మెరిసే మోజులపై మనసుపడి
అందక అలజడైన అంతరంగంలో
ఆగే భావాలు వెతకడం ఆవేశం!
మమతానురాగాలు మాయమైన
ఇరుకు మనసుల జనారణ్యంలో
ఆత్మీయత వెతకడం అనవసరం!
అలసినానన్న అస్తిత్వాన్ని దాచి
అలిగిన అమాయకపు ఊహలలో
జ్ఞాపకాలను వెతకడం అనిశ్చలం!
జ్ఞానం ఇచ్చిన పుడమిని విడిచి
జీవం లేని రాతికట్టడ నగరాలలో
ఆశల దారులు వెతకడం అవివేకం!
సాంప్రదాయపు సంకెళ్లను త్రుంచి
కొత్త ఫ్యాషన్ ప్రవాహపు మత్తులో
సహజత్వాన్ని వెతకడం అజ్ఞానం!
Awesome painting
ReplyDeleteAwakening thoughts
ప్రయత్నం తప్పదు కదా అప్రయోజనం అయినా
ReplyDeleteఏదైనా అనుభవము నేర్పేను పాఠం..
6 బులెట్స్=చిత్రం
ReplyDelete4 బులెట్స్=పోయం
మొత్తం=10 బులెట్స్
సాధించాలి అనుకుని ఆశావాదంతో సాగాలి పద్మగారు అప్పుదే జీవించడానికి ఒక స్ఫూర్తి ప్రయోజము.
ReplyDeleteమీరు రాసేవి అన్నీ నిజాలు వెరైటిలో ప్రెజంట్ చేస్తారు.
తామర మొగ్గలు కొలనున
ReplyDeleteకోమలమై మనసు చూర గొనె , నిలిచిన ఆ
కోమలియున్ ఆ కొలనున
తామర పూవై విరిసెను తాదాత్మ్యంబై .
రాను రాను మీ హస్తం కవిత/కళాచాతుర్యంతో విరాజిల్లుతుంది....అభినందనలు.
ReplyDeleteకలువ కోమలి ఏమి చెప్పినా వ్రాసినా రమ్యమే...
ReplyDeleteఅప్రయోజన లక్షణాలు ఎక్కడ?
ReplyDeleteగిసోంటి పోస్ట్ సదవనికి ఫోటో సూడనికి
ReplyDeleteఅదుష్టం ఉండాలె అప్రయోజనం ఏందమ్మో :)
advantages & disadvantages who bothered..
ReplyDeletesimply mast paintings & lyrics in this blog.
ఈ మధ్య మీ కవితలపై పెయింటింగ్స్ ఆధిపత్యం వహించి అలరిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త.
ReplyDeleteమెరిసే మోజులపై మనసుపడ్డం వెరైటీ ఫీలింగ్.
ReplyDelete
ReplyDeleteనీ భావాలు తెలియాలంటే
నీ కలం రాసే కవితల్ని చదవాలి
నిన్ను చదవాలి అనుకుంటే
నీ చిత్రాల వయ్యరాలు చూడాలి
నీ మనసు తెలుసుకోవాలంటే
నీ బ్లాగ్ చూసి మైమరచిపోవాలి
Iam wondered and appreciate Your writing skills Padma. Keep rocking dear.
ReplyDeleteకాలానుగుణముగా మార్పనేది అనివార్యం అత్యవసరం
ReplyDeleteకాకతాళియమో యాదృచికమో మానవత్వమే మార్పు చెందింది
సత్సాంప్రదాయాల లోగిలిలో తూలతూగే నాటి కాలం కనుమరుగున పడకూడదనే భావం కలగలసి మీరు రచించిన ఈ కవిత దృశ్యకావ్యం పద్మ గారు
~శ్రీ~
వైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ మంగళం
beautiful art.
ReplyDeletelast 3 lines too good.
ReplyDeleteఅలిగిన అమాయకపు ఊహలలో జ్ఞాపకాలను వెతకడం అనిశ్చలం.
ReplyDeleteనీ కవిత పరంగా చూస్తే అసలు జీవించి అప్రయోజము అనిపిస్తుంది అర్పిత. జీవించడానికి అనేక పాట్లు పడాలి తప్పదు. సాధ్యం అయినంత వరకు ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకుని ఎవరికీ హానికారం కాని పనులు చేస్తూ జీవించాలి. ఆలోచించవలసిన పదబంధం వ్రాశావు, అభినందనలు-హరినాధ్
ReplyDeleteఅనవసరంగా ఆవేశపడడ్డం అవివేకమని అర్థమైంది.
ReplyDeleteఆలోచించి అడుగువేయాలని తెలిసింది.
ఊహలలో జ్ఞాపకాలను వెతకడం అనిశ్చలం ముమ్మాటికి నిజం.
ReplyDeleteభావాల్లో ఆవేశం
ReplyDeleteఆత్మీయత అనవసరం
జ్ఞాపకాలు అనిశ్చలం
ఆసలు అవివేకం
సహజత్వం అజ్ఞానం
వీటిని వెతకడం లో టైం వేస్ట్ చేయవద్దు అంటూ సింప్లె సందేశాన్ని అందించారు. ఇక పాటించడమే తరువాయె.
ఇవి చదివి పాటించని జీవితం అప్రయోజం.
ReplyDeleteమరో మంచి కవిత పద్మ.
ReplyDeleteసాంప్రదాయపు సంకెళ్లను త్రుంచి కొత్త ఫ్యాషన్ ప్రవాహపు మత్తులో ఎప్పటి నుండో మునిగి తెలుతున్నాము.
ReplyDeleteఅంతరంగ భావాల్ని అద్భుతంగా కవితలో పొందుపరిచారు.
ReplyDeleteచిత్రం చూడ చక్కగ ఉన్నది.
అందరి అభిమానాక్షరాలకు శతకోటి వందనాలు. _/\_
ReplyDeleteMarvelous poetry.
ReplyDeleteకొత్త కవిత ఎక్కడ?
ReplyDelete