ఫోర్త్ జెండర్


పాపాలు చేసి పుణ్యం కోసం
గుడిచుట్టూ ప్రదక్షణలు చేసే
ప్రబుధ్ధులు అసలైన కొజ్జాలు..

ఇతరుల ఎదుగుదల కాంచి
ఏడవలేక నవ్వుకునే నరులు
నాణ్యత నిండిన నపుంసకులు..

మంచిమాటలని నీతులు చెప్పి
గోతులు తవ్వుతూ చెడుచేస్తూ
బ్రతికే బద్మాషోళ్ళు హిజ్రాలు..

శాంతం భూషణమని అరుస్తూ 
శీలం పవిత్రమని ప్రవచనాలు
చెప్పే సన్యాసులే శిఖండులు.. 

సుఖాల కోసమే వెతుకులాటని
దుఃఖాల ఊబిలో దూరి పైబడక
లబోదిబోమనే వారు మాడాలు..

అమ్మ ఆలిగా పనికోచ్చే ఆడోళ్ళు
ఆడపిల్లగా పుడతానంటే వద్దనే
ఆడంగినాకొడుకులే గాండూగాళ్ళు..

81 comments:

  1. దమ్మున్న పోస్ట్. Keep it up

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  2. "మాడా"లు" అనడం ఒక వ్యక్తి - అందులోనూ, మరణించిన వ్యక్తి - పట్ల అగౌరవమవుతుందనీ, కాబట్టి వేరే పదమేదన్నా వాడడం సబబనీ నా అభిప్రాయం. సినిమా వారు పుణ్యం కట్టుకున్న ఆ పదప్రయోగం వల్ల తను బతికున్న రోజుల్లో మాడా వెంకటేశ్వర రావు గారు బాధపడింది చాలు.

    ReplyDelete
    Replies
    1. బదులుగా ' తృతీయ ప్రకృతులు ' వాడచ్చేమో
      పరిశీలించండి .
      శిఖండులు , శికండులు కాదనుకుంటా .

      Delete
    2. విన్నకోట నరసింహారావుగారు నిజానికి ఇక్కడ ‘మాడా’ అనే పదం “వెంకటేశ్వరరావు” గారికి సంబంధించినదిగా నేను వాడలేదు. కేవలం 'హిజ్రా’ కి పర్యాయపదంగా వాడాను. పూర్వం జరిగిన సంఘటన నుంచో, సాహిత్యం నుంచో ఒక పదాన్నో, వాక్యాన్నో ఉదహరిస్తూ ఇప్పటి పరిస్థితిని పోల్చడాన్ని అల్యూజన్ అంటారు. ఇక్కడ నేను ‘అల్యూజన్ ప్రయోగించలేదు. కేవలం పర్యాయపదంగా మాత్రమే వాడాను. కానీ, వెంకటేశ్వరరావు గారిని కించపరిచేలా అస్సలు కాదు. మన సినిమాల పుణ్యమా అని మీకు అలా స్పురించడంలో తప్పేమీ లేదు. మీ ఆత్మీయ స్పందనకు వినమ్రతతో ధన్యవాదాలు.

      Delete
    3. వెంకట రాజారావు లక్కాకులగారూ...నిజమే మీరు చెప్పినట్లు స్త్రీ మరియు పురుషలింగులు కాక మూడవలింగం(third gender) & "పేడి" వాడి మరో రెండు పంక్తులు రాసి ఉండవలసింది. మీ అక్షర, పద, పంక్తి సవరణలు ఆత్మీయ ఆశిస్సులు ఎల్లప్పుడూ కోరుతూ అభివందనములు.

      Delete
    4. మీ వివరణ బాగుంది పద్మార్పిత

      Delete
  3. అద్భుతమైన నిర్వచనం
    అసలైన కజ్జాల గురించి
    పద్మా అభినందనలు...

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు వందనములు.

      Delete
  4. పుట్టుకతోనే హిజ్రాల లక్షణాలు ఉన్నవారిని చూస్తే జాలి, వీరికి సామాజిక ఆదరణ కరువైంది. మీరు వివరించిన అసలుసిసలైన నపుంసకులకు ఆదరణ ఐశ్వర్యాలు ఎక్కువ. మంచు సామాజిక స్ఫూర్తిని పెంపొందించే కవితను అందించారు.

    ReplyDelete
    Replies
    1. నిజమే మీరు చెప్పినట్లు సృష్టి లోపాలు బాధాకరం
      సృష్టించుకున్న విలాసవంతులకే అన్నీ దాసోహం అనిపిస్తుంది.

      Delete
  5. హార్మోన్ల లోపం వలన వారు హిజ్రాలుగా మారితే హానికారక లక్షణాలతో సమాజంలో వీరు సృష్టించబడినారు.

    ReplyDelete
    Replies
    1. అవును నాకూ అలాగే అనిపించింది.

      Delete
  6. దేవుడు పుట్టించిన మనుషుల మధ్య తేడాలను కనిపెట్టింది అదే మనిషి. నువ్వు ఆడ, నువ్వు మగ అని డిసైడ్ చేసుకొని బ్రతికేస్తున్నాం. మన దగ్గర హిజ్రాలకు మాత్రం అస్సలు విలువలేదు. దొంగ బాబాలు, దొరలు డబ్బు కోసం వేషాలు వేసి దోచుకుంటే వారే నవాబులుగా చలామణీ అవుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది నిజమేనండి.

      Delete
  7. పద్మార్పిత గారూ, క్షమించాలి, నా వరకు మీ వాదనతో ఏకీభశవించలేను. కానీ "మాడా" అన్న పదం "హిజ్రా" అనే పదానికి పర్యాయపదం అని మీరు ఎలా భావిస్తున్నారో అని కుతూహలంగా ఉంది. నా విశ్లేషణని మనవి చేస్తాను - ఒక సినిమాలో మాడా వెంకటేశ్వర రావు గారు హిజ్రా వేషం వేసినప్పటినుంచీ పబ్లిసిటీ కోసమో, "వెరైటీ"గా ఉంటుందనుకునో ఆ సినిమా తాలూకు వ్యక్తులు "మాడా" పదాన్ని "హిజ్రా" అనే అర్థంలో వాడకం మొదలెట్టారన్న సత్యాన్ని మీరూ అంగీకరిస్తారనే అనుకుంటున్నాను. సినిమాల్ని ప్రజలు గుడ్డిగా అనుకరిస్తుండడం వల్ల అవి రెండూ పర్యాయపదాలే అనే నమ్మకం తెలుగుజనాల్లో క్రమేపీ పెరిగి స్ధిరపడింది. పైగా ఆ సినిమా రాకముందు కాలంలో హిజ్రాలను మాడా అని ఎవరూ అనేవారు కాదే. మరి చెప్పండి - ఆ సినిమా ప్రభావం కాక, అవి పర్యాయపదాలే అని నమ్మడానికి వేరే ఏదైనా బలవత్తరమైన, నిర్దుష్టమైన, శాస్త్రీయమైన కారణమేదన్నా ఉందంటారా?

    ఇక మీరన్న "అల్యూజన్" గురించి నాకు ఆల్రెడీ అవగాహన ఉంది, థాంక్యూ వెరీమచ్. అసలు ఆ పదాలు రెండూ ఒకదానికొకటి పర్యాయపదం కాకపోయినా పర్యాయపదంగా వాడినప్పుడు మాడా వెంకటేశ్వర రావు గారి జ్ఞాపకమే మెదులుతుంది వద్దనుకున్నా. ఆ కారణాన అది అన్యాపదేశంగానైనా ఆ మనిషికి అల్యూజనే అవుతుంది కాని వేరొకటి అవదు కదా, ఎవరు కాదన్నా. అలా పర్యాయపదంగా వాడెయ్యడం కూడని పని, అలా వాడితే ఆది ఆ వ్యక్తి స్మృతికి అగౌరవం అనేదే నా వాదన.

    ఒకటి మాత్రం మనవి చేస్తాను - కనీసం విద్యాధికులు, ఆలోచనాపరులూ అయినా ఆ రకంగా ఒక మనిషీ పేరుని పదేపదే అపహాస్యం చేస్తుండడాన్ని ప్రోత్సహించకూడదు కదా.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటగారు క్షమించాలని మీబోటివారు అనకూడదండీ..ఇలా చర్చించడం వల్లనే ఎన్నో విషయాలు తెలుస్తాయి, నేర్చుకోగలుతామని నమ్ముతాను....మీరు ఈ 'మాడ' అన్న పదంతో ఏకీభవించక పోవడానికి అర్థం లేకపోలేదు. నిజానికి ఈ పదం వాడేటప్పుడు నేనూ ఎంతో తర్జన భర్జన పడాల్సి వచ్చింది.
      https://en.m.wikipedia.org/wiki/Hijra_(South_Asia)

      A number of terms across the culturally and linguistically diverse Indian subcontinent represent similar sex or gender categories. While these are rough synonyms, they may be better understood as separate identities due to regional cultural differences. In Odia, a hijra is referred to as hinjida, hinjda or napunsaka, in Telugu, as napunsakudu (నపుంసకుడు), kojja (కొజ్జ) or maada (మాడ), in Tamil Nadu, Thiru nangai (mister woman), Ali, aravanni, aravani, or aruvani, in Punjabi, khusra and jankha, in Sindhi khadra, in Gujarati, pavaiyaa..
      పైన గల వికీపీడియా లింక్ లో 'మాడా' ని పర్యాయపదంగా ఉపయోగించారు. కొందరు మిత్రులు ఈ పదం పుట్టుక గురించి చెప్పాక నేను వాడిన పదం కరెక్ట్ అనిపించింది. మగ-లో మొదటి అక్షరం, ఆడలో రెండవ అక్షరం కలిస్తే - మాడ అని కొందరు ఇలా చెప్పడం జరిగింది.
      ఏది ఏమైనా మీలాంటి వారి ద్వారా విషయపరిజ్ఞానం మరికొంత పెంచుకునే అవకాశం కలిగింది. సదా మీ ఆశీస్సులు కోరుకుంటూ ధన్యవాదాలు!

      Delete
    2. ఆసక్తికరంగా చర్చ జరిపి వివరంగా విషయాన్ని తెలిపిన తీరు ప్రశంసనీయం.

      Delete
    3. తెలుగునాట మాత్రం "మాడా" అనేది ఒక ఇంటిపేరు, అలాగే "మాడ" (డ కి దీర్ఘం లేకుండా) అంటే ఒక పాతకాలపు నాణెం, దేవాలయం ప్రహరీ వీధి - నా అవగాహన మేరకు. "మాడా" అనే పదం "నపుంసకుడు" అనే పదానికి పర్యాయపదం అని గానీ, అసలు "మాడా" అనే పదం గానీ తెలుగు నిఘంటువులో నాకయితే కనబడలేదు. ఇక వికిపెడియ విషయానికొస్తే, దాన్ని ఎవరైనా ఎడిట్ చేసే సౌకర్యం ఉంది కాబట్టి ఆ మార్గాన "మాడా" పదం కొజ్జా / నపుంసకుడు కి పర్యాయపదం అనే అర్ధంలో వికీలో ప్రవేశించుండవచ్చని నా అనుమానం - అని అంటూ నా వైపు నుంచి ఈ చర్చ ముగిస్తాను.

      ఏదేమైనా "నా బ్లాగ్, నా ఇష్టం" అనకుండా ఈ చర్చ మొత్తంలో మీరు కనబర్చిన సంయమనం, స్పోర్టివ్ స్పిరిట్ నాకు నచ్చాయి పద్మార్పిత గారూ. కీపిటప్.

      Delete
    4. విన్నకోటగారి వివరణలో సారం ఉంది పద్మార్పిత. వికిపీడియాలో తెలియపరిచిన విషయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చును. ఏమైనా విషయాన్ని సున్నితంగా ముగించడం మెచ్చుకోదగినది...

      Delete
  8. ఎదుటివారి ఎదుగుదల చూసి ఓర్వలేని వారు
    తమకు మించిన జ్ఞానం ఎవ్వరికీ లేదనుకునే వారు
    అనవసరంగా ఎదుటివారిని ఆడిపోసుకునే వారు
    మూర్ఖంతో వదించేవారు కూడా పై కోణాలకి చెందినవారే...

    ReplyDelete
    Replies
    1. ఎస్ వీళ్ళు ఆ కోవకే చెందుతారు..

      Delete
  9. నిరంతరం నిన్ను
    నీవు హెచ్చరించుకుంటూ
    ఎదుటివారిని గౌరవిస్తూ
    దృఢ సంకల్పబలం
    చేతిలో కలంగా పట్టి
    తెలుగుభాష రంగులను
    ఆలోచనలతో వెదజల్లే
    నీ కవితల నైపుణ్యం
    భావపరంపరల తేజం
    శిఖరాగ్రాలు చేరాలని
    మనసావాచా నాఆకాంక్ష..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ..

      Delete
  10. మనిషి జెండర్ని పట్టి కుదిపి కడిగేశారు.

    ReplyDelete
    Replies
    1. మనిషిలో మలినాలని చూపే ప్రయత్నమే తప్ప కడగలేను.

      Delete
  11. ఆహ్లాదపు కలమున ఎమి ఈ ఆగ్రహపు జ్వాలలు..?

    ReplyDelete
    Replies
    1. మదిలో ఆగ్రహపు జ్వాలలు అక్షరాలుగా చేసి అందించాలన్న తాపత్రయం అంతేనండి.

      Delete
  12. పద్మా ఆవేశంతో అక్షరాలను మలచి అసలైన హిజ్రాలకు నిర్వచం చెప్పినావు. శభాష్
    నీ కలం బహు ధైర్యవంతురాలు...కొనసాగించు.

    ReplyDelete
    Replies
    1. సంధ్యగారు...మీ అంత అందంగా నిర్వచించలేను. థ్యాంక్యూ

      Delete
  13. వివాస్పద వాదనలను అధికమించి మీ ఆలోచనలు పరిగెడుతుంటాయి
    అదే మీ కవితలకు అసలైన బలం మీ పై అభిమానానికి కారణం

    ReplyDelete
    Replies
    1. భావాలోచనలు దొర్లుతుంటే వాటిని పట్టి బంధించి మీ అందరితో పంచుకోవడమే ఆనందం.

      Delete
  14. చిన్నప్పుడు కొజ్జావాళ్ళని చూసి భయపడి పరిగెట్టేవాడిని. ఎందుకు భయపడ్డానో అప్పుడు తెలియదు ఇప్పుడు వాళ్ళని చూసి కాదు సమాజంలో అలజడులు రేపే మీరు వ్రాసిన కొజ్జాలను గురిచి తెలుసుకుని చదివితే...వీరు ఎంతో డేజర్. వీరి వలన సమాజానికి నష్టం దేశం పురోగాభివృద్ధికి ఇటువంటివారే కారణం అనిపిస్తుంది. మంచి సబ్జెక్టు కవితా ఎంచుకున్నారు-అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. వీళ్ళను చూసి భయపడేవారు ఇప్పుడూ ఉన్నారండీ. నిజానికి వీరు కాదు హానికారకం అని చెప్పాలన్నదే నా ప్రయత్నం. ధన్యవాదాలు.

      Delete
  15. సున్నిత పదాలు వాడే మీరు ఇంత కటువు పదాలు వాడకంలో మీ ఆవేశం తెలిసింది. అలాగే అందులోని అవేదన అర్థమైంది.

    ReplyDelete
    Replies
    1. చదివి అర్థం చేసుకున్నారు ధన్యవాదాలు.

      Delete
  16. పూర్వం రాజులకు, నవాబులకు చాలామంది భార్యలు ఉండేవారు. వారికి రాణివాసాలు, జనానాలు ఉండేవి. వాటికి కాపలాగా మగవారిని నియమించే వారు కాదు. మగ బానిసలకు వృషణాలు, లింగాలు కత్తిరించి, వారిని బలంగాను, నపుంసకులుగాను తయారుచేసి జనానాకు కాపలాదారుగా, సేవకులుగా నియమించేవారు. వీరినే కొజ్జాలనేవారు.
    మీరు పేర్కొన్న కొజ్జాలు వారికి వారే ఏరికోరి మార్పు చెంది ఇతరులని ప్రలోభాలకు గురిచేసి మాడాలుగా కాక మహారాజులం అనుకుని బ్రతికేస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. నిజమే మీరు చెప్పింది కూడా

      Delete
  17. అప్పుడెప్పుడో చదివిన గుర్తు.శారీరకంగా కొజ్జాల కన్నా వారిని కొజ్జాలు అని గేళి చేసే ప్రజలు పెద్ద కొజ్జాలు!
    1.ఒకరితో నవ్వుతూ మాట్లాడి, అతడు పక్కకి వెళ్ళగానే అతడి గురించి పక్కవాడితో ఎగతాళిగా చెప్పేవాళ్ళు గుణ రూపేణా కొజ్జాలు.
    2.ఉన్న ఒక్క రాత్రి తామున్న రైల్వే కంపార్ట్ మెంట్ ని శుభ్రంగా వుంచుకోవాలన్న ఇంగిత జ్ఞానంలేని ప్రయాణీకులు గొర్రెలకన్నా హీనమయిన కొజ్జాలు!
    3.వేసవిలో వేసిన రోడ్డు వర్షాకాలంలో కొట్టుకుపోతే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ని తామందరం కలిసి నిలదీయవచ్చనే ఆలోచన కూడా స్ఫురించని ప్రజలు గొర్రెలకన్నా తెలివితక్కువ కొజ్జాలు!
    4.యాభైమందిని క్యూలో నిలబెట్టి పక్కనే సినిమా టిక్కెట్లు అమ్ముతున్న బ్లాక్ మార్కెటర్ని తాము యాభైమంది కలిసి కూడా అడ్డుకోలేమని భయపడేవాళ్ళు ధైర్యం రూపేణా కొజ్జాలు!
    5.గుణం నుంచి ధైర్యంవరకూ ప్రతీ అంశంలోనూ కొజ్జాలే వున్న ఈ దేశంలో కొజ్జాలను ఎద్దేవ చేసే దమ్ము లేదు.
    నీ కవితలో మరిన్ని చక్కని శైలిలో విశదీకరించావు
    Congrats Padma...keep it up dear.

    ReplyDelete
    Replies
    1. సార్ సరైన నిర్వచనాలు.

      Delete
    2. Thank you very much sir.. మీరు చెప్పినవి నిత్యం జరిగే సత్యాలు.

      Delete
  18. సింప్లీ సూపర్బ్ మాడం.

    ReplyDelete
  19. ధ్రుఢమైన ఆలోచనాబలం తగిన మేదస్సు రంగరించిన కవిత

    ReplyDelete
    Replies
    1. అమ్మో అంత మేధస్సు లేదండీ..

      Delete
  20. హిజ్రాలు
    కొజ్జాలు
    నపుంసకులు
    మాడాలు
    గాడూగాళ్ళు
    ఎవరు అంటే వీళ్ళు అంటూ సరైన నిర్వచనం చెప్పారు మీ కవితలో. చిత్రం అర్థవంతంగా ఉంది.

    ReplyDelete
  21. పనికిరాని ప్రభోధాలు చేసి పబ్బం గడుపుకునే పెద్దమనుషులు సమాజంలో కోకొల్లలు. వారికి ఈ సందేశం చేరితే బాగుంటుంది. ఆలోచనాత్మక భావాలు మెండు నీ కవితలో.

    ReplyDelete
  22. Third gender in which individuals are categorized, either by themselves or by society, as neither man nor woman are harmless but these forth gender people are most dangerous. :)

    ReplyDelete
  23. శాంతం భూషణం అని అరుస్తూ శీలం ప్రవిత్రం
    అంటూ చెప్పేవారు..ఇలా మీరే నిర్మొహమాటంతో వ్రాసి మెప్పించగలరు.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ అండీ.

      Delete


  24. మీరే పద్మార్పిత! మీ
    రే రప్ఫాడించగలరు రెంటము గాళ్ళన్
    పారా హుషారనుచు సు
    మ్మీ రక రకమై నతిట్లు మిరుమిట్లాయెన్ :)

    ReplyDelete
    Replies
    1. మెచ్చితిరో లేక తిట్టితిరో
      తెలియకున్నది ఏదైనా తియ్యనే
      సమ్మతమే...జిలేబీగారు :)

      Delete
  25. మనుషుల్లో రెండు రకాలు
    మంచి.....చెడ్డా
    ఈ రెండూ కానీవారు మూడోరకం
    వీరికన్నా ధారుణం
    మీరు పేర్కొన్నవారు అంతేనా!?
    ...
    -----

    ReplyDelete
    Replies
    1. ఓహ్..కొత్త నిర్వచనం బాగుంది.

      Delete
  26. సులభమే కదా
    కారుకూతలు కూసి
    ఆహా అంటూ నవ్వడం
    మనిషిని ఎద్దేవ చేసి
    మనిషిని అనుకోవడం
    తమ క్రింద ఉన్నదేదో
    తెలుసుకో విర్రవీగడం
    మూర్ఖపు వాదనలు చేసి
    మేధావిని అనుకోవడం
    తులసీ వనంలో మొలచి
    ఆముదాన్ని వృక్షమనడం

    ReplyDelete
    Replies
    1. బాగుంది మీ కవిత...థ్యాంక్సండీ

      Delete
  27. అమ్మగా ఆలిగా పనికి వచ్చే ఆడది అమ్మాయిగా పుడితే ఒప్పుకోరు ఎందుకని ప్రశ్నించి మగవారి చెంప చెళ్ళుమనిపించారు.

    ReplyDelete
    Replies
    1. మరీ కొట్టాను అనకండీ భాస్కర్ గారు....థ్యాంక్యూ

      Delete
  28. ఇలాంటి స్ట్రాంగ్ కాంసెప్ట్స్ తీసుకుని రాస్తే ఏం కమెంట్స్ పెట్టలేము మాడంగారు...మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడితే ఎలాగండీ.

    ReplyDelete
    Replies
    1. మురిపించే ముఖచిత్రం ఇబ్బంది పెట్టలేనుగా

      Delete
  29. ఖతర్నాక్
    జబర్దస్త్..

    ReplyDelete
    Replies
    1. భయం ఆనందం అంటారా!?

      Delete
  30. శంఖారావం పూరించి సాగాలి ముందుకి.

    ReplyDelete
    Replies
    1. జీవితం సాగక తప్పదు కదండీ

      Delete
  31. ఇంత అధ్బుతమైన కవితను లేటుగా చూస్తున్నందుకు మన్నించండి! సమాజం తీరును, చేయాల్సిన దానిని చేయకుండా పరిపరి విధాలుగా తాము బ్రష్టుపట్టి ఇతరులను కూడా బ్రష్టుపట్టించే కుసంస్కారహీనులు మీరన్నట్టు ఓ ఫోర్త్ జండర్ గాల్లే...
    హ్యాట్సాఫ్... మేడం!! సలాం............

    ReplyDelete
    Replies
    1. సమాజం బ్రష్టు పట్టడం పట్టించడం అంటే...మనం మన చుట్టూ ఉన్నావారేగా చేసింది, థ్యాంక్యూ!

      Delete
  32. హిజ్రా, కొజ్జా , గాండు, పేడి.…ఎలా పిలిచినా ఆడామగా కాని మూడోవర్గం వాళ్లని ఎవ్వరమూ చేరదీయం సరికదా. హిజ్రాలని చూసి ఎవగించుకుంటాం. చూడరాని వాళ్ళని చూసినట్టు అసహ్యంగా మొహం పెట్టి చూస్తాం. రోడ్డుపై వారు కనిపిస్తే, వారికి దూరంగా వెళ్లిపోతుంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచనకు వస్తే కారు అద్దాలన్నీ గట్టిగా బిగించేస్తుంటాం. రైల్లో యాచనకు వచ్చిన వాళ్ళను చూస్తే మొహం అదోలా పెట్టి ఎటో చూడడమో అవహేళన చేయడమో చూస్తుంటాం.
    అదే మీరు వ్రాసిన అసలు కొజ్జాలకు గౌరవం జేజేలు. వారందరూ ధనవంతులు.

    ReplyDelete
    Replies
    1. మీరు వ్రాసింది అక్షర సత్యం.

      Delete
  33. "కాదు జానకీ. నువ్వు కొజ్జావికాదు. శారీరకంగా అయితే అవ్వొచ్చు గాక! కానీ నిన్ను కొజ్జా అనే ఈ ప్రజలంతా కొజ్జాలు!! నీకన్నా పెద్ద కొజ్జాలు!!! ఒకరితో నవ్వుతూ మాట్లాడి, అతడు పక్కకి వెళ్ళగానే అతడి గురించి పక్కవాడితో ఎగతాళిగా చెప్పేవాళ్ళు గుణ రూపేణా కొజ్జాలు. ఉన్న ఒక్క రాత్రి తామున్న రైల్వే కంపార్ట్ మెంట్ ని శుభ్రంగా వుంచుకోవాలన్న ఇంగిత జ్ఞానంలేని ప్రయాణీకులు గొర్రెలకన్నా హీనమయిన కొజ్జాలు! వేసవిలో వేసిన రోడ్డు వర్షాకాలంలో కొట్టుకుపోతే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ని తామందరం కలిసి నిలదీయవచ్చనే ఆలోచన కూడా స్ఫురించని ప్రజలు గొర్రెలకన్నా తెలివితక్కువ కొజ్జాలు! యాభైమందిని క్యూలో నిలబెట్టి పక్కనే సినిమా టిక్కెట్లు అమ్ముతున్న బ్లాక్ మార్కెటర్ని తాము యాభైమంది కలిసి కూడా అడ్డుకోలేమని భయపడేవాళ్ళు ధైర్యం రూపేణా కొజ్జాలు! గుణం నుంచి ధైర్యంవరకూ ప్రతీ అంశంలోనూ కొజ్జాలే వున్న ఈ దేశంలో నిన్ను చూసి నవ్వే ధైర్యం ఎవరికుంది జానకీ?" మీ ఈ కవిత యండమూరిగారి రాక్షసుడు నవలో వాక్యాలను గుర్తుచేసాయండి.

    ReplyDelete
    Replies
    1. ఆవేశం మరీ ఎక్కువైంది సార్, తట్టుకోలేకపోతున్నాం - కెవ్వు కేక:-)

      Delete
    2. పైన డైలాగ్స్ అన్నీ రాక్షసుడు నవల్లోనివి సార్..స్వతహాగా రాసినవి కావు ;)

      Delete
    3. ఈ విధంగా రాక్షసుడు నవలను అందులోని డైలాగ్స్ గుర్తు చేసుకోవడం సంతోషకరం.

      Delete
  34. మీ ఆలోచనల పరంపర అమోఘం..మీకు సలాం.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనలే నాకు స్ఫూర్తి

      Delete