తెలియకుండా కప్పెడుతున్న లోపాలెన్నో
ఊపిరి గతులని శిల్పంగా మార్చే పనిలో
ప్రజ్వరిల్లలేక ప్రకంపిస్తున్న వాస్తవికతలెన్నో
పత్రంపై వొలకలేక బెట్టుచేసే తాపత్రయంలో
లోన దాగిన తన్మయత్వపు ప్రకంపనలెన్నో
భావ తృష్ణకి భాష్యం నేర్పే కుతూహలంలో
మౌనంగా కరిగిపోతున్న రహస్యజడులెన్నో
లేని రాచరికం చూపే అడుగుల సవ్వడిలో
పగిలిన పాదాలు చూపలేకున్న మరకలెన్నో
తడారిన తపనను చిగురింపచేసే ఆరాటంలో
స్థానభ్రంశం అయిపోతున్న అంకురార్పణలెన్నో
నిజాలని దాచాలన్న నిరంతర ప్రయత్నంలో
నీడా తోడు రాక మారిన నైసర్గిక రూపాలెన్నో!
కనిపించే కన్నులలో కనబడని లోతులో దాగే స్వప్నాలెన్నో.. పలికే మాటల మాటునా మౌనముగా మిగిలే పదాలెన్నో.. అలుపెరుగక సాగే జీవిత పయనానా ఒడిదుడుకులెన్నో.. ఇదే జీవితానికి నిర్వచన.. ఎందుకో తెలుసా పద్మ గారు:
ReplyDeleteఅందరు అన్ని రాస్తారు.. కొందరు కొన్ని రాస్తారు..
కాని చావు పుట్టుకల నడుమ జీవిత చిత్రం మాత్రమే గమనర్హం..
జీవితానంతరం ఎలాగు సాధ్యపడని మానవత్వ దృక్కోణాన్ని
వాటి సాధక బాధకాలను ఏకరూపు పెట్టి..
వినూత్నంగా ఈ ప్రయాస..
బ్రతికి ఉన్నపుడు నలుగురు నీ గురించి చెడు చెప్పుకుంటారని దిగులు
ఆఖరి ఘడియలో గుమ్మిగూడిన జనాన్ని ఒక్కసారి లెక్క పెట్టు
నిన్న నీతో మౌనముదాల్చినా నేడు కంటిచెమ్మతో పలకరింపులు
అందుకే చచ్చేదాక అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు
ఎవరో ఏదో అన్నారని ఆ మాటని మనసు లోతుల్లో ఉంచి
ప్రతి క్షణం నీలోనే నీవు కుమిలిపోయావు నిన్నటి వరకు
ఈ విషయం నీకూ తెలుసు మానవ జన్మ రాదు మరలి
అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు
మనసును గాయపరిచారని నిందించేవు నిన్న నీవాళ్ళని
చూడు నీ చుట్టు చేరిన వారిలో పరాయివాళ్ళు ఎవరు లేరు
మిగిలేవు ఏదో రోజు కాటిలో కట్టెలా కాలి బూడిదయ్యీ
అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు
ఆప్యాయంగా రోజు పలకరిస్తుంటే ఉండకు విని విననట్టు
రేపటిరోజునా ఆ పలకరింపులు శాశ్వతంగా మూగబోవచ్చు
గుండెలకు హత్తుకుని ఏడ్చినా శ్వాసను విడిచి వెళ్ళే రోజు రావచ్చు
అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు
మనసుకి గాయమయితే శాంతియుతంగా పరిష్కరించుకొవచ్చు
దేహానికి గాయమయితే సపర్యలతో ఉపశమనం పొందవచ్చు
జన్మించే ప్రతి జీవి జీర్ణవస్థలో మరణ శయ్య కాదు కనికట్టు
అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు
నీవు బ్రతికున్నపుడు నిన్ను వెనకకు నెట్టాలని చూస్తారు కొందరు
నీవు పరమపదించినాక నీ పార్థివ దేహాన్ని అనుసరిస్తారు అందరు
విడువక ఆశను బ్రతకాలి ఆజన్మాంతం జీవితాన్ని విధి రాసినట్టు
అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు
Disclaimer: ఈ కవిత కేవలం కల్పితమే.. దీని ద్వార మానవ జన్మ విశిష్టతను తెలియజేయాలని నా అభిమతం.. మానవ జన్మ ఎలాగు కనుమరుగవక తప్పదు కనుక బ్రతికున్న నాళ్ళు కొందరితో అయినా మంచిగా మెలిగితే అటు పిమ్మట మనం భౌతికంగా లేకున్నా ఏ కొందరి మనసులో జ్ఞాపకాలుగా మిగిలుంటే జన్మ ధన్యమని చెప్పటానికి చేసిన అక్షర ప్రయత్నం.. దీని ద్వార ఎవరిని ప్రలోభ పెట్టే ఉద్దేశ్యం నాకు లేదని మనవి చేసుకుంటున్నాను.
మరొక్క మారు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు మీకు..
కమెంట్ ఇలా రాశారేమిటని అనుకోవద్దు పద్మ గారు.. ఏదైనా పొరపాటుగా అనిపిస్తే మన్నించండి.. అందరు బాగుండాలని కోరుకుంటు..
~శ్రీ~
గోదారంగనాథ శ్రీనిలయగోవింద
మీరు రాసిన వాటి ముందు నేను రాసిన పదాలు ప్రణమిల్లేంత అద్భుతంగా రాసారు. ధన్యోస్మి.
DeleteSridhargaru..జీవితం కాచివడపోసి ఈ విధంగా జోడించారు.
Deleteజీవితాన్ని కాచి వడపోసేంత వయసు కాదు నాది.
Deleteరోజువారి జరిగే సంఘటనల సమాహార సారమే అది.
నేను జన్మించి మూడు దశాబ్దాల కాలమే అయినది.
కల్కిగారు పద్మగారు మీ మీ కమెంట్లకు వందనమిది.
అధ్భుతంగా వ్రాసావు శ్రీధర్-అభినందన ఆశ్శిస్సులు-హరినాథ్
Deleteహరినాథ్ సర్.. మీ వ్యాఖ్యకు వినమ్రభివందనములు
Deleteజన్మించే ప్రతి జీవి జీర్ణవస్థలో మరణ శయ్య కాదు కనికట్టు
Deleteఅందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు
మనిషి పుట్టుక నవ మాసాల పిమ్మట జరుగునని ముందుగానే ఊహించగలము కాని వయసు పైబడి ఏ క్షణానా మరణం వస్తుందో ఊహించలేము. మనకు తెలిసిందల్లా ఒకటి ముదసలి వయసు పైబడ్డాకా ఆయువు జ్యోతి కొండెక్కినాకా కట్టేలో కొరివి పెట్టి భస్మం చేస్తారని. అయితే అదెప్పుడో తెలియదు ఎవరికి.. ఏ క్షణం చివరిదో తెలియనపుడు అలా ఊహించలేని వాస్తవాన్ని ఊహకే వదిలి కడదాకా బ్రతకమని ఆ లైన్ తాత్పర్యం మధు సర్. మీకు ఆ లైన్ నచ్చినందుకు ధన్యవాదాలు.
Deleteజై శ్రీమన్నారాయణ
కొత్తసంవత్సరానికి స్వాగతం పలికారో లేదో అప్పుడే స్వగతమా... స్వగతం వెల్లడించితిరి పో.. ఇంత ఇంకంప్లీట్ గా అయితే ఎలా మిమ్మల్ని గురించి తెలుసుకోవాలి...
ReplyDeleteఆత్రుత కాకపోతే తెలుసుకోవాలనుకుంటే నేను రాసే అక్షారాల్లో తెలుసుకోలేరా అసలే మీరు కవికోవిదులాయే :)
Deleteస్వగతం అంటే ఆటోగ్రఫీ వ్రాసి ఆశ్చర్యపరచాలి కానీ ఇలా నిరుత్సాహపరిస్తే అస్సలు బాగోలేదు పద్మార్పితా :)
ReplyDeleteఆటోగ్రఫీ అంటే ఆషామాషీ కాదు కదండీ..అంత ఎత్తుకి నేను ఎదగాలిగా :-)
Deleteఆటోబయోగ్రఫి:
Deleteమూడు దశల జీవిత సారం కాయితం పై సిరతో కంటే మదిలో జ్ఞాపకమే గొప్పదని చెప్పే నా ఈ కవితాక్షరి
ఏదో నాలుగు ముక్కలు జీవితం గురించి వ్రాయాలని తపన..
చిన్నప్పుడు.. వ్రాతలు రాకా.. మాటలన్ని లోలోపలే దాగి అమ్మ వొడిలో సేదతీరి ఆ వ్రాయటాన్ని బాల్యానికీ అందుకోమని చెప్పాను..!
అప్పుడప్పుడే పసితనపు ఛాయలను వీడి బాల్యపు దశలో తొలి అడుగులు.. మాటలు వ్రాతలు ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నావు.. ఇప్పుడే జీవితం గూర్చి ఏమి తెలుసుకోగలవంటే.. యవ్వనానికీ అందించి బాల్యాన్ని ఆస్వాదించాను..!!
యవ్వనం రానే వచ్చింది.. పూలతోటలో వికసించే విరుల పరిమళభరితంగా.. (ఇప్పుడు నాది ఈ దశ)
వ్రాయాలని ఉన్నా.. ఇప్పుడిప్పుడే ఘడియలని నెమురు వేసుకుంటున్నా.. ఇవన్ని జ్ఞాపికలుగా తీర్చిదిద్ది ఒక్కోక్కటిగా తరువాత వ్రాద్దామని అనుకుని రోజువారి పనిలో నిమగ్నమై ఆ ఆలోచనని పక్కన పెట్టాను..!!!
జీవితాన్ని మించిన మహాకావ్యం మరొకటిలేదని అగుపించి.. జ్ఞాపకాలన్ని జ్ఞాపికలుగా మరేలోగా మరో ముప్పై-నలభై ఏళ్ళ పైచిలుకు వృద్ధాప్యం వచ్చేస్తుందని.. అటువంటప్పుడు వ్రాసే బదులు వాటన్నిటిని ఏర్చి కూర్చి నలుగురి మదిలో చిరకాలం కాకున్న చిరుకాలమైనా ఓ తీపి జ్ఞాపకమై మిగిలుండాలని ఆశ!
Today's Little Moments Become Tomorrow's Precious Memories.
sridhar bukya garu,
Deleteheart felt wishes for a happy
and prosperous new year 2017.
(i couldn't trace your blog id...
and comments disabled at your g+ ...)
:)
thank you for your wishes respected naga malleswara rao sir, wishing you a new year full with health, happiness, prosperity and benignity. happy happy 2017 sir.
Delete(sorry for the inconvenience so caused.. I post very less on g+ these days.)
you may comment on my blog at https://goo.gl/bdQygT
ఇన్ని భావాలను అవలీలగా వ్రాసేస్తు తృష్ణ అని వ్రాయడం ఎంత వరకు సబబు అంటారు. చిత్రం కనువిందుగ ఉంది.
ReplyDeleteభావ దాహం అంత త్వరగా తీరదుకండి.
Deleteమొదటి కవిత మురిపంతో ముద్దు ముద్దుగా వ్రాయవలసింది.
ReplyDeleteఎప్పుడు మురిపాల మూడ్ వస్తే అప్పుడు రాస్తానుగా.. :-)
Deleteలేని రాచరికాన్ని చూపించి కాళ్ళ పగుళ్ళు పట్టించుకోరని ఢాబు కోసం పోయి కష్తాలు కొనితెచ్చుకునే వారు చాలామంది లోకంలో, కనువిప్పు కవిత బాగారాసారు.
ReplyDeleteనాకు నేను అనుకుంటూ మీ అందరితో పంచుకున్నానండి.
Deleteఈ ఇయర్ అంతా హ్యాపీ హ్యాపీగా రాసేయండి మేడంజీ
ReplyDeleteమనకి ఎందుకు ఈ లబో లబో మంటూ ఏడుపులు,
నోట్లు లేక నవ్వులు లేక ఏమైపోవాలని మనం.:) :0 :)
నవ్వుల్ని నోట్లతో కొనలేరుగా... అలాగే :-)
Deleteప్రతి రెండు లైన్స్లో ఆలోచనలు రేకెత్తించేదిగా ఉన్నాయి.
ReplyDeleteథ్యాంక్యూ సృజనగారు.
Deleteమీలాగా యేవొక్కరు
ReplyDeleteపాలను నీరమును వేరు పరుపంగ మదిన్
గీలించి వ్రాయ జాలరు
మేలిమి సర్రియలిజమిది మీకే సొంతమ్ .
అసలు రంగు తెలియ నంతగా దాపెట్టి
నకిలి రంగు పులుము నట్టి వింత
లోక రీతి మీద రోసిన స్వగతాన్కి
స్వాగతము పలికెద పద్మగారు !
మీ కమెంట్స్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని సంతోషాన్ని ఇస్తాయండి. మీ అభిమాన వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
Deleteముందుగా పద్మార్పిత గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు...
ReplyDeleteమనసులో నిండిన వొక భావాన్ని కవిత్వపరంగా ఏమేరకు స్పృశించాలో..ఎక్కడ యేవాక్యాన్ని కవిత్వీకరించాలో తెలిసిన మేధావి మీరు... ఈ కవిత కూడా అచ్చం అలాంటిదే.... నవ్యమాలిక ఈ కవిత...
గ్రేట్ మేడం... సలాం...
థ్యాంక్సండి...ఇంతకన్నా మీ అభిమానాక్షరాలకు నేను ఏమిచ్చుకోగలను.
Deleteతడారిన తపనను చిగురింపచేసే ఆరాటంలో
ReplyDeleteస్థానభ్రంశం అయిపోతున్న అంకురార్పణలెన్నో
Excellent meaning padma.
Each & every line is having its meaningful value. Keep it up.
Thank you very much Pashaji...
Deleteన్యూ ఇయర్లా జరంత నవ్విస్తే మంచిగుంటదిగందా, నువ్వేందమ్మో గిసోంటి నిజాలు సెప్పి బాధ పెడతవ్.
ReplyDeleteఎప్పుడూ నవ్వుతూ ఉండండి...నేను నవ్వేస్తాను :-)
Deleteఆలోచించి చిత్తశుద్ధితో చేసే కార్యం ఏదైనా సఫలీకృతం అవుతుంది అనుకోడానికి నిదర్శనం నీ అక్షరసుమాలు.
ReplyDeleteఏదో వెలితి అగాధాన్ని సృష్టించి కలవపెడుతూ నీడలా వెంటాడుతూ అలసిన సమయాన సేదతీర్చి మంచుతెమ్మెరలా చల్లని స్పర్శవోలే తాకేను నీ అక్షరాలు.అభినందన ఆశ్శిస్సులు-హరినాథ్
ధ్యన్యోస్మి....హరినాధ్ గారు.
Deleteమనసులోని భావాలను
ReplyDeleteఅక్షర భవనాలుగా నిర్మించి
నిర్మొహమాటంగా బయటపెట్టే ధైర్యం
చేరువా చిత్రాలు మీకు సొంతం
మీ కవితలు కవనాలు అక్షర ఆయుధాలు.
అందంగా ప్రోత్సాహ వ్యాఖ్యలు రాసిన మీకు అభివందనాలు.
Deleteఅంతర్లీనంగా నిగూఢభావాలు దాగిన కవిత అనిపిస్తుంది. చాలా బాగావ్రాశారు.
ReplyDeleteథ్యాంక్యూ లిపి.
Deleteభావతృష్ణ బాగుంది.
ReplyDeleteథ్యాంక్సండీ.
Deletetelugu bhashalo tiyadanam me kavitalo undi.
ReplyDeletethank you Janardhangaru.
Deleteబ్లాగ్లో అడుగుపెడితే పూర్తిగా పద్మార్పితం అనేట్లు అలంకరించుకున్నారు.
ReplyDeleteఈ కవితలోని కొన్ని వాక్యాలు ఒకటికి రెండుసార్లు చదివితే తలకెక్కును.
అంత కష్టంగా ఉన్న వాక్యాలు ఈజీగా అర్థం చేసేసుకున్నట్లే అయితే.. :-)
Deleteఅక్షరాల్లోని మర్మం తెలిసింది కానీ ఫోటో పట్టింది ఎందుకో అర్థం అవడంలేదు. ఈ చిత్రం కవితకి ఎంత వరకు సరిపోయినట్లు పద్మా.
ReplyDeleteఅన్ని చిత్రాలు సరిపోయేలా జతచేసే ప్రయత్నం చేయగలనే కానీ ఒకోసారి కుదరవు. ఇది ఒక స్త్రీ మనోభావాలని తనలో తాను నెమరువేసుకున్నట్లు ఉంది సరిపోతుంది అనిపించిందండి.
Deleteతడారిన తపనను చిగురింపచేసే ఆరాటంలో
ReplyDeleteస్థానభ్రంశం అయిపోతున్న అంకురార్పణలెన్నో?????
థ్యాంక్యూ...
Deletepadmarpita madam garu,
ReplyDeleteheart felt wishes for a happy
and prosperous new year 2017.
thank you and wish you the same andi.
Delete2017 started with good post. congrats
ReplyDeletethank you..
DeleteGood going padma...కొనసాగించు ఇలాగే.
ReplyDeleteథ్యాంక్యూ మహీ...
Deleteఆది నుండి అంతం వరకు ఎక్కడా రాజీ పడకుండా అద్భుతంగా వ్రాసారు.
ReplyDeleteమీ ప్రోత్సాకర వాక్యాలకు ధన్యవాదాలండీ.
Deletehighly intelectual lines in telugu poetry.
ReplyDeleteThank you.
Deleteఅవును మనసులో భావాలు ఎన్నో
ReplyDeleteచెప్పాలని ఉన్నా చెప్పలేనివి వ్రాయలేనివి ఎన్నెన్నో
మీరు మనసు కవయిత్రి జీవితాన్ని చదివిన స్త్రీ..
ధన్యవాదాలండీ మీ స్పూర్తి వాక్యాలకు..
Deleteపవర్ఫుల్ పదాలతో మొదలైంది మీ ప్రయాణం ఆపక పరుగులు తీస్తుందేమో....ఇంక కవితాప్రియులు అంతా పరవశం. :-)
ReplyDeleteఅంతంలేని ఆరంభంతో విసిగిస్తానేమో...తట్టుకోకండి :-)
Deleteమీ పదాల్లో పట్టు రాను రాను పెరుగుతుందండి.
ReplyDeleteసూపర్గా రాశారు.
పవర్ తరిగితే...అమ్మో అసలు చూడరుగా :-) థ్యాంక్యూ
Deleteతోడురాక మారిన నైసర్గరూపాలు
ReplyDeleteఅధ్భుతమైన నీ పద అల్లికలు
అందులో దాగిన జీవితసత్యాలు
మురిపించి మెరిపిస్తున్న కవితలు
మీ కవితా కమెంట్లు మనసు దోస్తున్నాయి ;) థ్యాంక్యూ
Delete
ReplyDeleteవామ్మో ! బ్యాక్సిక్స్పేకర్స్ !
జామ్మని యగుపించితీవు జాకెట్లేకన్ !
యమ్ముల పొదవయ్యారీ
బొమ్మా నీవెవత వే సపోటా వోలెన్ :)
జిలేబి
కొత్తసంవత్సరంలో కుమ్మింగ్ :)
ReplyDelete