ఆకాశ మేఘాన్ని తాకి ప్రేమజల్లుగా కురవక
ప్రకృతితో కూడి పిడుగువై గుండెల్ని పిండగా
నీ ఉనికి పిడిబాకై నాలో ఉప్పెనగా పెల్లుబికె!
వలపు అలగా మారి మనసు తీరం తాకలేక
కోరికల కెరటమై మనసుని కబళించబూనితే
నిన్ను నీవే కోల్పోయి నన్ను కోల్పోయినావె!
ధరణిలా దరి చేరి నాలో నిన్ను దాచుకోలేక
ప్రణయ ప్రకంపనలను పట్టి పిప్పి చేయబోవ
నీవు నలిగి నాకు నేనే శత్రువై సాక్షాత్కరించె!
చీకటి హృదయంలో జ్యోతివలె వెలగడం రాక
ఎగిసిపడే జ్వాలవై హృదయంలో మంటలురేపి
నీవు కాలి నేను కాల మిగిలింది బూడిదాయె!
అయ్యో రామ రామా,,,,చివరికి మిగిలేను బూడిదన్న యెటుల?
ReplyDeleteభావం బాగుంది పద్మార్పితా మిగిలింది చివరికి బూడిద అనడం తప్ప ఆఖరికి అక్షరాలో కూడా ఆనందం దక్కకపోతే ఎలా..
ReplyDeleteజీవితమున సంతోషాలు దుఃఖాలు సరిసమానమని.
ReplyDeleteఎలాటి భావోద్వేగాలకు లోనైనా మనసు పటుత్వం కోల్పోకూడదని.
నిన్నటి ఘడియలే నేటి జ్ఞాపకాలై విరాజిల్లునని.
మానవ జన్మ మా నవ జన్మ యని చాటి చెప్పాలని.
ఈర్ష్యా ద్వేషాలకు తావు లేకుండా నిరాడంబరంగా బ్రతకాలని.
బ్రతికిన కొద్ది రోజులైనా ఆశను వీడరాదని.
ఎంత ఎదిగినా మాను ఏదో ఒక నాడు నిర్వీర్యం కాగలదని.
స్వార్థం అనర్థమని.. చివరాఖరి మఝిలి కాటిలో మిగిలే బూడిదేనని మీదైన శైలిలో చక్కని వివరణాత్మకంగా కావ్యాన్ని రచించారు పద్మ గారు.
అణువు అణువునా ప్రాణం దాగి ఉంటే ప్రతి శ్వాసలో ఊపిరి ఊయలలూగగా గుండె లయగతులే జీవనం.. అవే కాలక్రమేణ ఆగిపోతే మరణం. నడుమ మానవత్వం సహృద్యతల తోరణం ఈ జీవనమరణ కాలచక్రం.
ప్రస్తుతం జీవితాలు నిస్తేజముతో సాగుతుంతే పైగా నీ కవితల్లో కూడా నిరుత్సాహ పరుస్తే ఎలా తట్టుకునేది పద్మ.
ReplyDeleteమనసులో మెదిలే అక్షరాలు మీ భావాలు.
ReplyDeleteమదిలో మెదిలే భావాలు అక్షరాలై అలరారే వేళ కవితాక్షరి
Deleteతగులు మిగులు చూడక బ్రతికేస్తుంటా...😝
ReplyDeleteప్రణయ ప్రకంపనలను పట్టి పిప్పి చేయబోవ, నీవు నలిగి నాకు నేనే శత్రువై సాక్షాత్కరించె super
ReplyDeleteఅన్ని అనుకున్నట్లు జరుగవని కవిత రూపంలో వివరణ ఇచ్చావు బాగుంది కానీ చిత్రంలో స్త్రీ విచార వదనమా విరహతాపమో అంతు చిక్కలేదు-హరినాధ్.
ReplyDeleteThe Woman in the Image relates to Hysteria: A Nostalgic Feeling with or without trauma and depression with mild delusion, Harinath Sir.. It is but natural, the selection of images is the pre-cursor and cue to fictional poems such as this, which is reflected in Padma madam's poetry. Thank you Sir.
DeleteThat's true.
DeleteExplained nicely Sridhar
God bless you my dear-Harinath
Thank You Sir,
DeleteFor Your Kind Blessings.
Always Obliged and Humbled.
The End=Ash :) :(
ReplyDeleteప్రణయ ప్రకంపనలు పిప్పి చేయడం వ్యధలో శిఖరాగ్రం.
ReplyDeleteప్రకృతి పిడుగై గుండెల్ని పిండగా..ఇది ఎంతో ఏమో తెలియదు మీ కవితాభావాలు మాత్రం ఖచ్చితంగా గుండెల్ని పిండుతాయి. ఏదైనా ప్రేమలో ఎదబాటే బాగుంటుందనేది నా భావం.
ReplyDeletegetting bored of sad poems madam :)
ReplyDeletechange your poetry according to season and trend.
అయ్యో అయ్యో అయ్యయ్యో చివరికి మిగిలింది బూడిదా అహ హా హా
ReplyDeleteప్రేమకు జ్ఞాపకాల తాకిడి తప్పదు
ReplyDeleteఅందులో విరహ వేదనా తప్పదు
హృదయం ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు
కంట నీరు రాక తప్పదు
ప్రేమంటే ఇదేనని తెలిసి కూడా
మనసు వద్దని చెబితే వినదు..
నిజమేనా.. తప్పదా.. ఎందుకో మరి..
Deleteఅయినా జీవితం పట్ల ఆరాటం తగ్గదు..
మరణం తథ్యమని తెలిసినా ఆశ వీడదు..
ప్రేమ పిడిబాకులా పొడిచి చివరికి బూడిద చేస్తుంది అంటారా?
ReplyDeleteజీవి చిట్ట చివరి మఝిలి ఎలాగు కాటిలో కాలి బూడిదగా మారటమే కదా. అటువంటప్పుడు బ్రతికున్ననాళ్ళైనా మంచి మర్యాద మానవత్వంతో బ్రతకాలని. నిజమైన నిజాయితిగల ప్రేమ ఐతే వేరొకరి చెడును కోరుకోదని. ఆ వ్యత్యాసం తెలిసి మసులుకునేవారు కాలి బూడిదగా మారినా కాని వారి సత్కార్యాలు జ్ఞాపికలై వారిని గుర్తు చేస్తూనే ఉంటాయి ఎన్ని ఏళ్ళు గడచిన కూడా. ఏకిభవిస్తారా రాగిణి మ్యాడమ్. నేను చెప్పిన మాట వాస్తవమే కదా పద్మ గారు.
Deleteప్రేమించడం తెలియని వారికి మనసుండి ఏం లాభం?
ReplyDeleteప్రేమించము అంటూ మనసుని గాయం చేసేవారిని ఏమనాలి?
కవితలో భావం మనసుని తడుతుంది మాడం.
మనసుని అర్థం చేసుకునే వారు వేరోకరి మనసును మభ్య పెట్టలేరు.
Deleteఅలా కాని పక్షంలో మానవత్వం కోల్పోయి
సమాజంలో మనలేక ఒల్లకుండిపోతారు సాహెబ్ పాషాజి
ReplyDeleteగోగుపువ్వుల కొంటెచూపుల గోవమీఱెడి కోటరీ!
మేఘమాలిక తాకగానట మేనిజల్లన మారెనౌ
సాగరమ్మున సాగిపోవుచు సాధనమ్మును జేయుచూ
రాగయుక్తపు పద్మమాలిక రాగమాలిక దెచ్చెనౌ
జిలేబి
ప్రేమించని నీకు మనసేలా
ReplyDeleteమరుజన్మకై నేడు మాట్లాడాలా
ప్రేమంటే అంత అలుసేల
ప్రేమిస్తే బ్రతుకు నరకమవ్వాలా?
మనసున్న వారే ప్రేమకు అర్హులా: మరి శివుడు పార్వతి
Deleteమాట ఇస్తే ఎన్ని జన్మలైనా నెరవెరాలా: మరి విష్ణువు ఆదిలక్ష్మి
అలుసుగాకా అలసటే చివరాఖరున మిగలాలా: మరి నల దమయంతి
నరకాన్నే జయించి నెగ్గి నిర్వచనమవ్వాలా: మరి సతిసావిత్రి సత్యవంతుడు
తూటాలు లేక తుపాకి మూలపడింది.
ReplyDeleteఎండాకాలం వచ్చినాది వానజల్లు లేదు ప్రేమజల్లు కుర్వద్
ReplyDeleteనీడల నిమ్మలంగుండాలె పద్మమ్మా..చెప్పేది జర ఇనుకో
బృందావనినా ఎటు జూచిన.. రంగుల కేళి
ReplyDeleteరాధాకృష్ణులు సమాయత్తమై.. ఆడేను హోళి
రంగురంగుల కాలి మువ్వలాయే.. రాధిక పదమున
రంగులన్ని నవ్వుల పువ్వులాయే.. మాధవుని మోవిన
ఒకరి వెంట ఒకరు తిరగాడుతు.. వసంతాన్ని తలపించే
అలకేలనని ప్రశ్నించే రాధిక.. అసలు తానే అలిగే కదా
పలుకలేక మౌనమై యెదలో నిండే.. హృదయ సడిలా
ముమ్మారు పలకరించినా.. కనుసైగలే భాషాయేనా
చూసి చూడనట్లు.. కనురెప్పలు వాలేనా ఇలా
రాధిక పిలువగా.. మాధవుడు సాక్షాత్కరించే భళా
ఓ భామిని.. నీ యెదుట నిలిచే గోపబాలుడీ వేళా
రాధాకృష్ణార్పణమస్తు
హోళికా పూర్ణిమ (12 మార్చ్) మరియు శ్రీ హేవిలంబి నామ ఉగాది (29 మార్చ్) సందర్భోచితము.
~శ్రీ~
నీలవర్ణ నీలవేణి
ఎచట నుంచి వీచెనో ఈ ప్రణయ విరహ రాగం.
ReplyDeleteపద్మ గారికి మరియు సమాజ నిర్మాణంలో తాము ఎవరిని తీసిపోమని తెలియజేసే ప్రతి అమ్మ కు.. ప్రతి చెల్లి కి.. ప్రతి అక్క కి.. కుటుంబ బాధ్యతలను సక్రమంగా భర్తతో పాటు తన భుజాన కూడా సమానంగా పంచుకునే ప్రతి భార్య కి.. కృతజ్ఞతాభివందనాలతో విమెన్స్ డే విషెస్ తెలియజేస్తున్నాను.
ReplyDelete(గమనిక: నాకింకా వివాహం కాలేదు.కనుక పైన తెలిపిన విషెస్ లో విషెస్ తెలిపిన తీరులో ఏదైనా పొరపాటు ఉంటే క్షంతవ్యుణ్ణి)
08 Mar 2017
To Every Honourable Respected Womanfolk, Wishing them Women's Day
Deleteశ్రీధర బుక్యా గారికి
మీకు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు :)
జిలేబి
ధన్యోస్మి మాతా మీ ఆశిర్వచనానికి
Deleteతామెల్లరికి మహిళ దినోత్సవ శుభాభినందనలు
Wish U Happy Women's Day Padmarpita.
ReplyDeleteఅంతర్జాతీయ మహిళదినోత్సవశుభాకాంక్షలు.
ReplyDelete
ReplyDeleteఅందరి అభిప్రాయ స్పందనలకు అభివందనములు _/\_
ఆలస్యంగా జవాబు ఇస్తూ..విడి విడిగా రిప్లైయ్స్ ఇవ్వనందుకు మన్నిస్తారని ఆశిస్తూ...మీ పద్మార్పిత.