ప్రేమపండుగ..

విరహం తాళలేను వీడిపోకంటూ విచిత్ర విన్యాసాలతో  
వినాయక చవితినాడు విఘ్నమేలేదంటూ మొదలెట్టి
ఉన్నప్రేమ చవితిచంద్రుడి ముందు కుమ్మరించినావు!

తిరుగులేదు మనకని తిధిలేని తిరుగుబోతులా తిరిగి
రామనవమి తరువాత తాళికడతానంటూ రోజుల్లెక్కెట్టి
హోళీకి ముఖాన్న రంగులద్ది మాయతో మభ్యపెట్టావు!

నేనుంటే ప్రతీరోజూ పండుగని లేదంటే రోజు శివరాత్రని 
చలికి సరసం నేస్తమంటూ సంక్రాంతినాడు ముద్దుపెట్టి 
నాగులపంచమికి నన్నల్లుకుని నవరాత్రి దేవినన్నావు!

వలచివస్తి వరలక్ష్మీవ్రతం ఎందుకు వరమియ్యి చాలని 
దసరాకి దశతిరుగునని దరిచేరి దాసోహమై దణ్ణాలెట్టి   
మాఘమాసంలోనే ముహూర్తాల్లేవని మూగనోమట్టావు!

దీపావళి వెలుగులో దిగులు పడుతున్న నన్ను చూసి
కార్తీకపౌర్ణిమ వెన్నెలలా విరబూసి తాపాన్ని చల్లారబెట్టి
ప్రేమికులకు పండుగలతో పనేలని పొదివిపట్టుకున్నావు!

29 comments:

 1. పండుగ వచ్చెనంటూ అందరూ విషెస్ చెబుతుంటే నూవ్వు ప్రేమపండుగ పవర్ చూపించావు. శభాష్ పద్మార్పిత.

  ReplyDelete
 2. ప్రేమ పండుగని వ్రాసి ఎందరి గుండెల్లో గిలిగింతలు పెట్టినారో పండుగనాడు. జర బద్రం బద్రం

  ReplyDelete
 3. ఏ ఒక్క పండుగ అవసరంలేదు అని చాటి చెప్పే పండుగ ప్రేమపండుగ
  అది సవ్యమైన మార్గాన్ని అనుసరించిన సత్ఫలితం లేదంటే నరకం ఏమంటారు.

  ReplyDelete
 4. మీరిలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పెళ్ళితో పనిలేదు ప్రేమ పండుగకని తెలిస్తే రెచ్చిపోయెదరు ప్రేమికులు. నా ఉధ్ధేశం ప్రియుళ్ళు మాత్రమే కాదండోయ్..అహా హా :)

  ReplyDelete
 5. Good blog
  Nice discrimination of art.

  ReplyDelete
 6. Love festival offer nice.

  ReplyDelete
 7. పండ్గకు ఇనాం ఇట్లిచ్చినావా పద్మార్పితమ్మో..
  కవిత మస్తుగుంది ఫోటో జబర్దస్తుగుంది

  ReplyDelete
 8. సల్లని మనసుండాలే గాని దినాము పండుగే అనిపిస్తది
  సక్కగా పలకరిస్తే పలికితే అంతకంటే కావలసినదేముంది

  ~శ్రీ~
  జయహే జయ జయహే జయ రామనామ రసఝరి

  ReplyDelete
  Replies
  1. lokam teeru
   :
   :
   vadilellinavaarikosam vubalaatamaa..
   vadilellanivaaritho chelagaatamaa..
   idekkadi vidduram..
   ahankaaramutho virravige vaarikai aaraatamaa..
   palakarinchina palakanivaarikosam taapatrayamaa..
   bahusha kaala mahimayo
   kali kaala maayo
   :
   manchivaaru lerani evarannaaru.. appatlo padullo okarunte..
   aa sankhya gananiyanga perigi.. ippudu lakshallo okarunnaaru..
   idekkadi vidduram..
   ounatyam oudaaryam okappudu aacharano vundedemo..
   ippudu kevalam saahityaaniki machutunakalaa migilipoye..
   bahusha kaala mahimayo
   kali kaala maayo
   :
   snehitulu sannihitulai.. sannihitulu aapadbaandhavulayyeru okappudu
   e kaalam lo andaru vunna ekaakiyegaa.. chuttu vunna ontaregaa ippudu
   idemi vidduram..
   manchitanam maanavatwam edo moola nakkindi
   lokame taarumaarai vichakshana sahanam kolpoyindi
   bahusha kaala mahimayo
   kali kaala maayo

   ~sri~

   Delete
  2. "reality and surreality even though seem to be same, but logically they have the difference of the sea and sky."

   పైన తెలిపిన విధంగా.. పండగ అంటే స్పెషల్ రోజు కానే కాదు. అన్ని రోజులు ఒకటే.. వ్యత్యాసం ఒకటే.. ఏ రోజునైతే మనలోని బాధ కన్నీరై దుఃఖం దూరమై సంతోషంగా ఉన్నామనిపిస్తే అదే అసలు సిసలైన పండుగ రోజు.

   కత్రా బోలావతోయి బోలేని తో కేని కాఁయ్ కరేర్ వేని.కేన కన్నా కూఁ రచకో కేని మాలమ్ ఛేని. ఏక్ దాడేర్ వక్తేపర సట్ కేసి రేజా.. జమ్మి పర హుయేజ్ సే అత్రాక్ దాడే వాసు.. కుణ్సికో ఏక్ దాడ్ కేనితోయి భగవానేర్ ఘర్ జాయేర్ తప్పేని. అత్రాజ్.!

   Delete
 9. మీ కవితల్లో ఉన్న పవర్ ప్రతిబింబమైంది చిత్రంలోను అక్షరాల్లోను.

  ReplyDelete
 10. దశతిరుగునని దరిచేరి దాసోహమై దణ్ణాలెట్టి-అందితే తల లేకపోతే కాళ్ళు పట్తుకునే ప్రబుధ్ధులు ఎందరో నేటి సమాజంలో. కవిత సూపర్ డూపర్.

  ReplyDelete
 11. పండగ పండక్కు ప్లేట్ ఫిరాయించిన ప్రియుడు...
  మహా గొప్ప మేధావి :-)

  ReplyDelete
 12. ప్రేమికులకు పండుగలతో పనేలని.... ఆ వంక తోనైనా కనీసం .....

  ReplyDelete
 13. eid ke sang pyar...bahut badiya didi

  ReplyDelete
 14. పండుగ చేసుకుని పిండివంటలు తిని వచ్చి కులాసా జల్సా కవిత చదివి నవ్వుకుంటున్నాను.

  ReplyDelete
 15. పండుగలతో ప్రేమను పరీక్షించడం పాత పద్మార్పితను మరోమారు ఊత్తేజాన్ని పుణికిపుచ్చుకుని ఉరకులు వేసినట్లుంది,అభినందనలతో-హరినాధ్

  ReplyDelete
 16. hey...he..hee...heee :)

  ReplyDelete
 17. మాఘమాసంలో ముహూర్తం లేదన్నాడు
  తెలివైన టెక్కులమారి ప్రియుడు

  ReplyDelete
 18. పండుగలకి పబ్బం గడుపుకున్న ప్రియుడు, తగిన గడుసరి ప్రియురాలు. ఇద్దరు తీసిపోరు.

  ReplyDelete
 19. ప్రేమ=పిస్టోల్
  పండుగలు=బులెట్స్

  ReplyDelete
 20. తిధిలేని తిరుగుబోతు correct.

  ReplyDelete
 21. మీ ఊహలకు అంతం లేదు అధ్భుతం.

  ReplyDelete
 22. మనసులు కలిసిన రోజు పండుగయే.

  ReplyDelete
 23. పండుగలు పబ్బాలంటూ కవిత కాస్త గందరగోళంగా ఉంది.

  ReplyDelete
 24. కార్తీకపౌర్ణిమ వెన్నెలలా విరబూసి తాపాన్ని చల్లారబెట్టి
  ప్రేమికులకు పండుగలతో పనేలని పొదివిపట్టుకున్నావు

  ReplyDelete
 25. విరహంలో విఘ్నాలు
  తపనకు తాపాలకు తద్దులు
  శుభలేఖ రాయడానికి తిధులు
  వరాలు ఇవ్వబోవ వ్రతాలు
  దిగులుతో ఉంటే దివిటీలు
  లక్షణంగా కూర్చిన పదాలు..భేష్

  ReplyDelete
 26. అందరి అభిమానాక్షరాలకు అభివందనములు _/\_
  ఆలస్యానికి మన్నించండి.

  ReplyDelete
 27. పండుగలు అన్నీ జోడించి ప్రియుడిపై చేసిన పిర్యాదు.

  ReplyDelete