మదిగదిలో...

నిన్నే తలచి నిశ్శబ్ధాన్ని కోరుకునేవేళ
విరహ సంద్రాన్ని ఆనంద భాష్పాలతోనో
కలల వర్షాన్ని కన్నీటి బిందువులతోనో
ఎడబాటుతో ఏక కాలంలో నింపేస్తావు!

తరచి తలచి మదివలపు తలపు తీసేవేళ
నా ఆయువుకి ఆశలరెక్కలు తొడుగుతూనో
ఆశలకి అందమైన కలలపాన్పు పరుస్తూనో 
శ్వాసకు గంధపు పరిమళాన్ని అద్దుతావు!

ఎద భారమై నీకై ఎదురు చూస్తున్న వేళ
నా వొంటరి కాలాన్ని నీ స్వప్న కౌగిలితోనో
అలసిన కనురెప్పలకి ఊహలరెక్కలతోనో    
వాడిన మదిపువ్వుని పునర్జీవింపజేస్తావు!

మదిదాగిన నిన్ను కంటికి పరిచయంచేయ
మదిన మహదానందమని కునుకుతీసెవు!

31 comments:

  1. Love pair ńd suitable poem.

    ReplyDelete
  2. మది గది లోగిలిలో
    మౌనాలన్ని మాటలై
    మాటలన్ని ఊసులై
    ఊసులన్ని పలకరింపులై
    పలకరింపులన్ని పులకింతలై
    పులకరింతలన్ని ఆనంద డోలికలై
    ఆనంద డోలికలో జీవితమే సాఫిగా సాగుతుందని
    మీ తరహాలో చెప్పకనే చెప్పారు పద్మ గారు.

    ReplyDelete
  3. మది మూల నుంచి గది మొత్తం ఆక్రమించెనా..

    ReplyDelete
    Replies
    1. మది గది లో గదమాయింపు యింపుగా
      మది మూలలో దాగి ముదము మూగదాయే
      ఆక్రమణ కాలక్రమేణ క్రమక్రమంగా క్రీగంటాయే కనుచూపూలే కడలిలా కదిలే కనుసైగతో!

      Delete
  4. ప్రేమ పొంగిపొర్లింది కవితలో
    బొమ్మ నిలిచింది మదిలో

    ReplyDelete
  5. గుండె లోతు లందు కొలువైన చెలికాడు
    నిండు కనుల ముందు నిలువ డేల ?
    అంత ప్రేమ లోని ఆరాధనకు ఫలమ్
    కనుల కళ్ళ నీళ్ళు కార్చు కొరక ?

    ReplyDelete
    Replies
    1. గుండె లోతు లందు కొలువై లయ గతుల నందు
      ప్రాణమై ప్రణవమై ఆత్మ యందే కొలువయ్యాడు ఊపిరి లా!
      ఫలమ్ ఆశించక చేసేటి ఆరాధనలో భక్తి భావము నిలచినా ఆనందతిరేక మగు వేళనే కనుల భాష్పాలే నేల రాలే లేలేత చెంపల పై అద్వైతాద్వితీయమై అద్వితీయద్వైతమై!!

      Delete
  6. గుండెగదిలోనే కాదు తనువంతా తానై తలపుల్లో తడుముతుంటాడు మాధవుడు మాదిరి.

    ReplyDelete
    Replies
    1. ~ఆనందాల రాగాలాపన ధ్వనించగా
      మువ్వలఘల్లు నవ్వులజల్లు వినసొంపాయే~

      ~శ్రీ~

      Delete
  7. ప్రేమలో మునిగి తేలేవారికి మదిగది ఇరుకుగా బాగుంటుంది హా అహా..

    ReplyDelete
    Replies
    1. कैसा वक्त है ये
      कैसा हादसा है ये
      बिन बुलाये मेहमान बन आये
      सोच विचार सब अक्षर में मिल कविता बन जाये

      Delete
  8. ఎంత మధురం మదిగదిలో బంధీ అవడం
    తలపుల్లో ప్రేమించుకోవడం-బాగుంది భావం

    ReplyDelete
  9. ఆశలకి కలల పానుపు పరుస్తూ శ్వాసకు గంధపు పరిమళాన్ని అద్దడం అద్భుతం మీ కవిత తగిన చిత్రం.

    ReplyDelete
  10. కలల వర్షాన్ని కన్నీటి బిందువులతో యే క్యా పద్మాజీ ప్యార్ బరీ కవితలో ఎందుకు ఏడుపు.
    హ్యాపీ మూడ్ కరాబ్ హోగయా.
    పిక్ చాలా బాగుంది.

    ReplyDelete
  11. ఏది ఏమైనా
    మీ భావాలన్నీ ప్రేమమయం

    ReplyDelete
  12. వలపుని వీడి వాస్తవంలోకి రండి :) :)

    ReplyDelete
  13. She takes the Centre Stage in Poetry
    She takes the Centre Stage in Society
    She Handles the Pin Wheel as a Child
    She Rocks the Cradle as a Mother
    She Breaks Down Yet Stays Strong
    She Corrects Each and Every Wrong
    She Needs is Respect and Dignity
    Let us Join Hands and Protect the Caretaker

    Happy National Girl Child Day
    24 Jan 2017
    17:57

    यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता

    ~శ్రీధర్ భూక్య

    ReplyDelete
  14. ప్రేమలో నువ్వు వ్రాసిన ఘటనలు సర్వ సాధారణమే అయినా వెల్లడించే విధానం వేరు అన్నట్లు సున్నిత పదాలతో చెప్పి మెప్పించావు. మోహన్ ఆర్ట్ పిక్ అతికినట్లుంది-హరినాధ్

    ReplyDelete
  15. ప్రేమ వాక్యాలతో గుండెల్ని పిడేసినారు అంటే అతిశయోక్తి కాదు సుమా!

    ReplyDelete
  16. వలపు పండి పాకంలో పడితే ఇటువంటి అందమైన భావాలు పెల్లుబుకునని తెలిసింది :)

    ReplyDelete
  17. ప్రేమమయం మీ బ్లాగ్ లోకం.

    ReplyDelete
  18. ప్రేమాయణం రమ్యం కానీ అందరికీ దక్కనిది

    ReplyDelete
  19. ప్రేమ మధురం
    ప్రియుడు ప్రియురాలు అతిమధురం
    అనుభూతులు ఎన్ని ఉన్నా అవకాశాలు శూన్యం అన్నట్లుంది..హ హ హా

    ReplyDelete
  20. నీ కవితలు జీవిత సత్యాలు
    వికాసానికి పునాదులు..
    బాధలో నీ అక్షరాలు చిరుదివ్వెలు
    చదివితే రేకెత్తించు ఆలోచనలు
    కవితల్లో కనిపించు నవరసాలు
    ఉపశమనయ అభ్యుదయ జవాబులు
    తేనెలు ఊరించు మిఠాయిలు..

    ReplyDelete
  21. తుపాకీల్ లేవ్
    తూటాల్ లేవ్
    నాకు నువ్వు నీకు నేను లెవల్లో కొట్టినారు

    ReplyDelete
  22. పొదివిపట్టి పదాల్లొ పొందికైన ప్రేమ చిత్రంలో మెండైన భావం మొత్తం తేటతెల్లమయ్యేలా ఉంది మీ కవితాచిత్రము.

    ReplyDelete
  23. నా ఒంటరికాలానికి నీ స్వప్న కౌగిలి వాహా

    ReplyDelete
  24. అభిమానాన్ని ఆదరణని చూపి అక్షరాలుగా అందిస్తున్న మీ అందరి స్పూర్తికీ నా శతకోటివందనములు.

    ReplyDelete