అప్రయోజనం!


మెరిసే మోజులపై మనసుపడి
అందక అలజడైన అంతరంగంలో
ఆగే భావాలు వెతకడం ఆవేశం!


మమతానురాగాలు మాయమైన
ఇరుకు మనసుల జనారణ్యంలో
ఆత్మీయత వెతకడం అనవసరం!


అలసినానన్న అస్తిత్వాన్ని దాచి
అలిగిన అమాయకపు ఊహలలో
జ్ఞాపకాలను వెతకడం అనిశ్చలం!


జ్ఞానం ఇచ్చిన పుడమిని విడిచి
జీవం లేని రాతికట్టడ నగరాలలో
ఆశల దారులు వెతకడం అవివేకం!


సాంప్రదాయపు సంకెళ్లను త్రుంచి
కొత్త ఫ్యాషన్ ప్రవాహపు మత్తులో
సహజత్వాన్ని వెతకడం అజ్ఞానం!

29 comments:

  1. Awesome painting
    Awakening thoughts

    ReplyDelete
  2. ప్రయత్నం తప్పదు కదా అప్రయోజనం అయినా
    ఏదైనా అనుభవము నేర్పేను పాఠం..

    ReplyDelete
  3. 6 బులెట్స్=చిత్రం
    4 బులెట్స్=పోయం
    మొత్తం=10 బులెట్స్

    ReplyDelete
  4. సాధించాలి అనుకుని ఆశావాదంతో సాగాలి పద్మగారు అప్పుదే జీవించడానికి ఒక స్ఫూర్తి ప్రయోజము.

    మీరు రాసేవి అన్నీ నిజాలు వెరైటిలో ప్రెజంట్ చేస్తారు.

    ReplyDelete
  5. తామర మొగ్గలు కొలనున
    కోమలమై మనసు చూర గొనె , నిలిచిన ఆ
    కోమలియున్ ఆ కొలనున
    తామర పూవై విరిసెను తాదాత్మ్యంబై .

    ReplyDelete
  6. రాను రాను మీ హస్తం కవిత/కళాచాతుర్యంతో విరాజిల్లుతుంది....అభినందనలు.

    ReplyDelete
  7. కలువ కోమలి ఏమి చెప్పినా వ్రాసినా రమ్యమే...

    ReplyDelete
  8. అప్రయోజన లక్షణాలు ఎక్కడ?

    ReplyDelete
  9. గిసోంటి పోస్ట్ సదవనికి ఫోటో సూడనికి
    అదుష్టం ఉండాలె అప్రయోజనం ఏందమ్మో :)

    ReplyDelete
  10. advantages & disadvantages who bothered..
    simply mast paintings & lyrics in this blog.

    ReplyDelete
  11. ఈ మధ్య మీ కవితలపై పెయింటింగ్స్ ఆధిపత్యం వహించి అలరిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త.

    ReplyDelete
  12. మెరిసే మోజులపై మనసుపడ్డం వెరైటీ ఫీలింగ్.

    ReplyDelete

  13. నీ భావాలు తెలియాలంటే
    నీ కలం రాసే కవితల్ని చదవాలి
    నిన్ను చదవాలి అనుకుంటే
    నీ చిత్రాల వయ్యరాలు చూడాలి
    నీ మనసు తెలుసుకోవాలంటే
    నీ బ్లాగ్ చూసి మైమరచిపోవాలి

    ReplyDelete
  14. Iam wondered and appreciate Your writing skills Padma. Keep rocking dear.

    ReplyDelete
  15. కాలానుగుణముగా మార్పనేది అనివార్యం అత్యవసరం
    కాకతాళియమో యాదృచికమో మానవత్వమే మార్పు చెందింది
    సత్సాంప్రదాయాల లోగిలిలో తూలతూగే నాటి కాలం కనుమరుగున పడకూడదనే భావం కలగలసి మీరు రచించిన ఈ కవిత దృశ్యకావ్యం పద్మ గారు

    ~శ్రీ~
    వైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ మంగళం

    ReplyDelete
  16. last 3 lines too good.

    ReplyDelete
  17. అలిగిన అమాయకపు ఊహలలో జ్ఞాపకాలను వెతకడం అనిశ్చలం.

    ReplyDelete
  18. నీ కవిత పరంగా చూస్తే అసలు జీవించి అప్రయోజము అనిపిస్తుంది అర్పిత. జీవించడానికి అనేక పాట్లు పడాలి తప్పదు. సాధ్యం అయినంత వరకు ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకుని ఎవరికీ హానికారం కాని పనులు చేస్తూ జీవించాలి. ఆలోచించవలసిన పదబంధం వ్రాశావు, అభినందనలు-హరినాధ్

    ReplyDelete
  19. అనవసరంగా ఆవేశపడడ్డం అవివేకమని అర్థమైంది.
    ఆలోచించి అడుగువేయాలని తెలిసింది.

    ReplyDelete
  20. ఊహలలో జ్ఞాపకాలను వెతకడం అనిశ్చలం ముమ్మాటికి నిజం.

    ReplyDelete
  21. భావాల్లో ఆవేశం
    ఆత్మీయత అనవసరం
    జ్ఞాపకాలు అనిశ్చలం
    ఆసలు అవివేకం
    సహజత్వం అజ్ఞానం
    వీటిని వెతకడం లో టైం వేస్ట్ చేయవద్దు అంటూ సింప్లె సందేశాన్ని అందించారు. ఇక పాటించడమే తరువాయె.

    ReplyDelete
  22. ఇవి చదివి పాటించని జీవితం అప్రయోజం.

    ReplyDelete
  23. మరో మంచి కవిత పద్మ.

    ReplyDelete
  24. సాంప్రదాయపు సంకెళ్లను త్రుంచి కొత్త ఫ్యాషన్ ప్రవాహపు మత్తులో ఎప్పటి నుండో మునిగి తెలుతున్నాము.

    ReplyDelete
  25. అంతరంగ భావాల్ని అద్భుతంగా కవితలో పొందుపరిచారు.
    చిత్రం చూడ చక్కగ ఉన్నది.

    ReplyDelete
  26. అందరి అభిమానాక్షరాలకు శతకోటి వందనాలు. _/\_

    ReplyDelete
  27. కొత్త కవిత ఎక్కడ?

    ReplyDelete