లేపుకు పో..

నా ఆత్మ అటు ఇటూ అల్లాడెనే కానీ 
సుఖమైన సంకెళ్ళలో బంధించబడలేదు
ఒక్కసారైనా మనసు ఆరాటాన్ని తీర్చు
అబద్ధపు ఆత్మ సంతృప్తినే ఇచ్చి పో..

నేను గొంగళి చుట్టిన సీతాకోకచిలుకను
రంగుల రెక్కలొస్తే విప్పుకు ఎగురుతాను
ప్రతికూల పరిస్థితుల కోసం వేచి ఉన్నా
సానుకూలతను సవ్యంగా కూర్చి పో..

ఒంటరైన హృదయ కదలికలు నిస్తేజమై
ఎందుకో తోడుగుండెను జతకోరుచున్నవి
తిరస్కరణకు గురై మది ముక్కలయ్యేను
పరిమితులెరగని తనువును తాకి పో..

తిరుగుబాటు చేసి నీ నుంచి నిన్ను దోచి
అగ్గికి ఆజ్యాన్ని జతచేసేటి ప్రక్రియలో కలిసి
మిగిలినవి నీకు కైవసంచేసే సంకల్పం ఇది     
లేచిపోయే సూత్రంచెప్పి సొరంగం త్రవ్వి పో..

32 comments:

  1. జీవిత గమనానా నిరాశ నిర్వేదపు సంకెళ్ళతో బంధించినా
    కాలమే ఎదురు తిరిగి బాధించినా
    ఆత్మ స్థైర్యాన్ని ఏనాడు వీడనాడ కూడదు

    కాలమెంతో విచిత్రమైంది
    ఈ రోజు నవ్విస్తు రేపు ఏడిపిస్తుంది
    నిన్నటి కన్నీటితో నవ్వును సాకుతుంది
    అలలాంటి కాలగమనానా ఒడిదుడుకులకు చలించ కూడదు

    చంద్రుడే మొన్న అమవాసలో కొట్టుకుపోయే
    మెల్ల మెల్లగ తాను ఎదుగుతు పౌర్ణమికి దారి చూసే
    పౌర్ణమి నాట మబ్బుల తెరలో చిక్కుకుపోతే
    వెన్నెల నలుదిక్కుల వికసించటం మానకూడదు

    చంచలమైన మనసు భావాలకు అందనిదాయే
    అక్షరాలన్ని భావాల లేమితో వాడిపోయే
    భాష లేక భావము లేక మాటే మౌనమాయే
    మౌనంలో కూడ మనసు నిబ్బరాన్ని కోల్పో కూడదు

    ReplyDelete
    Replies
    1. కవితకు కవితా వ్యాఖ్యాలు జవాబు మెండుగా కుదిరెను.

      Delete
    2. థ్యాంక్యూ సమీక్ష గారు

      Delete
    3. వైకుంఠ ఏకాదశి (నేడు), వైకుంఠ ద్వాదశి (రేపు) శుభాభినందనలు మీకు పద్మ గారు. ఎలా ఉన్నారు మీరు

      Delete

  2. తిరుగుబాటు చేసి నీ నుంచి నిన్ను దోచి
    అగ్గికి ఆజ్యాన్ని జతచేసి కాలి బూడిద అయ్యేనేమో పద్మగారు

    ReplyDelete
  3. లవ్ చేసి లవ్ చేయమని లేవతీసుకు పోవడం ఎంత వరకు కరక్ట్. లేపుకుపోమనడం కరెక్ట్ కాదు మాడంజీ

    ReplyDelete
  4. కష్టం మాడం మీరు డైరెక్ట్ అడిగితే..హా అహా హా

    ReplyDelete
  5. సంతోషంలో ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో తెలియక తబ్బిబై వెర్రికేకలు పెడతాడు కామోసు ప్రియుడు.

    ReplyDelete
  6. ఒకే మూసలో సాగుతున్న వలపు గీతానికి చివరి మలుపుగా లేపుకుపో అన్నారా?

    ReplyDelete
  7. Perfect plan veyali lekunte asaluke mosam madamji..ha ha ha

    ReplyDelete
  8. @padmaarpita
    లేచిపోయే సూత్రంచెప్పి సొరంగం త్రవ్వి పో..

    hari.S.babu
    ఇందులో నాకు పెద్ద కిరికిరి కనపడుతున్నది,
    బహుశా,నాలో పొలిటీషియన్ ఉండడం వల్ల కాబోలు!
    నాతోనే లేచిపోవాలనుకున్న ఆడదైతే,
    ....నన్ను అక్కడే ఎదురు చూస్తూ ఉండమంటుంది,
    చాకిరీలు అన్నీ చేశాక నన్ను పొమ్మంటే...?
    (ఎవరి కోసమో నేనెందుకు సొరంగాలు తవ్వాలి?)

    ReplyDelete
  9. Haribabu గారు.మీరు అడిగిన ప్రశ్న సమంజసమే... పద్మార్పిత జవాబు కోసం వెయిటింగ్.

    ReplyDelete
  10. పద్మార్పితగారు...ఇంతకీ సొరంగం త్రవ్వమందురో వద్దో వేంగిరం వచ్చి సెలవీయండి.:)హ హ హా

    ReplyDelete
  11. ఇంత కవిత్వాన్ని గుమ్మరిస్తున్న కవితా నాయికను ఆమె మనస్సంఘర్షణలను మామూలు మనిషి అర్థం చేసుకోవడమే కష్టం ఇక లేపుకుపోవడం అందునా సొరంగ మార్గంగుండా సరేలే…కలయా లేక పగలే కనురెప్పలు గడపదాటి కలలప్రపంచంలో విహరింపజేస్తున్నాయా!!! నిజముగా లేవనిత్తికెళ్ళినవాడు ప్రేమసామ్రాజ్యానికి ఆమె మనసుని దోచిన రాజాధిరాజు.

    ReplyDelete
  12. నేను పది అడుగులు వేస్తా
    నీవు నాలుగు అడుగులు వేసిరా
    అడుగులేగా వేసి వస్తాంటూ
    వగలుచూపి వయ్యారివై నీవు
    అడుగులు వేసి పాదాలు కందనీకు
    ప్రేమ సహకరించినా బిడియం అడ్డుపడు
    అయినా సంశయించక అడుగువేయి
    నాకు అనుమానమే ...
    నీ పాదం కమిలిపోయేనా
    నా అరచేతులనే తివాచీ చేసి
    గగన విహారంలో వివాహమాడెద
    మరి ఈ లేచిపోవడాలు
    లేపుకెళడాలు మనకేల ప్రియా...
    ప్రేమా తో...నీ..............(మీ కవితకు స్పందన మాత్రమే)

    ReplyDelete
  13. గట్టి ప్రయత్నమే తలపెట్టినారు.

    ReplyDelete
  14. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం నియంత్రించుకోకపోతే అస్థిరత, కష్టాలు, విషాదం, భయం అన్నీ వెంటాడుతాయి. దీంతో మన జీవితం అథ:పాతాళానికి చేరినట్టుగా కృంగిపోతాం అందుకే మనసుని లగ్నం చేసి యోగసాధన చేయండి. అది మనలో ఆధ్యాత్మికత, ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా లేచిపోవడానికి పేపుకుపోవడానికి ఆలోచించే శక్తిని ఇవ్వదు సరికదా ఉపాశం చేయడం వలన నీరసంతో ఆకలి బాధలు తప్ప వేరే ప్రేమ ఆలోచనలు రావుగాక రావు.
    హమ్మయ్య...సూక్తి ముక్తావళి పూర్తి అయినది. ఇక మీరు నిశ్శింతతో నిదురకు ఉపక్రమించండి...ఉపక్రమిస్తారు....ఉపక్రమించారు...అహా అహా హా హా హహా

    ReplyDelete
  15. కవయిత్రులు నిర్భయంగా భావాలను ప్రకటించడం అంటే ఇదేనేమో అనేంత అందంగా వ్రాసారు.

    ReplyDelete


  16. ఓలమ్మో ఓలమ్మో :)



    లేపుకు పోవయ్య మగడ
    చాపితి కరముల జిలే‌బి జాణన్ నేనే
    నోపక బోతి నయా నీ
    జ్ఞాపక మే తూగులాడె చానా చానా :)


    జిలేబి

    ReplyDelete
  17. వణికించే చలినే తట్టుకోలేక మేముంటే మీరు కవితలతో రెచ్చగొడితే ఎలా పద్మార్పితా. ఈసారి చిత్రం నీరసంగా రమ్మంటున్నట్లు ఉంది ఎందుకని?

    ReplyDelete
  18. రంగుల రెక్కలు విప్పుకుని ఎగిరిపోతున్నారా
    ????????
    !!!!!!!!!
    జింగిలాలే జింగి జింగి

    ReplyDelete
  19. అందనంత వరకూ ఉరుకులు పరుగులు ఆ పై అంతా మామూలు.

    ReplyDelete
  20. ప్రతికూల పరిస్థితుల కోసం వేచి ఉన్నా
    సానుకూలతను సవ్యంగా కూర్చి పో..
    అంటే అన్నీ సవ్యంగా ఉంతే వదిలివేస్తారా
    అన్యాయమండీ అర్పితగారు..ప్రేమను మోసగిస్తున్నారు

    ReplyDelete
  21. చెలువలు తామే వలచి వచ్చిన
    పిలిచినా బిగువటరా ఔరౌరా...
    అని మీరు అంటారని తెలిసే
    రివ్వున వచ్చి వాలెదడు చెలికాడు :)

    ReplyDelete
  22. గొంగళి చుట్టిన సీతాకోకచిలుక..Best

    ReplyDelete
  23. మనసు కవిత.
    మీరు పండుగల గురించి ఏమి వ్రాయరు వై?

    ReplyDelete
  24. ప్రతికూల పరిస్థితుల కోసం వేచి ఉన్నా అనడంలో అంతరార్థం ఏదో దాచబడి ఉన్నది.
    కవితలో సున్నితంగా తిడుతూ పొగిడినట్లు ఉన్నారు.

    ReplyDelete
  25. బాగుందండీ మీ కవిత.

    ReplyDelete
  26. వామ్మో వోరి నాయనో గిట్ల లేచిపోతే గెట్లమ్మో..

    ReplyDelete
  27. dear sir and madam you are blog is super and good telugu articles

    Latest Telugu News

    ReplyDelete
  28. _/\_ అందరికీ కృతజ్ఞతాభివందనములు _/\_
    2017లో భరించాము 2018లో ఇక వద్దు నీ భావాలు అనంటే మాత్రం వదిలేస్తాను అనుకోవడం అంతా మీ భ్రమే :) సుమా..

    ReplyDelete