నాలో నేను సేదతీరే గదులు ఎన్నో..
ప్రతి గదికీ వివిధ విశ్లేషణలు వివరాలు
కొన్ని గదులు క్రొత్త సామాగ్రితో కులుకగా
మరికొన్ని విరిగిన వాటితో చెల్లాచెదురుగా
నే రాసే అక్షరాల్లా..కాదు నా మనసులా!
ఖాళీగా ఉన్నాయి కొన్నిగదులు గొళ్ళెంవేసి
గొంతులోని మాటలు లోలోపల ధ్వనిస్తూ..
గోడలేమో వెలసిన రంగుతో వెలవెలబోతూ
భావాలు భాష రాక మౌనంగా సమ్మె చేస్తూ
ప్రతీకారం తీర్చుకో రాక లోలోనే దౌడెడుతూ!
ఈ తెలియని తర్కవిసర్జనలో పొరలు ఏర్పడి
ఆ రహస్య పొరల మధ్య నవ్వు ఆవిరైపోయి
గడచినకాలపు స్మృతులు మరుగునపడగా..
అనుబంధాలు ఆప్యాయతలూ అంతరించినట్లు
చందమామలో మచ్చలా కనబడీ కనబడనట్లు!
నేను మాత్రం తొణక్కబెణక్క నిలబడి ఉన్నాను
కుళ్ళిన సంప్రదాయాలని చంపలేక పాటించరాక
విక్రయిస్తున్నా వాదన్లని వ్యధలతో గెలిపించలేక
గులాబీరంగు శరీరంలో మూసి ఉన్న గదుల్లో..
విచ్ఛిన్నమవని విలువైన గదులకి తాళమేస్తున్నా!
గోప్యంగా దాచుకున్న సంస్కారం పెరిగి పెద్దదై..
చిరిగిపోతున్న మానవత్వానికి ఊపిరిపోయాలని
ఈ జన్మకు సార్థకత కూర్చి ఋణము తీర్చాలని!
ప్రతి గదికీ వివిధ విశ్లేషణలు వివరాలు
కొన్ని గదులు క్రొత్త సామాగ్రితో కులుకగా
మరికొన్ని విరిగిన వాటితో చెల్లాచెదురుగా
నే రాసే అక్షరాల్లా..కాదు నా మనసులా!
ఖాళీగా ఉన్నాయి కొన్నిగదులు గొళ్ళెంవేసి
గొంతులోని మాటలు లోలోపల ధ్వనిస్తూ..
గోడలేమో వెలసిన రంగుతో వెలవెలబోతూ
భావాలు భాష రాక మౌనంగా సమ్మె చేస్తూ
ప్రతీకారం తీర్చుకో రాక లోలోనే దౌడెడుతూ!
ఈ తెలియని తర్కవిసర్జనలో పొరలు ఏర్పడి
ఆ రహస్య పొరల మధ్య నవ్వు ఆవిరైపోయి
గడచినకాలపు స్మృతులు మరుగునపడగా..
అనుబంధాలు ఆప్యాయతలూ అంతరించినట్లు
చందమామలో మచ్చలా కనబడీ కనబడనట్లు!
నేను మాత్రం తొణక్కబెణక్క నిలబడి ఉన్నాను
కుళ్ళిన సంప్రదాయాలని చంపలేక పాటించరాక
విక్రయిస్తున్నా వాదన్లని వ్యధలతో గెలిపించలేక
గులాబీరంగు శరీరంలో మూసి ఉన్న గదుల్లో..
విచ్ఛిన్నమవని విలువైన గదులకి తాళమేస్తున్నా!
గోప్యంగా దాచుకున్న సంస్కారం పెరిగి పెద్దదై..
చిరిగిపోతున్న మానవత్వానికి ఊపిరిపోయాలని
ఈ జన్మకు సార్థకత కూర్చి ఋణము తీర్చాలని!
లైఫ్ పూర్తి అయినట్లు మీరు వ్రాసినట్లు బ్రతికితె. awesome post by you.
ReplyDeleteఆత్మశోధన వైపు పయనం.చిరిగిపోతున్న.......ni ce li nes.
ReplyDeleteఊపిరి ఊయల ఊగుతు మొదలయ్యేను మనిషి ఉనికి
ReplyDeleteమది మందిరంలో భావాలు ఆలోచనలు కలతలు నలతలు
కోపతాపాలు అలకలు ఆనందాలు సంతోషాల సంగమం
ఆశ నిరాశ ఉచ్వాస నిఃశ్వాస మంచి చెడు మాట మౌనం
అద్వైతాద్వితీయమైన జన్మమిది దుర్లభమైన ఆత్మకథ ఇది
కాలగమనానా కడలి కెరటాలై పడిలేచే జ్ఞాపకాల లోగిలి
అచంచలమైన బంధాలను అలవోకగా పెనవేసే పెన్నిధి
టూ-లెట్ బోర్డులెన్ని మది గదులకు వేలాడదీసినా
అనునిత్యం కదలాడే జీవిత సౌధానా అతిథులు
ఏదెలా ఉన్నపటికి జీవితానా సంస్కారానికి ఆస్కారముంటే
మానవత్వపు పరిమళాన్ని పథిలంగ వెదజల్లితే
ప్రాణవాయువు ఆత్మ శరిర సంగమమైన ఈ జీవితం సార్థకం
~శ్రీ~
06:03
12 Feb 2017
అంటే గుండె గదులు ఖాళీ ఉంచక అద్దెకు ఇవ్వమని సెలవిస్తున్నారా శ్రీధర్ గారు
Deleteఔను ఆకాంక్ష గారు.. గుండె గదులు బంధువులకు అద్దెకు ఇస్తే బంధాలతో నిండుగా కళకళలాడుతు పదికాలాల పాటు బాగుంటుంది కదా అని..!
Deletebeing happy or sad definitely lies within our sole discretion. just as the tides have ups and downs, just as the moon has waxing and waning, life has its links with the thoughts and words, that defines how we mould our emotions that can sometimes misfire or sometimes backfire, but at all times, a stable mind can really overcome the adversities and can pave way towards inner peace and happiness.
ReplyDeleteచిత్రాన్ని చూసి కళ్ళు
ReplyDeleteకవితకి చదివి ఒళ్ళు
పులకరించే...ఆదివారం సార్థకత ఏర్పడింది
గోప్యంగా దాచుకున్న సంస్కారం పెరిగి పెద్దదై..
ReplyDeleteచిరిగిపోతున్న మానవత్వానికి ఊపిరిపోయాలని...ఇది జరిగేనో లేదో కానీ ఊపిరి ఉస్సున ఒకరోజ ఉడాయించును
గడచినకాలపు స్మృతులు మరుగునపడగా..
ReplyDeleteఅనుబంధాలు ఆప్యాయతలూ అంతరించినట్లు
చందమామలో మచ్చలా కనబడీ కనబడనట్లు
వాస్తవికతలకు దర్పణంలా ఉంది మీ కవిత.
చిత్రంలో ఆవేదన ఆత్రుత స్పష్టంగా కనబడుతుంది. హ్యాట్సాప్
విరబూసిన మొగ్గలు
ReplyDeleteవాస్తవికత అద్దాలు
నీ కవితలు...
ఆకాశాన్న తారకలు
ఆలోచింపజేసే నీ అక్షరాలు
ఆవేశం ఆవేదన అహ్లాదం
అన్నీ కలసి సమపాళ్ళు..
పారే ఏటి పాయలు
గలగలా సాగు భావాలు
రమ్యం మధురం పద్మార్పిత పదం.
మీ చిట్టికవితల సాహిత్యం స్వీట్.
Deleteగుండె గదుల్లో దాచుకున్న ఆవేదన చక్కగా వివరించారు.
ReplyDeleteమనుషులు యాంత్రిక జీవితానికి అలవాటుపడి అసలు బంధాలను ముక్తసరిగా పలకరించి ముక్తి మార్గాలను మనీలో వెతుక్కుంటున్నారు. ఆస్తులు అంతస్తులు సంపాదించి అదే సార్థకత అనుకునే వారికి కవిత కనువిప్పు కలిగించాలి.
ఎవరికి వారే తాము చేసేది కరెక్ట్ అనుకునే ఈరోజుల్లో సార్థకతకు అర్థం అనేకం.
ReplyDeleteమమతలు బంధాలు కొట్టుకుని పోతున్నాయి మొబైల్ వాట్సఫ్ మెసేజులతో.
తప్పదు జీవితం అంతమైపోక ఇలా సాగినంత కాలం.
కవితలో భావాన్ని బాగా పండించావు పద్మ.
ReplyDeleteనాలో నేనిక సేదతీరు గదులన్ నారాత లన్నింట నిన్
బాలా! నేనిక మాటలన్ తెలిపి నా భావంబు లన్బేర్చదన్
చాలౌ జన్మన సార్థకత్వ మిదియే ! సావేరి పద్మార్పితా !
నీ లోకంబున నీవు నిర్మలముగా నీమంబు సాధించె బో !
జిలేబి
ఎప్పటికి దక్కును సార్థకత:-)
ReplyDeleteఇన్ని గదులు ఉన్నాయి అంటే మీరు ఆస్తిపరులే.
ReplyDeleteకవిత చాలా చాలా బాగుంది.
ReplyDeleteగుండె గదులు ఖాళీగా ఉంచకండి ఇలాంటి వ్యధలే వచ్చి చేరుతాయి అద్దె చెల్లించవు ఖాళీ చేసి వదలిపొమ్మంటే పోవు :)
విక్రయిస్తున్నా వాదన్లని వ్యధలతో గెలిపించలేక..మీకు ఇలాంటి పదాలు ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయి మాడం.
ReplyDeletesooper photo
ReplyDeleteLife is always tough.
Deleteకవిత చివరిలో సంస్కార బీజానికి పెద్ద పీటను వేసి తరిగిపోతున్న మానవత్వపు విలువలను పెంచుకోమని చెప్పిన విధానం చాలా నచ్చింది. చిత్రంలో ఆత్రుత చెప్పకనే చెబుతున్న సందేశంలా బాగుంది. అభినందన ఆశ్శిస్సులు అర్పిత-హరినాధ్
ReplyDeleteఏం తల్లో గిట్ల గదులున్నయ్ అంటూ గుండె గల్లంతు జేస్తివి.
ReplyDeleteకుళ్ళిన సంప్రదాయలు పాటించడం రాక చంపలేక తొడక్కుండా ఉండడం గొప్ప మానవత్వానికి అద్దం పట్టారు.
ReplyDeleteజీవిత వాస్తవికత ఏమిటంటే ఎవరి ఆలోచనలకి చేసిన పనులకి తగిన విధంగా సార్థకత చేకూరుతుంది.
ReplyDeleteఅవునంటావో ఏమంటావో మరి అర్పిత.
గుండెగది తలుపు తెరిచి ప్రేమను ఆహ్వానిస్తారు అనుకుంటే ఇదేమిటి మంచి మానవత్వమని మా మనసు మార్చేస్తున్నారు. మంచి పోస్ట్ మాడం.
ReplyDeleteHappy Valentines Day Padma.
ReplyDeleteపద్మగారు మీ పోస్ట్ చదివి నా గుండెగదులు ఎన్నోనని లెక్కించ నాలుగు చాంబర్లు, లబ్ డబ్ అన్న గుండె చప్పుడు తప్ప ఏం కనబడంలేదు వినపడలేదండి ఏమి చేయమంటారు..హ హ హా
ReplyDeleteప్రేమికుల రోజుకు మారో గోలీ
ReplyDeleteరోజూ మనకు ప్రేమించే రోజు మరీ
ప్రియురాల సిగ్గేలనే అంటూ ఒక డ్యూయట్ వేసుకోవచ్చులే మీ ప్రేమికులరోజు కవిత చూసి అనుకున్నాను అంతా గల్లంతు చేసినారు నేనొల్ల నేనొల్లను. హ్మ్..హా హ్మ్
ReplyDeleteHappy Valentines Day
ReplyDeleteహాయ్ డియర్...ఎప్పుడూ మిమ్మల్ని మీరు శోధించుకుంటూ మమ్మల్ని ఆత్మశోధన చేసుకోమంటూ ఉంటారు. దానికి ఈ పోస్ట్ మరో నిదర్శనం. కుడోస్ పద్మాజీ
ReplyDeleteప్రేమార్పిత బ్లాగ్ లో ప్రేమికులరోజు హంగామా---
ReplyDeleteఏదీ ఎక్కడా చడీ చప్పుడు లేదు ఎందుకు చెప్మా
భజరంగ్ దల్ వారు బెదిరించిరా లేక బుజ్జగించిరా!
వాలెంటైన్స్ డే ను మాతా-పిత దినోత్సవంగా మార్చిరి
ఏమాటకు ఆమాటే..మీ బ్రాండ్ కవిత వ్రాసి బ్యాండ్ మ్రోగించారు.
ముందస్తు ప్రేమికులరోజు శుభాకాంక్షలు పద్మార్పిత.
ReplyDeleteమానవత్వం మేల్కొనాలని కవిత ద్వారా అందించిన సందేశం అమోఘం.
प्यार खुश्यों का पैगाम है
ReplyDeleteप्यार मीठा सा इक जाम है
प्यार जीने की उम्मीद है
प्यार जीवन का इक नाम है
Happy Valentine Day
జీవన కారడవిలో ప్రయాణమే కష్టం ఇంక దానికి సార్థకత మరింత కష్టం పద్మా.
ReplyDeleteఅందరి అపూర్వ స్పందనలకు నా శతకోటివందనములు _/\_
ReplyDelete