కన్నులతో చూసేది..


అర్పితా నీ అసలు రూపం ఏదంటే
ఎన్నని తెలిపేది ఏమని వర్ణించేది?
అస్తిత్వమైన అందచందాలను చూపి
అసలందాల్ని ఎలా అనాకారిని చేసేది!

అవయవసౌష్టవంలో అప్సరసనంటే

ఆవురుమనే ఆశతోడేళ్ళనెలా ఆపేది?
అభిమానమని పైత్యానికి ముసుగేసి
పై పైనపడి పేట్రేగితే ఎలా తట్టుకునేది!

అరమోడ్పు కళ్ళ పద్మనయనినంటే

కసిరేగిన కోర్కెల్ని ఎలా చల్లబర్చేది?
నాజూకైన నడుము వంపును చూసి
కామం పుట్ట కావరమెలా కత్తిరించేది!

అధరాలే కెంపులై అలజడి రేపెనంటే

కాదన్న నాకే కన్నుకొడితే ఏంచేసేది?
పసిడిమేను మేలి మెరుపని మురిసి
కనబడితేనే స్నేహమంటే ఎలా నమ్మేది!

70 comments:

  1. మీరన్నదంతా సమాజంలో ఎప్పట్నుంచో ఉన్నదేకాని అద్భుతమైన మనసులు మనుషులు కూడా ఉన్నారు

    ReplyDelete
    Replies
    1. అందరూ అలాగే ఉంటే నా భావాలే మూగబోతాయండి :)

      Delete
  2. మీ మనోవేదన్ని కూడా అందమైన అక్షరాల్లో కూర్చి చెప్పడం అమోఘం. మీకు సలాం

    ReplyDelete
    Replies
    1. ఆవేదనకు నాకు తోచిన అక్షరరూపం.

      Delete
  3. Nuvu rasevi vastavm aina andaru ala undaru dear.
    We need your lovely poetry..that's enough. Keep rocking.

    ReplyDelete
    Replies
    1. Oh...nice comment. andaroo kadu kondaru untaarani naa bhavam.

      Delete
  4. Didi pic super hai. Poem bhi super hoga.

    ReplyDelete
  5. మీ పోయంస్తో పని కాని మీ ఫేస్ తో పనిలేదు మాకు
    అయినా చపలమైన తుంటరి మనసు మాట వినక మీతో అప్పుడప్పుడూ ఇలా చివాట్లు పెట్టించుకినుట అలవాటు మాకు
    ఏం చేస్తాము...మీకు మాకు రాసిపెట్టి ఉన్నది తప్పదు.
    కవిత మాత్రం అదిరింది.
    నిజానికి చెప్పాలంటే మీ పోస్ట్ చదివిన తరువాతే చూడాలి అనే కోరిక బలపడింది మాకు.

    ReplyDelete
    Replies
    1. చూడాలన్న కోరికను నిందగా మార్చి నాకే తిప్పి కొట్టారుగా :)

      Delete
  6. చిలకపచ్చ చీరలో సొగసు చూడతరమా
    ఎంతందంగా మీ భావాలు వ్రాసారో అంత అందంగా చురకలు వేసారు
    చిత్రమును నేను తస్కరించుట ఖాయం.

    ReplyDelete
    Replies
    1. తస్కరించనేల తీసుకో...థ్యాంక్యూ

      Delete
  7. Lovely wordings with warnings.
    So excellent and exciting posture.

    ReplyDelete
  8. చూడాలి అనుకునేవారు మనం ఎన్ని చెప్పినా వినరు. అయినా ఎవరికోసమో మన వ్యక్తిత్వాన్ని చపుకుని బ్రతకడం ఎందుకు. నీకు తోచిన విధంగా నీవు ఉండి వ్రాసుకో కాదనుకునేవారు కనబడకుండా పోనీ పద్మా..మరో నైస్ పోస్ట్ ఫ్రం యూ.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన కిటుకు బాగుంది..అలాగే ఫాలో అయిపోతానుగా :)

      Delete
  9. అంతటి ధైర్యసాహాసం చేసింది ఎవరు
    కనబడమని కోరి మిమ్మల్ని గాయంచేసిన ఎవరు అర్పితగారు.

    ReplyDelete
    Replies
    1. ఎందరో అలాంటి మహావుభావులు...

      Delete
  10. Sooooooooooper counter :)

    ReplyDelete
  11. మీరు కనబడనక్కర్లేదు
    కవితల్లో కనబడితే చాలు
    బొమ్మల్లో మిమ్మల్ని ఊహిస్తారు
    కంటిన్యూ మీకు నచ్చినట్లు
    అభినందనలు మీ కవితకు

    ReplyDelete
    Replies
    1. కవితలల్లి చెప్పిన అభినందనలకు ధన్యవాదాలు.

      Delete


  12. పచ్చని మేని సొబగు నులి
    వెచ్చగ గుచ్చు కవనంబు వెనువెంటగనన్
    "నెట్ చెలి" పద్మార్పిత సరి
    తచ్చట లాడిరి జనులిట తరుణి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీలా అందంగా పద్యాలు రాయడం రాదు అప్పుడప్పుడూ అర్థం కూడా కావు నా మట్టిబుర్రకు.ధన్యవాదములు.

      Delete
  13. ఏమని వర్ణింతు వయ్యారిని
    జగనంబు చూడ గుండెల్లో జిల్లు
    నయనం చూడ మనసు తుళ్ళు
    పదాల వెంట పరువం పరుగులెట్టు
    భావాలు చదివినవారు దాసోహం
    నిన్ను చూడ ఎవరి తరమో తెలుపవే.

    ReplyDelete
    Replies
    1. వామ్మో...కవితలో ఘాటుగా వర్ణించారు, థ్యాంక్యూ.

      Delete
  14. ఆహా..ఏం వర్ణించుకున్నారు మిమ్మల్ని మీరు :-)

    ReplyDelete
    Replies
    1. ఎదుటివారు ఎత్తిపొడవక ముందే జాగ్రత్త చర్యలు :)

      Delete
  15. అదృశ్యంగా ఉండి ఎవరికీ అగుపించనని సుకుమారంగా అందంగా బల్లగుద్ది చెప్పినట్లుంది కవిత. లోలోపల మనసులో ఆవేదన ఉన్నప్పటికీ నవ్వుతూ కప్పిపుచ్చినట్లుంది:-)

    ReplyDelete
    Replies
    1. కనబడతానని కమిట్ అయితే ఇంకేమైనా ఉందా..ఎప్పుడెప్పుడంటూ :)

      Delete
  16. అక్షరాలు అందంగా మలచిన మీ అందం అమోఘం
    మనసులోని భావాలకి రూపం ఇచ్చిన తీరు అద్భుతం

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యలకు వందనం

      Delete
  17. మనిషికి కోరిక కుతూహలం అనేవి సర్వనైజం పద్మ. అందులోను అక్షరాలని అలవోకగా మలచిచే నీ మోము చూడాలి అనుకోవడం ఎలా ఉంటావు ఏమిటని ఆలోచించడంలో తప్పులేదు. వాటి పర్యవసానంలో విభేధాలు పుర్రెకో బుధ్ధి వలె మారవచ్చును. అంత మాత్రమున అందరినీ ఒకే కేటగిరీలోకి చేర్చడం ఎంతమాత్రం సబబుకాదు. కవితలో నీవు వ్రాసిన భావం నీ వరకు ఎంత కరెక్టో, నీ అక్షార అభిమానుల కోరిక నిన్ను చూడాలని అనుకోవడం కూడా అంతే కరెక్ట్-హరినాధ్.

    ReplyDelete
    Replies
    1. మనిషి మనిషికీ ఒక నైజం ఉండవచ్చును కాదనను. కానీ అది ఎదుటి వారిని ఇబ్బందికి గురిచేయరాదని నా అభిప్రాయం. మీకు తెలియనిది కాదు కదా మాస్టారూ_/\_

      Delete
  18. conditions pettina sneham nammakam kadu :)

    ReplyDelete
  19. ఇన్ని సంవత్సారాలలో ఎప్పుడైన చూడాలి అనుకోవడం వాస్తవం కానీ మిమ్మల్ని కనబడాలి కోరలేదు. మీరు మంచి మనసు ఉన్న కవయిత్రి మీ కవితలు మాకు ఇష్టము.

    ReplyDelete
    Replies
    1. మీరు కోరినారు అని కాదు...అలా కోరే వారు చాలా మంది ఉన్నారని చెప్పాను అంతే యోహంత్

      Delete
  20. అందాలతో అభ్యంగన స్నానం ఆచరించినట్లుంది మీ కవితాలాపన అందుకు తగిన బొమ్మను పోస్ట్ చేసిన నిన్ను చూడాలని ఎవరికి ఉండదు చెప్పు అర్పితా. దీన్ని అంతర్జాతీయ ఆశగా పరిగణలోకి తీసుకోమందువా...హా అహా హా

    ReplyDelete
    Replies
    1. చలికాలంలో అభ్యంగన స్నానమా...సరిపోదన్నట్లు దానికి అంతర్జాతీయ ఆశను జోడించారు ;)

      Delete
  21. అస్తిత్వమైన అందచందాలను చూపి అసలైన అందాలని ఎలా అనాకారిని చేసేది..అద్భుతంగా వ్రాసారు అంతరంగమే అసలుసిసలు అందమని.

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు నందిని. మీ ప్రొఫిల్ పిక్ బాగుంది.

      Delete
  22. ఇంతకీ కనిపించేది ఎవ్వరికో ఎప్పుడో తెలుపవలెను అర్పితగారు :)

    ReplyDelete
    Replies
    1. లిస్ట్ ప్రిపేర్ చేసి త్వరలో తెలియపరుస్తాను మహీ :)

      Delete
  23. అందాన్ని కవితలా అల్లి ఆరిపోసినారు
    ఇక కనబడమని ఎలా అడుగుతాములెండి

    ReplyDelete
    Replies
    1. మీరు అడగరని తెలుసుగా ;)

      Delete
  24. గిసోంటి మాటలు మస్తుగ్గ రాసి పరేషాన్ జేస్తవు, నాకు సమజ్ గాలే కాకుంటేనె మంచిగుంది..

    ReplyDelete
    Replies
    1. నన్ను పరేషాన్ జేసి నేను చేసినా అంటే ఎట్లా :)

      Delete
  25. కన్నులతో చుసేదీ గురువా
    కనులకు సొంతమౌనా..అని పాడుకోమంటారా :) :)

    ReplyDelete
    Replies
    1. పాడుకోండి మాకు మాత్రం వినిపిస్తాను అనకండి.:) :)

      Delete
  26. very excellent art reflects your poetry in it.

    ReplyDelete
  27. సాగరగర్భ శూన్యోకట్లవాహిని భూతల హస్తసంచారిణి

    ~!~కనబడుట లేదు~!~
    కవితలో భావం దాగింది కనుక నాలుగు రోజులుగా కనబడుట లేదు
    మాటలో అర్దం దాగింది కనుక నాలుగు రోజులుగా కనబడుట లేదు
    అల్లరిలో మౌనం దాగింది కనుక నాలుగు రోజులుగా కనబడుట లేదు


    వివరాల్లోకి వెళితే:
    పొగ మంచు దట్టంగా కమ్ముకుని విరితోటలో విహరించే సమయానా మేఘాల వర్ణాలను అభివర్ణింప యత్నించగా పదాలన్ని మౌనాన్ని ఆశ్రయించగా మాటలన్ని మూగబోయాయి. ఇదే అదనుగా భావించి సదరు "సూర్యదేవర ఎండారావు" గగనతలం నుండి భూమి పై తన ప్రతాపంతో విజృంభించగా వేడికి నాలుకలన్ని ఎండిపోయి నీళ్ళకై అన్వేషించే క్రమంలో దారి తప్పి అర్దాలన్ని పెడర్దాలయ్యాయని కడపటి సమాచారం.

    ఈ వింత వార్తలు సమాప్తమయ్యే సమయానికి నీరుగారిపోయి ఆపసోపాలు పడి కాళ్ళీడ్చుకుంటు కమెంట్ ఇలా కనుల ముందు ప్రత్యక్షమవటానికి తొంభై ఆరు గంటలు కావస్తున్నా జాడలేని తరుణానా ఈ లుక్ అవుట్ కమెంట్.

    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ గారూ.. కమెంట్స్ డెలిట్ చేసి అకస్మాత్తుగా ఎక్కడికి వెళిపోయారో అనుకున్నాను...ఇప్పుడు అర్థమైంది. వార్తలు చదవడానికని....హా హా హా ;)thank you.. just kidding.

      Delete
    2. under sea optical fibre cable carrying digital information (ones and zeroes) and surface communicating mobile handset.

      there was some glitch with the network so, I had to delete the previous comments, padma gaaru..
      welcome padma gaaru :)

      Delete
  28. అక్షరాల్లో అందం చూసా
    పదాల్లో నీ ప్రతిభ చూసా
    భావాల్లో భాషపై పట్టు చూసా
    కమెంటుల్లో వాక్చాతుర్యం చూసా
    బొమ్మల్లో నీ కళాతృష్ణ చూసా
    కవితల్లో నీ పరిజ్ఞానం చూసా
    నిన్ను చూడకనే నీలో అన్నీ చూసా
    అర్పితను చూడవలసిన పనిలేదు తెలుసా

    అదేం వింతనో ఏమో నీ కవితలు చదువుతుంటే మనసు కాలేజీరోజులకి మళ్ళిపోతుంది. తెలియకుండానే నాలోని కవి నన్ను నిద్రలేపి గెంతులువేసి మరీ రాయిస్తాడు. ఇది నిజం పద్మార్పిత. పోస్ట్ చాలా బాగా ప్రెజంట్ చేసావు.

    ReplyDelete
  29. అరమోడ్పు కళ్ళ పద్మనయని..ఎంత అందమో!

    ReplyDelete
  30. Most urgently I want 2 see U

    ReplyDelete
  31. నిన్ను చూడని నాకనులకు వెలుగు ఎందుకు
    ప్రేలకుండా ఉన్న తుపాకీలో తూటాలు ఎందుకు
    ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకు???

    ReplyDelete
    Replies
    1. ఈ తుపాకీల గోడు మీకు ఎందుకు :) :)
      ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకు???

      Delete
  32. కనబడాలి అనుకున్న వారికి మాచక్కగా కనబడతాను వంటి ఆఫర్స్ ఇవ్వక ఇదేం ఫిటింగులు అర్పితా.

    ReplyDelete
    Replies
    1. হাঈ নযনি গারু নমস্তে ম্যাডং এলা ওন্নারু। চান্নালকু দর্শনং ইচ্চারু।

      హాయి నయని గారు నమస్తే మ్యాడం ఎలా ఉన్నారు. చాన్నాళకు దర్శనం ఇచ్చారు.

      Delete
    2. రీసెర్చ్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేసారా ఇన్నాళ్ళు...ఆలస్యంగా వస్తేను అదే అనుకున్నాను:-)

      Delete
  33. రెండుకళ్ళు సరిపోవు అందం చూడడానికి అందుకే కనబడను అని తప్పించుకోండి :)

    ReplyDelete
    Replies
    1. అంతేనా లేక అంత భయంకరంగా ఉంటాను అనుకుంటున్నారా :-)

      Delete
  34. ఇలా పోస్ట్ పెట్టి మాలో కుతూహలం మరింత పెంచారు
    ఏమైనా మొత్తానికి మీగురించి బసగానే వర్ణించుకున్నారు

    ReplyDelete
    Replies
    1. ఏదో మీలాంటివారిని ఇంప్రెస్ చేయడానికి పాట్లండీ.. :-)

      Delete
  35. మొత్తానికి మీ రూప లావణ్యాల గుట్టు విప్పారు. చూసేందుకు రంగు పూలన్నీ బాగుంటాయి. కానీ ముళ్ళున్నప్పటికీ గులాబీ అంటేనే అందరికీ ఇష్టం. మీ రూపం రంగు పువ్వు. మీ భావుకత గులాబీ సౌరభం. మీరు అనుమానించినట్టు ఆశ తోడేళ్ళు, పెట్రేగిపోవడాలు, కన్నుగీటడాలు ఉంటాయి. ఇష్టపడి చేతిలోకి తీసుకోకపొతే గులాబీ మాత్రం చిన్నపోదా చెప్పండి. ఆస్వాదించే మనసు తారసపడకపోతే అందానికి గుర్తింపు, లాలింపు ఎక్కడివి?

    ReplyDelete