా :) :)
పాడుకోండి మాకు మాత్రం వినిపిస్తాను అనకండి.:) :)
Deletevery excellent art reflects your poetry in it.
ReplyDeletethank you.
Deleteసాగరగర్భ శూన్యోకట్లవాహిని భూతల హస్తసంచారిణి
ReplyDelete~!~కనబడుట లేదు~!~
కవితలో భావం దాగింది కనుక నాలుగు రోజులుగా కనబడుట లేదు
మాటలో అర్దం దాగింది కనుక నాలుగు రోజులుగా కనబడుట లేదు
అల్లరిలో మౌనం దాగింది కనుక నాలుగు రోజులుగా కనబడుట లేదు
వివరాల్లోకి వెళితే:
పొగ మంచు దట్టంగా కమ్ముకుని విరితోటలో విహరించే సమయానా మేఘాల వర్ణాలను అభివర్ణింప యత్నించగా పదాలన్ని మౌనాన్ని ఆశ్రయించగా మాటలన్ని మూగబోయాయి. ఇదే అదనుగా భావించి సదరు "సూర్యదేవర ఎండారావు" గగనతలం నుండి భూమి పై తన ప్రతాపంతో విజృంభించగా వేడికి నాలుకలన్ని ఎండిపోయి నీళ్ళకై అన్వేషించే క్రమంలో దారి తప్పి అర్దాలన్ని పెడర్దాలయ్యాయని కడపటి సమాచారం.
ఈ వింత వార్తలు సమాప్తమయ్యే సమయానికి నీరుగారిపోయి ఆపసోపాలు పడి కాళ్ళీడ్చుకుంటు కమెంట్ ఇలా కనుల ముందు ప్రత్యక్షమవటానికి తొంభై ఆరు గంటలు కావస్తున్నా జాడలేని తరుణానా ఈ లుక్ అవుట్ కమెంట్.
~శ్రీ~
శ్రీధర్ గారూ.. కమెంట్స్ డెలిట్ చేసి అకస్మాత్తుగా ఎక్కడికి వెళిపోయారో అనుకున్నాను...ఇప్పుడు అర్థమైంది. వార్తలు చదవడానికని....హా హా హా ;)thank you.. just kidding.
Deleteunder sea optical fibre cable carrying digital information (ones and zeroes) and surface communicating mobile handset.
Deletethere was some glitch with the network so, I had to delete the previous comments, padma gaaru..
welcome padma gaaru :)
అక్షరాల్లో అందం చూసా
ReplyDeleteపదాల్లో నీ ప్రతిభ చూసా
భావాల్లో భాషపై పట్టు చూసా
కమెంటుల్లో వాక్చాతుర్యం చూసా
బొమ్మల్లో నీ కళాతృష్ణ చూసా
కవితల్లో నీ పరిజ్ఞానం చూసా
నిన్ను చూడకనే నీలో అన్నీ చూసా
అర్పితను చూడవలసిన పనిలేదు తెలుసా
అదేం వింతనో ఏమో నీ కవితలు చదువుతుంటే మనసు కాలేజీరోజులకి మళ్ళిపోతుంది. తెలియకుండానే నాలోని కవి నన్ను నిద్రలేపి గెంతులువేసి మరీ రాయిస్తాడు. ఇది నిజం పద్మార్పిత. పోస్ట్ చాలా బాగా ప్రెజంట్ చేసావు.
అరమోడ్పు కళ్ళ పద్మనయని..ఎంత అందమో!
ReplyDeleteMost urgently I want 2 see U
ReplyDeletebe patience.:)
Deleteనిన్ను చూడని నాకనులకు వెలుగు ఎందుకు
ReplyDeleteప్రేలకుండా ఉన్న తుపాకీలో తూటాలు ఎందుకు
ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకు???
ఈ తుపాకీల గోడు మీకు ఎందుకు :) :)
Deleteఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకు???
కనబడాలి అనుకున్న వారికి మాచక్కగా కనబడతాను వంటి ఆఫర్స్ ఇవ్వక ఇదేం ఫిటింగులు అర్పితా.
ReplyDeleteহাঈ নযনি গারু নমস্তে ম্যাডং এলা ওন্নারু। চান্নালকু দর্শনং ইচ্চারু।
Deleteహాయి నయని గారు నమస్తే మ్యాడం ఎలా ఉన్నారు. చాన్నాళకు దర్శనం ఇచ్చారు.
రీసెర్చ్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేసారా ఇన్నాళ్ళు...ఆలస్యంగా వస్తేను అదే అనుకున్నాను:-)
Deleteరెండుకళ్ళు సరిపోవు అందం చూడడానికి అందుకే కనబడను అని తప్పించుకోండి :)
ReplyDeleteఅంతేనా లేక అంత భయంకరంగా ఉంటాను అనుకుంటున్నారా :-)
Deleteఇలా పోస్ట్ పెట్టి మాలో కుతూహలం మరింత పెంచారు
ReplyDeleteఏమైనా మొత్తానికి మీగురించి బసగానే వర్ణించుకున్నారు
ఏదో మీలాంటివారిని ఇంప్రెస్ చేయడానికి పాట్లండీ.. :-)
DeleteBeautiful poem
ReplyDeleteమొత్తానికి మీ రూప లావణ్యాల గుట్టు విప్పారు. చూసేందుకు రంగు పూలన్నీ బాగుంటాయి. కానీ ముళ్ళున్నప్పటికీ గులాబీ అంటేనే అందరికీ ఇష్టం. మీ రూపం రంగు పువ్వు. మీ భావుకత గులాబీ సౌరభం. మీరు అనుమానించినట్టు ఆశ తోడేళ్ళు, పెట్రేగిపోవడాలు, కన్నుగీటడాలు ఉంటాయి. ఇష్టపడి చేతిలోకి తీసుకోకపొతే గులాబీ మాత్రం చిన్నపోదా చెప్పండి. ఆస్వాదించే మనసు తారసపడకపోతే అందానికి గుర్తింపు, లాలింపు ఎక్కడివి?
ReplyDelete