చెప్పాలని ఉంది


మనము ఎవ్వరమో ఏమో
ఎక్కడ నుండొచ్చి కలిసామో
అనుకోని వింత మార్గములో
మనిద్దరికీ ఇలా రాసి ఉంది!

ఎన్నెన్నో కొత్త ఆలోచనలు
ఆశలకు ఎన్నో అవరోధాలు
నిర్ణయాల తాటిపై నడవలేక
హృదయం మౌనంగా ఉంది!

నువ్వు నేను ఎవ్వరో ఏమో
ఎందుకని మనం కలిసామో
పొందలేని వాటిపై మోజెందుకో
దక్కదనేమో ఆరాటంగా ఉంది!

ఏవేవో కలలబుడగల బాసలు
ఎద లోయలో అలజడి సెగలు
అభిమత అభినయం చేయలేక
మనసు మొత్తం భారంగా ఉంది!

18 comments:

  1. అదేమిటో ఎన్నాళ్ళైనా ఇంకా చెప్పుకోవడంతోనే ఆగింది :)

    ReplyDelete
  2. చివరి నాలుగు పంక్తులు బాగున్నాయి.

    ReplyDelete
  3. అన్నీ తెలిసి చేస్తే ప్రేమ ఎందుకు పుడుతుంది
    ఏం జరుగుతుందో తెలిసేది జీవితమూ కాదు..

    ReplyDelete
  4. రేపటి గూర్చి అవగాహన మాత్రమే జీవితం
    నిన్నటి అడియాశల కుప్ప తెప్పల తుణీరం

    కలబోతకు కాఠిన్యానికి నిఖార్సైన నిర్వచనం
    రెప్పల అలికిడిలో కలల సౌగంధ నందనవనం

    మనిషి మనుస నడుమన సేంద్రీయ సంయమనం
    తెలిసి తెలియక సర్దుబాటులతో సుదీర్ఘ స్వగమనం

    మాట మాట పెరిగి తూట తేటగా అపుడపుడు కలవరం
    మాట మాట తరగి మౌనరాగాలాపన గావించే హృదయ కుటీరం

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  5. prema ante vedana
    rodhana roppi enduko
    kushi kushi to majachey ante

    ReplyDelete
  6. Nice and Lovely blog. Happy to read this and follow

    ReplyDelete
  7. మనము ఎవ్వరము ఎందుకు పరిచయాలు పెంచుకుని కలిసి ఉంటామో తెలిస్తే జీవిత విధానం అంతా తెలిసినట్లు కదా. ఇది పైవాడి చిద్విలాసం.

    ReplyDelete
  8. Emotional feel and touch in poetry.

    ReplyDelete
  9. చెప్పాలని ఉంటుంది కానీ అన్నీ చెప్పలేము కదండి.

    ReplyDelete
  10. ఆశలకు ఎన్నో అవరోధాలు
    నిర్ణయాల తాటిపై నడవలేక
    Touching lines...

    ReplyDelete
  11. ఎందుకు ఏమో అని అడిగితే ఏమి చెప్పగలరు
    జీవితం అంటే జవాబులేని ప్రశ్నలు..ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మరీ అధికం.

    ReplyDelete
  12. Cheppandi
    Ready unnamu
    Vinipedatamu :)

    ReplyDelete
  13. ఆలస్యం దేనికి?
    చెప్పండుఇ...వింటాము
    లేదా వ్రాయండి
    చదివి ఆనందిస్తాము

    ReplyDelete
  14. అందరికీ పద్మార్పిత వందనములు_/\_

    ReplyDelete